Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఇరువదిఆరవ యధ్యాయము - భూదేవి యింద్రలోకమునకేగుట

మార్కండేయ ఉవాచ :

నాకపృష్ఠా గతాభూమి ర్దదర్శ మధుసూదనమ్‌ | రత్నాసన గతం వీరంశ్రియా పరమయా యుతమ్‌ || 1

ఉపాస్యమానం త్రిదశైర్భాసయంతం సఖాం శుభామ్‌ | ఆదిత్యై ర్వసుభి స్సాధ్యై ర్విశ్వేదేవై ర్మరుద్గణౖః || 2

రుద్రై ర్భృగ్వంగిరోభి శ్చనాసత్యైశ్చ మహాత్మభిః | ఋషిభి స్సూర్య సంకాశై స్తపసా ద్యోతితవ్రభైః || 3

గంధర్వై రప్సరో భిశ్చ స్తూయమానం సహస్రశః | కిరీటోత్తమ సంఛన్నం హారకేయూర భూషితమ్‌ || 4

రత్నాంగద కృతోద్యొతం రత్నగర్భ సమప్రభమ్‌ | హరిచందన దిగ్ధాంగం నీలాంబరధరం హరిమ్‌ || 5

తిర్యగ్ల లాటకేనా7క్షా తృతీయేన విరాజితమ్‌ | పశ్యంతం సర్వలోకస్య సతతం ధర్మ కర్మణీ || 6

విష్ణో రచింత్య మంగం తత్‌ త్రైలోక్య సై#్యవకారణమ్‌ | గోబ్రాహ్మణ హితాసక్తందదర్శ వసుధా తదా || 7

సంధ్యా సహ సమాసీనం శ్రియాచైవ జనార్దనమ్‌ | తం వవందే వసుమతీ దైత్య భార భరార్దితా || 8

పాద్యార్ఘ్యా చమనీయాద్యై శ్శక్రో7పి వసుధాం తదా | పూజయిత్వా సుఖాసీనాం పప్రచ్ఛాగమన క్రియామ్‌ || 9

పృష్టా శ##క్రేణ సాదేవీ వక్తుం సముప చక్రమే || 10

మార్కండేయుడనియె. భూదేవి నాకపృష్ఠమునకుం జని రత్నాసనమందు మహాలక్ష్మితో గూడి దేవతలచే నుపాసింప బడుచు శుభలక్షణలక్షితమైన దేవసభను ప్రకాశవంతము నొనర్చుచు వసురుద్రాదిత్య సిద్ధసాధ్య విశ్వదేవమరుద్గణములు అంగిరసులు భృగువులు అశ్వినీదేవతలు సూర్యునట్లు తపోదీప్తిచేకలుగు బ్రహ్మర్షులు సేవింపం గంధర్వాప్సరోవరులు వేతెఱగుల స్తుతింప సువర్ణమణికిరీటము దాల్చి కేయూరాంగదరత్న హారము లుద్ద్యోతింప హరిచందనము పూసికొని ఇంద్రనీల రత్నగర్భ ప్రభాభాసమానుడై నీలాంబరధారియై లలాటమందడ్డముగ మూడవకన్ను దీపింప సర్వలోకముల ధర్మమును నిరంతరముందిలకించుచు ముల్లోకములకు కారణమై గోబ్రాహ్మణ హితాసక్తుడై యున్న విష్ణువుయొక్క అచింత్యమైన యామూర్తినింద్రుని వసుంధరదర్శించెను. సంధ్యాదేవి శ్రీదేవి యిరువైపుల వసింప నింపొందు విష్ణ్వంశమునకు దైత్యభారమున నలసిన యవ్వసుంధర వందనమాచరించెను. ఇంద్రుడాదేవినర్ఘ్య పాద్యాచమనాద్యుపచారములచే బూజించి సుఖాసీనయైన తఱి నవ్వసుమతి రాకకు కారణమడిగెను. ఆమెయిట్లు తెలుపనుపక్రమించెను

పృథివ్యువాచ :

అన్తరిక్షం దివం యచ్చత థైవాహం జగత్పతే ! తవా77యత్తా మహాభాగ ! త్వంహి దేవేశ్వరోవిభుః || 11

త్వయిభారం సమాసజ్య వేదాభ్యసన తత్పరః | సుఖమాస్తే ప్రశాన్తాత్మా బ్రహ్మా శుభ చతుర్ముఖః || 12

త్వయిభారం సమాసజ్య దేవదేవో7పి శంకరః | ఆస్తేతప స్యభిరతః కైలాసే పర్వతోత్తమె || 13

త్వయి భారం సమాసజ్య సుఖం స్వపితి కేశవః | క్షీరోదశయనే నిత్యం శేష పర్యంక మాస్థితః || 14

పితామహస్య యత్తేజః కేశవస్య శివస్యచ | స్థితం తత్సకలం తుభ్యంత్వం సర్మమయో7రిహా || 15

త్వయా వినిహతో వృత్రో బలశ్చాపి నిఘాదితః | త్వయాచ వాశితః పాకః త్వయా దైత్యా నిషూదితాః || 16

బ్రహ్మణ్యస్త్వం శరణ్యస్త్వం ప్రణతార్తి వినాశనః | సహస్రనయనః శ్రీమా& వజ్రపాణిః జగత్ప్రియః || 17

తేజసా తపసా యజ్ఞెః శ్రుతేన చ దమేన చ | త్వత్తో విశిష్టం లోక్మేసి& న పశ్యామి శచీపతే || 18

వేదేషు సరహస్యేషు గీయసేత్వం పునః పునః | వేదాః ప్రవృత్తాః యజ్ఞార్థం తదర్థం క్రతవస్తథా || 19

యే హతాదానవా యుద్ధేత్వయాశక్ర ! పునః పునః ! త ఇమే నృషు సంభూతాః కార్తవీర్యం సమాశ్రితాః || 20

తే7ద్య జాతా మమ విభో ! పీడయ న్తి చ మాం భృశమ్‌ |

సా7హం భర సమాక్రాంతా త్వా మద్య శరణం గతా || 21

శక్ర ఉవాచ :

జానామి భారఖిన్నాం త్వాంద్యైత్యేభ్యో వరవర్ణిని ! |

తేషాం గత్వా వధోపాయ మహం ప్రష్టా7స్మి వేధసమ్‌ || 22

మార్కండేయ ఉవాచ :

ఇత్యేవ ముక్త్వా త్రిదశ ప్రధానః పృథ్వీ సమేతో గురుణాచరాజన్‌ |

య¸° సభాందేవ వరస్య తస్య పితామహస్య ప్రతిమస్య వీరః || 23

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే పృథ్వీ శక్రలోక గమనం నామ షడ్వింశతి తమో7ధ్యాయః.

వసుమతి యింద్రుని స్తుతించుట : భూలోకము (నేను) భువర్లోకము (అంతరిక్షము) స్వర్లోకమునను నీత్రిభువనములు నీకధీనమైయున్నాము. మహానుభావ! నీవు దేవతాప్రభువవు. నీయందుభారముంచి చతుర్ముఖుడు ప్రశాంతమనస్కుడై వేదాభ్యాసతత్పరుడై సుఖముగానున్నాడు. నీయందే బరువునుంచి దేవదేవుడు శంకరుడును తపోనిరతుడై కైలాసపర్వతరాజమున రాజిల్లుచున్నాడు. కేశవస్వామియు నీపై భారమువెట్టి క్షీరాబ్ధియందు శేషపర్యంకమున హాయిగ నిదురపోవుచున్నాడు. బ్రహ్మయొక్క విష్ణువుయొక్క శివునియొక్క తేజస్సది సకలము నీ కొఱకున్నది. (నీయందున్నది) నీవు సర్వమయుడవు. శత్రుహరుడవు. నీచేత వృత్రుడు బలుడు పాకాసురుడు మొదలగు దైత్యులు గూలిరి. నీవు బ్రహ్మణ్యుడవు ప్రణతార్తిహరుడవు. సహస్ర నయనుడవు. వజ్రపాణివి జగత్ప్రియుడవు శచీపతీ ! తేజస్సుచే (ప్రతాపముచే) తపస్సుచే యజ్ఞముచే శ్రుతముచే (పాండిత్యముచే) దమముచే (ఇంద్రియ నిగ్రహముచే నిన్ను మించినవాని నింకొకని నీ లోకమందేను గానను. సరహస్యములయిన వేదములందు మఱల మఱల నీవు కీర్తింపబడినాడవు. వేదములు యజ్ఞముకొరకు క్రతువులు వేదముల కొరకు ప్రవర్తించినవి. నీచే యుద్ధమున గూలిన దానవులు నేడు నరులందు బుట్టి కార్తవీర్యు నాశ్రయించి యున్నారు. వారు నన్ను మిక్కిలి బాధించుచున్నారు. అ బరువునం గ్రుంగి నేనిపుడు నిన్ను శరణందితిని. అనవిని శక్రుండిట్లనియె. ఓ సుందరీ ! దేవతల వలన నీవు భారఖిన్నవైనట్లు విన్నాను. బ్రహ్మ కడకేగి వారి వధోపాయమడిగెదను అని పలికి త్రిదశపతి బృహస్పతితో వసుమతితో నప్రతిమ ప్రభావుడగు పితామహుని (బ్రహ్మ) యొక్క సభ##కేగెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున భూదేవి యింద్రలోకమునకేగుట యను ఇరువదియాఱవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters