Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

అరువదిఆరవ అధ్యాయము - పరశురామునిగూర్చి శంకరునిఅనుశాసనము

మార్కండేయ ఉవాచ :

కైలాస శిఖరే రమ్యే రామస్య రమత స్తదా అజగామ హరం ద్రష్టుం దేవదేవః పురందరః || 1

స సమాసాద్య దేవేశం ప్రణమ్య పృషభ ధ్వజమ్‌ | ఉవాచ వచనం సమ్యక్‌ ముదా రామస్య సన్నిధౌ || 2

శక్ర ఉవాచ :

త్పత్ర్పసాదేన దేవేశ ! మయాప్రాప్తం త్రివిష్టపమ్‌ | రామేణ ఘాతితా స్సర్వేయధాయే దేవ శత్రవః || 3

అవధ్యాస్త్రిదశానాంయే వరదాన బలోద్ధతాః | నరవధ్యాం కృతా స్తేహి బ్రహ్మణా సుమహాత్మనా || 4

పాతాల నిలయా దేవ ! అవధ్యా దేవతాగణౖః బాధన్తే నరవధ్యామే లోకానంచ జగత్పతే || 5

తాంశ్చ ఘాతయ దేవేశ | రామేణా క్లిష్టకర్మణా || 6

మార్కండేయ ఉవాచ :

ఏవం కరిష్యతీ త్యుక్త్వా విసృజ్య త్రిదశేశ్వరం ఉవాచ వచనం రామం భార్గవం పురత స్థ్సితమ్‌ ||

శంకర ఉవాచ :

గచ్ఛ ! భార్గవ ! పాతాలం పాతాల నిలయాన్‌ జహి ||

శక్రశత్రూన్‌ దురాచారాన్‌ నరవధ్యాన్‌ మహాసురాన్‌ | వైష్ణవం చాపరత్నంతే మయాన్యస్తం పితుఃకరే || 8

తదాదాయ శ##రైస్తీక్ష్నెః జహి ! తాన్‌ రామ ! దానవాన్‌ | అక్షయం తూణ మాదాయ శరపూర్ణమిదం త్వయా || 9

మార్కండేయ ఉవాచ :

ఏవ ముక్త్వా దదౌచాస్య తూణ మక్షయ సాయకం | దత్త్వాచ భగవా నాహ రామం పరబలార్దనమ్‌ || 10

శంకర ఉవాచ :

తూణమేతత్‌ ప్రదాతప్యం త్వయాగస్త్యాయ భార్గవ ! | చాపరత్నంచరామాయ కృతే కర్మణి సువ్రత | 11

అగస్త్యోపి మహాతేజాస్తూణ మక్షయ సాయకం | రాఘవాయాతి యశ##సే రామాయైవ ప్రదాస్యతి || 12

రామ సందర్శనాదూర్ధ్వం మా కృధాః శస్త్రధారణమ్‌ | రామ సందర్శనే రామ ! తవ తేజోహి వైష్ణవం || 13

రామం ప్రవేక్ష్యతి తదా సురకార్యార్థ మూర్జితమ్‌ | యావత్త్వం తేజసాయుక్తో వైష్ణవేన పరంతప || 14

తావచ్ఛత్రుగణాన్‌ సర్వాన్‌ జమరేషు విజేష్యసి |

స్థాతుం న శక్తా స్తవదైత్యసేనా అస్తాయుధస్య ప్రముఖే ద్విజేంద్ర !

ఆదాయ చాపం యుధి వైష్ణవం తత్‌ తూణం తధేమంజహిదేవశత్రూన్‌ || 15

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే మహాపురాణ ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే రామం ప్రతి శంకరానుశాసనే షట్‌షష్టిత మోధ్యాయః.

మార్కండేయుడనియె : రమ్యమైన కైలాసశిఖరమందు పరశురాము డానందించుతరి నింద్రు డేతెంచి శంకరుని నమస్కరించి రాముడు వినుచుండనిట్లనియె : దేవేశ్వర ! నీ యనుగ్రహముచే నేను స్వర్గము బొందితిని. రాముడు రాక్షసులం బరిమార్చెను. దేవతల కవధ్యులయినవాండ్రుగూడ పరదానదర్పితులు దానవులు బ్రహ్మచే నరునిచేత వధ్యులుగా జేయబడిరి. ఆ యందరు పాతాళమందిపుడు నివసించుచు బాధించుచున్నారు. రామునిచే నా దైత్యులంగూడ చంపింపుము. అనవిని శంకరుండిట్లు సేయుదునని యింద్రునిం బంపి తనముందున్న భార్గవరామునితో భార్గవ నీవు పాతాళమునకుం జని యటనున్నవారినింద్రశత్రువులం దైత్యులను సంహరింపుము. మీ తండ్రి హస్తమునందు వైష్ణవ ధనుస్సును న్యాసముసేసియున్నాను. అది గొని యేగి యాదురాచారులను వరదర్పితులైనవారిం గూల్చుము. ఈ అక్షయతూణీరముంగూడ గైకొని యేగుమని యిచ్చెను. నీ చేయవలసిన పని యైన తరువాత నీ యమ్ములపొదిని యీ ధనుస్సును నగస్త్యునికిమ్ము. అగస్త్యుడును యీ ధనుస్సును అక్షయతూణీరమును రామునికి (దశరధకుమారునికి) ఒసంగును. రామ సందర్శనమైన తరువాత నీవు శస్త్రము పట్టవలదు. దశరధరాముని దర్శనమైనతరువాత నీవైష్ణవతేజసాతనియందు బ్రవేశించును. అది సురకార్యము నిర్వహించును. నీవు వైష్నవతేజస్సుతో నున్నంతకాలము శత్రుగణము లన్నింటిని జెండాడగలవు. దైత్యసేనలాయుధప్రయోగము సేయుచున్నంతదాక నీముందు నిలువలేరు. ఈ వైష్ణపచాపమును తూణీరమును జేకొని యుద్ధమందు దేవశత్రువుల గూల్పుము.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రధమఖండమున పరశురాముని గూర్చి శంకరుని యనుశాసనమను నరువదియారవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters