Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఏడవ అధ్యాయము

జంబూద్వీపవర్ణనము

వజ్ర ఉవాచ :

జంబూద్వీపస్య సంస్థానం విస్తరేణ మహామునే : త్వత్తో7 హంశ్రోతు మిచ్ఛామి యత్ర జాతో7సి భార్గవ! 1

మార్కండేయ ఉవాచ :

అవగాఢా వుభయత స్సముద్రౌ పూర్వ పశ్చిమౌ | జంబూద్వీపే మహారాజ ! షడిమే కుల పర్వతాః || 2

హిమవాన్‌ హేమకూటశ్చ నిషధోనీల ఏవ చ | మేరుశ్చ శృంగవాం శ్చైవ సర్వే రత్నాకరాశ్శుభాః || 3

మధ్యేతు మండల శ్శైలః నీలస్య నిషధస్య చ | సౌవర్ణః కధ్యతే మేరుః ప్రమాణం తస్య మే శృణు ! 4

చతు రాశీతిసాహస్రాః కథితశ్చో చ్ఛ్ర యేణ చ | అధస్తాత్‌ షోడశై వోక్తః షోడశైవ తు విస్తృతః || 5

విస్తారో ద్విగుణశ్చాస్య భూలగ్నో మండలః స్మృతః | బృందపుష్ప నిభశ్చోర్ధ్వంద్వా త్రింశ##చ్చైవవిస్తృతః || 6

విస్తారో ద్విగుణశ్చాస్య తత్రా7ధిక విధిస్స్మృతః | మేరుస్తు నవతిఃపోక్త స్సహస్రః పూర్వతో గిరిః || 7

యోజనానాం సహస్రంతు మాల్యవాన్‌ నామ నామతః | ఆనీలం నిషధం యావ త్పశ్చిమేన తు తావతా || 8

తావతత్ప్రమాణో నిర్దిష్టః పూర్వతో గంధమాదనః | మేరోస్తూత్తరత శ్శ్వేతః పూర్వతో7 నన్త ఉచ్యతే || 9

దక్షిణచ తథా పీతః కృష్ణః పశ్చిమత స్స్మృతః | అన్తరేణ స్మృతో విప్రః పూర్వతః క్షత్రియ స్స్మృతః || 10

దక్షిణన తథా వైశ్యః శూద్రః పశ్చిమతః స్మృతః | తస్మా దుదీచీవిప్రాణాం ప్రాచీస్యాత్‌ క్షత్ర జన్మనామ్‌ || 11

దక్షిణా వైశ్యజాతీనాం శూద్రాణాం పశ్చిమాస్మృతా | ప్రాచ్యాం మహేంద్రస్య పురీ మేరుపృష్ఠే7మరావతీ || 12

వహ్నేః ప్రదక్షిణనోక్తా పురీనామ్నా సభావతీ | యమస్య దక్షిణనోక్తా నామ్నా సంయమనీ పురీ || 13

ప్రోక్తా వైనైరృతీ భాగే పురీ పశ్చిమ దక్షిణ | పశ్చిమేన తథారమ్యా, సుముఖా వరుణస్య చ || 14

అనంతరం శివానామ పురీ వాయోః ప్రకీర్తితా | ఉత్తరేణ పురీ రమ్యా సోమస్యోక్తా విభావరీ || 15

అనన్తరం శివస్యోక్తా నగరీ శాంకరీ శివా | మేరుపృష్ఠే యథా దేవాః సంశ్రితాస్తు యథాదిశమ్‌ || 16

విజ్ఞేయా స్తేతు దిక్పాలాః తస్యాం తస్యాం తథాదిశి | దేవస్స్వాం నగరీం ముఖ్యం మానసోత్తర మూర్ధని || 17

మేరుంతు పశ్యతి విభుస్తత్‌స్థో మేరుగతాం పురీమ్‌ | ఉదక్‌ శృంగవతో7ర్ధేతు యామ్యేన కురుసంజ్ఞితమ్‌ || 18

వర్షంతు కథితం దివ్యం సర్వోపద్రవ వర్జితమ్‌ | శృంగవచ్ఛ్వేతయో ర్మధ్యే వర్షం జ్ఞేయం హిరణ్మయమ్‌ || 19

రమ్యంతు వర్షం విజ్ఞేయం మధ్యతః శ్వేతనీలయోః | మధ్యే నిషధ నీలాభ్యాం పశ్చార్ధే గంధమాదనః || 20

కేతుమాలఃస్మృతో వర్షస్త్వతీవ సుమనోహరః | మధ్యే నిషధనీలాభ్యాం పూర్వే మాల్యవతోగిరేః || 21

వర్షో రుద్రముఖో నామ నిత్యం ముదిత మానవః | మేరోశ్చతుర్దిశం నామ్నా వర్షో రాజన్‌ ! ఇలావృతః || 22

తస్యాపి భేదా శ్చత్వారో నామతస్తాన్నిబోధమే | భద్రాశ్వో జంబుమాలశ్చ కేతుమాన్‌ కురవస్తథా || 23

జంబువృక్షస్తు విఖ్యాతో జంబుమాలేతు యాదవ ! యోజనానాం సహస్రంతు తత్పూర్వం తస్య కీర్తితమ్‌ || 24

వజ్రుడిట్లనియె : భృగువంశీయమునీ ! నీ జన్మస్థానమగు జంబుద్వీపము యొక్క సన్నివేశము యొక్క యథార్థమును నీ నుండి వినగోరెద.నన మార్కండేయమహర్షి యిట్లు సెప్పదొడంగె. జంబూద్వీపమం దిరువైపుల పూర్వ పశ్చిమ సముద్రములు చొచ్చుకొనియున్నవి. ఇందు కులపర్వతమూలారున్నవి. హిమవంతము, హేమకూటము, నిషధము, నీలము, మేరువు, శృంగవంతము ననునవి రత్ననిధులు. శుభప్రదములు. నీల నిషధ పర్వతముల నడుమనున్న మండలము వర్తులాకారప్రదేశము సువర్ణ మయము మేరువని పిలువబడును దాని ప్రమాణము ఎనుబదినాల్గు వేల యోజనములు. క్రింద మరి పదునారు వేలు దాని విస్తారము. దీనికి రెట్టింపుభాగము భూమిలోపలనున్నది. మీది భాగము ముప్పదిరెండువేల యోజనముల విరివి గలది. అది బృందపుష్పమట్లున్నది. దీని వైశాల్యము దీనికి రెట్టింపుమించియున్నది. మేరువు యొక్క విస్తారము (వైశాల్యము) తొంబదివేల యోజనములు. దానికి తూర్పున మాల్యవంతమను పర్వతము వేయి యోజనముల వైశాల్యముగలది. నీలపర్వతమునుండి నిషధ పర్వతమువరకు పశ్చిమముగా నెంత పొడవున్నదో యంత పొడవున దీనికి తూర్పున గంధమాదనమున్నది. మేరువునకుత్తరముగ శ్వేతపర్వతము, తూర్పున అనంతపర్వతమని పిలువబడును. దక్షిణదిశ పీతపర్వతము(పసుపుపచ్చనిది) పడమట కృష్ణపర్వతమును గలవు. నడుమ నున్న పర్వతము విప్రుడు. తూర్పున క్షత్రియమనబడును. దక్షిణ పర్వతము వైశ్యము. పశ్చమగిరి శూద్రము. కావున నుత్తర పర్వతము విప్రులది. తూర్పు పర్వతము క్షత్రియులది. దక్షిణము వైశ్యజాతులది. పశ్చిమము శూద్రులది. ప్రాగ్దిక్కున నింద్రునిపురమమరావతి మేరువుమీద నున్నది. ఈవిషయము లోగడనే తెలుపబడినది. మేరుపృష్ఠమందాయా దిక్కులందు దేవతలున్నారు. వారు దిక్పాలురు. విష్ణువు మానసోత్తర పర్వతమందలి తన నగరిని మేరువును జూచుచుండును. ఉత్తర దిక్కునగల శిఖరమునకు దక్షిణపుసగము కురువర్ష మనబడును. అది దివ్యము. ఏ యుపద్రవములు లేనిది. శృంగవంతము శ్వేతగిరికి నడుమ హిరణ్మయవర్షమున్నది. శ్వేత నీల పర్వతముల నడిమిది రమ్యకవర్షము. నిషధ నీల పర్వతముల నడుమ పడమట గంధమాదనమున్నది. నిషధ నీలముల నడుమ కేతుమాల వర్షము చాల రమ్యమైనది గలదు. నిషధ నీలముల నడుమ మాల్యవంతమను గిరికి తూర్పుగ రుద్రముఖమను వర్షమున్నది. అందెల్లవేళల మానవులానంభరితులై యుందురు. మేరువునకు నలుదెసల నిలావృతవర్షమున్నది. అందు నాల్గు విభాగములు గలవు. భద్రాశ్వము జంబుమాలము కేతుమంతము కురవముననునవి వానిపేర్లు. ఓయాదవ! వజ్రభూపతీ! జంబుమాలమందు జంబూ వృక్షమునేరేడుచెట్టు విఖ్యాతమైనది. దాని విరివి వేయియోజనములు.

తత్ఫలేభ్యః ప్రభవతి రమ్యా జాంబూనదీ శుభా | మేరోః ప్రదక్షిణం కృత్వా స్వమూలే సా చ నశ్యతి || 25

వృక్షరాజేన తేనేదం జంబూద్వీపం ప్రచక్షతే | ఇలావృతస్తు ప్రభయామేరో ర్నిత్యం ప్రకాశ##తే || 26

న తత్ర భ్రాజతే సూర్యో న చంద్రో న చ తారకాః | మేరోశ్శరావ సంస్థత్వా న్నిత్యమేవ తిరోహితః || 27

హేమకూటా దుత్తరతో హరి వర్షం ప్రచక్షతే | హేమకూటా ద్దక్షిణతస్తథా కింపురుషం స్మృతమ్‌ || 28

హిమాచలా ద్దక్షిణతో వర్షం యాదవ ! భారతమ్‌ | కర్మభూమి ర్మహీపాల ! యత్ర వర్తామహే వయమ్‌ || 29

భారతే7స్మి& యుగావస్థా కేశ##వేన వినిర్మితా | వర్షే ద్వేచాథ సంస్థానే విజ్ఞేయే దక్షిణోత్తరే || 30

దాని పండ్లనుండి జంబూనది పుట్టును. అది మేరుగిరికి బ్రదక్షిణముసేసి తన మూలమందు (పుట్టినచోట) అంతరించును. ఆ వృక్షరాజముచేత నిది జంబూద్వీపమనబడుచున్నది.

ఇలావృత వర్షము మేరుపర్వత కాంతిచే నిత్యము దీపించుచుండును. అక్కడ సూర్యుడు వెలుగడు. చంద్రుడు తారకలు వెలుగవు. మేరువు శరావమువలె (మూకుడువలె) నుండుటచే తత్కాంతికి జ్యోతిర్మండలములు ప్రకాశ మడగియుండునన్నమాట. హేమకూటమునకుత్తరము హరివర్షమనబడును దానికి దక్షిణము కింపురుషవర్షము - హిమాద్రికిదక్షిణమున భారతవర్షము. అది కర్మభూమి మనమున్న తా వదియే. ఈ భారతమందు యుగవిభాగము విష్ణువు సేసినది. దీనియందు దక్షిణమున నుత్తరమున రెండు సంస్థానములు (ఖండములు) గలవు.

* వి.ధ.పు-3

వర్షత్రయంతు విజ్ఞేయం చతురస్రంతు మధ్యమమ్‌ | దీర్ఘంతథైవ విజ్ఞేయం వర్షాణాంచ చతుష్టయమ్‌ || 31

వర్షాణాం నవ సాహస్రో విష్కంభః కథితో నృప ! | యోజనానాం ప్రమాణన కథితస్తత్వ దర్శిభిః || 32

విష్కంభః పర్వతానాంతు సహస్ర ద్వితయం స్మృతమ్‌ | మేరో ర్యోజన సాహస్రో విష్కంభః కథిత స్తథా || 33

యోజనానాంతు నియుతం జంబుద్వీపః ప్రకీర్తితః | యామ్యోత్తరేణ తస్యేదం ప్రమాణంతే మయోదితమ్‌ || 34

పూర్వాపరేణ తస్యాపి ప్రమాణం శృణు పార్థివ! | యోజనానాం సహస్రాణి ద్వాత్రింశచ్చ శతానిచ || 35

భద్రాశ్వకేతు మాలౌ ద్వౌ ప్రత్యేకం పార్థివోత్తమ ! యోజనానాం సహస్రేణ శతసహస్ర కానిచ || 36

నవమేరుస్తథా ప్రోక్తో గంధ మాదన మానతః | మేరోర్నవ సహస్రాణి మాల్యవాంశ్చ నిగద్యతే || 37

మేరోర్యోజన సాహస్రో విష్కంభః కథితస్తథా | ఏవమష్యేష నియుతః జంబూద్వీపః ప్రకీర్తితః || 38

హిమాచలే యక్షవరా నివిష్టా దైత్య ప్రధానాః ఖలు హేమకూటే |

గంధర్వ ముఖ్యా నిషధే చశైలే నాగానివిష్టాశ్చ తథైవ నీలే || 39

శ్వేతే పితౄణాంచ గతిర్నివిష్టా సిద్ధా స్తథా శృంగవతశ్చ పృష్ఠే |

సేంద్రాస్తథా దేవగణాశ్చ మేరౌక్రీడావిహారేణ సదా వసన్తి || 40

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే జంబూద్వీప వర్ణనంనామ సప్తమో7ధ్యాయః.

నడుమ చతురస్రముగ మూడు వర్షములున్నవి. ఈవర్షముల విష్కంభము తొమ్మిదివేల యోజనములు. పర్వతముల విష్కంభము రెండువేల యోజనములు. మేరువు యొక్క విష్కంభము వేయి యోజనములు. దీని ఉత్తర రక్షిణపు కొలతలు నీకు నేను చెప్పితిని. రాజా ! దాని తూర్పు పడమరల ప్రమాణము చెప్పెదను. వినుము. అదినూటముప్పది రెండువేల యోజనములు. జంబూద్వీప ప్రమాణము నియుత (లక్ష) యోజనములు. ఓ రాజోత్తమా! భద్రాశ్వ కేతుమాలములు ప్రత్యేకముగ పదికోట్ల యోజనముల పరిమాణము కలవి.నవ మేరువు కూడ గంధమాదనమంత పరిమాణమే కలది. మాల్యవత్‌ పర్వతము మేరువునకు తొమ్మిది వేల రెట్ల పరిమాణము కలది. ఇట్లు జంబూద్వీపము నియుతప్రమాణము. హిమాలయమందు యక్షవరులు హేమకూటమందు దైత్య ముఖ్యులు నిషధమందు గంధర్వముఖ్యులు నీలగిరియందు నాగులు నున్నారు. శ్వేతపర్వతములో పితృదేవతలమార్గమున్నది. శృంగవంతమున సిద్ధులు చరింతురు. మేరువునం దింద్రాది దేవగణము లున్నవి అందందు వారు క్రీడావిహారము సేయుచుందురు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమ ఖండమున జంబూద్వీపవర్ణనమను సప్తమాధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters