Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఏబదితొమ్మిదవ అధ్యాయము - ఉపవాసఫల నిరూపణము

శ్రీరామ ఉవాచ :

ఉపోషితేన యేనేహ యంయం కామం ప్రయచ్ఛతి | తదహం శ్రోతుమిచ్ఛామి గదతస్తే పృషధ్వజ || 1

శంకర ఉవాచ :

పూజితః ప్రయతైః స్నానైః సోపవాసై ర్దినే రవేః | సంవత్సరం మహాభాగ ! దీర్ఘమాయుః ప్రయచ్ఛతి || 2

సోమవారే మహాభాగ | చారోగ్యం సంప్రయచ్ఛతి | తధాభౌమదినే రామ ! పైశ్వర్యం సంప్రయచ్ఛతి || 3

వాసదే సోమ పుత్రస్య సర్వాకామాన్‌ ప్రయచ్ఛతి | అభీష్టాంచ తధా విద్యా మాఖండల గురోర్దినే || 4

సౌభాగ్య మతులం లోకే భార్గవాహ్ని ప్రయచ్ఛతి | తథా శ##నైశ్చర స్యాహ్ని రిపూస్సర్వాన్‌ వ్యపోహతి || 5

కృత్తికాసు తథాభ్యర్చ్య యజ్ఞాన్‌ ప్రాప్నో త్యనుత్తమాన్‌ |

ప్రాజాపత్యే తధా భ్యస్చ్య ప్రజాం ప్రాప్నోతి శోభనామ్‌ || 6

విందతే బ్రహ్మపర్చస్యం మృగశీర్షేర్చయన్‌ హరిమ్‌ |

రౌద్రకర్మత్వ మాప్నోతి సిద్ధింరౌద్రే సమర్చయన్‌ || 7

చ్యుత స్థ్సాస మవాప్నోతి పూజయానః పునర్వసౌ | పుష్యే సంపూజతో దేవః పుష్టిమగ్ర్యాం ప్రయచ్ఛతి ||

అశ్లేషాయాం దథాభ్యర్చ్య శ్రియం విన్దతి మానవః | పితృప్రసాదమాప్నోతిపిత్ర్యే సంపూజయన్‌ హరిమ్‌ ||

సౌభాగ్యం మహదాప్నోతి ఫాల్గునీ ష్వర్చయన్‌ తథా | తధైవ చోత్తరా యోగే గతిం విందతి శోభనామ్‌ || 10

హప్తే సంపూజయన్‌ దేవంగజాన్‌ ప్రాప్నోత్యనుత్తమాన్‌ |

చిత్రాసుచ తథాభ్యర్చ్య వస్త్రాణ్యాప్నోతి మానవః || 11

ఆప్యే సమర్చయన్‌ దేవం రత్నభాగీ భ##వేన్నరః | తధో త్తరా స్వషాఢాసు కీర్తిం ప్రాప్నోతి శాశ్వతీమ్‌ || 12

సర్వాన్కామా నవాప్నోతి శ్రవణభ్యర్చయన్‌ హరిం | ధనిష్ఠాసు తథా విత్త మారోగ్యం వారుణ తథా || 13

ఆజే పశూనవాప్నోతి గావశ్చ తదనంతరమ్‌ | పౌష్ణే శీల మవాప్నోతి చాశ్వాన్‌ ప్రాప్నోతి చాశ్వినే || 14

దీర్ఘం జీవిత మాప్నోతి భరణీషు మహాభుజ | ప్రతి పద్యర్ధ మాప్నోతి కుప్యం ప్రాప్నో త్యనుత్తమమ్‌ || 15

సర్వాన్కామా నవాప్నోతి తృతీయాయాం సమర్చయన్‌ |

పశూం శ్చతుర్థ్యా మప్నోతి పంచమ్యాం శ్రియ ముత్తమామ్‌ || 16

షష్ఠ్యాం ప్రాప్నో త్యథా೭೭రోగ్యం సప్తమ్యాం సుహృద స్తధా |

ఆష్టమ్యాంచ తథా భృత్యాన్‌ నవమ్యాం చ తధా యశః || 17

కర్మసిద్ధి మవాప్నోతి దశమ్యాం పూజయన్‌ హరిమ్‌ | ఏకాదశ్యాం పూజయానః శ్రీభాగీ స సదా భ##వేత్‌ || 18

అభీష్టాం గతిమాప్నోతి ద్వాదశ్యాం పూయన్‌ హరిమ్‌ |

త్రయోదశ్యాం పూజయాసః రూపం ప్రాప్నోత్య నుత్తమమ్‌ || 19

న దుర్గతి మవాప్నోతి పూజయాన శ్చతుర్దశీం | సర్వాన్‌ కామాన వాప్నోతి పంచదశ్యాం మహామునే ! 20

ఇత్యేత దుక్తం తవ మానవానాం కామ్యం ఫలం సమ్యగుపోషితానామ్‌ |

దేవేశ్వరం పూజయతాం యథావ త్పరంపురాణం పురుషం వరేణ్యమ్‌ || 21

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శ్రీశంకరగీత సు ఉపవాసఢలోనామ ఏకోన షష్టితమోధ్యాయః.

ఉపవాసమున్న వారికేయే ఫలముల హరియిచ్చునది తెల్పుమన శంకరుండనియె : అదివారమునసనియమముగ స్నాములు ఉపవాసములు ప్రతాదులు సేసి యొక్క సంవత్సరము హరినిబూజించినవారికి హరిదీర్ఘాయువునొసగును. సోమవారమిట్లు సేసిన వారి కారోగ్యమిచ్చును. మంగవారమిది సేసిన ఐశ్వర్యమనుగ్రహించును. బుధవారముగావించిన సర్వాభీష్టము లిచ్చును. గురు వారము సేసిన కోరినవిద్య ననుగ్రహించును. శుక్రవారమునందు సౌభాగ్యమొసంగును. శనివారముసేసిన సర్వశత్రువుల దలగించును. కృత్తికానక్షత్రార్చనము మహాయజ్ఞఫల మిచ్చును. ప్రాజాపత్య (రోహిణి) నక్షత్రమందు విష్ణుపూజ సేసిన చక్కని ప్రజాలాభము (సంతానము) గల్గును. మృగశీర్ష బ్రహ్మవర్చస్సును ఆరుద్ర రౌద్ర కర్మ సంసిద్ధిని పునర్వసు పోయిన స్థానమును పుష్యమి నిండుపుష్టిని అశ్లేష సంపదను మఖ పితృదేవతానుగ్రహమును పూర్వపాల్గుని మహా సౌభాగ్యమును ఉత్తర పాల్గుని శోభన గతిని హస్తగజ సమృద్ధిని చిత్ర వస్త్రసంపత్తిని స్వాతి (ఆప్యము) రత్నసంపదను ఉత్తరాషాఢ కీర్తిని శ్రవణము సర్వకామ సంపూర్తిని ధనిష్ఠ ధనము వారుణము (శతభిషము) ఆరోగ్యమును పూర్వాభాద్ర పశుసమృద్థిని ఉత్తరాభాద్ర గోసంపదను పౌష్ణము చక్కని శీలము అశ్విని అశ్వలాభమును భరణి దీర్ఘాయును హరి పూజకు ఫలముగా నొసంగును. ష్రతిపత్తు (పాడ్యమి) సర్వార్థ సమృద్దిని (విదియ) వెండిని తృతీయ (తదియ) సర్వాభిష్టములకు చతుర్ధి పశువులను పంచమి ఉత్తమైశ్వర్యమును షష్ఠి ఆరోగ్యమును సప్తమి మిత్రులను అష్టమి భృత్యులను నవమి కీర్తిని దశమి కర్మసిద్ధిని ఏకాదశ శ్రీలాభమును ద్వాదశి కోరిన ఉత్తమగతిని త్రయోదశి అత్యుత్తమరూపసంపదను నొసంగును. చతుర్దశినాడు విష్ణునిర్చించినవాడు దుర్గతిపాలుగాడు పూర్ణిమ సర్వాభీష్టప్రదము లెస్సగనుపవసించి వారముని పురాణ పురుషుని పరేణ్యుని హరిని పూజించు వారికిగల్గు కామ్యఫలమిది తెలిపితిని.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము నందు ప్రథమ ఖండమున శంకరగీతలందు ఉపవాసఫల నిరూపణమను ఏబది తొమ్మిదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters