Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఇరువదెనిమిదవ యధ్యాయము - హరదర్శనము

మార్కండేయ ఉవాచ :

రుద్రలోక మథాసాద్య దదృశు స్త్ర్యంబకం తదా | నహ్ని పుంజ ప్రకాశేన జటాభారేణ రాజితమ్‌ || 1

సూర్యభాసా తృతీయేన నయనేన చ శోభితమ్‌ | భాల చంద్రేణ శుభ్రేణ జటా మందల శోభినా || 2

వ్యాల యజ్ఞోప వీతంచ నాగేశ్వర కృతాంశుకమ్‌ | నీలకంఠం విశాలాక్షం దన్తి చర్మోత్తర ఛదమ్‌ || 3

ఉమా సహాయం వరదం నర్వభూత భవోద్భవమ్‌ | నందినానుగతం వీరం ప్రమథైశ్చ సహస్రశః || 4

నానా వక్త్రశిరోగ్రీవై ర్నానాయుధ విభూషణౖః | తం దృష్ట్వా ప్రణతః ప్రాహ శక్రస్తు గురుణాసహ || 5

మార్కండేయుడనియె : ఇంద్రాదులు రుద్రలోకమేగి త్రిలోచనుం దర్శించిరి. ఆయన అగ్నిపుంజమట్లు ప్రకాశించు జటాభారము సూర్యప్రభ##మైన మూడవ కన్ను నుదుట చంద్రుడు శుభ్రవర్ణమైన జటామండలము సర్పరూప యజ్ఞోపవీతము నాగేంద్రవసనముం దాల్చి గజచర్మముత్తరీయముగగొని విశాలనయనుడై నీలకంఠుడై యుమాదేవితో నందివాహనమున ప్రమథగణ పరివారుడై పెక్కు ముఖములతో శిరస్సులతో కంఠములతో నానాయుధభూషణములతో దర్శనమిచ్చినంత నవ్వరదుని కింద్రుడు బృహస్పతితోగూడ ప్రణతుడై యిట్లనియె.

శక్ర ఉవాచ :

నమో7స్తు దేవదేవేశ ! ప్రణతార్తి వినాశన | నీలకంఠ ! మహాభాగ ! హ్యుమాభూషణ తత్పర || 6

గంగా తరంగ నిర్ధౌత జటా మండల మండిత | శశాంక శత సంకాశ ! సూర్యకోటిసమ ప్రభ || 7

వామనై ర్జటిలై ర్ముండైః ప్రమథై రీడ్యసే సదా | తైశ్చ సార్థం మహాదేవ | రమసే7మిత విక్రమ || 8

ఘోరం హి బ్రహ్మచర్యం తే యథా నాన్యస్య కస్యచిత్‌ | తవ లింగార్చన రతాః పూయన్తే సర్వ కిల్బిషైః || 9

స్మరంతి యే త్వాం సతతం తేహియాంతి పరాంగతిమ్‌ | విష్ణో రచింత్య భాగో7సి ప్రజాసంహరణ కృతే || 10

సర్వదేవమయో ధాతా సర్వదేవ మయో7పిచ | సర్వదేవ వరేణ్య స్త్వం సర్వభూత విభావనః || 11

సర్వామరగురు ర్దేవః సర్వభూతేశ్వరే శ్వరః | సర్వదేవో మహాయోగీ మహాజయో మహాబలః || 12

మహాబుద్ధి ర్మహావీర్యో మహాతేజా మహాయశాః | చతుష్పా త్సకలోధర్మో వాహనస్తే మహావృషః || 13

శ్మశానే వసతిర్నిత్యం చితాధూమ సమాకులే | నృత్య ద్భూతాకులే భూమే ర్భూతిశ్వేతా నులేపనః || 14

భూఖార్క వర్చ స్సలిల యజమానేందు వాయవః | మూర్తయ స్తేస్మృతా దేవ! యాభిర్వ్యాప్త మిదంజగత్‌ || 15

త్వయావినా జగత్యస్మి& నాన్యత్కించన విద్యతే | దైత్య భారా7భి తప్తాంగాం వాలయస్వ ! నమో7స్తుతే || 16

మార్కండేయ ఉవాచ :

ఏవముక్తస్తు శ##క్రేణ దేవ శ్శక్ర మభాషత | కార్తవీర్య మహం త్వాజౌ కర్తా నిఃక్షత్రియాం మహీమ్‌ || 17

నశక్త స్త్రిదశ##శ్రేష్ఠ యతః స్మర్తా7స్మి తద్వధమ్‌ | విష్ణుదత్తవరో రాజా సో7వధ్యో మమ వాసవ || 18

తమేవ ప్రార్థయిష్యామి వధంతస్య మహాత్మనః | సర్వేయాత ! స్వకం స్థానం త్వహ మప్యమరేశ్వరమ్‌ || 19

చంద్రమండల మధ్యస్థం యాస్యే వరద మీశ్వరమ్‌ | విష్ణుశ్చార్ధేన భాగేన దత్తాత్రేయో7 భవత్‌ క్షితౌ || 20

తేన దత్తవరో రాజా పాలయ త్యఖిలాం మహీమ్‌ || 21

ఇత్యేవ ముక్తస్త్రి దశేశ్వరస్తు దేవేన సాక్షాత్‌ త్రిపురాంతకేణ |

జగామ శీఘ్రం స్వపురం ష్రవిష్టో మహీం సమాదాయ గురుంచ రాజన్‌ || 22

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే - ప్రథమఖండే - మార్కండేయ వజ్రసంవాదే హర దర్శనం నామ అష్టా వింశతి తమో7ధ్యాయః

ఇంద్రకృత శివస్తుతి

దేవదేవేశ ! ప్రణతార్తిహర నీలగళ మహాభాగ ఉమాభూషణాదర ! గంగాతరంగ నిర్ధౌత జటామండలమండిత చంద్రశత సంకాశ కోటిసూర్యసమప్రభ ! నీవు మరుగుజ్జులు జటాధరులు తలబోడులు నైన ప్రమథులచే నిరంతరము స్తుతింపబడుచుందువు. వారితోనే యెల్లవేళల వినోదింతువు. నీ బ్రహ్మచర్యవ్రతమతికఠోరము. ఇంకొకడాచరింప వలనుగానిది. నీ లింగము నర్చించు టందుదీక్షగలవారు సర్వపాపములంబాయుదురు నిన్ను స్మరించువారు పరమగతినందుదురు. ప్రజాసంహరణ కృత్యమునందు విష్ణుదేవునంశ##మైయున్నావు సర్వదేవమయుడగు విధాతవు నీవు. సర్వదేవమయుడవు సర్వదేవవరేణ్యుడవు. సర్వభూతవిభావనుడవు సర్వాదుర గురువవు. సర్వభూతేశ్వరులకీశ్వరుడవు. సర్వదేవుడవు మహాయోగివి మహాజయుడవు మహాబలుడవు మహా బుద్ధిని మహావీర్యుడవు మహాతపస్వివి మహాయశస్వివి. చతుష్పాదమయిన సకలధర్మము నీ వృషభవాహనము చితాధూమసమాకులమైన భూతములు నృత్యముసేయు స్మశానము నీ నిత్యనివాసము. స్మశానవిభూతిం దెల్లగ బూసికొనువాడవు పంచభూతములు చంద్రసూర్యులు సోమయాజులు నను జగమెల్ల వ్యాపించిన యెనిమిది పదార్థములు నీ మూర్తులు ఈజగమునందు నీకంటె నన్య మించుకయేనిలేదు. దైత్యభారమున మిగుల తపించు నవనిం బాలింపుము. నీకు నమస్కారము. అని యిట్లు శంకరుడింద్రునిచే వినుతింపబడి క్షితిమండలము నిఃక్షత్రియముసేసినవాడనైనను యుద్ధమునందు నేను కార్తవీర్యార్జునుని వధింపజాలను. నన్నీవందులకు స్మరించితివికాని యతడు విష్ణువువలన వరముంబడసినవాడు. నాకతడవధ్యుడు. వాని వధ విషయములో నావిష్ణువునే ప్రార్థించెదను. మీరందరు స్వస్థానమునకేగుడు. నేనా దేవేశ్వరుని చంద్రమండలమధ్యస్థుని వరదుని దరిసెదను. విష్ణువు తన సగభాగమున దత్తాత్రేయుడై యవని నవతరించెను. ఆతనివలన నారాజు వరములంబడసి సర్వమేదినిం బాలించుచున్నాడు. అని యిట్లు త్రిపురాంతకుడు పలుక నింద్రుడు వెంటనే తన పురమునకుం భూదేవితో బృహస్పతితోగూడ నేగెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున హరదర్శనమను నిరువదెనిమిదవ అధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters