Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

డెబ్బది యొకటవ అధ్యాయము - పరశురామకృతవరుణస్తోత్రము

వజ్ర ఉవాచ :

యత్స శుశ్రావ ధర్మాక్మా వరుణాత్‌ భృగునందన! తన్మమాచక్ష్వ తత్వేన పరం కౌతూహలం హి మే || 1

మార్కండేయ ఉవాచ :

జమదగ్ని సుతోరామో వరుణస్య గృహోషితః | కదాచి ద్వరుణం దేవ మిదం వచన మబ్రవీత్‌ || 2

రామ ఉవాచ :

నమస్తే దేవదేవేశ ! సురాసుర గణార్చిత ! గోబ్రాహ్మణ హితాసక్త ! యాదోగణ జలేశ్వర ! || 3

త్వం తస్య దేవదేవస్య విష్ణో రమిత తేజసః | అయన మృషిభి ర్యేన విష్ణుర్నారాయణః స్మృతః || 4

త్వమేవేదం జగత్సర్వం స్థానరం జంగమంచ యత్‌ | బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ త్వచ్ఛరీరే సమాశ్రితాః ||

త్వ మింద్ర స్త్వంచ ధనదః త్వ మీశః త్వం సమీరణః |

త్వ మగ్ని ప్త్వం యమశ్చైవ సర్వాధార స్త్వమచ్యుతః || 6

దేవానా మీశ్వరశ్చైవ నాగానా మీశ్వర స్తదా | సాగరాణాంచ సరసాం సరితాంచ మహాభుజ ! 7

కూస వాపీ తటాకానాం శౌచస్య పరమస్య చ | విష్ణో ర్వామస్య నేత్రస్య శశాంకస్య మహాత్మనః || 8

త్వన్మయం మండలం దేవ! త్వన్మయా స్సర్వతారకాః |

త్వమేవ సరితాం నాధ స్సముద్రో యాదసాంపతిః || 9

అధార స్సర్వరత్నానాం విద్వానాంచ జగత్పతే ! త్వ న్మయో దేహినాం ప్రాణో జీవో రుధిర సంజ్ఞితః ||

రామస్త్వం ప్రాణినాం దేవ ! సర్వదేవ మయో విభుః |

భవతా సంయతాః పాశై ర్దానవాః దేవ! దారుణౖః || 11

పాతాళద్వార మాశ్రిత్య భవాం స్తిష్ఠతి నిర్భయః | మేరు పృష్ఠేచ భగవన్‌ ! పురీతే దేవ నిర్మితా || 12

తృతీయాచ మహాభాగ ! మానసోత్తర మూర్ధని | పురత్రయే త్వం వనసి ప్రాకామ్యేన జలేశ్వర ! || 13

సర్వత్ర ప్యూసే దేవై స్సర్వభూత భవోద్భవ ! | ఆధారస్త్వం హి తపసాం శౌచానాం భువనస్యచ || 14

త్రైలోక్యం సకలం దేవ ! ప్రకృతి ర్వికృతి శ్చ తే | మమాపి సుమహాభాగ ! ప్రసాద సుముఖోహ్యసి || 15

తస్మాన్మే భగవన్‌ ఛిన్ధి సంశయాన్మసేసి వస్థితాన్‌ |

వరుణ ఉవాచ:

యత్రాస్తి తే సంశయ మన్త్రధారిన్‌ ! ఛేత్తాస్మితే తత్రనసం శయోత్ర |

యధా మమేశ స్త్రిపురా స్తకోసౌ తథాభవాన్‌ మేరణ చండవేగః || 16

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే - ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శ్రీ పరశురామ వరుణ కృతస్తోత్రోనామ ఏకస ప్తతి తమోధ్యాయః.

ధర్మాత్ముడు భృగునందనుండప్పుడు వరుణునివలన విన్నదేమో యానతిమ్మది వినగుతూహలమగుచున్నదన మార్కండేయుండిట్లనియె.వరుణగృహమందట్లువసించునొకనాడు పరుశురాముడు వరుణునింగూర్చి యిట్లనియె. నమస్కారము. సురాసుర గణార్చిత! గోబ్రాహ్మణహితాసక్త ! యాదోగణనాథ ! విష్ణువును ఋషులు నారాయణుండనిరి. విష్ణువునకు గమ్యస్థానమునీవని దాని భావము. నారాః=ఉదకములు అయనముగ గలవాడు అనగా ఉదకములందు ప్రళయమందుండువాడు. ఉదకముల కధీ శుడవునీవేగావున నీవావిష్ణువునకు గమ్యస్థానమని అర్థము. స్థావరజంగమాత్మక ప్రపంచమంతయు నీవే. త్రిమూర్తులు నీశరీర మందున్నారు. నీవుఇంద్రాదిదిక్పాలులెల్లరును. సర్వాధారుడచ్యుతుడు దేవాధీశుడింద్రుడు నాగులకధీశ్శరుడు. సాగరాదిసకల జలమూర్తులకు పరశౌచమునకు (శుచిత్వమునకు) నీ వీశ్వరుడవు. విష్ణువు నెడమకన్ను చంద్రుడు. అతని బింబము (మండలము) త్వన్మయము. సర్వతారకలు త్వన్మయములు సరిత్తులకు నాథుడవు నీవు. జలజంతువులకు రాజవీవు. రుధిరమను పేరి జీవుడవు నీవే సర్వ దేవమయుడవు సర్వప్రాణిలోక ప్రభువునగు రాముడవు నీవు. నీ దారుణ పాశములచే దానవులు బధ్ధులైనారు. పాతాళద్వారమందీపు నిర్భయుడవైయున్నావు. సర్వరత్ననిధివి నీవు. సర్వవిద్యాధరుడవు నీవు మేరువు మీద నీ రెండ పురము దేవనిర్మితమైయున్నది. నీ మూడవ యావాసము మానసోత్తర శిఖరమందు. ప్రాకామ్యముతో సర్వకామ సమృద్ధులనియెడి అణిమాది సిద్ధులలో నొకటియగు సిద్ధితో నీవీ మూడు పురములందును వసింతువు. సర్వభూతభవోద్భవుడైన నీ వెల్లవేల్పులచే నెల్లెడ పూజింపబడుదువు. తపస్సులకు నెల్ల శౌచాచారములకు భువనమునకు నీవాధారము. త్రైలోక్యమెల్ల నీ ప్రకృతి వికృతియును. నాయెడగూడ నీవు ప్రాసాదసుముఖుడవైతివి. కావున నా మనసునందుగల సందియముల వారింపుమన వరుణుండనియె : శస్త్రధారీ ! నీకెచట సంశయముగల దక్కడ నే ఛేదించెద. సందియము వలదు. నాకీ త్రిపురాంతకుడెట్లో నీవు నట్లే.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున శ్రీపరశురామకృత వరుణస్తోతమను డెబ్బదియొకటవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters