Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నలుబది యాఱవ యధ్యాయము - సాల్వసేనా దుర్నిమిత్తదర్శనము

మార్కండేయ ఉవాచ :

వ్యస్పంద తాథ సాల్వస్య రాజన్‌ ! బాహు రదక్షిణః |

హృదయంచ తథా పృష్ఠం నయనం చా ప్యదక్షిణమ్‌ || 1

శూన్య చిత్తశ్చ విమనాః కంపతేచ ముహుర్ముహుః | పపాత నాయక శ్చాపి కిరీటా త్తారక ప్రభః || 2

ఆక్రమన్తి గజాః పాదం తథా వామేన దక్షిణమ్‌ | కరేణ వేష్టయ న్తి స్మ తథా దంత మదక్షిణమ్‌ |

మదం త్యజన్తి యే మత్తాః తురగా శ్చ ముహు ర్ముహుః || 3

సంస్పృశ న్తి తథా వామం పార్శ్వం ప్రోథేన వామునా |

వృకాః శృగాలా శ్శార్దూలాః బిడాలా గర్ద భా శ్శశాః || 4

వామీ భూత్వా దానవానాం యా న్తి దక్షిణత స్తతః | ఏణా వరహాః పృషతో యా న్తి తేషాంచ వామతః || 5

దీప్తాయాం దిశి వాశన్తి మృగా స్తేషామపస్వనమ్‌ | తైల పంక గుడాంగార చర్మకేశ తృణాని చ || 6

దానావానాం ప్రయాతానాం సంభవ న్త్యగ్రత స్తథా | ఏవం విధా దుర్ని మిత్తాజాతాః సాల్వస్య పశ్యతః || 7

మతి స్సునిశ్చితై వాసీ న్మరణం ప్రతి యాదవ ! | సయ¸° సహ సై న్యేన మహతా చతురంగిణా || 8

కైలాస పర్వతం యోద్ధుం మహాదేవేన శూలినా || 9

యుద్ధోత్సుకేదైత్య పతౌ ప్రయాతే వ్యదృశ్య తాగ్రే చర చండవేగః |

రామః ప్రవాలారుణ కోమలేన దీప్త ప్రతాసేన విరాజమానః || 10

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే సాల్వసేనా దుర్నిమిత్త దర్శనం నామ షట్‌ చత్వారింశ త్తమోధ్యాయః.

మార్కండేయుడనియె : అంతట సాల్వుని యెడమబాహువదరెను. ఎడమహృదయము, వీపు ఎడమ కన్ను గూడ నదరెను. మనసుశూన్యమై కలతవడ మాటిమాటికి నతడు కంపించెను. నక్షత్ర కాంతిజిమ్ము నాయకమణి కిరీటమునుండి యూడివడెను.

* వి.ధ.పు-12

ఏనుగు లెడమ పాదమున కుడిపాదము నాక్రమించెను. తొండముచే నెడమ దంతమును జుట్టినవి. ఊరక మదముం గార్చినవి. గుఱ్ఱములు మాటిమాటికి ఎడమ పార్శ్వమును నెడమ ముక్కుతో దాకుచుండెను. తోడేళ్ళు, నక్కలు, పులులు, పిల్లులు, గాడిదలు, శశములు (చెవుల పిల్లులు) దానవులకు దక్షిణమునుండి యెడమ వైపునకు బోవుచున్నవి. లేళ్ళు, పందులు, దుప్పులు వానికెడమవైపు వెలుగుగలదిక్కున మృగములు అరస్వపముగ నరచుచున్నవి. నూనె, బురద, బెల్లము, బొగ్గులు, చర్మము, వెంట్రుకలు, గడ్డి యుద్ధమున కేగు దానవుల ముందున్నవి. సాల్వుడు గనుచుండ నిట్టి యపశకునము లేర్పడినవి. మరణము తప్పదను నిశ్చయము వానికి గల్గెను. అతడు పెద్ద చతురంగ సైన్యముతో నెత్తి మహాదేవుడగు శూలితో బోర కైలాస పర్వతము గూర్చి యేగెను. దైత్యపతి యుద్ధోత్సుకుడై చన నెట్టెదుట ప్రచండ వేగుడైన రాముడు పవడపునెఱుపుచే మృదువైన యుద్ధీప్త ప్రతాపముతో విరాజిల్లుచు నయ్యెడ గానవచ్చెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున సాల్వసేనకు దుర్నిమిత్తదర్శనమను నలుబది యారవయధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters