Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

అరువదియొకటవ యధ్యాయము - శంకరగీతలందు అభిగమనకాలనిరూపణము

రామ ఉవాచ :

తస్యమాయా శరీరస్య విష్ణోరమితి తేజసః | ప్రాప్నుప న్తికథం స్థానం నిత్యమక్షయ్య మవ్యయమ్‌ || 1

శంకర ఉవాచ :

అఖండకారిణోరామ ! విష్ణో రమిత తేజసః | ప్రాప్నుపన్తి సరంస్థానం నిత్య మక్షయ్య మవ్యయమ్‌ || 2

రామ ఉవాచ :

అఖండ కారీ భగవన్‌ | కథం భవతి శంకర ! | ఏతన్మే సంశయం బ్రూహి ! దేవదేవ ! పృషధ్వజ ! || 3

శంకర ఉవాచ :

పంచకాల విధానజ్ఞ స్తత్కర్మ కరణరతః | అఖండకారీ భవతి రామ ! దానవ నాశన ! || 4

రామ ఉవాచ :

భగవన్‌ ! పంచ కేకాలాః కథం తేషాం తథా విధిః | ఏతన్మే దేవదేవేశ ! కౌతూహల మపానుద ! 5

శంకర ఉవాచ :

రామాభిగమనం పూర్వ ముపాదాన మతః పరం | ఇజ్యా స్వాధ్వాయ కాలేచ యోగకాల స్తధైవచ || 6

తేషాం ప్రత్యేకశో పక్ష్యే విధిం తే భృగు నందన ! తన్నిబోధ ! మహాభాగ ! ప్రయతే నా న్తరాత్మనా || 7

రామ! కల్యే సముత్థాయ దన్తధావన పూర్వకమ్‌ |

స్నాసం కృత్వా యధా శాస్త్రం స్వాచాన్తః సు సమాహితః || 8

యశ్చేహ భగవన్‌ ! మస్త్రం పఠన్‌ దేవగృహం విశేత్‌ |

ప్రవిన్ద్యాత్‌ రామ ! జానుభ్యాం పాణిభ్యాం శిరనా తధా || 9

ఓంకారం స నమస్కారం ప్రయుజ్య సు సమూహితః | యోగకాలం తు సందధ్యా దుపాదధ్యా దనంతరమ్‌ ||

రామాభిగమ కాలంతు తత్ర మంత్రం తధార్పయేత్‌ | భగవతో బలేనేతి వీర్యేణౖ తేన తేజసా || 11

సుప్రకీర్తిత తో యేన వేదిం ప్రక్షాలయేద్బుధః | సౌవర్ణీం రాజతీం తామ్రీం మృణ్మయీ మాయసీంతధా || 12

శిలాం చందన జాంవాపి దేవదారు భవా మధ | శింశుషాక్షోట సరళ కదంబార్జున జా మధ || 13

సాల్వాశ్వకర్ణజాం రామ ! త్వాయామేన తధై వచ |

వామప్రవాణాం ప్రక్షాల్య పూర్ణకుంభాన్నవాం స్తతః || 14

కల్పనీయాస్తు కలశా శ్చత్వారో భృగునందన ! సౌవర్ణా రాజతా స్తామ్రా అథవాపిహరీతిజాః || 15

పాద్యమాచమనీయంచ త్వర్ఘ్యం స్నానీయమేవచ | పాద్యాత్పాద్యం తు దాతవ్యం స్నానీయాత్‌ స్నానమేవచ ||

తథా ప్యాచమనీయాఖ్యాద్దేయ మాచమనం భ##వేత్‌ | దానం ప్రణయనం ప్రీతి ర్విసర్గం విస్తరం తథా || 17

తర్పణం చార్హణంచైవ త్వర్ఘ్యాదేతాని కారయేత్‌ | ద్వాదశాక్షరకం మస్త్రం తతో జప్త్వా సమాహితః || 18

తతః పవిత్ర మంత్రేణ వేది మభ్యుక్షయే ద్ద్విజ | ఆత్మానం చ తథా భోగాన్‌ కుర్యాన్మార్గ త్రయం తతః || 19

విద్యా జ్ఞానం తతః కర్మ బ్రహ్మచక్రం తథైవచ | మార్గత్రయం చ క ర్తవ్యం నామార్ఘ్య కలశాన్సదా || 20

పాణిమార్గం కూర్చమార్గం మధుమార్గం తథైవచ | ఉశీరమూలజం కూర్చం జీవ న్నోపాల సంభవమ్‌ || 21

పరశురాముండు మహాతేజస్వియు మాయామానుష మూర్తియునైన విష్ణువుయొక్క నిత్యము క్షయరహితము అవ్యయము నైన స్థానము పొందుటెట్లని యడిగిన, శ్రీశంకరుడు అఖండకారులది పొందుదురు. పంచకాల విధాన మెఱింగినవాడు నా పంచ కాలాచరణ మందాసక్తిగల వాడును అఖండకారి యనబడును. రాముడు పంచకాలములన నేవి వాని విధియేమన శంకరుడు తెల్పుచున్నాడు. 1. అభిగమనము 2. ఉపాదానము 3. ఇజ్య (¸్ఞుము) 4. స్వాధ్యాయము 5. యోగముననునవి పంచకాలములు. నిలుకడగొన్న మనసుతో నాలింపుము. ఉషఃకాలమున మేల్కని దంతధావనము సేసికొని స్నానము యధాశాస్త్రముగా నొనరించి యాచమన మొనరించి సమాహితుడై (కుదురుకొని) భగవన్మంత్ర పఠనము సేయుచు దేవతార్చన గృహమందు బ్రవేశింపవలె. మోకాళ్ళమీదవంగి శిరసువంచి ఓంకారమును నమస్కారమును (సమశ్శబ్దమును) జతసేసి యోగకాలమును సంధానముసేయవలెను. అమీదట అభిగమకాలమునను సంధించి అందు మంత్రము సమర్పింపవలెను. భగవతోబలేన అను మంత్రముతో వీర్యముతో తేజస్సుతో నభిమంత్రింపబడిన యుదకముతో వేదికను ప్రక్షాళింప వలయును. బంగారు వెండి రాగి మన్ను ఇనుము రాయి శిల గంధపుచెక్క దేవదారువు శింశప = ఇరుగుడు అక్షోటము-అక్రూట్టు సరళ కదంబ = కడిమిఅర్జునములతో సాల అశ్వకర్ణములు దయారైన వామప్రవాణ మయిన దానిని ఎడమవైపు వాలినదానిని విశాలవేదిక నేర్పరచి నాల్గు కలశలను బూర్ణకుంభములుగా నందుంపవలెను. ఆకుంభములు బంగారము వెండి యిత్తడి యనునేదోదాన జేయబడవలెను. ఆ నాల్గింట పాద్యము ఆచమనీయము అర్ఘ్యము స్నానీయమునను నాల్గు ఉదకములు నింపవలెను. దేవతకు పాద్యము పాద్యకలశమునుండి నాయాకలశములనుండి గ్రహించిన తీర్థముచే సమర్పింపవలెను. ఆచమనతీర్థకలశోదకముచే ఆచమనము స్నానతీర్థముచే స్నానముగావింప దానము ప్రణయనము = అగ్ని ప్రతివిసర్గము (ఉద్వాసన) విస్తరము=పీఠము తర్పణము పూజ అనునవి అర్ఘ్యోదకముచే నిర్వర్తింపవలెను. ద్వాదశాక్షరమంత్రము జపించి పవిత్రమంత్రముచే వేదినిప్రోక్షింపవలెను. తనను బ్రోక్షించుకొననగును. ఆమీదమార్గత్రయమును భోగము లను నొనరింపవలెను. విద్య జ్ఞానము కర్మ బ్రహ్మచక్రము అనుమార్గత్రయమను అర్ఘ్యకలశములను ఏర్పరుపవలెను. మార్గములు మూడు. 1. పాణిమార్గము 2. కూర్చమార్గము 3. మధుమార్గము అనునవి. కూర్చ వట్టివేళ్లతో జేయవలెను.

జీవశ్చ మరణంచాపి కర్తవ్యం భృగు నందన | ప్రతిస్నానం తతః కార్యం సమానానాం క్రమాద్భవేత్‌ || 22

తథైవ పాదపీఠానాం ప్రభ##వేన మహాభుజ ! | ఆసనా న్యథ కార్యాణి రత్న చిత్రాణి భార్గవ ! 23

సౌవర్ణాన్యథ రౌప్యాణి తామ్రశైల మయానిచ | తతస్త్వావాహనం కార్యం తతోభిగమనం తతః || 24

సమస్కార స్తతః కార్యః ప్రణీతేన తతః పునః | బ్రహ్మశ్వ క్రామనౌ మస్త్రం ప్రభ##వేనాపి యేనచ || 25

తతో జప్త్వా మహాభాగ ! ప్రణవేన నివేదయేత్‌ | ఆసనై రర్చయే ద్దేవం తతః ప్రయత మానసః || 26

ఆర్ఘ్యాభి రద్భిశ్చ తతో భోగైస్సర్వై రసన్తరమ్‌ | పాద్య ప్రతిగ్రహేణాథ పాద్యాభి శ్చాప్యసస్తరమ్‌ || 27

పాదుకాభిస్తతో రామ ! దేవదేవం సమర్చయేత్‌ | తత స్త్వాచమనీయార్థం దేవదేవ ప్రతిగ్రహం || 28

దేవ మాచమనీయంచ పాదపీఠాం స్తథైవచ | దన్త కాష్ఠం తతో దద్యా జ్జిహ్వా నిర్లేఖనం తతః || 29

గండూషణం తతో దద్యాత్‌ ముఖప్రక్షాళనం తథా | భూయ స్త్వాచమనం దేయం తర్పణం చాప్యనంతరమ్‌ || 30

పుష్పం దీప మలంకారం ధూప ప్రకర మేవచ | నివేద్య విధి వత్సర్వం తతః పశ్చా న్నివేదయేత్‌ || 31

సేవ్యాని రామ బీజాని త్వర్హనీయం తతఃపునః | మధుపర్కం తతో దద్యా ద్దధి-సర్పిస్తథా మధు || 32

దధ్య లాభే పయః కార్యం మధ్వలాభే తథాగుడమ్‌ | ఘృత ప్రతి నిధిర్నాస్తి తత్రయత్నా త్సమర్చయేత్‌ || 33

ఏకాంగోవా సమస్తోవా మధుపర్కో విధీయతే | వ్యంగం వర్జ్యం ప్రయత్నేన నిత్యమేవ విజానతా || 34

దర్పణం తు తతో దద్యా త్తతో నిర్భర్త్పనం బుధః | తత స్త్వాచమనీయం చ విధిపత్‌ సు సమాహితః || 35

హస్త నిష్పుంసనార్థాయ తతో దద్యాత్తు గంధకం | తతః పశుం బుధః కుర్యా ద్యథావ న్మాధు పార్కికమ్‌ ||

మాధుపార్కిక మశ్వత్థపత్రం వా వినివేదయేత్‌ | ఘృతాపద్యం తతో దద్యాత్‌ తాంబూలం చాప్య సన్తరమ్‌ ||

మాత్రాం చ దక్షిణార్థాయ బ్రాహ్మణాయ నివేదయేత్‌ | మంగశాని యథాశక్త్యా తతో దేవే నివేదయేత్‌ || 38

తతోభిగమకాలంతు సందద్యాత్పురుషోత్తమే | ఉపాదాన మథోదద్యా త్కుర్యాచ్చైవ విసర్జనమ్‌ || 39

తతోగ్ని శరణం గత్వా వహ్నిం సంతర్పయే ద్బుధః |

బ్రాహ్మణానాం యథాశక్తి దానం దద్యా దనంతరమ్‌ || 40

ఏతన్మయా తే కథితం సమగ్రం యథనుపూర్వ్యాభిగమస్య కాలమ్‌ |

గచ్ఛేదుపాదాన కృత ప్రయత్న స్తతో యథావ ద్భృగువంశ చంద్ర || 41

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే మహాపురాణ ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శంకరగీతాసు అభిగమనకాలో నామ ఏకషష్టితమోధ్యాయః.

బంగారు వెండి రాగి రాయి యనువానితో రత్న చిత్రములైన అసనములు ఏర్పరచవలెను. అమీద దేవతాహ్వానము సేసి యభిగమనము సేయవలెను. అవ్వల ప్రణీతేస ప్రభ##వేన యనుయంత్రముతోను ''బ్రహ్మశ్వక్రామనౌ'' అనుమంత్రముచేగాని ప్రభ##వేన అను దానిచే కాని నమస్కారము సేయవలెను. అటుపై జపించి ప్రణవముతో నివేదింపవలయును. అటుపై నిశ్చల మనస్కుడై అసనములు సమర్పించి అర్ఘ్యపాత్రలోని యర్ఘ్యమునిచ్చి పాద్యజలమున పాద్యార్ఘ్యనొసంగి సర్వభోగములచే నర్చస సేయవలెను. అమీద పాదుకలతో దేవేశు నర్చింపవలెను. అటుపై నాచమనమునకు దేవ దేవ ప్రతిగ్రహం దేవుని అచమనీయం పాదపీఠమును పూజింప వలెను. (ప్రతిగ్రహమనగానిచ్చట దేవదేవుని పత్ని యన్నమాట) అటుపై దంతకాష్ఠము జిహ్వానిర్లేఖనము =నాలుక బద్దయు నీయవలెను. అటుపై పుక్కిలించుటకుదకము (గండూషణము) ముఖప్రక్షాలనోదక మునీయవలెను. అటుపై నాచమన తర్పణము నొసంగవలెను. అటుపై పుక్కిలించుటకుదకము (గండూషణము) ముఖప్రక్షాలనోదక మునీయవలెను. అటుపై నాచమన తర్పణము నొసంగవలెను. పుష్పము ధూపము దీపము అలంకారము ధూపమునిచ్చి తేనె నైవేద్యము పెట్టవలెను. సేవ్యాని రామ! బీజాని త్వర్హణీయం తతః పునః మధుపర్కమామీద నియవలెను. (తేనె నీయవలెను) ఆపుపెరుగు నెయ్యి తేనె పెరుగు లేనిచో పాలుతేనె లేనిచో బెల్లము నివేదింపవలెను. ఆవునేతికి ప్రతినిధి ద్రవ్యము లేదుగాన ఆపునేతినే తప్పక సమర్పింపవలెను. మధుపర్కము ఏకాంగముకాని సమస్తమునుగాని సమర్పింపవలెను. తెలిసినవాడు వ్యంగముగా మధుపర్కము సమర్పింపరాదు అనగా మధుపర్కాంగములు తేనెతోపాటుగ అవునెయ్యి అపుపెరుగు అవుపాలు పంచదార (పంచామృతము) కలిపి సమర్పింపవలెను. అమీద దర్పణము చూపవలెను. అటుపై నిర్భర్త్సకము=ఆలక్తకమ్‌ ఇక్కడ లాక్షారాగము పారాణి అనవచ్చునేమో. అచమనము నీయవలెను. హస్త నిష్ఫుంసనము కొరకు గంధకమర్పింపవలెను. మాధుపార్కికముగా (మధుపర్కాంగముగ) పశు వునుగాని ప్రతినిధిగా రానియాకుగాని యీయవలెను. ఘృతాపద్య మొసగినమీదట తాంబూలమీయవలెను. విప్రునికి దక్షిణగా చిల్లర డబ్బులు మాత్రమొసగవలెను. దేవునికి యథాశక్తి మంగళములు నివేదింపవలెను. మంగళనీరాజనాదులు మంత్రపుష్పాదు లన్నమాట. అటుపై పురుషోత్తమునెడ అభిగమనకాలమును సమర్పింపవలెను. అటుపై ఉపాదానమునొసంగి విసర్జసముగావింప వలెను. (ఉద్వాసనమన్నమాట) అటుపైనింటికేగి అగ్నిని వేల్వవలయును యథాశక్తి బ్రాహ్మణులకు దాన మీయవలెను. ఇది యభిగమనకాలము 'అను అర్చనావిధానమును అను పూర్విగా నీకు జెప్పితిని. అటుపై నుపాదానకాలమునుగూర్చి ప్రయత్నముపూని, యథావిధిగ నేగవలయును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున శంకరగీతలందు అభిగమనకాలమను నరువదియొకటవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters