Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలముప్పదవ అధ్యాయము - స్కందకృతగ్రహానుగ్రహము

నాడాయనః - తతస్తు జాత కర్మాద్యాః క్రియా స్తస్య మహాత్మనః | విశ్వామిత్రస్తు కృతవాన్‌ మంగళాని తథైవ చ || 1

ఏతస్మి న్నేవ కాలే తు దేవనాథాయ వజ్రిణ | శ్వేత జాత మథా చఖ్యుః కుమారం దీప్త తేజసమ్‌ || 2

నిధనాయ మతిం చక్రే తదా తస్య పురందరః | దైవతైః పితృభిర్యజ్ఞైః ప్రభు ర్దానవ రాక్షసైః || 3

భూత నాగ పిశాచైశ్చ పితృ గంధర్వ మానుషైః | సంమంత్ర్య నిధనే తస్య సృష్టవాన్‌ స మహాగ్రహాన్‌ || 4

దేవదైత్య గ్రహాన్‌ ఘోరాన్‌ పితృ దానవ రాక్షసాన్‌ | యక్ష గంధర్వ నాగానాం నృణాం చ పిశితాశినామ్‌ || 5

తే గ్రహా బహుసాహస్రాః నానా ప్రహరణోద్యతాః | అభి జగ్ముః శ్వేత గిరిం కుమార వధ కామ్యయా | 6

తే గ్రహా బహు సాహస్రాః గ్రహాంశ్చ శతశఃశ్శివః | స్కందో గ్రహాన్వై ససృజే పూర్వ గ్రహ నిశాచరాన్‌ || 7

మహాబలాన్‌ మహా వీర్యాన్‌ కామగాన్‌ కామరూపిణః | అనేక శత సమస్రాన్‌ నానావేశాన్‌ మనోజవాన్‌ || 8

తేషాంప్రధా నాన్‌ వక్ష్యామి తన్మే నిగదతః శృణు | స్కందో విశాఖశ్చ తథా నైగమేయ స్తథై వచ ||

భీమో భీమకరః క్రవ్యో నిరతః క్రోశ ఏవచ || 9

క్రవ్యాదోథ హవి ర్బుద్ధిః కోటముద్గరికః పృథుః | కాల శ్చాప్యు ప కాలశ్చ సిద్ధార్థః పుష్పక స్తథా || 10

పుష్ప మిత్రః కోకిలకః సిద్ధో లంబోదర స్తథా | ఖల్యూః కపోతో లంబోష్ఠః తథా నాయాస ఏవచ || 11

యదండో గృధ్ర నాసాశ్చ గృధ్ర వృత్తుక ఏవ చ | క్షుద్రకః కాల జాలశ్చ కాల స్తత్పురుష స్తథా || 12

విద్యుద్భూతోథ సంవర్తో వర్త శ్చావ ర్త ఏవ చ | శితి కంఠః కపర్దీచ కచ్ఛపః పరికంటకః || 13

పరి ప్రకాశో మత్తవ్చ మాతంగ వసన స్తథా | గదరాక్షః పిశాచ శ్చ వీరనాశో వలీముఖః || 14

మహా భూతశ్చ సందశ్చ సొమానందః ప్రమోదకః ఆనందో వ్యవసాయ శ్చ నిశ్చయోథ పరాక్రమః || 15

జయ శ్చ విజయ శ్చైవ సంజయః కల్ప ఏవ చ | పుష్పదన్తో దంత వక్త్రో హేముండి ర్భీషణ స్తథా || 16

వసు భూతి ర్వసు స్త్రాతో జీవక స్తాపస స్తథా | వీరబాహు స్సుబాహుశ్చ సుందరో గండ ఏవచ || 17

తండా విచేలా గోదంతః కలశః కలశోచరః | శీర్య గ్రాహో లలాటస్థో గ్రీవాగ్రా భరతో గ్రహః || 18

పరిలేపక జాత్యంధౌ కరాళః కుంజనామనౌ | అన్యేద్యుకః సతత గః త్రైతీయక చతుర్థకౌ || 19

వ్యరో చకో నేత్రరోగః కాస శ్వాసా సుగ స్తథా | ధూత పాపః పాప హితః పాపాచార స్తథై వచ|| 20

కాండో ధనంజయ శ్చైవ శఠో నైష్కృతిక స్తథా | వసుధాతా వసుమనా గౌర శ్శోథో గలగ్రహః || 21

భ్రమశ్చ చిత్తమె హశ్చ తథా కార్య విఘాతకః | సర్వ కార్య కరశ్చైవ జృంభక శ్చాద్యక స్తథా || 22

ఏతే చాన్యేన బలినః కామరూపాః విహంగమాః | త్రైలోక్యసృష్టి సంహార స మర్థా వివిధా యుధాః || 23

నానారూపధరా వీరాః నానా వివిధ వాసనః | ప్రాదుద్రవన్‌ గ్రహాన్‌ ఘోరాన్‌ పూర్వదేవై ర్వివర్జితాన్‌ || 24

అవిషహ్య తమాత్మానో గ్రహాః స్కందగ్రహా స్తథా | స్కందం దేవవరం సర్వే తదా శరణ మాగతాః || 25

తాంస్తు వై శరణం ప్రాప్తాన్‌ స్కందో వచన మబ్రవీత్‌ |

స్కందః : శరణం వై ప్రపన్నానాం పరం దాస్యామ్యహం గ్రహాః || 26

వరయధ్వం యథాకామం పూజ్యామే శరణార్థినః | గ్రహాః : భగవన్‌ ! భక్షయిష్యామః త్వత్ప్పసాదేన మానుషాన్‌ || 27

ఏతద్వర మభీష్టం నః సర్వేషాం దీప్త విగ్రహ ! స్కందః : దురాచారాం స్తథా లోకే గంధమాల్యాను లేపనే || 28

తేషాం శరీరే రత్యర్థం వసధ్వం నాత్రసంశయః | యే భక్తా స్త్ర్యంబకే దేవే తథాదేవే జనార్దనే || 29

అస్తికాన్‌ శ్రద్ధధానాంశ్చ వజ్రయధ్వం ప్రయత్నతః | వరార్థమపి సంగృహ్య న్యస్తా వర్మాధిభిః క్రమైః || 30

త్యక్షద్వం పురుషాన్‌ శీఘ్రం మమ విజ్ఞాయ శాసనమ్‌ |

నాడాయనః : ఏవముక్తా గ్రహాస్సర్వే స్వామ్యే చక్రు స్తదా శిశుమ్‌ || 31

కుమారం శర్వతనయం మహాబల పరాక్రమమ్‌ | స్కందేనైవ యథోక్తం తు స్కందం స్కందగ్రహా స్తదా || 32

సమేత్య సర్వే వచన మిదమూచు ర్నరాధిప ! | అస్మాక మపి దేవేశ ! ప్రసాదం కర్తు మర్హసి || 33

ఏవముక్తోథ ధర్మాత్మా గ్రహాన్‌ స్కందస్త్వభాష థ | యావత్‌ షోడశ వర్షాణి మానవానాం భవన్త్యుత || 34

తా వద్భవన్తో బాధస్తు మనుష్యాణాం తథా ప్రజాః | తత్రాపి బలి కర్మాద్యైః క్షేమం తేషాం కరిష్యథ ||

తతః పూర్వం గ్రహాణాంతు పూజ్యాలోకే భవిష్యథ || 35

ఏతావ దుక్త్వా భగవాన్‌ కుమారో దదౌ గ్రహాణామపరం శరీరమ్‌|

దేహాన్‌ స్వకా న్నాయక ఉగ్ర సత్త్వో లోకస్య రక్షార్థ మతీవ హృష్టః || 36

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే శైలూషం ప్రతి నాడాయనవాక్యే

త్రింశదుత్తర ద్విశతతమోధ్యాయః ||

అవ్వల నా కుమారస్వామి జాతకర్మాది క్రియలను మహాత్ముడగు విశ్వామిత్రుడొనరించెను. ఈతఱి శ్వేతగిరిం జనించిన వాడు దీప్త తేజస్వి కుమారస్వామియని యింద్రున కెవరో యెఱింగించిరి. పురందరు డది విని యాతనిం బౌరిగొన తలంపొనరించెను. దేవతలతో పితరులతో యజ్ఞములతో దానవరాక్షసులతో భూతనాగ పిశాచ గంధర్వ మానుష వర్గముతో నాలోచించి యతడు మహాగ్రహములను సృష్టించెను. అవి దేవగ్రహములు కొన్ని దైత్యగ్రహములు కొన్ని గంధర్వాదిగ్రహములవి పెక్కు వేలు. పెక్కు విధములాయుధములూని శ్వేతగిరిం గుమారుని జంపగోరి యేగినవి. శివుడును స్కందుడు గూడ వందల కొలది గ్రహములను నా మున్నుపుట్టిన గ్రహముల పాలిటికి రాక్షసులైన వారిని బలశాలురను వీర్యవంతులను కామసంచారులను కామరూపుల గగన సంచారులను నానావేషములవారిని సృజించెను. అందులో బ్రధానులం బేర్కొనెదను వినుము. స్కందుడు విశాఖుడు నైగమేయుడు మొదలగవారి పేర్లు 9వ శక్లోకమునుండి 23 శ్లోకమువరకు గలవు. వీరు త్రిలోకసృష్టి సంహార సమర్థులు. వీరందరు పూర్వదేవులు (రాక్షసులు) వదలిన గ్రహములపైకి దూకిరి. అవిషహ్యరూపులయిన గ్రహములు స్కందగ్రహములును నప్పుడు దేవదేవుని స్కందుని శరణందిరి. వారినిగని స్వామి గ్రహములార ! ప్రపన్నులైనచో మీకు వరమిచ్చెద. నాకు శరణార్థులు పూజనీయులన గ్రహములు స్వామీ ! నీప్రసాదముచే నా మానువగ్రహములం దినివేసెదము. ఇదేవరము మాకిమ్మన స్వామి లోకమందు గంధమాల్యానులేపనములు సేసికొన్న దురాచారులయొక్క శరీరమందు మీరు క్రీడార్థముగ వసింపుడు. హరునందు హరియందు భక్తి గల్గి ఆస్తికులను శ్రద్ధావంతులజోలికి మాత్రము పొరబడియేని పోవలదు. వారినాయా శుభకర్మములందు వరములను గ్రహింప నియోగించితిని. నాయానచే నట్టి పురుషులకు వదలివేయుడు. అని పలికినంత నా శిశువును (కుమారుని) తమకు స్వామిగా నొనరించుకొనిరి. అప్పుడాస్కందగ్రహములతో స్కందుడు పదునారుసంవత్సరముల వయస్సువరకుగల మనుష్యుల మీరుబాధింపుడు. అప్పుడుకూడ బలులు మొదలైనవి మీకై చేసినవారికి క్షేమముసేయుడు. అంతకుమున్ను గ్రహములకు మీరుపూజ్యులుకండు. ఇట్లు కుమారస్వామిపలికి గ్రహములకు లోకరక్షణ సేయుకొరకు తనవే వేరొక శరీరములను సంతుష్టుడై యిచ్చెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున స్కందకృత గ్రహానుగ్రహమను రెండువందల ముప్పదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters