Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల ముప్పదిఏడవ అధ్యాయము - విష్ణుకవచము

మహేశ్వరః : ప్రణమ్యాజర మీశాన మజం నిత్య మనామయమ్‌ | దేవం సర్వేశ్వరం విష్ణుం సర్వవ్యాపిన మవ్యయమ్‌ ||

ప్రజామ్యహం ప్రతిసరం నమస్కృత్య జనార్దనమ్‌ | అమోఘ మప్రతిహతం సర్వదుష్టనివారణమ్‌ || 2

విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || 3

మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్రే వాసుదేవః శ్రోత్రే సంకర్షణ స్తథా || 4

ప్రద్యుమ్నః పాతు మే ఘ్రాణం అనిరుద్దో ముఖం మమ | వనమాలీ గలం పాతు శ్రీవక్షో రక్షతాత్పురః |

పార్శ్వ తు పాతుమే చక్రం వామం దైత్య విదారణమ్‌ || 5

దక్షిణం తు గదా దేవీ సర్వాసురనివారిణీ | ఉదరం ముసలీ పాతు ! వృష్ఠం పాతు చ లాంగలీ || 6

ఊరూ రక్షతు శార్గీ మే జంఘే రక్షతు చర్మకీ | పాణీ రక్షతు శంఖీ చ పాదౌ మే చరణా పుభౌ || 7

వరాహో రక్షతు జలే విషమేషు చ వామనః | అటవ్యాం నరసింహస్తు సర్వతః పాతు కేశవః || 8

హిరణ్య గర్భో భగవాన్‌ హిరణ్యం మే ప్రయచ్ఛతు ! | సాంఖ్యాచార్యస్తు కపిలో ధాతు సామ్యం కరోతు మే || 9

శ్వేతద్వీప నివాసీ చ శ్వేతద్వీపం నయ త్వజః | సర్వాన్‌ శత్రూన్‌ సూదయతు మధుకైటభ సూదనః || 10

వికర్షతు సదా విష్ణుః కిల్బిషం మమ విగ్రహాత్‌ | హంసో మత్స్యః తథా కూర్మః పాతు మాం సర్వతో దిశమ్‌ || 11

త్రివిక్రమస్తు మే దేవః సర్వాన్‌ పాశా న్నికృంతతు ! | నరనారాయణో దేవో వృద్ధిం పాలయ తాం మమ || 12

శేషోశేసామలజ్ఞానః కరో త్వజ్ఞాన నాశనమ్‌ | బడబాముఖో నాశయతు కల్మాషం య స్మయా కృతమ్‌ || 13

విద్యాం దదాతు పరమా మశ్వమూర్ధా మమ ప్రభుః | దత్తాత్రేయః పాలయతు సపుత్ర పశు బాంధవమ్‌ || 14

సర్వాన్రోగా న్నాశయతు రామః పరశునా మమ | రక్షోఘ్నె మే దాశరథిః పాతు నిత్యం మహాభుజః || 15

రిపూన్‌ హలేన మే హన్యా ద్రామో యాదవ నందనః | ప్రలంబ కేశి చాణూర పూతనా కంస నాశనః || 16

కృష్ణో యో బాలభావేన స మే కామాన్‌ ప్రయచ్ఛతు | అంధకారం తమో ఘోరం పురుషం కృష్ణ పింగళమ్‌ || 17

పశ్యామి భయ సంతప్తః పాశహస్త మివాంతకమ్‌ | తతోహం పుండరీకాక్ష మచ్యుతం శరణం గతః || 18

యోగీశ మతిరూపస్థం శుభ శీతాంశు నిర్మలమ్‌ | ధన్యోహం విజయీ నిత్యం యస్య మే భగవాన్‌ హరి! || 19

మహేశ్వరుడనియె : ప్రణమిల్లి అజరుని ఈశానుని అజుని నిత్యుని అనామయుని దేవుని సర్వేశ్వరుని విష్ణువును సర్వవ్యాపిని అవ్యయుని జనార్దనుని నమస్కరించి ఆమోఘము అప్రతిహతము సర్వదుఃఖ నివారణము నగు విష్ణువుయొక్క ప్రతిసరమును దొడుగుకొనుచున్నాను. విష్ణువు నాముందు రక్షించుత కృష్ణుడు వెనుక రక్షించుత హరినా శిరస్సును రక్షించుత జనార్దనుండు శిరస్సును హృదయమును గాపాడుత హృషీకేశుడు (ఇంద్రియముల నాయకుడు) నామనస్సును కేశవుడు నాజిహ్వను (నాలుకను) రక్షించుత వాసు దేవుడు నేత్రములను సంకర్షణుడు నాకర్ణములను రక్షించుత ప్రద్యుమ్నుడు నాఘ్రాణమును (ముక్కును) అనిరుద్ధుడు నాముఖమును వనమాలి నాగళమును శ్రీవక్షుడు నాముందును గాపాడుగాక ! చక్రము నా యెడను రక్షయిచ్చుత నా సర్వాసుర విదారిణిగదాదేవి నా కుడివైపు కాపాడుత సుమాలి (వనమాలి) ఉదరముం గాపాడుత లాంగలి (నాగలియయుధమైనవాడు) నావెనుక బ్రోచుత శార్గి శార్గమనువిల్లు ధరించువాడు) నా చర్మమయములైన పిక్కలం గాపాడుత శంఖి (శంఖధారి) నాయిరుచేతులను పాశములను చరణములను (సంచారయోగ్యములను) రక్షించుత గరుడధ్వజుడు సర్వకార్యర్థసిద్ధికొఱకు నాకు రక్షయిచ్చుత వరాహమూర్తినీటిలో విషమములందు వామనుడు అడవిలో నరసింహుడు నన్ని యెడ కేశవుడు గాపాడుంగాక హిరణ్య గర్భుడు (కడుపు బంగారమైనవాడు) భగవంతునాకు హిరణ్యమును (వ్యుత్పత్తి) ఇచ్చుగాక సాంఖ్యాచార్యుడు కపిలుడు నా శరీర ధాతువులను సమముగా నొనరించుగాక శ్వేతద్వీపనివాసి నన్ను శ్వేతద్వీపమునకుం జేకొనిపోవుగాక మధుకైటభ సూదనుడు నా సర్వశత్రువులను సూదించుత (చంపుగాక) విష్ణువు నా శరీరమునుండి కిల్బిషమును వికర్షించుగాక (లాగివేయుత) హంసుడు మత్స్యమూర్తి కూర్మమూర్తి నన్నన్ని దిశల గాపాడుత త్రివిక్రమదేవుడు నా సర్వపాశములం ద్రెంచుత నరనారాయణమూర్తి నా బుద్ధిని పాలించుగాక శేషుడు వినిర్మల జ్ఞనశేషుడు నా అజ్ఞాననాశన మొనరించుత బడబాముఖుడు నేజేసిన కల్మషమును నశింపజేయుత. అశ్వమూర్ధుడు (హయగ్రీవుడు) ప్రభువు నాకు విద్యనిచ్చుత దత్తాత్రేయుడు నాపుత్రపశుబాంధవముగ నన్నేలుత రాముడు పరశువుచే గండ్రగొడ్డలిచే) నా సర్వరోగములను నశింపజేయుగాక రక్షోఘ్నుడు (రాక్షసులంగొట్టినవాడు) దాశరథి మహా భుజుడు రాముడు నిత్యము నన్నుగాపాడుగాక యాదవకుమారుడు బలరాముడు నా శత్రువులను నాగలిచే హతమార్చుత. బాల్యమున ప్రలంబకేశి చాణూరపుతానా కంస నాశనుడు కృష్ణుడు నాకమములను (కోరికలను) ఒసంగుత. అంధకారము కాఱుచీకటి కృష్ణ పింగళమూర్తి (నలుపుజేగరురంగు గలిసిన వర్ణము) యునై పాశముచే బూనిన యంతకుని భయసంతప్తుడనై చూచుచున్నాను. అందువలననే పుండరీకాక్షునచ్యుతని శరణందితిని. యోగీశుని అతిరూపస్థుని (రూపాతీతుని నీరూపుని) చక్కని శీతాంశునట్లు నిర్మలుని శరణొంది నాడను నేను ధన్యుడను నాకునిత్యము విజయియై భగవానుడున్నాడు.

స్మృత్వా నారాయణం దేవం సర్వోపద్రవ నాశనమ్‌ | వైష్ణవం కవచం బద్ధ్వా విచరామి మహీ తలే || 20

అప్రధృష్యోస్మి భూతానాం సర్వ విష్ణు మయోహ్యహమ్‌ | స్మరణా ద్దేవదేవస్య విష్ణో రమిత తేజసః || 21

సిద్ధి ర్భవతు మే నిత్యం తథా మంత్ర ఉదాహృతః | యోమాం పశ్యతి చక్షుర్భ్యాం యంచ పశ్యామి చక్షుషా || 22

సర్వాసాం సమదృష్టీనాం విష్ణు ర్బధ్నాతు చక్షుషా | వాసుదేవస్య యచ్చక్రం తస్య చక్రస్య యే అరాః || 23

తేచ ఛిన్దన్తు మే పాపం మా మే హింసస్తు హింసకాః | రాక్షసేషు పిశాచేషు కాంతారే ష్వటవీషు చ || 24

వివాదే రాజమార్గేషు ద్యూతేషు కలహేషు చ | నదీ సంతరణ ఘోరే సంప్రాప్తే ప్రాణ సంశ##యే || 25

అగ్నిచోర నిపాతే చ సర్వగ్రహ నివారణ | విద్యు త్సర్ప విషోద్యోగే ఖా తోదే రిపు సంకటే || 26

తథ్య మేత జ్జపే న్నిత్యం శారీరే భయ ఆగతే | అయం భగవతో మంత్రో మంత్రాణాం పరమో మహాన్‌ || 27

విఖ్యాతం కవచం గుహ్యం సర్వపాప ప్రణాశనమ్‌ | స్వ మాయాకృత నిర్మాణం కల్పాంత గ్రహ లోపకృత్‌ || 28

సర్వోపద్రవనాశనుని నారాయణ దేవుని దలచికొని విష్ణుకవచముంగట్టికొని మహీతలమందు జరింతును దాన భూతముల కప్రధృష్యుడనయ్యెదను నేను సర్వవిష్ణు మయుడను అమిత తేజస్విని దేవదేవుని విష్ణువుని స్మరించుటవలన నాకెప్పుడు సుదాహృత మంత్రము (ఈవిష్ణుకవచము) సిద్దించుగాక! ఎవ్వడు కన్నుల నన్ను జూచును నేను కంటనెవ్వనిం జూతును తన దృష్టితో విష్ణువాయెల్లదృష్టులనను సర్వసమదృష్టులతో ననుసంధించుగాక వాసుదేవుని చక్రముదాని అరలు (కన్నులు) అంచులు నా పాపమును త్రెంచుగాక నాహింసకులను హంసించుత రాక్షసులం పిశాచముల కాంతారములంగారడవుల వివాదముల రాజమార్గములందు జూదములం గలహములందు నదులుదాటునపుడు ఘోరమైన ప్రాణసంకటము ప్రాప్తించినపుడు అగ్నిచౌరనిపాతమందు నిపాతము ప్రమాదము సర్వగ్రహనివారణమందు విద్యుత్సర్ప మిషస్పర్శయందు (నీటినుండి గుండములందు) బావులు నూతుల బడినపుడు శత్రుసంకటమందు శరీరమున భయమువచ్చినపుడు నిక్కమిది (తప్పక) నిత్యము జపింపవలయును ఇది భగవంతుని మంత్రము. మంత్రములకెల్ల పరమమంత్రము చాల గొప్పది. విష్ణుకవచమను ఖ్యాతిగన్నది. సర్వపాపహరము విష్ణువుతనమాయుశక్తిచే నిర్మించినది. కల్పాంత గృహలోప మొనరించును ప్రళయకాలబీభత్సము దోపనీదన్న మాట అనాద్యము జగద్భీజమది. తచ్చబ్దార్థము అగు పద్మనాభ నీకు నమస్కారము.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున శ్రీవిష్ణుకవచమను రెండువందల ముప్పదియేడవ అధ్యయము.

ఓం కాలాయ స్వాహా || ఓం కాలపురుషాయ స్వాహా || ఓం ప్రచండాయ స్వాహా || ఓం ప్రచండ పురుషాయ స్వాహా || ఓం సర్వాయ స్వాహా || ఓం సర్వ సర్వాయ స్వాహా || ఓం నమో భువనేశాయ త్రిలోకధామ్నే ఇతి టిపి రిటి స్వాహా || ఓం ఉత్తమేన అఘేతు మే వాయుతు మే యే సత్వాః పాపనుచారాఃతేషాం దైత్య దానవ యక్ష రాక్షస భూతప్రేత పిశాచ కూష్మాండా పస్మా రోన్మాదన జ్వరాణాంఏకాహిక ద్వితీయక తార్తీయక చాతుర్థిక మౌహూర్తిక దినజ్వర రాత్రిజ్వర సతతజ్వర సంధ్యాజ్వర

సర్వజ్వరాదీనా ముత్సాదన లూతాకీటక కంటక కట పూతనా భుజగ స్థావర విష విషమ విషాదీనా

మిదం శరీరం మమా ప్రధృష్యం భవతు ఓం సుకారే ప్రకరోత్కటక వికట దంష్ట్ర పూర్వతో రక్ష!

ఓం హైం హైం హైం హైం దినకర సహస్ర కాస్త సమోగ్ర తేజః పశ్చిమతో రక్ష రక్ష ! || ఓం నిరినిరి

ప్రదీప్త జ్వలన జ్వాలాకాల మహాకపిల జటిల ఉత్తరతో రక్ష ! ఓం చిలిచిలి మిలిమిలి చేవడి గౌరి

గాంధారి విషో హని విషం మాం మోహయతు స్వాహా || దక్షిణతో రక్ష ! మా మముకస్య సర్వభూత

భయోపద్రవేభ్యః స్వాహా || జయతి విజయదానం జాయతాం రిపుపుర హాస నున నధ్యతే భయహృదయ

భయదోభ##యే భయం దిశతు మమాయ ముదార మచ్యుతః || యదుదర మఖిలం విశన్తి రశ్మయః ||

ఆద్యన్త వన్తః కవయః పురాణాః సూక్ష్మా బృహన్తో హ్యనుశాసితారః |

సర్వ జ్వరాన్‌ ఘ్నన్తు మమా నిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవాః ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే విష్ణుకవచమ్‌నామ సప్తత్రింశదుత్తర ద్విశతతమోధ్యాయః ||

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters