Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల పదునైదవ అధ్యాయము - దేవప్రయాణవర్ణనము

అగస్త్యః : తపసా తోషితో దేవై ర్దేవదేవో జనార్దనః | మహోదవాసం సంత్యజ్య సురాణాం దర్శనం దదౌ || 1

తే చ తం విబుధారిఘ్నం ధరణీపాత పాంశులైః | జానుపాణి లలాటాంతైః ప్రణముర్ముదితా వయమ్‌ || 2

తుష్టువు శ్చ తథా వాగ్భిరథోచుః స్వప్రయోజనం | పధార్థం దేవదేవస్య సుకేశ తనయాన్‌ ప్రతి || 3

ప్రతిజజ్ఞే తదా తేషాం దేవో మాలి వధం హరిః | యూయం సుమాలి నిధనే శక్తాఃస్థ సురసత్తమాః : || 4

మాల్యవాన వ్యవధ్యోసౌ సతతంధర్మవత్సలః | ఏవముక్త్వా తత స్తార్ష్యమాహ్వాయామాస కేశవః || 5

తమారు రోహ సర్వాత్మా కాంచనం వినతాసుతమ్‌ | శంఖచక్ర గదాపద్మ లాంఛితో మధుసూదనః || 6

అతసీ కుసుమశ్యామః కాంచనే ఖగమేస్థితః | శ్రియ మూహే సతోయస్య తోయదస్య స విద్యుతః || 7

కిరీట కౌస్తుభధరం వరభూషణ భూషితమ్‌ | విహంగ వరమారూఢ మనుజగ్ము ర్దివౌకసః || 8

సుధావదాత సత్పక్ష్యైః వితతాంబర ధావిభిః | హంసై స్తమన్వయా ద్ర్బహ్మా జటామండల దుర్దశః || 9

చంద్రరశ్మి ప్రతీకాశ నిబిడాంగ కకుద్మికః | హరస్తృతీయ నేత్రార్చి ర్విదారిత సభోయ¸° || 10

మహేంద్రనేత్ర సంకాశ కలాపాటోప రోధినా | స్కందస్త మన్వ¸° తస్మా న్మయూరేణ షడాననః || 11

వినాయకాన్‌ కర్తుమనాః రాక్షసేంద్రాన్‌ వినాయకః | వాయుమండల మారూఢః ప్రయయా వను మాధవమ్‌ || 12

వహ్ని జ్వాలావశీ పుంజ సమకేసర మాలినా | సింహేనాను య¸° దేవీ భద్రకాశీ జనార్దనమ్‌ || 13

వరస్త్రీ కుచ సంకాశ కుంభైరావణ పృష్ఠగః | కిరీటీ వజ్రపాణిస్త మన్వ¸° త్రిదశాధిపః || 14

వహ్నిస్త మన్వ¸° దేవం శుకయానేన పార్థివ ! | సేంద్ర గోప గణాకీర్ణ శాద్వలస్థల శోభినా || 15

గిరికూట సమాకారం శృంగ భూషిత మస్తకమ్‌ | వైవస్వతోపి మహిష మారుహ్యానుయ¸° హరిమ్‌ || 16

శంకు కర్ణో మహాగ్రీవో వరేభ స్కంధ సంస్థితః | పశ్చా దను య¸° దేవం విరూపాక్షో మహాబలః || 17

మహాయానేన రమ్యేణ మనో మారుత రంహసా | వరుణోను య¸° పశ్చాత్‌ స్నిగ్ధ వైడూర్యసన్నిభః || 18

మనశ్శీఘ్రగతి ర్దేవో వాయుమండల మధ్యగః | వాయుశ్చాను య¸° పశ్చాద్వాయు పూర్ణ శుభాంశుకః || 19

ధనదో నరయానేన సర్వరత్నో జ్జ్వలాత్మనా | గోవింద మను వవ్రాజ శ్రియా పరమయా యుతః || 20

సప్తాశ్వ మేక చక్రంచ రథ మారుహ్య భనుమాన్‌ | తదైవాను య¸° దేవప్రభా మండల దుర్దృశ ః || 21

చంద్ర శ్చండ ప్రభాకారో దశభి స్తు రగోత్తమైః | మనోజవేన చ తథా రథేనామ య¸° హరిమ్‌ || 22

తురంగ పరమారుహ్య భాస్కర ప్రతిమాకృతిః | తమన్వ¸° తదా రాజన్‌ ! ప్రచండో రవి నందనః || 23

చతుర్భిః కుంజరై ర్యుక్తం రథ మాస్థాయ సత్వరా | త మన్వ¸° ధరాదేవీ దేవం త్రిదశ పూజితమ్‌ || 24

సంకల్ప రథ మారుహ్య వ్యవసాయ పురస్సరః | మనోరథే నాను య¸° కాదేవోపి కేశవమ్‌ || 25

పుష్పేషో రపి యస్యాజ్ఞాం బిభర్తి సకలం జగత్‌ | ఆనాలస్యం సమారూఢా తథా దేవీ సరస్వతీ || 26

అన్వ¸° పుండరీకాక్షం శరణాగత వత్సలమ్‌ | భౌమజ్జ జీవ శుక్రాశ్చ రాహుః కేతుః శ##నైశ్చరః || 27

వాజియుక్తైః రథైః శీఘ్ర మన్వయః పురుషోత్తమమ్‌ | దేవాశ్చైకోన పంచాశ న్మరుతః చారుమండలాః || 28

అను జగ్ముః సురాః కృష్ణం వాయుమండల మధ్యగాః | అనుజగ్ము స్త మాదిత్యాః రథైః కాంచన సుప్రభైః || 29

వసవోంగిరసః సాధ్యా విశ్వేదేవా స్తథాశ్వినౌ | భృగవ శ్చాశ్వసంయుక్తైః రథై స్తం దేవ మన్వయుః || 30

రుద్రాశ్చాను యయుః దేవం బలోదగ్రైః కకుద్మిభిః | తథైవాన్యే బలోదగ్రాః దేవా దేవాను యాయినః || 31

గర్ధభై ః శింశుమారైశ్చ మహోష్ట్రె ర్మహి షోరగైః | సింహ వ్యాఘ్ర తరక్ష్వృక్ష గజవానర మర్కటైః || 32

చమరై ః సృమరైశ్చైవ గోధా మార్జార శల్లకైః | వివిధై ః పక్షియా నైశ్చతే ను జగ్ము ర్జనార్దనమ్‌ || 33

సిద్ధమార్గేణ సిద్ధాశ్చ ప్రయము ర్మునయ స్తథా ః స్తువన్తః పుండరీకాక్షం దేవసంఘ భయాపహమ్‌ || 34

గీతవాద్వై ః సుమధురై స్సేవమానా జనార్దనమ్‌ | పహృష్టాః ప్రయయు స్తత్ర గంధర్వాప్సరసాంగణా ః || 35

అగస్త్యులనిరి : దేవతలు సేసిన తపస్సుచే హరి సంతుష్టుడై సముద్రవాసమును విడిచి వారికి గానవచ్చెను. వారును సురారి సంహారుని నవనిం జాగిలవడుటచే ధూళిగలిసిన మోకాళ్ళ అరచేతుల లాలాటములతో హర్షముతో మ్రొక్కిరి. దేవవాక్కులచే (వేదములచే) స్తుతించిరి. తాము వచ్చిన ప్రయోజనము సుకేశ తనయ సంహారమని దేవదేవుని నివేదించిరి కూడ. అప్పుడు హరి మాలి వధ సేయుదునని వారికి ప్రతిజ్ఞసేసెను. మీరు సుమాలివధ విషయములో శక్తులు గండు. మరి మాల్యవంతుడో ధర్మవత్సలుడు ఇతరవధ్యుడు. అని పలికి హరి గరుడునిం బిలిపించెను. సర్వాత్ముడా విష్ణువు స్వర్ణమూర్తియైన యా వినతాసుతునధిష్ఠించెను. శంఖ చక్ర గదా పద్మములూని అవిసేపూవట్లు శ్యామలుడై యా బంగారుపక్షిపై గూర్చుండి మెరపుతో గూడిన జలముతోడి జలదము యొక్క శోభను దాల్చెను. కిరీటము కౌస్తుభమణిని యామూల్యభూషణములను దాల్చి విహంగవరమధిష్టించిన యా స్వామిని వేలుపు లనుగమించిరి. అమృతమటచ్చపు తెల్లనైన రెక్కలతో విశాలాకాశమున బరువెత్తు హంసలతో నా విష్ణువును జటామండలములచే గనశక్యముగానివాడై బ్రహ్మదర్శించెను. చంద్రకిరణసదృశ##మైన నిబిడమైన (ఒత్తైన పుష్టియైన) మేనితోడి వృషభముపైనెక్కిన వాడై మూడవ కంటి వెలుగుచే నాకసముంజీల్చుకొని హరుడా హరింవెంటం జనియె. దేవేంద్రుని వేయికన్నులతో నీడైన పించెము యొక్క యాటోపముచే దూసికొనిపోవు మయూరమునెక్కి స్కందుడు కుమారస్వామి షణ్ముఖుడు విష్ణువును వెంబడించెను. రాక్షస స్వాములను వినాయకులను గావింప వినాయకుడు వాయుమండలారూఢుడై మాధవు వెంట నేగెను. అగ్ని జ్వాలావళీ పుంజ ముతో నీడైన కేసరములతోడి (జూలుతోడి) సింహముతో (సింహవాహని) భ్రదకాళి జనార్ధనుని వెంటనరిగెను వరాంగనల కుచముల వంటి కుంభస్థలముగల యైరావతగజమెక్కి కిరీటముదాల్చి వజ్రముచేబూని త్రిదశాధిపతి యా జగత్పతి ననుచరించెను. రాజా వహ్ని చిలుక వాహనమెక్కి నాదేవు ననుసరించెను. వైవస్వతుండు (యముడు) అరుద్రపురుగుల గమితో నలముకొన్న పచ్చిక బయలట్లు శోభించునది గిరిశిఖర సమాకారమైనది కొమ్ములతో రాణించు మస్తకముగలది యగు మహిషమునెక్కి హరివెంట నేగెను పెద్దమెడ శంఖములు చెవులందుగల (నిరృతి) విరూపాక్షుడు గజస్కంధ మధిష్టించి యాదేవుననుసరించెను. మనోజపము వాయు వేగమునైన మహాయానమెక్కి హరివెంట స్నిగ్ధ వైడూర్యవర్ణుడైన వరుణుడేగెను. మనోవేగియై వాయుమండల మధ్యమందుండి వాయువులతో గూడిన చక్కని వలువదాల్చి వాయుభగవానుడా వెంటజనెను ధనుదుడు(కుబేరుడు) సర్వరత్నోజ్జ్వలమైన నరవాహన మెక్కి పరమశ్రీ సంపన్నుడై గోవిందునను వ్రజన మొనరించెను. ఏడు గుఱ్ఱములు నొక్క చక్రమునుంగల యరదమెక్కిభాను మంతుడు(సూర్యుడు) ప్రభామండలముచే నీక్షింపవలనుగాక యాదేవుననుసరించెను. చంద్రుడు తీవ్రప్రభను (వేడిని) వారించుచు పది గుఱ్ఱములు పూన్చిన మనోజనమైన రథమెక్కి హరిని వెంబడించెను. శని (సూర్యకుమారుడు) మంచిగుఱ్ఱమెక్కి భాస్కరుని వంటి రూపుగల్గి ప్రచండుడై హరిననుగమించెను. భూమి నాల్గేనుగులబూన్చిన రథమెక్కి త్వరతో దేవపూజితుని విష్ణువు వెంబడించెను. కామదేవుడు (మనసిజుడు మన్మథుడు సంకల్పమను రథమెక్కి (మనోరథముతో)సర్వ ప్రయత్న పురస్సరముగా హృషీకేశు వెంటజనెను. జగత్తు కుసుమధన్వుని యాజ్ఞను దలదాల్చును సరస్వతి ఆనాలస్యమను తేరెక్కి శరణాగతవత్సలుని పుండరీకాక్షు ననుసరించెను.

తపస్సత్యం క్షమాదానం వ్రతాని వివిధాని చ | యజ్ఞాంగాని చ సర్వాణి కాలస్యావయవాః సథా || 36

సంవత్పరా స్తథా మాసా పక్షౌ చ కరణౖ స్సహ | యుగా యన ముహూర్తాశ్చ శాస్త్రాణి వివిధాని చ || 37

మూర్తిమన్తి తథా స్తాణి శస్త్రాణిచ జగత్పతేః | సముద్ర పక్షి తద్ద్వీప శాఖినాం విగ్రహాణి చ || 38

వర్షాణాం చ శరీరాణి పితౄణాంచ తథా గణాః | నక్షత్రాణి దిశ శ్చైవ విదిశ శ్చ మహి వతే || 39

దేవా వనస్పతి శ్చైవ యా శ్చలోకస్య మాతరః | దేవదైత్య గణా యేచ తథా పితృగణాశ్చయే || 40

గంధర్వ యక్ష నాగానాం గణా యేచ నరేశ్వర! | ఘోరా వ్యాధి గణా శ్చైవ కాలపాశై ః సుదారుణౖః || 41

మృత్యుర్దండః స్తథా క్రోధో జరాచ మనుజేశ్వర ః | అన్వయుః పుండరీకాక్షం రక్షోగణ వధైషిణమ్‌ || 42

జయశ్రీ రగ్రత స్తస్య ప్రయాతి రఘునందన! | సరిత శ్చ తథా యానైః సర్వలోకస్య మాతరః || 43

మకరేణ య¸° గంగా కాశిన్దీ కచ్ఛ పేన తు | సారసేనాపి సరయూ ః శింశు మారేణ గోమతీ || 44

గోదావరీ చ ఖడ్గేన మయూరేణ సరస్వతీ | కకుద్మినా శతద్రుశ్చ విపాశా తురగేణచ || 45

చంద్రభాగా చ సింహేన దంతినే రావతీ తథా | సింధు ర్వ్యాఘ్రేణ మత్స్యేన వితస్తాచ తథా య¸° || 46

దేవికా చైవ హంసేన పురుషేణచ గండకీ | మహిషేణ చ పర్ణాశా వరాహేణ చ కౌశికీ || 47

హిరణ్యతీ సుపర్ణేన చక్రేణ క్షుమతీ నదీ | భుజగేన చ పర్ణాశా వరాహేణ చ కౌశికీ || 48

వేదస్మృతి ర్మయూరేణ సారంగేణ చ నర్మదా | జీవజీవక మారూఢా సీతాపిప్రయ¸° నదీ || 49

హ్రాదినీ చ సరోరూఢా సృమరేణచ పావనీ | శశ##కేనాపి లౌహిత్యా నదీ సింధు ర్గజేన చ || 50

ఉరభ్రేణ తథా చక్షుః సీతా చాజేన రాఘవ ః గౌతమీ కుక్కుటేనాపి చాషేణచ దృషద్వతీ || 51

సై#్వః సై#్వః యానైః తథై వాన్యాః ప్రయయుర్నిమ్నగా హరిమ్‌ | దేవాను యాత్రా ఘోషేణ వాదిత్రాణాం రవేణ చ ||

స్తూయ మానో ద్విజాగ్ర్యైశ్చ ప్రయ¸° కమలేక్షణః | తద్భలోద్యమ పర్వంతం దేవగంధర్వ సంకులమ్‌ || 53

ఆతపత్రైః పతాకాభిః స్వచిహ్నైశ్చ విరాజితమ్‌ | 54

కింకిణి శత సంఘెషం ప్రయయా వసుకేశపమ్‌ రశ్య్ముత్కరై ర్దేవ విభూషణానాం | ప్రదీప్యమానం కనకాది చిత్రమ్‌ బలం య¸° తత్త్రి దశోత్తమానాం నారాయణ నా ప్రతి మేన గుప్తమ్‌ || 55

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే దేవ ప్రయాణ వర్ణనంనామ పంచ దశోత్తర ద్విశత తమో ధ్యాయః.

తపస్సత్య క్షమాదాన వివిధవ్రతములు అన్ని యజ్ఞాంగములుకా లావయవములు సంవత్సరములు మాసములు పక్షములు రెండు కరణములు యుగములు ఆయనములు ముహూర్తములు వివిధ శస్త్రములు అస్త్రములు శాస్త్రములు సమద్రమార్గములు అందలి ద్వీపములు వృక్షములు వర్షములు (వర్షపర్వతములు) పితృగణములు నక్షత్రములు దిశలు (మూలలు) దిక్పాలురు వివస్వతులు లోకమాతలు దేవదైత్యపితృగణములు గంధర్వ యక్షనాగగణములు ఘోరవ్యాధిగణములు మూర్తించాల్చి దారుణ కాంపాళములతో మృత్యుదండము (క్రోధము జరముదిమి) రక్షోగణ సంహారము సేయగోరు విష్ణువును వెంబడించెను. భరతా ! ఆయనకు జయలక్ష్మి ఆయన ముందునడిచెను నదులు సర్వలోకమాతలు తమతమ వాహనములెక్కిచనెను గంగ మకరవాహనమైన కాలింది. తాబేలునెక్కి సరయూనది సారసమునెక్కి (బెగ్గురుపక్షిని) గోమతి శిశుమారముపై గోదావరి ఖడ్గమృగవాహనయై సరస్వతి నెమలి శతద్రువు వృషభమును విపాశ గుఱ్ఱమును చంద్రభాగ సింహమును ఇరావతి దంతిని (ఏనుగును) సింధువు పెద్దపులిని వితస్త మత్య్సమును దేవికానది హంసనుగండకి పురుషుని పయోష్టి దున్నను కావేరివృషభము హిరణ్యపతి గరుడుని ఇక్షుమతి చక్రవాకమును పర్ణాశానది సర్పమును కౌశికి వరాహమును వేదస్మృతి నెమలిని నర్మద లేడిని సీతానది (జీవంజీవమును)చకోరమును నెక్కిచనెను. హ్రాదిని సరోరూఢా - నరారూఢా - సరవాహనమెక్కి యానిపాఠాంతరము. పావని సృమర మృగమును లోహిత్యానది శశకమును (కుందేటిని)సింధువు ఏనుగును చక్షువు ఉరభ్రమును సీతమేకను గౌతమి కుక్కుటమును (కోడిని) దృషద్వతి చాషమును మరియుంగల పుణ్యనదులు తదితర వాహనముంనెక్కి హరివెంట జనిరి. దేవతల వెంబడించు సందడితో దేవవాద్య రకములతో ద్విజోత్తములు స్తుతింప కలమలలోచనుడు జైత్రయాత్ర వెడలెను. గొడుగులు పతాకలు వారివారి చిహ్నాలతో విరాజిల్లుచు చిఱుగంటల ఘోషములతో దేవ గంధర్వ సంకులమైన బలగము హరివెంటనడచెను. దేవతలుదాల్చి భూషణముల కాంతులతో సుద్దీపించుచు కనక మణి ప్రముఖ ప్రభలచే చిత్రవిచిత్రమై దేవతా శ్రేష్ఠలబలము అసామాన్యుడగు నారాయణునిచే గుప్తమై (రక్షింపబడును) యరిగెను.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమందు

దేవ ప్రయాణవర్ణనమును రెండువందల పదునైదవ యధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters