Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలనలుబదిఐదవ అధ్యాయము - హేమంన్తవర్ణనము

రామః - ప్రబుద్ధేపుండరీకాక్షే హేమన్తే వైష్ణవే ఋతౌ | కార్యః పురనివేశ##స్తే తథా జనపదస్యవా || 1

పక్వనారంగ సుభ##గే నీహారావృత నిమ్నగే | ప్రలూన ధాన్య కేదారే గత తుందశిలీముఖే ||2

కృతసంగ్రహణ కాలే ప్రవృత్తనృప విగ్రహే | విపంక వసుధే రమ్యే స్వాదుశీతజలాశ##యే ||3

విశాలా యత్ర యామిన్యః సుతరాంసురతక్షమాః | భృశం మనోహరా యూనాం పీడితా లింగనక్షమాః || 4

యత్ర శీతాపదేశేన మానినీభి రపి స్వయమ్‌ | క్రియతే త్యక్తమానాభిః ప్రియకంఠ గ్రహోత్సవః || 5

సుఖోష్ణోదక గాంధర్వ రమ్య ప్రస్రవణోదకే | ప్రరూఢ పవనోద్ధూతే కాలే నీలధరాతలే || 6

వాసోద్గమన సంరుద్ధ దుర్విభావ్య నదీతటే | సారసారావ విజ్ఞేయే కాలేకామి జనప్రియే ||7

యత్రేక్షుపీడ యన్త్రాణాం యష్ట్యః పురుషచోదితాః | భాగ్యానీవ మనుష్యాణా మున్నమన్తి నమన్తిచ || 8

కృతాగ్రాయణ పూజాశ్చ హుతహవ్యాః ద్విజాతయః | యత్ర ప్రవేశ హృష్టాశ్చ తథా యత్రచ కర్షకాః || 9

గృహేషుచ సుఖోష్ణేషు గవాం నిశ్శ్వాస మారుతైః | స్వాధ్యాయ ఘోషో విప్రాణాం నౄణాం యత్ర సుఖావహః ||

సితాభిః పచ్యమానాభిః క్రియమానైస్తథా గుడైః | రమ్య స్సుశీతలః కాలః ప్రాణి ప్రియ హుతాశనః || 11

విచరన్తి నరాయత్ర గురుప్రావరణాంబరాః | కుంకుమే నాను లిప్తాంగా ధనినః ప్రియదర్శినః || 12

అశ్వాయామక్షమేకాలే యత్రయూనాం వివేషతః | మృగయా దయితా వత్స ! మందరశ్మౌ దివాకరే || 13

రోహితాశన పుష్టానాం సాధునారంగ వాసితమ్‌ | మహిషీణాంతు మథితం గంధవర్ణ రసాన్వితమ్‌ || 14

ఇషవశ్చ విదార్యాశ్చ తథైవమూలకానిచ | రసవన్తివిశేషేణ యత్ర పిష్ట కృతానిచ || 15

ప్రవృత్తమేఖలాబంధ వివాహాది క్రియేజనే | ప్రబుద్ధే పుండరీకాక్షే ప్రవృత్తేయజ్ఞసంగరే || 16

కాలేప్రహృష్టాశ్వ కరీంద్రముఖ్యే కార్యాత్వయా రాఘవ వాస్తుపూజా |

ఆరంభణీయం నగరస్యకర్మ శివాయ సర్వస్యజనస్యవత్సః || 17

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే శత్రుఘ్నం ప్రతిరామస ముపదేశే హేమన్త వర్ణనం నామ పంచచత్వారింశదుత్తర ద్విశతతమోధ్యాయః ||

రాముడనియె : శత్రుఘ్న ! హేమంతృతువువు విష్ణుదేవతాకమైనది. (వైష్ణవ మనబడును) పుండరీకాక్షు డప్పుడు మేల్కొనును. కాగా నీవు నగరమందుగాని గ్రామమందుగాని వసింపవలయును. ఆ ఋతువు పండిన నారింజపండ్లతో జక్కగనుండి నదులు మంచుగప్పికొనియుండును. పొలములందు ధాన్యము రాలుచుండును. వరిచేలు నూర్చుటకు సమయమన్నమాట. పంటల నిండ్లకు సంగ్రహించుకొనితెచ్చు కాలమది. రాజుల యుద్ధారంభసమయము భూమి బురద యెండి చక్కగానుండును. తియ్యని చల్లని జలసమృద్ధిగలది. రాత్రిప్రొద్దెక్కువ. స్త్రీలు మిక్కిలి రతిక్షమలు యువకుల కెంతేని గూర్చువారు. గాఢాలింగనక్షమలు. చలినెపమున మానినులు (గుట్టు మిగుల లజ్జ) చిత్తసమున్న తిగలవారుగూడ మానము విడిచి తమంతతాము ప్రియవల్భుల కంఠముల బిగ్గగౌగలించుకొను వేడుకలొనరింతురు. స్వయంగృహాశ్లేష సుఖోత్సవోత్సాహులయ్యెదరు. సుఖకరమైన వేడిమి మాత్రమే కల్గి కలకల నినాద మధురములై నీటిబుగ్గలం బొంగు జలములం జలిగాలులు బెక్కుగ వీచుతఱి నేలయెల్ల నల్లబడిన చలిచే నిల్లువెడలి వెలుపలికి జనలేమిని నదియొడ్డుమాట తలపునకేనిరాని పుండువంటి చలిలో సారసారావమున బెగ్గురు పక్షుల కూతలంబట్టి మాత్రమే తెలియనయిన కామిజనప్రియమైన చలికాలమున చెఱకుగానుగలకు సంబంధించిన ఎడ్ల నదలించి తోలుటకు రైతులుపయోగించు ములు గర్రలు మానవులభాగ్యములట్లు (అదృష్టములట్లు) మీదికెగయుచుందిగుచుండును. (అద్భుతవర్ణనము!!) ద్విజులు ఆగ్రాయణపూజచేసి (ఆగ్రయణష్టిచేసి దేవతాప్రీతిగ హోమములుసేయుతఱి కొత్తపంట వచ్చినప్పుడుదేవతలకు హవిర్భాగములిచ్చుటకు జేయబడునిష్టిని ఆగ్రయణష్టియందురు) కర్షకులు పొలములను విడిచి గోవుల విశ్శ్వాస వాయువులచే సుఖోష్ణములైన తమ యిలువాకిండ్లం బ్రవేశించి హర్షింతురు. విపుల స్వాధ్యాయ ఘోషమందఱకు హాయిగూర్చును. మార్గశిర పౌష పుష్యమాసములు హేమంత ఋతువుగాన అప్పుడు బెల్లమువంటలో పంచదారములవంటలో నగ్ని సామీప్యమువలనగల్గు వెచ్చదనమును కొనినీప్రాణు లగ్ని ప్రియులగుచుందురు. (అందఱకప్రియమైన యగ్నిని బ్రియమునొనరించు కాలమిదియను నీచలికాల ప్రశంసయు నద్భుతముగా నున్నది.) అందు జనులు బరువైన కంబళీలు మొదలయిన బరువైన ప్రావరణములను గప్పుకొని దట్టమైన వస్త్రములు ధరించి కుంకుమపూవు మేనికి బూసి కొని (కుంకుమ పూవుపూత వలన శరీరము వేడెక్కును.) ధనికులు చూడ ముచ్చటగ చరించు చుందురు. గుఱ్ఱములకది వ్యాయామ కాలము. (గుఱ్ఱముల పరిశ్రమను బాగుగ సహించు సమయము) కావున సూర్య రశ్మి మందముగ నున్నందున యువకుల కందు వేట మిగుల యిష్టమగును. చేపలు తెగతిని పుష్టినొందిన వారికి మంచి నారింజ పండ్లరసముచే బరిమిళితమైన సువాసనతో నచ్చవు తెలుపు రంగుతో గూడిన గేదెవెన్న చెఱకులు విదారులు మూలకములు రుచికరమైన పిండితోచేసిన వంటకములు ప్రీతి నించుచుండెను. జరుగనగు శుభముహూర్తముల కది కాలము గావున ఉపనయన వివాహాది శుభకార్యములారంభమగును. హరిమేల్కొని నందున యజ్ఞముల కది సమయము. ఏనుగులు గుఱ్ఱములు మిగుల హర్షభరితమైన యా హేమంతము నందు నీవు వాస్తు పూజ గావింపదగును. సర్వజనమంగళము కొఱకది రాజధానీనగరమందు నీ వారంభము సేయుము.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున శత్రుఘ్ను నిగూర్చిన రామానుశాసనమను రెండువందలనలుబదియైదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters