Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల నలుబదిరెండవ అధ్యాయము - రామానుశాసనము

నాడాయనః తత స్సభాగతం రామ ద్వాఃష్తో వచన మవ్రవీత్‌ ద్వారి తిష్టన్తి మునయో యమునాతీరవాసిన || 1

భార్గవం తు పురస్క్రత్య చ్యవనం దీప్త తేజసమ్‌ మహానుభావా వరదాః తపసా దగ్ధ కిల్బిషాః || 2

ద్వాః స్థాత్తు వచనం శ్రుత్వా తదా రామః పురోధసా | సహిత స్త్వరయా ద్రుష్టుం తాపసాన్‌ తాన్‌ వినిర్గతః || 3

సోభిగమ్య మహాతేజాః ఋషిసంఘాన్‌ తపస్వినః | అభివాద్య ప్రణమ్యైతాన్‌ పురస్కృత్య తదా గృహమ్‌ || 4

ప్రావేశయ త్తతస్తేషాం పాద్యార్ఘ్యా చమనా దికమ్‌ | ఆసనం మధుపర్కం చ తథా రాజ్యం న్యవేదయత్‌ || 5

ప్రతిగృహ్య తు తే సర్వే రాజ్యం తసై#్మ పునర్దదుః | తద్వచ్చ తీర్థ తోయాని ఫలాని వివిధాని చ || 6

ప్రతిగృహ్య చ రామస్తాన్‌ పృష్ట్వా కుశల మవ్యయమ్‌ | పప్రచ్ఛతాన్‌ మహాభాగః తతస్త్వాగమన క్రియామ్‌ || 7

రామస్య వచనం శ్రుత్వా చ్యవనో వాక్య మబ్రవీత్‌ | రాక్షసో లవణో నామ రాజన్‌ ! మధువనే వసన్‌ || 8

లోకాన్‌ తాపయతే సర్వాన్‌ తస్యయత్నం వధే కురు ! | దశప్రాణి సహస్రాణి చాహారస్తస్య నైత్యికః || 9

వధార్థం భరతం తస్య శత్రుఘ్నం సహ లక్ష్మణమ్‌ | సమాదిశ ! మహాభాగ! లోకాస్యన్తు నిరామయాః || 10

తథా మధువనే స్ఫీతే దేశం రామ! నివేశయ! | నగరీ శ్చ యథా పుణ్యాం లోకానాం హితకామ్యయా || 11

త్వయా సభాజ్యో రాక్ష్యాశ్చ మునిసంఘాః మహామతేః | ఏవముక్త స్తదా రామ శ్చిన్తయామాస ధర్మవిత్‌ || 12

నాడాయనుడు శైలూషుని కిట్లనియె. పేరోలగమున్న రామభద్రునితో ద్వారపాలకుడు యమునాతీరవాసులు మునులు ద్వారమందున్నారు. భార్గవ వంశభూషణుని మహాతేజస్విని చ్యవనుని మున్నిడుకొని యేతెంచినారు. మహానుభావులు వరదులు తపస్సు చేసి పాపములం దహించినారన విని రాముడు పురోహితునితో తొందరగా నా తాపసులం దర్శింప బయలుదేరెను. వారిందరిసి నమస్కరించి నవనిం జాగిలి మ్రొక్కి వారిని ముందిడుకొని గృహముం బ్రవేశింపజేసెను. వారికి పాద్యార్ఘ్య మాచమనాదికము ఆసనము మధుపర్కము మొదలగు నుచారములన్నియును నెరపి రాజ్యమును నివేదించెను. (ఈరాజ్యము మీదని సమర్పించెనన్న మాట వారదాని స్వీకరించి యందరుందిరిగి రాజునకిచ్చిరి. మఱియుం దాముగొనివచ్చిన తీర్థోదకములను పలువిదములు పండ్లను సమర్పించిరి. రాముడు వానింగైకొని వారిని తరుగని వారి కుశలమడిగి యా మహానుభావులను రాకనుగూర్చి ప్రశ్నించెను. రాముని పలుకాలించి చ్యవనమహర్షి పలుకదొడంగెను.

రాక్షసుడు లవణుడనువాడు ప్రభూ! మధువనమందు వసించుచు సర్వలోకములం దహింపజేయుచున్నాడు. వానివధకు యత్నమొనరింపుము. నిత్యము పదివేలప్రాణుల వానికాహారము. వానింజంప భరతుని శత్రుఘ్నుని లక్ష్మణునితో నాజ్ఞయిమ్ము. లోకములు నిరుపద్రవములగుంగాక! మధువనము సువిశాలము. అందు దేశమును (రాష్ట్రమును) నెలకొల్పుము. లోకహితముకోరి రమ్యమైనరాజధానినేర్పరుపుము. నీచేగౌరవింప రక్షింపవలసినవారు ముని సంఘములవారు అనవినిధర్మజ్ఞుడురాముడాలోచించెను.

లక్ష్మణన మహత్కర్మ కృతం నివసతా వనే | రాజ్యం పాలయతా కర్మ భరతేన మహ త్కృతమ్‌ || 13

శత్రుఘ్నం ప్రేరయా మ్యద్య లవణస్య వధేప్సయా | ఇత్యేవం చిన్తయిత్వా తు రామః శత్రుఘ్ను మబ్రవీత్‌ || 14

మునీం శ్చైతాన్‌ పురస్కృత్య గచ్ఛ శత్రుఘ్న | మాచిరమ్‌ | ఘాతయస్వ దురాచారం లవణం పాప కారిణమ్‌ || 15

ఘాతయిత్వాచ లవణం జనాం స్తత్ర నివేశయ ! | నగరీ చ తథా తత్ర త్వయా కార్యా మనోరమా || 16

అరణ్యమున నివసించుచున్న లక్ష్మణుని చేతను రాజ్యమును పాలించుచున్న భరతుని చేతను గొప్ప కృత్యమొనరింప బడెను. లవణాసురుని చంపుటకై శత్రుఘ్నుని పురిగొల్పెదము. అని ఆలోచించి రామచంద్రుడు శత్రుఘ్నునితో నిట్లు పలికెను. ''శత్రుఘ్నా! ఈ మునుల ముందడుకొని శీఘ్రముగ నీవువెళ్ళి దురాచారుడ పాపకారియు నగు లవణాసురుని చంపి జనుల నచట ప్రవేశ##పెట్టుము. అచట మనోహరమగు నొకపట్టణమచట నిర్మింపుము.

తస్యాం వస ! మహాభా! పాలయన్‌ త్వం వసుంధరామ్‌ | తత్రాహ మభిషేక్ష్యామి రాజ్యే త్వా మృషిభి స్సహ || 17

ఏతావ దుక్త్వా రామ స్తద్వాక్యం ఋషి గణాన్వితమ్‌ | అభిషేకేన దివ్యేన యోజయామాస తం తదా || 18

ఉవాచ చ మహాతేజాః భ్రాతరం దీప్త తేజసమ్‌ | ఇమా న్యశ్వ సహస్రాణి చత్వారి భవతో నఘ ! || 19

రథానాం ద్వే సహస్రేచ ద్విపోత్తమ శతం తథా | అయుతం చ పదాతీనాం సువర్ణస్యచ సంచయమ్‌ || 20

అన్తరాపణ వీథ్యశ్చ నానాపణ్యోప శోభితాః | ఆదాయ గచ్ఛ శత్రుఘ్న ! పర్యాప్త బలవాహనః || 21

బలం చ సుభృతం వీర ! తుష్ట పుష్ట మనుద్ధతమ్‌ | వశం చ సాంత్వదానాభ్యాం కురుష్వ ! రఘునందన ! || 22

న హ్యర్థా స్తత్‌ తిష్ఠన్తి న మిత్రాణి న భాంధవాః | సుప్రీతో భృత్య వర్గస్తు యత్ర తిష్ఠతి రాఘవ ! || 23

సత్వం దుష్టజనాకీర్ణాం సంస్థాప్య మహతీం చమూమ్‌ | ఏక ఏవ ధనుష్పాణిః యోధయేథాః మధోస్సుతమ్‌ || 24

యథాచ త్వాం న జానాతి గచ్ఛ తం యుద్ధకాంక్షితమ్‌ | లవణస్స మధోః పుత్ర స్తథా నిశ్శంకనో వ్రజ ! || 25

ఆఖ్యాతో న చ తస్యాస్తి కశ్చి న్మృత్యు భయాన్వితః | దర్శనం యోభి గచ్ఛేత హన్యతే లవణన సః || 26

మాహేశ్వరేణ శూలేన వియుక్తం మృగయా గతమ్‌ | ద్వార మావృత్య లవణం యుధ్యస్వ రఘునందన || 27

మాహేశ్వర మమోఘం తు శూలం చ పరివర్జితమ్‌ | గృహాణమం శరం వత్స ! సర్వాయుధ వినాశనమ్‌ || 28

అనేన లవణం యుద్ధే ఘాతయిష్యస్య సంశయమ్‌ | గచ్ఛత్వం ! గ్రీష్మ శేషేణ లవణస్య జిఘాంసయా || 29

కాలే తథా ప్రావృషి సంప్రవృత్తే వివృద్ధ తోయాసు సరిద్వరాసు |

మద్దత్త బాణన నిశాచరస్య వ్యసుం క్షితౌ పాతయ ! తస్య దేహమ్‌ || 30

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే లవణవధే శత్రుఘ్నం ప్రతి రామానుశాసనంనామ ద్విచత్వారింశదుత్తర ద్విశతతమోధ్యాయః ||

భూమిని పాలించుచు నీవచట నుండుము. ఈఋషులతోగూడ నిన్నచట నభిషేకిం తును.'' అనిపలికి రాముడు ఋషులతో గూడ ఆ శత్రుఘ్నునికి దివ్యాభిషేకమొనరించెను. మరియు నిట్లనెను. ఈ నాలుగువేల గుఱ్ఱములను, రెండువేల రథములు, నూరు గజములు పదివేలమంది పదాతులు హేమసముదాయము నానావిధ విక్రేయస్తు శోభితములగు అంగడి వీథులను, తగినంత సేనను. వాహనములను తీసికొనిపొమ్ము. రఘునందనా! ఆసేనను చక్కగ పోషించుచు లాలనపాలనలచే విదేయతగలదానినిగ నొనర్పుము. ఓ రాఘవా! సేవకజనము సంతుష్టితో నున్నతావునకు బంధువులుగాని, మిత్రులుగాని

అర్థములుగాని చేరవు. కావున సంతుష్టులైన జనముతోనిండిన గొప్ప సేనల గూర్చుకొని ధనుష్పాణివై లవణాసురునితో యుద్ధముచేయుము. మధుసుతుడగు లవణాసురుడు యద్ధేచ్ఛతో నీవువచ్చినట్లు తెలియకుండునట్లు నిర్భయముగ వెళ్ళుము. మృత్యుభయము గలవాడెవ్వడు వానికంటబడిననుసరే; లవణుడు వానిని చంపివేయును. మాహేశ్వర శూలరహితుడై వేటకరిగిన లవణుని ద్వారమునావరించి యుద్ధము చేయుము. అమోఘమగు మామేశ్వర శూలమును వదలి నాయనా! సర్వాయుధ వినాశకమగు నీ బాణమును నీవు తీసికొనపుము. ఈ బాణముతో నీవు నిస్సంశయముగ లవణుని చంపెదవు. ఈ గ్రీష్మ కాలాంతమున లవణుని చంపు గోరికతో నీవు బయలుదేరుము. వర్షాకాలము రాగానే నదులన్నియు పుష్కల జలసమృద్ధములుకాగా నేనిచ్చిన యీ బాణముతో విగత ప్రాణుడైన యా రాక్షసుని దేహమును భూమిపై పడవేయుము !

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున లవణాసురవధ విషయమై శత్రుఘ్నునిగూర్చి రామానుశాసనమను రెండువందల నలుబదిరెండవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters