Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలపదునాల్గవ అధ్యాయము - సముద్రవర్ణనము

అగస్త్యః : మాలీ సుమాలీ రాజేంద్ర! మాల్యవాంశ్చ రణోత్కటః | లంకా దుర్గ మథా సాద్య చిత్రమూషుః పరస్పరమ్‌ ||

మాలీ సుమాలీ దుర్వృత్తౌ పీడన్తౌ చ దేవతాః | వార్యమాణావపి సదా తేన మాల్యవతా నృప ! 2

తయోర్భీతైః సురై ర్బ్రహ్మా జ్ఞాపితః సంప్రయోజనమ్‌ | బ్రహ్మణా సహితై ర్గత్వా జ్ఞాపిత స్త్రిపురాంతకః || 3

బ్రహ్మేశ సహితా దేవా విష్ణుం శరణ మీయుషః | జగ్ము ర్లవణ తోయస్థం విజ్ఞాపయితు మచ్యుతమ్‌ || 4

దదృశు శ్చ రఘుశ్రేష్ఠ! సముద్రం పీత మంభసామ్‌ | ఊర్మిపర్గైః ప్రసృత్యద్భిః వర్ధంత మివ వాయునా || 5

హసన్త మివ ఘేనౌఘైః స్ఖలన్తం కందరాసు చ | అపార మివ గర్జన్తం నానా యాదో గణావృతమ్‌ || 6

వీచి హసై#్తః ప్రచలితై రాహ్వయాన మివా పరాన్‌ | ఫేనా వత్యః ప్రకీర్ణా శ్చ సంహతాశ్చ సముచ్ఛ్రితాః || 7

ఊర్మయ శ్చాస్య దృశ్యన్తే చలన్త ఇవ పర్వతాః | తిమింగిలాః కచ్ఛపాశ్చ తథా తిమి తిమింగిలాః || 8

మకరా శ్చాపి దృశ్యన్తే జలే మగ్నా ఇవాద్రయః | శంఖానాం చ సహస్రాణి మగ్నా న్యప్సు సమంతతః || 9

దృశ్యన్తే స్మ యథా రాత్రౌ తారా స్తన్వభ్ర సంవృతాః | క్వచి త్సుప్తః క్వచి ద్గర్జన్‌ క్వచిత్‌ ఘూర్ణన్‌ క్వచిత్‌ స్ఖలన్‌ ||

క్షోబోపమం తం దదృశుః సముద్రం త్రి దశాధి పాః | క్వచి శ్చావాసితైః దైత్యైః క్వచిద్దైత్యారిణా తథా || 11

క్వచిచ్చ భుజగై ర్భీమైః మహా గాంభీర్య సంయుతమ్‌ | విష్ణో ర్వరాహ వపుషా విక్షోభిత జలావిలమ్‌ || 12

అనాసాదిత బాధంచ వర్షాణాం శతపత్రిణా | తేన దేవాతి దేవేన విష్ణునా ప్రభవిష్ణునా || 13

నిత్య మన్తర సంస్థేన నిర్మలీ కృత విగ్రహమ్‌ | శక్ర వజ్ర భయ త్రస్య మాన శైలశతా కులమ్‌ || 14

విద్రుమాంబర మాప్లుష్ట స దృశాకార విద్రుమమ్‌ | పూర్ణ చంద్ర కలంకస్య క్షాళ##నేప్సు రివోద్ధతైః || 15

ఖ మాక్ర మతి కల్లోలైః పౌర్ణమాసీషు య స్సదా | అసంఖ్యాతం తరంగౌఘైః సంక్రాంత శశి మండలమ్‌ || 16

హసన్తం వా న్తరిక్షస్య శ్రియ మేవేందు ధారిణః | దిగ్భాగ దాన కాలేషు యుక్త శ్చందన వారిణా ||

సుప్యతేచ యథా యత్ర సతతం దాన వారిణా

తమన్త రిక్ష ప్రతిమం విశాల లోలోర్మి మాలాకుల దిగ్వి భాగమ్‌ |

సముద్ర మాసాద్య దివౌక సస్త మాతస్థు రుగ్రం తపసోగ్రా సత్వాః || 18

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే సముద్ర వర్ణనం నామ చతుర్దశోత్తర ద్విశతతమోధ్యాయః.

అగస్త్యులనిరి. రణోద్ధతులు మాలి సుమాలి మాల్యవంతుడు లంకాదుర్గముంజేరి యొండొరులు గలిసియుండిరి. అయునికి అతి చిత్రము. మాలి సుమాలియు దుర్మత్తులై దేవతల పీడించుచుండిరి. మాల్యవంతుడు వారించుచున్నను మానరైరి. వారికి జడిసి దేవతలు బ్రహ్మకు కార్యప్రయోజన మెరింగించిరి. వారు బ్రహ్మతోనేగి త్రిపురాంతకునికి నివేదించిరి. బ్రహ్మను శివినిగూడి లవణ సముద్రమందున్న విష్ణువునకు విన్నపముసేయనేగిరి. అట నా సముద్రమును జూచిరి.

సముద్రవర్ణనము

ఆసముద్రము తరంగవేగముచే నృత్యము సేయుచున్నట్లు గంతులు వేయుచున్నట్లు నుఱుగులతో నవ్వుచున్నట్లు పర్వతముల చరియలనుండి జారుచున్నట్లు అపారమై గర్జించుచున్నట్లు నానాజల జంతుగణములతోగూడి, చలించు తరంగములను హస్తముల దేవతలం బిలుచు చున్నట్లు గాననయ్యెను. నురుగులు గ్రమ్మి చిమ్ముకొనుచు కలిసికొనుచు మీదికి లేచుచునున్న యందలి కెరటములు కదలుచున్న పర్వతములట్లు గనబడెను. తిమింగములు తేబేళ్లు తిమంగలములు మొసళ్ళును నీటందేలు పర్వతములట్లు కానవచ్చెను. వేలకొలది శంఖములు నీటందేలి రాత్రి చిఱుమబ్బుల గూడిన తారలట్లు (నక్షత్రములట్లు) కానవచ్చుచుండెను. ఒకచోట నిదిరించి, ఒకచో గర్జించుచు నొకచో ఘూర్జించుచు నొకచో సకిలించుచు (తొట్రుపడుచు) క్షీబునివలెనున్న బక్క చిక్కిన వాడట్లున్న) యా సముద్రుని దేవాధిపతులు చూచిరి. ఒకచో నావాసముగొన్న దైత్యులు, ఒక్కచో దైత్యాదులు (దేవతలు) ఒకచో భయంకరులగు పన్నగులనుగూడి మిగులలోతుగల్గి వరాహరూపియగు విష్ణువుచే గలుపబడిననీటితో జెదరి చెదరి శతపత్రియైన (చక్రాయుధుడైన) ప్రభవిష్ణువైన (జగత్కారణమైన) విష్ణువుచే వర్షపర్వతముల బాధనొందనిదై నిత్యము తనలోనున్న యావిష్ణువుచే నిర్మలినముగావింప బడిన ఘార్తితో ఇంద్రుని వజ్రాయుధము వలన భయమునంజడియు వందలకొలది పర్వతములతో నలముకొన్నదై పవడములంబరముగా దాల్చి పూర్ణిమలందు పూర్ణచంద్రునిలోనికళంకమును గడిగివేయగోరినట్లు ద్ధతములై నకల్లోలములతో నాకమాక్రమించుచున్నదై అసంఖ్యాకములై తరంగసంఘములచే శశిమండలము నాక్రమించునదై ఆయాదిశలకు భాగమునిచ్చు తరి నా చందనోదకముతోగూడి చంద్రధారియైన యంతరిక్షము యొక్కశోభను పరహసించుచున్నదై యాకసమట్లు విరివియై విశాల విలోల తరంగమాలాకుల దిగ్వి భాగమైయున్న సముద్రముం దరిసి తపస్సుచే సత్యుగ్రమైన బల సంపన్నులు దివౌకసులట జేరినిలిచిరి.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమందు శైలూషునితో నాడాయనుని ప్రసంగమందు సముద్ర వర్ణనమను రెండువందల పదునాల్గవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters