Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల ముప్పదియారవ అధ్యాయము - దండధర(కాల)దండనము

నాడాయనః : ప్రభావ ముపరం తస్య శృణు! దేవస్య శూలినః | యథా విమోక్షిత స్తేన శ్వేతో మృత్యువశం గతః || 1

శ్వేతో నామ మహాతేజాః పరమధార్మికః | పూజయామాస సతతం లింగం త్రిపుర ఘాతినః || 2

తస్య పూజా ప్రసక్తస్య కదాచిత్‌ పృథివీపతే ! | ఆజగామ తముద్దేశం కాలః పరమ దారుణః || 3

రక్త వృత్త త్రినయనః సర్ప పృశ్చిక రోమవాన్‌ | దంష్ట్రా కరాళో వికటః చూర్ణితాంజనసప్రభః || 4

రక్తవాసా మహాకాయః సర్వాభరణ భూషితః | పాశహస్త స్తథా భ్యేత్య శ్వేతే పాశ మథా సృజత్‌ || 5

కంఠార్పితేన పాశేన శ్వేతః కాల మథా బ్రవీత్‌ | క్షణమాత్రం ప్రతీక్షస్వ మమ త్రిభువనాంతక ! 6

నివర్తయా మ్యహం యావత్‌ పూజనం మన్మథ ద్విషః | తమబ్రవీత్తతః కాలః ప్రహసన్‌ వసుధాధిప ! 7

నాడాయనుడనియె : పరమేశ్వరునింకొక ప్రభావము వినుము. శివునిచే మున్ను శ్వేతుడను నాతడు మృత్యువుబారినుండి ముక్తుడయ్యెను శ్వేతుడొకమహర్షి. పరమధార్మికుడు మహాతేజస్వి త్రిపురాంతకుని లింగము నిత్యము పూజించెను. రాజా! ఒకతఱి లింగపూజా ప్రసక్తినుండ పరమదారుణుడు కాలుడటకు వచ్చెను. ఆయన ఎఱ్ఱని గుండ్రని కన్నులవాడు పాములు తేళ్ళునాతని రోమములు. కోఱలతో భయంకరుడు. వికటుడు నూరిన కాటుకవలె కారునలుపువాడు. ఎఱ్ఱని వస్త్రములుదాల్చినాడు మహాకాయుడు సర్పము లాభరణములు చేతిలో పాశము ఇట్లు వచ్చి శ్వేతునిపై పాశము విసరెను. కుత్తుకం దగిలిన పాశముతో శ్వేతుడు కాలునితో నిట్లనియె. ఓత్రిభువనాంతక ! నేను మన్మథాంతకుని పూజసేసికొందును. అందాక ఒక్క క్షణమాత్రము ప్రతీక్షింపుము. అన విని కాలుడల్లన నవ్వుచు నాతనితో నిట్లనియె.

న శ్రుతం తు త్వయా మన్యే వృద్ధానాం శ్వేత ! జల్పితమ్‌ | శ్వః కార్య మద్య కుర్తీత పూర్వాహ్ణే చా పరాహ్నికమ్‌ ||

న హి ప్రతీక్షతే మృత్యుః కృతంవా స్యా న్న వా కృతమ్‌ | గర్భేవా ప్యథ బాల్యేవా ¸°వనే వార్ధకే పివా ||

ఆయుష్యే కర్మణి క్షీణ లోకోయం నీయతే మయా | నౌసధాని న మంత్రా శ్చ న హోమో న పునర్జపః || 10

త్రాయన్తి మృత్యునో పేతం జరయా వాపి మానవమ్‌ | బహూనీంద్ర సహస్రాణి పితామహశతాని చ || 11

మయా నీతాని కర్తవ్యో నాత్ర మన్యు స్త్వయానఘ ! | విధత్సే పూజనం యస్య మహాదేవస్య శూలినః || 12

దేహన్యాసం స బహుధా మయావై శ్వేత ! కారితః | స్వయం ప్రభు ర్నచైవాహం కర్మాయత్తా మతి ర్మమ || 13

కర్మణాం హి తథా నాశం నాస్తి భూతస్య కస్య చిత్‌ | కర్మమార్గానుసారేణ ధాత్రాహం సంప్రచోదితః || 14

నయామి సర్వ మాక్రమ్య త్రైలోక్యం సచరా చరమ్‌ | ఏవముక్త స్తు కాలేన నీయమాన స్త్రిలోచనమ్‌ || 15

జగామ సర్వభావేన శరణం భక్తవత్సలమ్‌ |

శ్వేతా! వృద్ధుల జల్పనము (భాషణము) నీవు వినలేదుకాబోలు. అదేమి? రేపటి పని యిప్పుడే చేయవలెను. అపరాహ్న కృత్యము పూర్వాహ్ణమంద యొనరింపవలెను చేసిన చేయవలసినదానికి మృత్యువు నిరీక్షింపడు కడుపులో లేదా బాల్యములో ¸°వన మున ముదిమినిగాని ఆయుష్యము కర్మమును క్షీణముగాగానే నాచే జీవుడు గొంపోబడును. ఔషదములుగావు మంత్రములుగావు హోమముగాదు జపముగాదు మరిదియు మృత్యువు గూడినవానిని ముదిమిపైకొన్న వానిని రక్షింపలేవు పెక్కువేలకొలది యింద్రులు నూర్లకొలది బ్రహ్మలు నాచే గొంపోబడిరి. ఓ పుణ్యాత్ముడ ! ఇందునీవు కోపముసేయకు. నీవే శూలికి మహాదేవునికి పూజచేయుదువా దేవుడు నాచే బహుపర్యాయములు దేహుము వదలింపబడినాడు నేనును స్వయం ప్రభువునుగాను నాబుద్ధి కర్మాధీనము ఏజీవుని కర్మములకు నాశములేదుగదా ! కర్మమార్గాను సారముగనే ధాతచే నేను బ్రేరితుడను సచరాచర త్రైలోక్యమునేను బైబడి లాగికొని పొవుదును. అనియిట్లు కాలదేవత పలికి గింపోవుచుండ సర్వభావముతో శ్వేతుడు భక్తవత్సలు శరణందెను.

శ్వేతే తు శరణం ప్రాప్తే లింగస్య త్రిపురాన్తకః || 16

భూత భవ్య భవిష్యద్భిః ప్రాదుర్భావైస్తు శార్జిణః | ఆత్మనః కవచం కృత్వా కృతరక్షో మహేశ్వరః || 17

భిత్వా లింగం సముత్తస్థౌ క్రోధవిస్ఫారితేక్షణః | తృతీయలోచనజ్వాలా ప్రకాశిత జగత్త్రయః || 18

దృష్టమాత్ర స్తదా తస్య కాలో జజ్వాల తేజసా | న శాన్తో భస్మ భూత శ్చ సర్వ భూతవిధిర్గ్రహః || 19

శ్వేతుడు లింగము శరణొంద త్రిపురాది శార్జియొక్క (విష్ణువుయొక్క) మందటి రాబోవు నవతారములతో దనకు కవచము సేసికొని దాన రక్షసేయబడి క్రోధవిస్ఫారితనయనుడై మూడవకంటి మంటలం జగములు మూడింటిని వెలిగించుచు లింగము భేదించుకొని లేచినిలువబడెను. ఆతడు కనబడిన మాత్రన నాతేజస్సుచే కాలుడు జ్వలించిపోయెను. అతడు సర్వభూతములపాలివిధి గ్రహమునైన యాతడ భస్మమయిపోయెను.

శ్వేతస్య దత్వా సామీప్యం గణశత్వం తథైవచ | కృత్వా విధిగ్రహం కాలం తత్రైవాన్త రధీయత || 20

తతఃప్రభృతి రాజేన్ద్ర ! కాలస్య కలయన్‌ప్రజామ్‌ | న కైశ్చి ద్దృశ్యతే లోకే విదేహ త్వా జ్జగత్త్రయే || 21

శైలూషః : వైష్ణవం కవచం బ్రహ్మన్‌ ! సర్వ బాధానివారణమ్‌ | త్వత్తోహం శ్రోతు మిచ్ఛామి తత్రమే సంశయో మహాన్‌ ||

నాడాయనః : అదృశ్య మేత త్పరమం పవిత్రం పూర్వేరితం కల్మషనాశనంచ |

దుఃఖావహం తే కవచం బ్రవీమి రక్షా కృతా యేన మహేశ్వరేణ || 22

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే కాలదారణో నామ షట్త్రింశదుత్తర ద్విశతతమోధ్యాయః.

కాలాంతకుడు పరమశివుడు శ్వేతునకు దనసామీప్యముననుగ్రహించి గణశత్వమిచ్చి కాలువిధిగ్రహుని (దైవగ్రహీతుని) గావించి యటనే యంతర్ధానమయ్యెను అదియొదలు రాజేంద్ర! కాలు ప్రజలను కలయించుచు (అంత మొందించుచు) విదేహుడగుటవలన దేహము పోవుటచే నెవ్వరికి గనరా కున్నాడు. అనవిని శైలూషరాజు బ్రహ్మణ్య ! సర్వబాధానివారణము వైష్ణవకవచమును నీవలన వినగోరెదను అకవచ ప్రభావమునెడ నాకెంతేని సంశయముగలదన నాడాయనుడు మహేశ్వరుడుగూడ రక్షచేసికొనిన యావిష్ణుకవచము అదృశ్యప్రభావము. పరమపవిత్రము పూర్వోక్తము కల్మషనాశనము దుఃఖహరము నీకది వచించెదను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున దండధర (కాల) దండనమను రెండువందల ముప్పదియాఱవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters