Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల ఆరువదిఎనిమిదవ అధ్యాయము - గంధర్వస్త్రీవిలాపము

తస్యాం రాత్ర్యాం వ్యతీ తాయాం గంధర్వ నగరాజ్జనాః | గంధర్వ పుత్ర దారా శ్చ రాజపత్న్యస్తథైవచ || 1

రణాజిరంతు సంప్రాప్య రురుదుర్భృశదుఃఖితాః | అహో కృతాన్తో బలవాన్‌ యేన నోబలదర్పితాః || 2

అజేయాః సురసంఘానాం సంగ్రామే వినిపాతితాః | నా తి భారోస్తి దైవస్య నా శక్యం తస్య విద్యతే || 3

యేన నాగాయుత ప్రాణా గందర్వ తనయా హతాః | తేపురా శయనీయేఘ పరార్ద్యేషు మదోత్కటాః || 4

న నిద్రా మభిగచ్ఛన్తి శేరతే తేద్య భూతలే | తాళవృంతాని లైర్యేతు వరస్త్రీభిశ్చ వీజితాః || 5

వీజ్యన్తే పతితా స్తేద్య గృధ్ర వత్సై ర్మహీతలే | వరార్ధ్య చందనాక్తాంగా యే విరేజు స్సమాగతాః || 6

నరాజన్తేద్య తే సర్వే శోణితాక్తా మహీతలే | ఆ లింగ్య సుషుపుః పూర్వం వరోరు జఘనాః స్త్రియః || 7

యే తే ద్య భూమి మాలింగ్య దుఃఖశయ్యాసు శేరతే | హా రాజన్‌ ! దేవ దర్పఘ్న ! హా రాజన్‌ ! భృత్య వత్సల!

హా రాజన్‌ ! చారు సర్వాంగ ! హా రాజన్‌ ! సుత వత్సల ! | బాహు చ్ఛాయాముపాశ్రిత్య వయం తస్య జనేశ్వర ః

నిర్భయాః దేవ దైత్యా నాం నివత్స్యామో యథా సుఖమ్‌ | సంపూర్ణ చంద్ర వదనం పుత్ర కోటిభి రావృతమ్‌ || 10

విషమస్థమితో దృష్ట్వా యాస్యామో యమ సాదనమ్‌ | సభాస్థం త్వా మపశ్యన్తో యాస్యామో యమసాదనమ్‌ || 11

ఏవం జనేతు శోకార్తే కరుణం విలప త్యథ ! | గంధర్వ రాజ పుత్రాణృం పత్న్యస్తాః సుమనోహరాః || 12

తతస్తా దుఃఖ శోకర్తాః కారుణ్య మహతి స్థితాః |

మార్కండేయుడనియె. ఆ రాత్రి గడచి గంధర్వనగరమునుండి జనులు గంధర్వుల భార్యలు కొడుకులును రాజభార్యలును రణాంగణమునకు వచ్చి మిగులు దుఃఖించి యేడ్చిరి. ఆహా! కృతాంతు డెంత బలవంతుడు బలగర్వితులు సురలకేని అజేయులైన మావారందరు గూల్పబడినారు దైవమునకు మిక్కిలి బరువులేదు చేతగాని పనిలేదు. వేలకొలది యేనుగుల ప్రాణములు గంధర్వ కుమారులను గూల్చినాడు ఇంతమున్ను హంసతూలికాతల్పములందేని నిదురపట్టక కొట్టుకొనుమతోద్ధతు లీకటికనేల నిద్రివోయినారు. ఎవ్వరు సుందరస్త్రీలు తాళవృంతములూని వీనబడినవారిప్పుడు గూలిగ్రద్దలరెక్కలచే వీవబడుచున్నారు. మంచి గంధములు మేనులబూసికొని యింతమున్ను సొంపుగుల్కిరి వారిపుడు రక్తముపూసికొని నేలంబడినారు చక్కని యూరువులు విశాల జఘనములునుంగల యంగనలం గౌగిలించికొని నిదురించిన వారిపుడు భూమిం గౌగిలించుకొని దుఃఖశయ్యలం బడుకొన్నారు. అయ్యె అయ్యె పలు రాజల దేవతల దర్పమణచినవాడ! భృత్యులయెడ వాత్సల్యములగలవాడ! సూతవత్సల ఎవ్వని బాహువులనీడు నేమింక దేవదైత్యులకు జడియక హాయిగ బ్రతుకుదుము. అయ్యయ్యె! సర్వాంగసుందర! ప్రభూ! సూతవత్సల నిండుచందురునిబోలు నెమ్మొగము గ్రద్ధరెక్కల యీకలంగప్పువడినది. ఈ విషమస్థితిచూచి మేమింక యమమందిరమునకు బోవుచున్నాము. కొలువుదీరి కూర్చుండు నిన్ను జూడక యమునింటికేగవలసినవారమైనాము. ఇట్లు జనులెల్ల శోకార్తులై యేడ్చిరి. గంధర్వ కుమారుల భార్యలు మిక్కిలి యందగత్తెలు శోకార్తలై యేడ్చి పరమదయనీయస్థితికివచ్చిరి.

భర్తారం శిరసా హీనం కాచిద్బాహువినాకృతమ్‌ || 13

ద్విధా కృతం తథైవాన్యా కాచి త్ర్కవ్యాద భక్షితమ్‌ | దృష్ట్వా రురోచ దుఃఖార్తా కాచిన్నాసాదయత్యపి || 14

కుణపేషు స్థలంత్యస్తాః బభ్రము స్తత్ర దుఃఖితాః | ఉరాంసి పాణి భిర్ఘ్నంత్యో లూనయంత్య శ్శిరో రుహాన్‌ || 15

నావాప యాసాం భవనే వురా సూర్యోపి దర్శనమ్‌ | దుఃఖితా ముక్తకేశాస్తాః జనస్సర్వోపి పశ్యతి || 16

పతన్త్యు పరి భర్తౄ ణాం సమాలింగంతి చాపరాః | రుదన్త్యన్యా స్తథా రాజన్‌ ! ఉత్కృత్య మధురస్వరాః || 17

రుదన్తీనాం తథా తాసాం రాజపత్న్యస్సు దుఃఖితాః |రురుదుః కరుణం రాజన్‌! విప్రకీర్ణ శిరోరుహాః ||18

హా కాన్త ! హా మహారాజ : హా మహాజన వల్లభ ! హా సురేశ్వర దర్పఘ్న ః హా శశాంక నిభానన || 19

హే భర్తః ! కేన తే బుద్ధిః మరణంప్రతి గాహితా! హా రాజన్‌! త్వ మిమాం భూమిం సమాలింగ్య ప్రయావివ || 20

వసుధాం ప్రియ బాహుభ్యాం సమాజే కింస లజ్జసే | కిం శేషే పురతోస్మాకం విశేషణ రజస్వలామ్‌ || 21

ఖే చర స్థో శి తే రాజన్‌ః సతతం వసుధా ప్రియా | నాడాయన వచ స్తద్ధి త్వయా నర్థాయ న శ్రుతమ్‌ || 22

ప్రియా తే యద్య పి మహీ తథా ప్యస్మాసు పార్థివ ! యుక్తం హి కర్తుం దాక్షిణ్యం యతస్త్వం సత్కులోద్భవః || 23

అతర్కిత ప్రయాణన త్వయాస్మ పరి పీడితాః | వాజ్హాత్రేణ కురుష్వాస్మాన్‌ సాంత్వనం రిపు సూదన! 24

రాజ్ఞోన యుక్తం శయనం వివృతే వసుధాతలే | తస్మా దుత్తిష్ఠ ! రాజేన్ద్ర! శయనం భజ! మాచిరమ్‌ | 25

నున్నా వయం మహారాజ ! మదనేన మదేన చ | కంఠే ను కం గ్రహీ ష్యామ స్త్వయా హీనా జనేశ్వర: 26

కృతాన్తో బలవాన్‌ రాజన్‌ ! యేనా కృష్యాద్య నీయసే! నాడాయనస్య వచనం త్వయా యది కృతం భ##వేత్‌ || 27

నా భవిష్య ద్వియోగస్తు త్వయా స్మాకం జనాధిప ! నిశ్చేష్టాంగః కథం ! త్వద్య రాజన్‌! స్వపిషి భూతలే|| 28

ఉత్తాయ వీర ! చాస్మాకం పరిష్వజ్య న చుంబసేః విజిత్య సమరే వీరాన్‌ హత్వా చ వసుధా ధి పాన్‌ || 29

కథ మేకేన యుద్దేత్వం మానుషేణ నిపాతితః | క్వతేవ పుః క్వతే తేజః క్వతేలక్ష్మీః క్వతే బలమ్‌ || 30

క్వతే తద్విమలం ఛత్రం క్వచతే వరచామరమ్‌ | క్వ తత్పీఠం చ శృంగారం క్వచతే తనయా విభో || 31

క్వసా వీతా క్వసాలక్ష్మీః క్వచతే వరవందినః | వర చామర ధారిణ్యః క్వచతాః పరమాంగానాః || 32

అద్యైవ స్మ స్త్వయా హీనాః అద్యేవ స్పృహయా మహే | అద్యైవ స్మరణీయ స్త్వం గతోసి జనవల్లభః 33

నూనం కాన్తతరః స్వర్గే రాజేన్థ్ర! ప్రమదాజనః | యత్త్యక్త్యా స్వజనం తస్య రతి ర్బద్ధాత్రయా నఘ|| 35

స్వచ్ఛంద చారిణా కేనమతిః శూర నిషేవితా | త్వయా ప్రార్థయతా లోకే యుద్దశ్రధ్ధా వివర్థితా || 34

వల్లభస్య జనస్యాస్యలాలితస్య త్వయా తథా | దీర్ఘ ప్రయాణ కర్తవ్యో వాజ్ఞాత్రేణాప్యను గ్రహః || 36

విసర్జయః జనం రాజన్‌ః క్రీడామ స్సహితాస్త్వయా | ఉద్యానేషు విచిత్రుషు వనే షూప వనే షు చ || 37

వయ మీర్ష్యాం నకురుమః సర్వలోకస్య పశ్యతః వజ్రసార మిదం నూనం హృదయం సుదృఢం కృతమ్‌ || 38

గతాసు మపి దృష్ట్వా త్వాం శతధా యన్న దీర్యతే | కర్పూర చందనా ర్ద్రాంగః మహార్హ శయనో చితః 39

విరాజసే న రాజేన్ద్రః రుధిరాక్తో మహీతలే | క్వతే భిన్న ఘటా నాగా స్తురాంగాః క్వచతే గజాః || 40

క్వతే యోధా గతా రాజన్‌ ః శక్ర విస్పర్దినో రణ సైన్యే మహతి తిష్ఠంతం ఖడ్గబాణ ధనుర్ధరమ్‌ || 41

కథం త్వామనయ ద్రాజన్‌ః పరలోకాయ రాఘవః | కృతాంత సమదృష్ఠ్యైవ వేపథుస్తే జనే శ్వరః 42

స కథం మానుషేణాతద్య సంగ్రామే వినిపాతితః | తద్వయం కిం కరిష్యామో నిరాశాస్తవ జీవితే || 43

నమే స్తి కల్పో దృష్టిర్వామే నసో ర్దృష్టి సంగతిః | ఏవం విలపమానా స్తాఃశైలూష స్యతు యోషి తః || 44

ఆలింగ్యా లింగ్య తం రాజన్‌ ! నిపతన్తి మహీతతే | శిరాంసి చ వినిఘ్న న్తితాడయన్తి భుజాం స్తథా || 45

పశ్యన్తి భూయ స్తం వీరం భూమావు త్క్రాన్తజీవితమ్‌ | దృష్ట్వా భూయ శ్చ నిః సంజ్ఞా నిపతన్తి మహీతలే || 46

తాసాం రోదన శ##బ్దేన సమాక్రాంతం మహీతలమ్‌ | తాసా మాశ్వాసనం చక్రే విద్వాన్నాడా యనో ద్విజః || 47

ఏతస్మి న్నేన కాలేతు తందేశ మపరాజితః | గంధర్వేంద్రః సమభ్యాగా ద్భరతేన ప్రచోదితః || 48

స తత్థ్సాన మథా భ్యేత్య జనం సర్వం యథా విధి | ఆశ్వాస యా మాస తదా రాజా చిత్రరథః శ##నైః || 49

సత్కారం లంభ యా మాస శైలూషం తనయైస్సహ | రాజ్ఞా చిత్ర రథేనాథ గంధర్వాస్తే ప్రచోదితాః || 50

రాజ్ఞ శ్ఛక్రుశ్చితాం కాష్ఠైః సుశుషై#్క ర్బహు భిస్తదా | పుత్రాణా మస్య సర్వేషాం యోధానా మప్యశేషతః || 50

చందనా గురుకాష్ఠైస్తే తథా కాలీయకస్యతు || 51

చితాం గంధైశ్చ తైలైశ్చ ప్రజ్వాల్య చ ఘృతేన తే | సంస్కారయిత్వా తాన్‌ సర్వాన్‌ నగరాయ వవ్రజుః || 52

గంధర్వరాజ వచసా తత స్సర్వో మహాజనః | నాడాయనం పురస్కృత్య ప్రయ¸° గంధ మాదనమ్‌ || 53

నివేశం కృతనాం స్తత్ర రామ పర్వత రోధసి | కృత్వా నివేశనం తత్ర సర్వే చిత్ర రథాజ్ఞయా ||

సుఖ మూషు ర్మహా రాజ పాల్య మానామహాత్మనా || 54

బభూవ తత్రాపి పుర ప్రధానే శైలూష పౌత్రస్తు జనస్య రాజన్‌! |

గంధర్వ రాజస్తు చకార తస్య సంరక్షణం రాఘవ ముఖ్య వాక్యాత్‌ || 55

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే గంధర్వస్త్రీ విలాపో నామ అష్ట షష్ట్యుత్తర ద్విశతతమోధ్యాయః.

ఒక్కతె తల తెగి మొండెమైనవాని నింకొకతె బాహువులు తెగిపోయినవానిని రెండుతునకలయిన వాని వేరొకతె గ్రద్దలు రాబందులు పీకితొని తినువాని నింకొకతెయుం జూచి హోరుమని యేడ్చిరి. ఒకతె చూడలేక దరికే రాలేదయ్యె. మరికొందరా కుణపముల గుట్టలం దొక్కికొని దొట్రువడుచు పరిభ్రమించిరి. చేతుల రొమ్ములం బాదుకొనుచు జుట్టు పీకుకొనుచు ఎండకన్నె రుగని యంతఃపుర స్త్రీలు జుట్టు విరబోసికొని యందరుచూడ నేడ్చిరి. కొందరు భర్తలపై పడిరి. కొందరు కౌగలించుకొనిరి. కొందరు గంతెత్తి మధురస్వరలయిన యా గంధర్వకాంతలు పెల్లుగనేడ్చిరి. హా కాంత హా మహారాజ హా మహాజనవల్లభ సురేశ్వర దర్ప భంజన! చంద్రనిభానన ! మగడా! నీ బుద్ధిని చావువంక ద్రిప్పినదెవరు? హా! రాజా! ప్రేయసినట్లే నేలం గౌగలించుకొంటివే! ఓప్రియ వల్లభ! బాహువలతో ఇట్లీయవనిం గౌగలించుకొనుటకు సిగ్గుపడవేమి? ఈ ధరణి రజస్వలగదా! (ధూళిగ్రమ్మినదియని శ్లేష) పరుండుట ఛీ ఛీ! మా యెదుటనేనా యీపని చేయుట! ఖేచరుడవయ్యు (గగనసంవాసి-దేవతామూర్తి) నీకెల్లతరి నీధా త్రిపైననే మోహమా? పాపము! నాడాయనుడు చెప్పినాడు. కాని యీ కష్టము కనిపెట్టుకొనియున్నందున నీవది వినిపించుకొనవైతివి. నీ కీ ధారుణి ప్రియురాలైన కానిమ్ము! అయినను నీవు సత్కులప్రసూతుడవు గావున మాయెడగూడ దాక్షిణ్యము సూప న్యాయముగదా! (దాక్షిణ్యము=దక్షిణనాయకత్వము-అనేకమంది నాయకులున్న నందరియందు సమప్రీతి సూపువాడు దక్షిణ నాయకుడు) అనుకోని యీ నీ ప్రయాణముచే (స్వర్గయాత్రచే) మేము కష్టాలపాలుగావింపబడినాము. ఒ శత్రునాశన! మాటమాత్రముననేని మమ్మోదార్పుము. బట్టబయల రాజు పడక యిది బాగుండదు. కావున లేలెమ్ము. జాగుసేయకు. తల్పమందు పరుండుము. మేము మదనునిచే (మన్మథునిచే) మదముచేతను గూడ (¸°వన సౌందర్యాది మదముచేత) ప్రేరితలము. నిన్ను బాసి యెవ్వని కంఠ గ్రహణ మొనరింతుము? కృతాంతుడు (సర్వ జీవుల నంతము సేయువాడు) బలవంతుడు ప్రభూ! నిన్ను లాగికొని యముడు పోయినాడు. నాడాయనుని మాట నీవు వినిపించుకొని యుంటివేని నీతోడి వియోగము నీకిది వచ్చెడిది కాదు. అయ్యో! మేను కదలక నేల నీవు నిదురించితివి. లేచి ఓ వీర! మమ్ము కౌగలించి ముద్దువెట్టుకొనవా? సమరమందు వీరులంగెలిచి వసుధాధిపతులం గూల్చియు నీ వొక్కనిచే ఒక్క మానమాత్రునిచే నెట్లు పడితివి. నీ మేనెక్కడ. నీ తేజస్సెక్కడ (తేజస్సు=ప్రతాపము). ఆ నీసిరి యెక్కడ? నీ బలమెక్కడ? నీయా శ్వేతచ్ఛత్ర మేమైనది? నీయా చామర మెందున్నది? ఆ పీఠమేది? ఆ శృంగారమేది? నీ కొడుకు లెక్కడ? ఆ విలాసమేది? ఆ లక్ష్మీకళ##యేది? ఆ వందిమాగధు లతిశ్రేష్ఠులేమైరి? నీకు జామరములు వీచు నాపరమరమణీయ మూర్తులారమణులేరి? ఇప్పడే నీకెడ బడితిమి: ఇప్పుడే నీకై మోహపడుచుంటిమి. ఇప్పుడే మాకు స్మరణీయుడవై పోయితివి. మాకు వల్లభుడవు సరియే. కాని సర్వజన వల్లభుడవు నీవు. స్వర్గ మందలి కాంతాజనము కాంత తరము కాబోలు! కాదేని నీ జనముం బాసి నీవా జనమునకై యేల (ప్రీతి) ముచ్చట బడుదువు? స్వేచ్ఛా సంచారివి గదా నీవు (సర్వ స్వతంత్రుడవు) నీ వేల యీ బుద్ధి (తలపు) గొంటివి. ఎవ్వని ప్రార్థనముచే నీకీ యుద్ధముపై శ్రద్ధ పెరిగినది? నీచే లాలింపబడ నీ కత్యంత ప్రియమైన యీ జనమును నీయీ దీర్ఝ ప్రయాణమందు జేయవలసిన దేమో మాటమాత్రమైన యనుగ్రహమైన నీవు చేయవలసినది. మా జనమును విడిచి రాజా! మేముద్యానములందు విచిత్ర వనములందు నుపవనములందును నీతో మేమాడు కొందుము. ఎల్లలోకము గనుగొన్న నించు కేని యీర్ష్య గొనము. నిశ్చయముగ మా గుండెలు వజ్రసారములు (వజ్రమంత) దృఢములయియుండును. అటులేగాని ప్రాణముల వాసిన నిన్ను జూచియు నూరు వ్రక్కలు గావలసినవి గాలేదు. కర్పూర చంద నార్ద్ర శరీర! హంసతూలికాతల్పశయన రక్తమనందడిసి పుడమిపై సొంపుదఱిగి యున్నావు. ఘటల విడి (బెదరి మందం దప్పి చెదరి) నీ యేనుగు లెటెవోయినవి. తురంగము లెక్కడ? గజములెట? ఇంద్రునికి బ్రతి స్పర్ధులైన నీయోధు లెటువోయిరి? మహాసైన్యమందు నిలిచిన ఖడ్గబాణములు దాల్చి నిన్ను రాఘవుడెట్లు పరలోకమందించెను? యముని సమదృష్టి చేతనే నీకువణకు పుట్ట వలసినది. అట్టి నీ విపుడు మనుష్య మాత్రునిచే సంగ్రామ మందీల్గితివి. అందుచే నీవారమైన మేమిపుడు జీవితముపై నిరాశులమైనా మేమి చేయుదుము? నమేస్తి కల్పో దృష్టిర్వా మేన సోర్దృష్టి సంగతిః అని యిట్లు విలపించి శైలూషుని స్త్రీలు వానిం గౌగలించి కౌగలించి యవని తలమున బడిపోయిరి. తలలు బాదుకొనిరి జీవితము లేచిపోయిన యతని నూరక చూచు చుండిరి. చూచిచూచి మూర్ఛవడిరి. ధరణితల మెల్ల రోదన శబ్దముచే నిండిపోయెను. తెలిసిన ద్విజుడు గాన నాడాయనుడు వారినోదార్పెను. ఇదే సమయమున భరతుని ప్రేరణచే గంధర్వరాజు (చిత్రరథుడు) ఆచోటికివచ్చి యా జనము నెల్ల నోదార్చెను. శైలూషునికి వాని కొడుకులచే యథావిధి సంస్కారము సేయించెను. వారు వానికి కాష్ఠము పేర్చి వారి కొడుకులకు సర్వయోధులకు చందనా గురుకాలీయకాదికాష్ఠములచే గంధములచే తైలములచే నేతిచే బ్రజ్వలింపజేసి వారందరికి సంస్కారమొనరించి నగరమునకేగిరి. గంధర్వరాజు శైలూషుడు చివరిదశలో జెప్పినమాటననుసరించి గంధర్వమహాజనమెల్ల నాడా యనునిమున్నిడుకొని గంధమాదనమునకుంజనిరి. చిత్రరథాజ్ఞతో గంధర్వులు రామ పర్వతముపై నివేశనమొనరించియాతనిచేపాలితులై యటసుఖముగా వసించిరి. అక్కడగూడ శైలూషుని పౌత్రుడా జనమునకు ప్రభువై భరతునిమాటంబట్టి వారి సంరక్షణము సేసెను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తరమహాపురాణమందు ప్రథమఖండమున గంధర్వస్త్రీ విలాప మను రెండువందలఅరువదియెనిమిదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters