Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నలుబది తొమ్మిదవ యధ్యాయము-సాల్వవధ

మార్కండేయ ఉవాచ:

తతస్సాల్వో మహాతేజాః కుంజరేణ తపస్వినా | అర్పయామాస ధర్మజ్ఞ! రేణుకానందవర్ధనమ్‌ || 1

స్తబ్ధకర్ణో వివృతాక్షః కృత్వా కుండలినం కరమ్‌ | గ్రీవాం సంచాలయ న్నాగో య¸° గజమదో ద్ధతమ్‌ || 2

దృష్ట్వైవాపతత స్తస్య వేగం రామోపి తంగజమ్‌ | హుంకార మాత్రేణ రణ స్తంభయామాస వేగితమ్‌ || 3

స్తంభయామాస నాగేంద్రం శైలేంద్ర శిఖరోపమమ్‌ | తస్థౌ స పురత స్తస్య సాల్వస్య సమరప్రియః || 4

పరుశుం రుధిరా೭೭క్తాంగం సకలంకమలం కరే | ధారయన్‌ విష్ణువద్యా తి సకలం కమలంకరే || 5

దంతినా దంతినః పృష్ఠం రామస్యారోఢు మిచ్ఛతః | జహార వేగవా న్వేగం శ##రైస్సన్నత పర్వభిః || 6

సాల్వసాయక సంఘాత విముఖీకృత విక్రమమ్‌ | రామంరణ దైత్య గణా శ్ఛాదయ న్తి వరాయుధైః || 7

మహతా సోస్త్రపుంజేన రామ స్సంఛాదితో రణ | నిమీలితాక్ష శ్చిక్షేప సాల్వాయ పరుశుం తదా || 8

ఆగచ్ఛన్తంచ వేగేన సాల్వస్తం పరుశుం రణ | ఆయుధై ర్వారయామాస నశశాక చ శత్రుహా || 9

స సాల్వాయుధ సంఘాతం భంక్త్వా సర్వ మశేషతః | జహార శీర్షం సాల్వస్య ముకుటోత్తమ భూషితమ్‌ || 10

రామోపి భూతలా త్ర్పాప్య గదాం హేమ విభూషితామ్‌ |

ఆవిధ్య నిజఘానోగ్రం సాల్వం కుంజర సంస్థితమ్‌ || 11

ద్వా వంకుశ ధరౌశ్రేష్ఠౌ ద్వౌచ చర్మాసి ధారిణౌ | పతాకాధారిణం చైకం గజస్య జఘనే స్థితమ్‌ || 12

దేహంచ తస్య సాల్వస్య పతాకాంచ మనోరమాం | ఏత దాదాయ సకలమాజగామ వసుంధరామ్‌ || 13

సింహనాదేన రామస్య విత్రస్తో గజయూధపః | ఆర్తనాదం మహత్‌ కృత్వా ప్రదుద్రావ న రాధిప ! 14

రామకర్మణి వృత్తేతు భూతలా త్పరశుం రణ | జగ్రాహ వేగనా& వేగా ద్ధానవాన్త చికీర్షయా || 15

దృష్ట్వా సపరశుం రామం సాల్వంచ వినిపాతితం | హతశేషాస్తు తేదైత్యాః ప్రవిష్టా వరుణాలయమ్‌ || 16

ఏతస్మిన్నేవ కాలేతు దేవాః సేంద్ర పురోగమాః | ఆయోధన ముపాజగ్నుః పురస్క్రత్య పితామహమ్‌ || 17

ప్రణామ మకరో త్తేషాం రామో రతికరః పితుః | పూజయిత్వాతు తే రామం యయుర్ధేవాః స్వమాలయమ్‌ || 18

శక్రోపి లబ్ధ్వా త్రిదివం రామ బాహు ప్రసాధితమ్‌ | విజహార దివం రాజన్‌ ! పాలయానో జగత్త్రయమ్‌ || 19

రథెన సింహయు క్తేన మహాదేవోపి భార్గవమ్‌ | ఆదాయ ప్రయ¸° శీఘ్రం కైలాసం పర్వతోత్తమమ్‌ || 20

స్నేమేన చాస్య గాత్రాణం చక్రే సమ్మార్జనం హరః | యేనాసీ ద్బలవాన్‌ రామో నిర్ర్వణశ్చ మహాళయాః || 21

గతవ్రణం శ్రియోపేతం జయం లబ్ధ్వా హ్యుపస్థితమ్‌ | రామం ప్రహరతాం శ్రేష్ఠం శంకరో వాక్య మబ్రవీత్‌ || 22

శంకర ఉవాచ :

రామరామ ! మహాభాగ ! త్వయాహం పరితోషితః | తస్మాత్తవాహం దాస్యామిచాస్త్ర గ్రామం హ్యనుత్తమమ్‌ || 23

అస్త్రాణాం ధారణ శక్తస్త్వమేకో భువి బార్గవ ! | తవ ధైర్యమనౌపమ్యం తవ సత్త్వ మనుత్తమమ్‌ || 24

అస్త్రయోగ మిహస్థస్త్వం కృత్వా పుత్ర ! శ##నైశ్శనైః | సర్వాస్త్రవిత్తతో రామ గంతాసి పితరం స్వకమ్‌ || 25

యశ్చైష పరశు ర్దివ్యః పిత్రా దత్తః తవానఘ | అద్య ప్రభృతి తేక్షిప్తః కరం భూయః సమేష్యతి || 26

ఉపలక్షణ మేతచ్చ తధా తవ భవిష్యతి | ఛేత్స్యామి తే సంశయాంశ్చ నిర్ర్వతోభవ ! పుత్రక! || 27

మార్కండేయ ఉవాచ :

ఇత్యేవ ముక్తః పరిపూర్ణకామో రామో మహాత్మాజిత సైన్య నావః |

ఉవాస తత్ర ప్రమధైః సమేతః సర్వాణ్యధాస్త్రాణ్య నుశిక్షమాణః || 28

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్ర సంవాదే సాల్వవధోనామ ఏకోన పంచాశ త్తమోధ్యాయః.

మార్కండేయుడనియె: మహాప్రతాపశాలి సాల్వుడంతట రేణుకానంద వర్ధనుని (రేణుకాదేవి కుమారుడైన పరశురామున్పి పైకి బహువేగియైన యేనుగునుసికొల్పెను. చెవులు నిక్కించి కన్నులు బాగతెరచి యా గజము తొండము గుండ్రముగ ద్రిపి) మెడ నూచుచు నన్నాగము నాగబలు రాముని పైకేగెను. పైబడుచున్న యా మదగజము వేగముగని హుమ్మని (హుంకారమత్రమున) దానిని స్తంభింపజేసెను. (కదలకుండ కట్టుకట్టెను) సమర ప్రియుడు గావున నా రాముడు సాల్వుని యెదుట నిలువబడెను. పరశు రాముడు రక్తముచే దడిసినదియు సకలంకమును కలంకముతో గూడినదియునగు పరశువును (గొడ్డలి) అలం = చక్కగా కరమందూని కళలతో గూడిన కమలమును ధరించు విష్ణువట్లు వానికెదుట నిలబడెను. ఏనుగుతో నేనుగు పిరుంద నెక్కందలచు రాముని వేగమును సాల్వుడు వాలుటమ్ములం హరించెను. సాల్వుని సాయక సంఘాతముచే పరాక్రమము పెడమొగమైన రాముని దైత్య సంఘము మంచి యాయుధములం గప్పివైచిరి. గొప్ప యస్త్రపుంజమున గప్పబడి యాతడు కన్నులు మూసికొని సాల్వునిపైకి పరశువును విసరెను. వచ్చి పడుచున్న యా గొడ్డలిని సాల్వుడాయుధముచే వారించెను. గాని దానికి శక్తుడు గాడయ్యెను. పరశురాముడంతట సాల్వాయుధ సంఘాతమునెల్ల వమ్మెనరించి రత్న కిరీటభూషితమైన వానితలను డొల్లజేసెను. మఱియును భూతలమునుండి బంగారు నగిషీగల గదనుగైకొని విసరి ఉగ్రబలుడైన కంజరము పైనున్న సాల్వుని గొట్టెను. మఱియు ఇద్దరంకుశధారులను (మావటేండ్రను) చర్మము తాలునుంబూనినవారి నిద్దరిని గజముయొక్క జఘనమందున్న పతాకధారి నొక్కనిని గూడ యొక్క దెబ్బలో బడవేసెను. సాల్వుని శరీరమును, చక్కని పతాకను తీసుకొని నేలపైకివచ్చి రాముడు సింహగర్జనముసేయ గజరాజడలి పెద్ద ఆర్తనాదముసేసి (ఘీంకారము సేసి) పారిపోయెను. తర్వాత రాముడు దానవుల నంతమొనరింప భూతలమునుండి పంశువుంగైకొనెను. పరశువుతోడి రాముని పడిపోయిన సాల్వునిం జూచి హతశేషులు దైత్యులు వరుణాలయముంజొచ్చిరి. ఈ సమయమందే యింద్రాది దేవతలు బ్రహ్మను ముందిడుకొని యుద్ధరంగముచ కేతెంచిరి. తండ్రికి మెచ్చుకూర్చువాడగు రాముఢు వారికి నమస్కరించెను. వేల్పులును రాముని బూజించి తమ నెలవునకరిగిరి. రామునిబాహువులు ప్రసాధించిన త్రిదివమును (స్వర్గమును) బడసిఇంద్రుడు త్రిభువనములం బాలించును సుఖముగ విహరించెను. సింహమును పూన్చిన రథమెక్కి మహాదేవుడు (శంకరుడు) వచ్చి పరశురాముం జేకొని పర్వతరాజమగు కైలాసమున కేగెను. మరియుం బరమేశ్వరుడాతని మేనిని స్నేహముతో నిమురుటచే నాతడు వ్రణశూన్యుడై బలశాలియయ్యెను. యుద్ధము దెబ్బలు వ్రణములు మాని శ్రీసంపన్నుడై జయమొంది వచ్చిన రాముని యుద్ధ విశారదుని గని శంకుడరు రామా ! రామా! మహానుభావా ! నీ వలన నేను సంతసించితిని. కావున నీకు నుత్తమమైన యస్త్రగ్రామమిచ్చెదను. ఈ పుడమియందు నీవొక్కడవ యద్యుస్త్రములం దాల్ప సమర్ధుడవు. నీ ధైర్యమసమానము, నీ సత్వము (సత్తువ) అనుత్తమము.(అంతకంటె నుత్తమమైన సత్తువింకొకటి లేదన్నమాట) నాయనా! అస్త్రయోగమీవిక్కడనే మఱి మఱి గావించి సర్వాస్త్రవేత్తవై యా మీద మీ తండ్రి దరికేగుదువు గాక ! ఈ పరశువు దివ్యము. ఇది నీ తండ్రిచే నీకీయబడినది. నేడు మొదలు నీవిది విసరినంతనేగి తిరిగి నీ చేతిలోనికి రాగలదు. ఈ విధముగానిది నీకు పలక్షణము కాగలదు (ఇది నీకు జిహ్నమగు నన్నమాట) నీ సంశయముల నేను వారించెదను. పుత్రా! ఇక సుఖముండుము. అని శివుడన రాముడుమహాత్ముడు పరిపూర్ణకాముడై (కోరిక పూర్తిగ నెరవేరినవాడై) సైన్యనౌకను జయించి ప్రమధులతో సర్వాస్త్రాభ్యాసము గావించుచు నట వసించెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున సాల్వవధయను నలుబది తొమ్మిదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters