Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల ఇరువదియవ అధ్యాయము - రావణవరప్రాప్తి

నాడాయనః : ఏతస్మి న్నేవ కాలేతు సుమాలీ వసుధా తలమ్‌ | చచా రాదాయ తనయాం కైకసీం నామ నామతః || 1

చరన్‌ స వనుధాంస్సీతాం దదర్శాథ నరాధిపమ్‌ | పుష్పకం యాన మారుఢం శ్రియా పరమ యా యుతమ్‌ || 2

తల దృష్ట్యా కైకసీం వాక్యం చోవాచ రజనీ చరః | పుత్రి ! ప్రధాన కాలస్తే న కశ్చిత్త్వాం వృణోతి మామ్‌ || 3

ఆప్రార్థిత ప్రదానం చ ధర్షణా భయ శంకయా | న కరోమి విశాలాక్షి : తవార్థం వరవర్ణిని : 4

కష్టం కన్యా పితృత్వం హి నరాణాం మాన కాంక్షిణామ్‌ | ధ్రువం కన్యా పితృత్వం హిశక్రస్యాపి ప్రధర్షణమ్‌ || 5

మాతుఃకులం పితృకులం యత్ర కన్యా ప్రదీయతే | కులత్రయం సంశయితం కన్యాం కృత్యేహ తిష్టతి || 6

తేనా7హం త్వాంన దాస్యామి సాత్వం గచ్చ స్వయంశుభే ! | భర్తారం వరయస్వా77శు మునిం విశ్రవసం విభుమ్‌ ||

యత స్సో7యం ధనాధ్యక్షః శ్రియా పరమయా యుతః | తాదృశం తనయం తస్మా జ్ఞన యిష్యసి భామిని ! 8

నాడాయునుడనియె. ఇదేకాలమున సమాలి కైకసియను తనకూతురింగొని భూమండలమెల్ల దిరిగెను. అప్పుడు పుష్కక విమానమెక్కి పరశోభతో దీపించు నరపతింగాంచెను. అతనింజూచి కైకసితో అమ్మయీ ! నీకు కన్యాదాన సమయము వచ్చినది. నిన్నిమ్మని నన్నెవ్వడుం గోరుటలేదు. కోరనివానికిచ్చుట వలన నేదేని ఘర్షణ (వివాద) లేదా ధర్షణ కాదనియనునమోయను భయము వలననేను నోవిశాలనయన! నిన్నెవ్వరికి నీయజాలకున్నాను. అభిమానధనులకు (మానకాంక్షులకు) కన్యాపితృత్వము (ఆడపిల్లకు తండ్రియుగుట) కష్టమైనది. అది దేవేంద్రునికైనను జడుపుగూర్చునదే. తల్లివంక తండ్రివంక వారినిదానమిచ్చిన (మెట్టిన) యింటివారు. ముగ్గురికులములను కన్య సంశయగ్రస్తులనుజేసి యిట నిలుబడును. ఆమెనిచ్చినచోట సరియైనదిగాదేని యందువల్ల ననేక దస్సంఘటనలామోలో నేర్పడి యామె వెనుకనున్న పుట్టింటి యిరువంకలవారి ప్రతిష్ట మంచిదా చెడ్డదాయను సందేహమునకు గురిచేయునన్నమాట. అందుచే నేను నిన్నెవ్వరికి నీయకూరుకొనుచున్నాను. కావున నీవు కల్యాణి! నీయంత నీకనువైన భర్తను వరింపుము. అందులకు త్వరగా నీవు విశ్రవస ప్రభువను ముని నాశ్రయింపుము. ఇతడు ధనపతి పరమశ్రీసంపన్నుడు కావున నదే లక్షణములుగల తనయుని గనగలడు. అని పలికెను.

జగామ కైకసీ రాజన్‌ ! తతో విశ్రవసం మునిమ్‌! రౌద్ర ముహూర్తే సంప్రాప్తే సంధ్యాయాం నృప సత్తమమ్‌ : 9

సా7 భి వంద్య తతః పాదౌ తస్య విశ్రవసో మునేః | బభూవ పురత స్తన్వీ వ్రీడ మానేవ లజ్జయా || 10

ఉవాచ తాం మునిః ప్రహ్వాం కైకసీ చారు హాసినీమ్‌| విజ్ఞాత స్త్వదభిప్రాయో మయా7ద్య వరవర్ణిని || 11

పుత్రార్థం త్వమును ప్రాప్తా మత్సమీప మనిన్దితే : రౌద్రే కాలే యథా ప్రాప్తా తా దృశం జనయిష్యయసి || 12

ఏవ మస్త్వి త్యథోక్తా సా తత్రోవాస సుఖం తదా | తతః కాలేన సాపుత్రం జనయామాస భామినీ || 13

దశాస్యం వింశతి భుజం ఏక దామం మహాబలమ్‌| నామ యస్య పితా చక్రే దశ గ్రీవేతి బుద్ధిమాన్‌ || 14

తతో ద్వితీయ తనయం మహాకాయ సుషావ సా | కుంభకర్ణేతి తస్యాపి నామ చక్రే తదా పితా|| 15

తత్ర శూర్పణాఖాం కన్యాం జనయామాస సా తదా | తతః కదాచి త్సా పుత్రం కైకసీ జ్యేష్ట మబ్రవీత్‌ || 16

దర్శయ న్తీ ధనాధ్యక్షం స్రవీడేవ పరం తప | పశ్య స్వీయా గ్రజస్వాస్య శ్రియం భ్రాతుర్ధశానన : 17

సత్వం యత్న యథాస్థాయి భవ వై శ్రవణోపమః | ఏవముక్తస్తు గోకర్ణం ప్రయ¸° భ్రాతృభి స్సహ || 18

శీర్ణవర్ణాశన స్తత్ర చకార సుమహ త్తపః | పూర్ణేవర్ష సహస్రే తు శిరశ్చిత్వా దశాననః || 19

జుహా వాగ్నౌ మహాభాగ : ఏకైకం తపసా కృశః | గ్రీష్మే పంచ తపా భూత్వా వర్షాస్వాకాశ శాయికః || 20

అర్థ్రవాసాశ్చ శిశిరే కుంభకర్ణో7 ప్యత ప్యత | విభీషణ స్తతః కాలే షష్టే షష్టే ఫలాశనం || 21

పరిచర్యాం తదా తేషాం చక్రేశూర్పణఖా స్వసా | దశవర్ష సహస్రాంతే తదా కాలే దశాననః || 22

దశమం మస్తకం వహ్నౌ జుహూషతి యదా ప్రభో | తతస్తం దేశమాగమ్య బ్రహ్మావచన మబ్రవీత్‌ || 23

కైకసియామీదట విశ్రవసుని సమీపించెను. ఆమెయేగిన సమయము రౌద్రమూర్తిము. సంధ్యాసమయము. విశ్రవసముని పాదములకు మ్రొక్కి సిగ్గుతో దలవంచి యాయెదుట నిలబడెను. అమ్ముని వినయవినమ్రురాలైన కైకసిం జిరు నవ్వు నమ్మోముదాని జూచి, చూడగనే నాకు నీతలపసగాహనమైనది. ఓసుందరి ! నా కొడుకునకై నాదరికి నీవు వచ్చితివి ఇది రౌద్రకాలము. ఇందువచ్చితివిగావు ఆలాటి కొడుకునే రౌద్రమూర్తిని నీవు గంధువు. సరే! ఇట్లేయగుంగాకయన నామె యక్కడ సుఖముగా నివసించెను. అవలగొంతకాలమున కామె కొడుకుంగనెను. వాడు పదిమొగములవాడు. ఇరువది భుజములు ఒకటేదేహము పెద్ద బలముగలవాడు. తండ్రీబుద్దిమంతుడు వానికిదశ గ్రీవుడను పేరుపెట్టెను. అవ్వల నామెరెండవ కొడుకును పెద్దశరీము గల వానిని బ్రసవించెను. తండ్రివానికి కుంభకర్ణుడను పేరుపెట్టెను. అక్కడ నామె శూర్పణఖయను నాడుశిశువుంగనెను. అటుపై నొక తణినామె పెద్దకొడుకుంగని కుబేరుని జూపిసిగ్గుపడినట్లై దశానన! చూడు మీయన్న యితని సంపదను గనర! నీవును యత్నము గొని వైశ్రవణుని వంటివాడవగుమనియె. ఇట్టేయుగుగాక! యని తమ్ములతో దశముఖుడు గోకర్ణమునకేగెను. అక్కడ రాలిన యాకులందిని గొప్పతపస్సు చేసెను. వేయేండ్లుముగియదనతలనఱికి యగ్ని యందువేల్చెను. ఇట్లొక్కొక్కటిగ తపః కృశుడై హోమము సేసెను. గ్రీష్మమందు పంచాగ్ని మధ్యమందుండి వర్షర్తువులం దారుబయట శయనించుచు. శిశరర్తువునందడి బట్టలతో దపము చేసెను. కుంభకర్ణుడు సదేతీరునసతపించెను. కుంభకర్ణుడును నారుమాసముల కొకమారు పండుతినుచు తపముగావించెను. వారికి చెల్లెలు శూర్పణఖ పరిచర్యగావించెను. పదివేలేండ్ల చివర దశాననుడు దశమశిరస్సునగ్ని యందువేల్చెను. అంతబ్రహ్మ యచ్చోటి కేతెంచి యటువంచించెను.

బ్రహ్మః వరం పరయః భ్రదంతే పరితుష్టో 7స్మి పుత్రక ః | తపసా తేసుతప్తేన షత్త్వేన విపులేనచ || 24

నాడాయనః : దేవాదీని సభూతాని కీర్తయమాస రాక్షసః | సర్వాణ్వవా విశేషేణ వర్ణయిత్వాతు మానుషమ్‌ || 25

సంకీర్త్య తేభ్యో7వధ్యత్వం వరయామాన భూమిపః త్రైలోక్య విషయం చైవ తచ్చతస్య దదౌ ప్రభుః || 26

చన్దయిత్వా వరేణా7థ దశగ్రీవం నిశాచరమ్‌ | స్యస్య సర్స్వతీం వక్రై కుంభకర్ణం స రాక్షసమ్‌ || 27

వరేణ ఛందయామాస తదాగత్య విభీషణమ్‌ | సవవ్రే నిత్యకాలంతు మతిం ధర్మేసనాతినీమ్‌ || 28

తేన తస్య తదా తుష్టః త్వమరత్వం దదౌ ప్రభుః | వరేణ ఛందయిత్వా తాన్‌ బ్రాహ్మస్వభవనం గతః || 29

నీకు భ్రదంబగుగాక ! వరముకోరుము. పుత్రక! నీతపస్సుచే నీ విపుల సత్త్వముచే నేను పరితుష్టుడనైతిననియె. అప్పడా రాక్షసుడు మనష్యునొక్కని విడిచిదేవాది సర్వభూతములను బేర్కొని వారివలన నవధ్యుడనగు వరము గావలయుననియె. వానికి ప్రభువాదరమిచ్చి త్రైలోక్య విజయమునుగూడి వరముగనొసంగెను. ఇట్లురావణుని వరముచే ఛందింపజేసి (స్వచ్ఛందముగా నడుగజేసి యన్నమాట) సరస్వతిని వానిమోముననిలిపి కుంభకర్ణరాక్షసుని వరముకోరుమని విశీషణునట్లే కోరుమనియె. అతడు నిత్యము తనబుద్ది ధర్మమునందుండగోరెను. దాన విధాత సంతోషించి యతని కమరత్వముంగూడ యొసగెను అవ్వల బ్రహ్మ తనభవనమున కేగెను.

వరల బ్దం దశగ్రీవం జ్ఞాత్వా రక్షోగణ స్తథా | పాతాలాత్తు వినిష్క్రమ్య మహారజ్యే7భ్య షేచయత్‌ || 30

సతు రాజ్యం తదా లభ్యా ప్రేషయామాస రాక్షసాన్‌ | కుబేరాయ తదాదూతం వ్రహస్తం నామ నామతః || 31

రాక్షసానా మథి వాసో లంకేయం నిర్మితా వురా | తాం త్యజ త్వం ధన్యాధ్యక్ష ః సమ్నైవ మమ మా చిరమ్‌ || 32

వహస్త వచనం శ్రుత్వా ధనా ధ్యక్షో మహా మతిః | దశ గ్రీవం వరోన్మత్తం జ్ఞాత్వా తత్యాజ తాంపురీమ్‌ || 33

కైలాసం పర్వతం గత్యా తదా చక్రే పురీం శుభామ్‌ | అలకాం నామ రాజేంద్ర ః యత్ర 77స్తే స సుఖీసదా || 34

దశ గ్రీవో మహారాజ ః త్రిలోక విజయం తథా | చ క్రేలంకా మథా సాద్య వరదానాత్‌ స్వయంభూవ్యః || 35

మందోదరీం నామ భార్యాం తదా లేభే మయాత్మజామ్‌ | తస్యాం స జనయా మా సమేఘనాదం తథా సుతమ్‌ || 36

త్రిలోక విజయీ శ్రీమాన్‌ దేవ బ్రాహ్మణ కంటక ః | నిహత స్సతు కాలేన విష్ణునా నరరూపిణా || 37

ర్రాఘేవణ మహారాజ | రామేణా క్లిష్ట కర్మణా | లంకాం త్యక్త్వా ధనధ్యక్ష ః కైలాసే పర్వతోత్తమే 38

అద్యాపి పాలయ న్నాస్తే రాజ్యం నిహత కంటకమ్‌ |

తస్మా త్త్వమపి రాజేంద్ర ః త్వక్త్వా దేశ విమం స్వయమ్‌ | హిమ వంత మథాసాద్య వసః వైశ్రపణోపమః | 39

తస్మాన్న కార్యం భరతేన వైరం మహాబలాస్త్రా రఘవః ప్రతీతాః |

ప్రసీద ! జీవస్తు సుపుత్ర పౌత్రాః పుత్రాస్తవేమే తుహినాద్రి సంస్థాః|| 40

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే పథమాఖండే రావణ వర ప్రాప్తి పర్ణనం నామ

వింశత్యుత్తర ద్విశత తమో7ధ్యాయః.

రక్షోగణము వరలాభమందినట్లు దశకంఠునించెలిసి పాతాళమున వెడలి రాక్షససామ్రాజ్యమందువాని నభిషేకించెను. అతడయ్యెడ రాజ్యముంబడసి కుబేరునికి బ్రహస్తుడు దూతగా ఈలంక రాక్షసుల నివాసముగ మున్ను నిర్మింపబడినది ఓ ధనాధ్యక్ష! దానిని మంచిగా నాకు వెంటనేవిడుము అని కబురంపెను. ప్రహస్తునిమాటవిని బుద్దశాలి ధనదుడు దశవదనుడు వరములచే వెఱ్ఱత్తి యున్నట్లెరింగి యాలంకారిని వదలివేసెను. కైలాసపురికేగి యక్కడ జక్కని పురము నొసరించుకొనెను. అది అలకానగరము. అందతడెల్లపుడు సుఖీయైవసించెను. మహారాజా! దశగ్రీవుడు త్రైలోక్య విజయము సేసి శ్రీమంతుడై దేవ బాహ్మణకంటకుడయ్యెను. కాలక్రమమున నతడు మానవ రూపుడైన విష్ణువుచే గూలెను. వానిలింగూల్చిన విష్ణువు రాఘవుడు రామచంద్రప్రభువు. పుణ్యకర్ముడు. కుబేరుడు లంకనువిడిచి పర్వతరాజమగును కైలాసమందిప్పుడును నిష్కంటకమయిన రాజ్యమును నేలుచున్నాడు. కావున నీవును నీ ప్రదేశమువిడికి హిమవంతముంజేరి కుబేరునట్లట వసింపుము అందువలన నీవు భరతునితొ వైరము పెట్టుకొనకుము రఘువులు మహాబలాస్త్రసంపన్నులని ప్రతీతులు (ప్రసిద్దలు) ఈ నీకొడుకులు కొడుకులతో మనుషులతో తుహినాద్రియందు హాయిగా బ్రతుకుదురుగాక !

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమందు

రావణవర ప్రాప్తి వర్ణనమను రెండు వందలయిరువదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters