Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల ఏబదిమూడవ అధ్యాయము - గజవానరయుద్ధ వర్ణనము

శైలూష ఉవాచ : కింనిమిత్త మభూద్వైరం వానరాణాంతుకుంజరైః కీదృళంచా భవద్యుద్ధంతన్మమాచక్ష్య పృచ్ఛతః ||

నాడాయనఉవాచ : వనాష్టకం కరంద్రాణాం యన్మయోక్తం పురాతవ |

తదుక్తం భారతాద్వర్షా ద్భాగస్యతే నవమస్యచ || 2

ద్వీపేషు రాజన్సర్వేషు వర్షేషుచ పృథక్‌ పృథక్‌ | వనేషు నివసంత్యేతే కరీంద్రా వానరాస్తథా || 3

రక్షంతివానరాస్తత్ర కాననేషుచ శాఖినః | పాతయంతి ద్రుమాన్నాగా వీలయైవజనాధిప || 4

ద్రుమేషు పాత్యమానేషు కుంజరాణాంతరస్వినామ్‌ | వానరాః కదనంచక్రుః క్రోధావిష్పాః పునః పునః || 5

హన్య మానేషు నాగేషు కరీంద్రాశ్చపవీముఖాన్‌ | పాతయంతి మహారాజ శతశోథసహస్రశః || 6

ఏవం ప్రవృద్ధేవైరేతు వానరై కుంజరైస్తథా | రాజ్ఞేనివేదితాంగ త్వాఋక్షై రావణయోస్తథా || 7

తతస్తౌ పార్థివౌ క్రుద్ధౌ చక్రతుర్యత్న ముత్తమమ్‌ | వానరాస్తు మహాకాయా వీరాః పరమరం హసః || 8

ఋక్షాశ్చైవ సగోపుచ్ఛాః కిష్కింధాం పునరాగతాః | ఐరావణాజ్ఞయానాగాః సపక్షాః పర్వతోత్తమాః || 9

ప్రాచ్యాం వనమథా జగ్ముః సర్వతః పృధివీపతే | బలార్ణవావు భౌక్షుభ్థౌక్రోధావిష్టో పరస్పరమ్‌ || 10

అంతర్వేదీంతదాతౌతు జగ్మతుర్భలదర్పితౌ | తతః ప్రావర్తతరణం ఘోరరూపం భయానకమ్‌ || 11

భూమౌచై వాంతరిక్షేచ నాగానాం సహవానరైః | ద్రుమప్రహారాభిహతాః కుంజరావాన రోత్తమైః || 12

పతంతోగగనాద్భూమించాలయం తిముహుర్ముహషిః | ఖురేషువాన రంగృహ్య ద్వౌనాగౌగగనేతథా || 13

పాతయంతిమహా రాజభిందంతి దశ##నైస్తథా | మమంథుర పరేపాదై ర్దేహేనాతాడ యంస్తథా || 14

వృక్షాన్కరై రథోన్మూల్య చుక్షుభుర్యేనవానరాః | ఐరావణన విహతాః కోటిశస్తత్రవానరాః || 15

వద్మేన సుప్రతీకేన వామనేనాంజనేనచ | కుముదేనచనీలేన పుష్పదంతేనచాప్యథ || 16

తేషామన్వయ సంభూతైస్తథై వాన్యైశ్చ కుంజరైః | భ##ద్రేణచాథమందేన మృగేణచ మహీపతే || 17

భద్రమందేణ మిశ్రేణసార్వభౌమేన వేధసా | రాజ్ఞాసుమనసారాజం న్తథైవచ సువర్చసా || 18

వలాహకేన మత్తేన భీమేనేందీవరేణచ | హేమకూటేన కూటేన శంఖేన నిషధేనచ || 19

శ్వేతేనరాజన్రక్తేన కాంచనేనాంగ సుప్రజ | విరూపాక్షేణ చోగ్రేణ షద్దంతేనాసితేనచ || 20

చతుర్దంతేన యక్షేణరక్షసా భీమమాలినా | ఋక్షేణ వానరేంద్రేణ కోటేశః కుంజరాహతాః || 21

శరభేణగవాక్షేణ తథాకనకబింధునా | ఋక్షరాజౌన ధూమ్రేణ తథా జాంబవతానృప || 22

సుషేణ దధివక్త్రాభ్యాం తథా కేసరిణారణ | రణచండేనవీరేణ వాన రేంద్రేణజానునా || 23

తథా శతబలిర్యశ్చతే నాపికదనం కృతమ్‌ | పనసేనవిశాతేన గజేన గవయేనచ || 24

హేమకూటేన విభూనాభాను రోవ్ణూనిశాభృతా | గంధమాదన నామ్నాచ విజయేన జయేనచ || 25

కుముదేనాథ పద్మేన కనకాక్షేణ శంభునా | ఇత్యేవందృశ్య మానేషు వానరేషు గజేషుచ || 26

చచాలమేదినీ రాజం స్తస్మిన్కా లేముహుర్ముహుం | ఖస్థైర్భూస్థైశ్చ విక్రాంతైర్వానరైః కుంజరైన్తథా || 27

హతైశ్చహన్య మానైశ్చ ఘోరమాయోధనంబభౌ | శరీరైర్యత్ర సంరుద్ధాః స్రవంతోరుధిరాపగా || 28

శైలూషుడేనిమిత్తమున కపి కుంజరములకు బోరయ్యె నది యెట్లయ్యె నాకు వచింపుమన నాడాయనుండనియె గజేంద్ర నివాస వనములెనిమిదని యింతమున్ను దెలిపితిని. అదంతయు భారతవర్షమందు తొమ్మిదవ భాగమైయున్నది. అన్ని ద్వీపములందు అన్ని వర్షములందు వేర్వేర నీ కపీంద్రులు కరీంద్రులను నా యా వనములందు వసించుచున్నారు. అందడవులలోని చెట్లన వానరములు గాపాడుచుండును. కుంజరము లవలీలగ గూల్చుచుండును. అట్లు చెట్లగూల్చుచుండ వానరములు కోపావేశముచెంది వానితో యుద్ధ మొనర్చుచుండెను. ఇట్లారెండుజాతులకు ఘోరకదనము ప్రవృద్దమైనంత వానరములు చని తమరాజగు ఋక్షునికి కుంజరములరిగి తమరాజగు నైరావణునకు జెప్పుకొనిరి. దాన నాయిద్దరు రాజులు కుపితులై పెద్ద ప్రయత్నము గావించిరి. మహాకాయులు వానరములు వీరులు మహావేగులు ఋక్షములు (ఎలుగుబంట్లు) గోపుచ్ఛములతో కిష్కింధకు మరలివచ్చిరి. ఐరావణాజ్ఞచే దమపక్షముతో దూర్పునందున్న వనముకుంజనెను. ఇట్లాయుభయ బలసముద్రములు పరస్పర క్రోధావేశమంది సంక్షోభించి బలదర్పితు లయ్యి ద్దరు నంతర్వేదికిం జనిరి. అటుపై భూమిపై నంతరిక్షమున కుంజర వానరముల కతిభయంకరమైన సంగరమారంభమయ్యెను. వానరులచే నేనుగులు తరువులం గొట్టబడి కూలుచు నెడనెడ భూమిం గంపింప జేసినవి. రెండేనుగులు పాదము డెక్కల నొకవానరము నెత్తి నింగికెగరవేయుచు గోరలచే జీల్చెను. కొన్ని పాదములచే నేలరాచినవి. దేహములం గెట్టినవి. తొండములం జెట్లం బెరకి పైబడి బాదినవి. అంతట కపులు సంక్షోభించినవి. ఐరావణుడెందరినో కోట్లకోలది కోతులం గూల్చెను. అట్లే కడమ వానరరాజులేడ్వురు నంతులేని కపిసంఘముల హతమార్చెను. వారి కాలమునకుచెందిన భగ్రాది కుగిజరయూదపతులు ధూమ్ర జాంశవ తుషేణ దధిముఖ కేసరు రణచండాదులగు ఋక్ష వానర సైన్యాధిపతులు కలియబడి ప్రచండ కదనమొనరించిరి. అప్పడు భూమి మఱిమఱి కంపించెను. స్నస్థులై భూమి పైనిలిచిన విక్రమ వంతులను వానరములతో కుంజరములతోడను చచ్చిన చంపబడు చున్న వారిచేతను నా రణమతి ఘోరమయ్యెను. ఆ యిరుపక్షములవారి శరీరముల నుండి జాల్వారి రక్త నదులు ప్రవహించెను.

వానరాణాంగజానాంచ మహాశైలోపమైర్నృప | తస్మింస్తథా విధేయుద్ధే గజవానర సంక్షయే || 29

ఆజగామాథతం దేశం స్వయం దేవః శ్శతక్రతుః | అభ్యేత్య వారయామాసవానరాంశ్చైవ కుంజరాన్‌ || 30

తతశ్చవానరాః సర్వే శక్రగౌరవయంత్రితాః | సంస్యవర్తంత సంగ్రామత్ప్రహ్వాః ప్రాంజలయః స్థితాః || 31

త్యక్తయుధాన్రణ జఘ్న ర్వానరాన్కులజరా స్తథా | క్రుద్ధస్తే షాంమహేంద్రస్తు వజ్రేణ శతపర్వణా || 32

పక్షాంక్షిశ్చిచ్ఛేద నాగానాం నిహతాయైర్వ వీముఖాః | భిన్న పక్షాంస్తదానాగా న్వాహనార్థంమహీతలే || 33

ప్రదదౌలోమ పాదాయ తదాంగేయ పార్థివ | లోమపాదోపినృపతి స్తదా తేషాంచికిత్సితమ్‌ | 34

శిక్షాం స్వస్త్యయనం చైవ చక్రీసూత్రనిబంధనమ్‌ | తతః ప్రభృతి లోకేస్మిన్వాహ సత్వంగతాగజాః || 35

గుర్విణీభిర్వ నస్థాభిఃకరిణీభిర్జనేశ్వర | వనే వివర్థితా వంశాః కుంజదాణాం పునః పునః || 36

వనేష్వ పితదా జాతావిపక్షాః కుంజరోత్తమాః | భిన్న పక్షేషు జాతేషు ప్రభావేణ శతక్రతోః || 37

వానరాశ్చజయం లబ్ధ్వా ప్రణిపత్య పురందరమ్‌ | స్థానానిజగ్ముః స్వాన్యేవరాజ్ఞా ఋక్షెణ పూజితాః || 38

ఏవం విధైర భూత్తేషాం వానరాణాంతు కుంజరైః | యుద్ధమాసీన్మహా ఘోరం విజితాయత్రకుంజరాః || 39

వానరాశ్చమహాభాగా కుంజరేంద్ర ప్రమర్దనాః | దైవయోగేన విజితేభరతౌపియదృచ్ఛయా |

క్షిప్రమేవోద్ధరిష్యంతిత్వాం సమేత్య సబాంధవమ్‌ || 4

తస్మాన్నయుద్ధం మమరోచేతేతే రఘూద్వహేనా ప్రతిమేన రాజన్‌ |

నయాత్మనా చప్రతిపూరుషేణ ధర్మాఖిరామేణ జన్రపియేణ || 41

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శైలూషం ప్రతి నాడాయన వాక్యే గజవానర యుద్ధవర్ణనంనామ త్రిపంచశ దుత్తర ద్విశతతమోధ్యాయః ||

గజవానర సంక్షయమైన సమర మా విధముగ సాగ నచ్చోటికింద్రుడు వచ్చెను. వచ్చి యా యిర్వురును వారించెను.అంతట వానరులందరు శక్రునిపై గటల గౌరమునకు లోబడి రణము నుండి మరలిరి. పినతులై దోసి లొగ్గి నిలువబడిరి. రణమునందు పోరులుమానిన వానరులను మదేభములుపైబడి క్రుమ్మినవి. అప్పుడింద్రుడు క్రుద్ధుడై నూరంచులు గల వబ్రుముచే వానరములం జంపిన యా యేణుగుల పక్షములను నరికివేసెను. (అప్పుడేనుగులకు ఱక్కలుండె నన్నమాట.) ఱక్కలు దెగిన యేనుగుల నవనీ తలమందలి అంగదేరాధిమతి లోమపాదున కిచ్చెను. ఆ రాజు ఆ గజముల చికిత్సతమున గజశిక్షను జేసి సూత్ర నిభంధంనమైన స్వస్త్యయనము బంగళాచరణము గావించెను. అదిమొదలీలోకమున గజములు వాహనములయ్యెను. వనములందున్న గుర్భిణులయిన కరిణులచే (చూలొందిన ఏనుగులచే) మరిమరి గజకంసము అభివృద్ధి నొందింపబడెను. ఇంద్రప్రభావముచే ఱక్కలు త్రెంపబడినవి. అప్పటి నుండియే గజములరణ్యములందు ఱక్కలు లేనివై జనించినవి. అందట్లు వానరములు కుంజరేంద్రముల మర్దించి తాము గెలుపొంది ఒక వేళ దైవ యోగమున భరతుడు మీచే గెలువ బడెనేని తమంతతామ యాక్షణవన్చి సబాంధవము నిన్ను న్మూరింప గలరు. అందుచే రాజా! న్వాయమూర్తి ధర్మాభిరాముడు జనప్రియుడును ఆ ప్రతి మానుడైన రఘూద్వహునితో నీయుద్దము నా కభిమతము గాదు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున కుంజరవానర సంగ్రామను రెండువందలయేబదిమూడవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters