Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఇరువదిమూడవ యధ్యాయము - అర్జునోపాఖ్యానము

వజ్ర ఉవాచ :

భగీరథస్య రాజర్షే ర్వంశ ముత్తమ పూరుష ! త్వత్తో7హం శ్రోతు మిచ్ఛామి గంగా యేనావతారితా || 1

మార్కండేయ ఉవాచ :

భగీరథసుత శ్రీమా& విశ్రుతో నామ ధార్మికః | విశ్రుతస్యాత్మజ శ్శ్రీమా& నాభాగ ఇతి విశ్రుతః || 2

అంబరీషస్తు నాభాగి రయుతారి స్త దాత్మజః తత్సుతో ఋతు పర్ణశ్చ రాజా నలసఖో బలీ || 3

శర్వకామ స్సుత స్తస్య సుదాస స్తస్య చాత్మజః | తస్య మిత్రసహః పుత్రః తస్య పుత్రో7శ్మకో నృప ! 4

మూలక స్తత్సుతో రాజా మహాబుద్ధి ర్నరేశ్వరః | క్షత్రియాణాం వధే ఘోరే రామేణ వినిపాతితః || 5

పురా పితృవధా మర్షాద్రామో భార్గవ నందనః | త్రి స్సప్తకృత్వః పృథివీం చక్రే నిఃక్షత్రియా మిమామ్‌ || 6

భగీరథ కులోత్పన్నం మూలకం నామ జఘ్నివా& |

వజ్ర ఉవాచ :

కథం రామేణ వసుధా పురా నిః క్షత్రియా కృతా | కి మర్థంచ మహాభాగ ! త న్మమాచక్ష్వ పృచ్ఛతః || 7

గంగనవతరింపజేసిన రాజర్షియగు భగీరథుని తరువాతి వంశవృత్తాంతమును తెలియగోరెదనని వజ్రుడడుగ మార్కండేయుడిట్లనియె : భగీరథుని పుత్రుడు శ్రీమంతుడు ధార్మికుడు నగు విశ్రుతుడు. నాభాగుడు అంబరీషుడు నాభాగి అయుతారి ఋతు వర్ణుడు (నలుని స్నేహితుడు) శర్వకాముడు సుదాముడు మిత్రసహుడు అశ్మకుడు మూలకుడు దాక తండ్రికొడుకుల వరుస యిది. మూలకుని పరశురాముడు సంహరించెను. పరశురాముడిరువదియొక్కమారు దండెత్తి యీ పృథివిని నిఃక్షత్రియముం గావించెను పరశురాముడెందులకీ దండయాత్రసేసెను దెల్పుమన మార్కండేయుడిట్లనియె :

మార్కండేయ ఉవాచ :

సోమవంశ సముత్పన్నో యయాతి ర్నామ పార్థివః | తస్యాపి సంహతః పుత్రో బభూవ పృథివీ పతిః || 8

సహస్ర జిత్‌ సుత స్తస్య నభజిత్తస్య చాత్మజః | తస్యా7పి హైహయః పుత్రః కుంతి స్తస్యాపి చాత్మజః || 9

తస్యా7పి సంహితః పుత్రో మహిష్మా& తస్యచాత్మజః | మాహిష్మతీ కృతా యేన నగరీ సుమనోహరా || 10

భద్రశ్రేణ్య స్సుతస్తస్య దుర్మద స్తస్య చాత్మజః | కనక స్తత్సుతో రాజా కృతవీర్య స్తదాత్మజః || 11

అర్జున స్తనయ స్తస్య సప్తద్వీపేశ్వరో7భవత్‌ | దత్తాత్రేయో7థ భగవా& విష్ణురూపాను రూపధృక్‌ || 12

ఆరాధ్య తపసాయేన ప్రాప్తం రాజ్యం సుదుర్లభమ్‌ | తథా బాహు సహస్రంచ మతిం ధర్మే తథో త్తమామ్‌ || 13

అధర్మే వర్తమానస్య మరణం చ జనార్దనాత్‌ | యుద్ధేన పృథివీం జిత్వా ధర్మేణౖ వానురంజయ& || 14

తేనేయం పృథివీ సర్వా సప్తద్వీపా సపత్తనా | సప్తోదధి పరిక్షిప్తా క్షాత్రేన విధినా జితా || 15

పాతాల నగరే శైలే వసుధాయాం రసాతలే | తస్య పార్థివ సింహస్య చక్రం నప్రతిహన్యతే || 16

ద్వీపేషు సహి సర్వేషు ఖాతం ఖాతమథా7కరోత్‌ | యూపచిహ్నాని చ తథా ఖడ్గీ శతశనీ రథీ || 17

దేశా నను చర& యోగాత్‌ సదా పశ్యతి తస్కరా& | స ఏవ పశుపాలో7భూత్‌ క్షేత్రపాల స్స ఏవచ || 18

స ఏవ వృష్ట్యా పర్జన్యో యోగిత్వా దర్జునో7భవత్‌ | సతు బాహు సహస్రేణ జ్యాఘాత కఠిన త్వచా || 19

భాతి రశ్మి సహస్రేణ శారదేనేవ భాస్కరః | రాక్షసా నిర్జితాస్తేన తేన బద్ధస్య రావణః || 20

జిత్వా భోగవతీ తేన కర్కోటక సుతా హృతా | తస్య బాహు సహస్రేణ క్షోభ్యమాణ మహోదధౌ |

భవన్తిలీనా నిశ్చేష్టాః పాతాలస్థాః మహాసురాః || 21

మందర క్షోభ చకితాః అమృతోత్పాద శంకితాః | నత నిశ్చల మూర్ధానో భవంతిచ మహోరగాః || 22

దశయజ్ఞ సహస్రాణి తేనేష్టాని మహీక్షితా | ద్వీపే ద్వీపే మహారాజ! ధర్మజ్ఞేన మహాత్మనా || 23

సర్వే యజ్ఞా మహారాజ ! తస్యాస& భూరి దక్షిణాః | సర్వే కాంచన వేదీకాః సర్వే యూపైశ్చ కాంచనైః || 24

ద్విజానాం పరివేష్టారః తస్య యజ్ఞేషు దేవతాః | స్వయ మాస& మహారాజ! స్వయం భాగహరా స్తథా || 25

తస్య యజ్ఞే జగౌ గాథా నారద స్సుమహాతపాః | న నూనం కార్తవీర్యస్య గతిం యాస్యన్తి పార్థివాః || 26

యజ్ఞైర్దానై స్తపోభిర్వా విక్రమేణ శ్రుతేన వా || 27

పంచాశీతి సహస్రాణి వర్షాణాం స మహీపతిః | సప్తద్వీపేశ్వరః సమ్రాట్‌ చక్రవర్తీ బభూవ హ || 28

తస్య రాజ్ఞస్తు వసుధా బహు పార్థివ సంకులా | భారాక్రాన్తా విలులితా బభూవ పృథివీపతే ! || 29

తస్యరాజ్ఞో గతాతంకై ర్బహుపుత్రై ర్నరోత్తమ ! | తేజోయుక్తై స్సమాకీర్ణా వసుధా వసుధాధిప ! || 30

బహునాగా7శ్వ సంకీర్ణా బహు గోకుల సంకులా | న శక్తా నృపతే ! సోఢుం తేజస్త దతి మానుషమ్‌ || 31

జ్వాలావళి వపుః శ్రాన్తా ఖిన్నా నాక ముపాగతా || 32

ఏవం ప్రభావే పరదేవ నాధే పృథ్వీం సమత్రాం పరిపాల్యమానే |

భారేణ సన్నా పృథివీ జగాను మహేన్ద్రలోకం మునిదేవ జుష్టమ్‌ || 33

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే అర్జునోపాఖ్యానం నామ త్రయోవింశో7ధ్యాయః

చంద్రవంశమందు యయాతి, సంహతుడు, సహస్రజిత్తు, నభజిత్తు, హైహయుడు, కుంతి, సంహతుడు, మహిష్మంతుడు దాక తండ్రికొడుకులైరి. మహిష్మంతుడు మాహిష్మతి నగర నిర్మాత. అతని కొడుకు భద్రశ్రేణ్యుడు. అటనుండి దుర్మతుడు కనకుడు కృతవీర్యుడు అర్జునుడు దాక తండ్రికొడుకులయిరి. అర్జునుడు సప్తద్వీప సార్వభౌముడయ్యెను. విష్ణునవతారమైన దత్తాత్రేయుల నతడారాధించి రాజ్యమును వేయి బాహువులను బడసెను. ధర్మబుద్ధిని యుద్ధమందధర్మవర్తనుండు తన రాజ్యములో చనిపోవలెనని వరముంబడసి యవనినెల్ల యుద్ధమున గెలిచి ధర్మముచే ప్రజారంజనముగ పరిపాలించెను. అన్ని ద్వీపములందాతడు యూపస్తంభములను నెలకొల్పెను. అనగా బెక్కు యజ్ఞములు సేసెనని తాత్పర్యము. సప్తసముద్రావృతమయిన మేదిని కతడేక ఛత్రాధిపతియైయుండెను. మహాయోగియై కత్తులు శరశతముంగొని రథమెక్కి దిగ్విజయముసేసి పాతాల నగరమందు శైలమందు నేలపై యాతడు రథముతో సంచరించెను. అతని చక్రమెక్కడను కుంటువడలేదు. అతడు యోగశక్తిచేత దొంగలను గనిపెట్టినాడు. అతడే పశుపాలకుడు క్షేత్రపాలకుడు నయ్యెను. తానే వర్షము గురిపించి పర్జన్యుడయ్యెను. యోగి యగుటచే నర్జునుండను పేరొందెను. వేయుబాహువులతో నతడు వేయికిరణములతోడి శరదృతు భాస్కరుడట్లు వెలింగెను. అతడు రాక్షసుల నెల్లర గెలిచెను. రావణుని బందీగా నొనరించెను. కర్కోటకు సుతులు హరించిన భోగవతిని (పాతాళ ప్రధాననగరము) ఆతడు జయించెను. ఆతని వేయిబాహువులచే సముద్రము సంక్షోభింప పాతాళగతులయిన మహాసురులు దాగి దాగి మందరగిరి నమృతమథనమందుట, మందరగిరి క్షోభమునందట్లు నిశ్చేష్టులయిరి. మహాసర్పములు తలలువాంచి కదలకుండ నిలిచినవి. ఆతడు ప్రతి ద్వీపమునందు పదివేల యజ్ఞములు సేసెను. భూరిదక్షిణలు బంగారువేదికలు బంగారు యూపములతో అనంత బ్రాహ్మణ సమారాధన మందు దేవతలు స్వయముగ వడ్డనలు గావించిరి. స్వయముగా హవిర్భాగములను నందుకొనిరి. ఆతని యజ్ఞమందు మహాతపస్వి నారదుడిట్లు గాధల గానము సేసెను. రాజులు యజ్ఞములచే దానములచే దపస్సులచే పరాక్రమముచే బాండిత్యముచే కార్తవీర్యార్జునుడేగిన దారి బోజాలరు. ఆమహాప్రభు డెనుబదియైదు వేల యేండ్లు సప్తద్వీపములకు సమ్రాట్టు చక్రవర్తియునైయుండెను. అనేకమంది పార్థివులతో సమ్మర్దముగొన్న వసుధ భారాక్రాంతయై విశ్లథయైయుండెను. ఆరాజుయొక్క అనేకమందిపుత్రులు ఆతంకరహితులు (నిరాతంకవిక్రమవిహారులన్న మాట) ప్రతాపశీలురగువారితో అనేక నాగాశ్వగోకులముతో నివ్వసుధ యలముకొనియుండెను. మానవాతీతమైన యాతని తేజస్సునకు (ప్రతాపమునకు) బరువెక్కి ధరణి యలసిబిట్టూగి విన్నవోయి నాకమునకేగెను. ఇటువంటి ప్రభావముతో నానరనాథదేవుడు పారిపాలన సేయుచుండ బరువెత్తి మునిబృంద సంసేవ్యమైనమ హేంద్రలోకమునకుంజనెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున అర్జునోపాఖ్యానమను నిరువదిమూడవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters