Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఏబది ఆరవ అధ్యాయము - శంకరగీతలందు విభూతివర్ణనము

రామ ఉవాచ :

తస్యదేవాదిదేవస్య విష్ణో రమితతేజసః | త్వత్తోహం శ్రోతు మిచ్ఛామి దివ్యా ఆత్మవిభూతయః || 1

శంకర ఉవాచ :

సశక్యా విస్తరా ద్వక్తుం దేవదేవస్య భూతయః | ప్రాధాన్యతస్తే పక్ష్యామి శృణు షై#్వకమనా ద్విజ ! || 2

సర్గే బ్రహ్మా స్థితౌ విష్ణుః సంహారేచ తథా హరః | వరుణో వాయు రాకాశో జ్యోతిశ్చ పృథివీతథా || 3

దిశశ్చ విదిశ శ్చాపి తథా యేచ దిగీశ్వరాః | ఆదిత్యా పసవో రుద్రా భృగవోంగిరస్తథా || 4

సాధ్యశ్చ మరుతో దేవాః విశ్వేదేవా స్తధైవచ | అశ్వినౌ పురుహూతశ్చ గంధర్వాప్సరసాం గణాః || 5

పర్వతోదధిపాతాలా లోకా ద్వీపాశ్చ భార్గవ | తిర్య గూర్ధ్వ మథశ్చైవ త్వింగితం యశ్చ నేంగతే || 6

సచ్చాసచ్చ మహాభాగ ! ప్రకృతి ర్వికృతిశ్చ యః | కృమికీటపతంగానాం పయసాం యోనయ స్తథా || 7

విద్యాధర స్తథా యక్షా నాగాస్సర్పా స్సకిన్నరాః | రాక్షసా శ్చ పిశాచాశ్చ పితరః కాలసంధయః || 8

ధర్మార్థకామ మోక్షశ్చ ధర్మద్వారాణి యానిచ | యజ్ఞాంగానిచ సర్వాణి భూతగ్రామం చతుర్విధమ్‌ || 9

జరాయుజా శ్చాండజాశ్చ సంస్వేదజ మధోద్బిజమ్‌ | ఏకజ్యోతిస్స మరుతాం వసూనాం సచపాపకః || 10

అహిర్బుధ్న్యశ్చ రుద్రాణాం నాదై వాశ్వినయో స్తధా | నారాయణశ్చ సాధ్యానాం భృగూణాంచ తధాక్రతుః || 11

ఆదిత్యానాం తధా విష్ణు రాయు రంగిరసాం తధా | విశ్వేషాం చె వదేవానాం రోచమానః సకీర్తితః || 12

వాసవస్సర్వ దేవానాం జ్యోతిషాంచ హుతాశనః | యమ స్సంయమశీలానాం విరూపాక్షః క్షమాభృతామ్‌ || 13

యాదసాం వరుణశ్చైవ పవనః ప్లపతాం తధా | ధనాధ్యక్షశ్చ యక్షాణాం రుద్రో రౌద్ర స్తథా పరః || 14

అనస్త స్సర్వ నాగానాం సూర్యస్తేజస్వినాం తధా | గ్రహాణాంచ తథా చంద్రో నక్షత్రాణాంచ కృత్తికా || 15

కాలః కలయతాం శ్రేష్ఠో యుగానాంచ కృతం యుగమ్‌ | కల్పం మన్వంతరేశాశ్చ మనవశ్చ చతుర్దశ || 16

స ఏవ దేవ స్సర్వాత్మా యే చ దేవేశ్వరా స్తథా | సంవత్సర స్తు వర్షాణాం చాయనానాం తధో త్తరః || 17

మార్గశీర్షస్తు మసానాం ఋతూనాం కుసుమాకరః | శుక్లపక్షస్తు పక్షాణాం తిధీనాం పూర్ణిమా తిథిః || 18

కారణానాం వధః ప్రోక్తో ముహూర్తానాం తధాభిజిత్‌ | పాతాలానాం సుతలశ్చ సముద్రాణాం పయోనిధిః || 19

జంబూద్వీప శ్చ ద్వీపానాం లోకానాం సత్య ఉచ్యతే | మేరు శ్శిలోచ్చయానాంచ వర్షేష్వపిచ భారతమ్‌ || 20

హిమాలయ స్థ్సావరాణాం జాహ్నవీ సరితాం తథా | పుష్కరస్సర్వ తీర్థానాం గరుడః పక్షిణాం తధా || 21

గంధర్వాణాం చిత్రరథః సిద్దానాం కపిలో మునిః | ఋషీణాంచ భృగు ర్దేవో దేవర్షీణాంచ నారదః || 22

తథా బ్రహ్మఋషీణాంచ అంగిరాః పరికీర్తితః | విద్యాధరాణాం సర్వేషాం దేవ శ్చిత్రాంగద స్తథా || 23

కంబరః కిన్నరాణాంచ సర్పాణా మథ వాసుకిః | ప్రహ్లాద స్సర్వదైత్యానాం రంభా చాప్సరసాం తథా || 24

ఉచ్ఛైశ్శ్రవా స్తథాశ్వానాం ధేనూనాంచైవ శామధుక్‌ | ఐరావతో గజేంద్రాణాం మృగాణాంచ మృగాధిపః || 25

ఆయుధానాం తధాపజ్రో సరాణాంచ సరాధిపః | క్షమా క్షమావతాం దేవో బుద్ధి ర్బుద్ధిమతామపి || 26

ధరావిరుద్ధః కామశ్చ తథా ధర్మభృతాం వృణామ్‌ | ధర్మోధర్మ భృతాం దేవ స్తపశ్చైవ తపస్వినామ్‌ || 27

యజ్ఞానాం జపయజ్ఞశ్చ సత్య స్సత్యవతాం తథా | వేదానాం సామవేదశ్చ ఆంశూనాం జ్యోతిషాం పతిః || 28

గాయత్రీ సర్వమంత్రాణాం వాచః ప్రపదతాం తథా | అక్షరాణా మకారశ్చ యన్త్రాణాంచ తధా ధనుః || 29

అధ్యాత్మ విద్యావిద్యానాం కవీనా ముశనా కవిః | చేతనా సర్వభూతానా మింద్రియాణాం మనస్తథా || 30

బ్రహ్మా బ్రహ్మవిదాం దేవోజ్ఞానం జ్ఞానపతాం తథా | కీర్తి శ్శ్రీవా& క్చనారీణాం స్మృతిర్మేథా తథాక్షమా || 31

ఆశ్రమాణాం చతుర్థశ్చ వర్ణానాం బ్రాహ్మణ స్తథా |

స్కందః సేనాప్రణతౄణాం సదయశ్చ దయావతామ్‌ || 32

జయశ్చ వ్యవసాయశ్చ తథోత్సాహవతాం ప్రభుః | అశ్వత్థః సర్వవృక్షాణా మోషధీనాం తధా యవః || 33

మృత్యు స్స ఏవ మ్రియతా ముద్భవశ్చ భవిష్యతామ్‌ | ఝషాణాం మకరశ్చైవ ద్యూతం ఛలయతాం తథా || 34

మాసశ్చ సర్వ గుహ్యానాం రత్నానాం కనకం తధా | ధృతి ర్భూమౌ రసశ్చాప్సు తేజశ్చైవ హుతాశ##నే || 35

వాయు స్పర్శగుణానాంచ ఖంచ శబ్ద గుణః తథా | ఏవం విభూతిభి స్సర్వం వ్యాప్య తిష్ఠతి భార్గవ ! || 36

ఏకాంశేన భృగుశ్రేష్ఠ ! తస్యాంశత్రితయం దివి | దేవాశ్చ ఋషయశ్చైవ బ్రహ్మా చాహంచ భార్గవ ! || 37

చక్షుషా యన్నపశ్యన్తి వినా జ్ఞాన గతిం ద్విజ | జ్ఞాతా జ్ఞేయ స్తథా ధ్యాతా ధ్యేయ శ్చోక్తోజనార్దనః || 38

యజ్ఞో యష్టాచ గోవొందః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ | అన్న మన్నాద ఏవోక్తః ఏవచ గుణత్రయమ్‌ || 39

గా మావిశ్యచ భూతాని ధారయ త్త్యో జపా విభుః | పుష్ణాతి చౌషధీ స్సర్వా స్సోమో భూత్వా రపాత్మకః || 40

ప్రాణినాం జఠరస్థోగ్ని ర్భుక్త పాచీ స భార్గవ ! | చేష్టాకృత్‌ ప్రాణినాం బ్రహ్మ&! సచవాయుశ్శరీరగః || 41

యధాదిత్యగతంతేజః జగద్భాసయతేఖిలమ్‌ | యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజ స్తత్ర కీర్తతమ్‌ || 42

సర్వస్యచాసౌ హృది సన్నివిష్ట స్తస్మా త్స్మృతిజ్ఞా& న మపోహనంచ |

సర్వైశ్చ దేవైశ్చ స ఏవ వంద్యో వేదాన్త కృద్వేదకృదేవచాసౌ || 43

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శంకరగీతాసు విభూతివర్ణసంనామ షట్పంచాశత్తమోధ్యాయః.

పరశురాముండనియె : దేవాదిదేవుండగు విష్ణువు విభూతులను విసగోరెదనన శంకరుండిట్లనియె ఆ విభూతి వైభవ మును విస్తరించి పలుకుట శక్యముగాదు ప్రధానములయిన వానిం దెలిపెద సావధానుండవై వినుము. విష్ణువు సృష్టికార్యమందు బ్రహ్మ స్థితియందు విష్ణువు సంహారమందు (లయకార్యమందు) హరుడు నగును. వరుణుడు వాయువు ఆకాశము జ్యోతి వసుమతి దిక్కులు మూలలు దిక్పతులు ఆదిత్యులు వసువులు రుద్రులు భృగువులు అంగీరసులు సాధ్యులు మరుత్తులు విశ్వేదేవతలు అశ్వినులు పురుహూతుడు గంధర్వాప్సరోగణములు పర్వత పారావారపాతాళముము లోకములు ద్వీపములు క్రింద మీద నడ్డముగ కదలునది కదలనిది సత్తు (సర్వాధారము) ఆసత్తు లేనిది- ప్రకృతి వికృతి క్రిమి కీటక పతంగాదులకు పక్షులకు యోనులు (మూలకారణములు) విద్యాధర యక్ష నాగ సర్ప కిన్నరులు రాక్షస పితరలు కితరాలు కాలసంధులు ధర్మార్థకామ మోక్షములు ధర్మద్వారములు యజ్ఞాంగములు నలువిధములైన భూతసంఘము జరాయుజాండజన్వేదజోద్భిజ్జములు నతడే మరుత్తుల కతడు ఏకజ్యోతి. వసువులకు పావకుడు. రుద్రులు కహిర్బుధ్న్యుడు. అశ్వినులకు సాధ్యులకు నారాయణుడు భృగువులకు క్రతువు ఆదిత్యులకు విష్ణువు. అంగిరస్సులకు ఆయువు. విశ్వదేవులకు రోచమానుడు సర్వదేవతలకు వాసవుడు. జ్యోతిస్సులకు హుతాశనుడు (అగ్ని) సంయమశీలురకు యముడు. క్షమావంతులకు విరూపాక్షుడు, నీటిజంతువులకు వరుణుడు. ఎగిరేవాటికి వాయువు. యక్షులకు. ధనాధ్యక్షుడు (కుబేరుడు) ఏకాదశ రుద్రులలో నొకడగు రుద్రుడు నాగులందరో సనంతుడు తేజస్సులకు సూర్యుడు. గ్రహములకు చంద్రుడు. నక్షత్రములకు కృత్తిక. జీవులకు కాలుడు యుగములలో కృతయుగము కల్పము మన్వంతరాధిపతులు మనువులు పదునల్గురు నాతడే. సర్వాత్మకుడైన దేవుడు దేవేశ్వరుడాయన. పర్షములకు సంవత్సరము. అయనములలో ఉత్తరాయణము. మాసములలో మార్గశీర్షము ఋతువులలో కుసుమాకరము (వసంతము) తిథులకు పూర్ణిమ. కారములకు పధముహూర్తములకు అభిజిత్తు. * పాతాళము లకు సుతలము. సముద్రములకు పయెధి. ద్వీపములకు జంబూద్విపము, లోకములలోసత్యలోకము. శిలోద్భయములలో పర్వతము వర్షములలో భారతవర్షము. స్థావరములలో హిమాలయము. నదులలో జాహ్నవి సర్వతీర్థములలో పుష్కరము పక్షులలో గరుత్మంతుడు గంధర్వులలో చిత్రరథుడు సిద్దులలో కపిలుడు ఋషులలో భృగువు దేవర్షులలో నారదుడు బ్రహ్మర్షులలో అంగిరస్సు విద్యాధరులలో చిత్రాంగదుడు కిన్నరులలో కంబరుడు సర్పములలో వాసుకి సర్వదైత్యులలో ప్రహ్లాదుడు అప్సరసలలో రంభ అశ్వములలో ఉచ్చైశ్రవము ధేనువులలో కామధేనువు గజేంద్రములలో ఐరావతము మృగములలో మృగరాజు (సింహము) ఆయుధములలో వజ్రము నరులలో సరాధిపుడు (రాజు) క్షమాపంతులలో క్షమ బుద్ధిమంతులలో బుద్ధి ధర్మాత్ములలో ధర్మా విరుద్ధమగు కామము ధర్మనిష్ఠులలో ధర్మము తపస్సులలో తపస్సు యజ్ఞములలో జపయజ్ఞము సత్యవంతులలో సత్యము వేదములందు సామవేదము అంశువులలో సూర్యుడు సర్వమంత్రములలో గాయిత్రి ప్రపక్తలలో వాక్కులు అక్షరమాలలో సకారము యంత్రములలో ధనుస్సు విద్యలలో అధ్యాత్మవిద్య (వేదాంతము) బ్రహ్మవిద్యకవులలో ఉశనుడు(శుక్రుడు) సర్వభూతములలో చేతనాశక్తి ఇంద్రియములలో మనస్సు వేదవేత్తలలో బ్రహ్మ జ్ఞానులలో జ్ఞానము నారీజనమందు (స్త్రీలలో) కీర్తిశ్రీవాక్కుస్మృతి మేధ క్షమ ఆశ్రమములలో నాల్గవది (సన్న్యాసము) వర్ణములలో బ్రాహ్మణుడు సేనానాయకులలో స్కందుడు దయావంతులలో దయ ఉత్సాహవంతులలో జయము వ్యవసాయము (ప్రయత్నము కృషి) సర్వ వృక్షములలో అశ్వత్థము (రావి) ఓషదులలో యవలు అమధాన్యము

* అభిజిత్తు = పగటి పదునాల్గు గడియల తరువాతి రెండు గడియల కాలము.

మరణించువారిలో మృత్యువు పుట్టువారిలో పుట్టువు ఝషములలో (మత్స్యజాతిలో) మకరము మొసలి జూదరులలో జూదము గుహ్యము లందు (రహస్యములందు) మాసము గుట్టు రత్నములలో కనకము భూమిలో ధృతి (ధారణశక్తి) నీటిలో తేజస్సు. అగ్నియందు తేజస్సు (వెలుగు) స్పర్శగుణము కలవానిలో వాయువు శబ్దగుణమయిన ఆకాశము. ఇట్లు విభూతులచే సర్వము వ్యాపించియున్నాడు. ఒక్కయంశముచే నీజగత్తును మూడంశములచే దివమునాక్రమించి యా హరియున్నాడు. దేవతలు ఋషులు బ్రహ్మ నేను జ్ఞానగతి చేతగాక ఈకంటిచే యా ముక్తుని జూడనేరము. జ్ఞాత(తెలియువాడు) జ్ఞేయము (తెలియబడునది) ధ్యాత (

ధ్యానించువాడు) ధ్యేయుడు (ధ్యానింపబడువాడు) నా విష్ణువే. యజ్ఞము యష్ట (యజ్ఞముసేయువాడు) గోవిందుడు. క్షేత్రము (శరీరము) క్షేత్రజ్ఞుడు (కూలస్థుడు) అన్నము అన్నాదుడు (అన్నమతినువాడు) నా హరియే. అవ్విభువు భూమియందావేశించి ఓజశ్శక్తిచే భూతములను భరించు చున్నాడు. రసాత్మకుడగు సోముడై సర్వౌషధులను పోషిచుచున్నాడు ప్రాణుల జఠరమందగ్నియై (వైశ్వాసరాగ్ని=ఆకలిచిచ్చ్యు అన్నమాట) భుక్తమయిన యాహారమును అన్నివిధాల వచనముచేయుచున్నాడు. శరీరమందున్న వాయువా విష్ణువే. ఆదితునందున్న ఏ తేజస్సు యెల్లజగముం భాసింపజేయుచున్నదో చంద్రుసందు నగ్నియందునే తేజస్సున్నదోయది విష్ణువుతేజస్సే. అందరి హృదయమునందీతడున్నాడు. జ్ఞప్తి జ్ఞానము మఱపు నాతని వలననే కల్గును. అందరిదేవతల కాతడు వంద్యుడు, వేదాంత కర్త వేదకర్తయు నావిష్ణువే.

ఇది శ్రీ విష్ణుధర్మోతరమహాపురాణమున ప్రథమఖండమునందు విభూతివర్ణన మను నెబదియారవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters