Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలఎనిమిదవ అధ్యాయము - భరతుని రాజగృహగమనము

తతః స్వల్ప పరీవారో భరతో ధర్మ వత్సలః ! అభ్యధాయ తతః ప్రీత్యా మాతులః కైకయాధిపః || 1

కంఠే గృహీత్వా భరతం మూర్థ్న్య పాఘ్రాయ చా7సకృత్‌ | భరతో పి సమాదాయ రాజన్‌! గృహము పాగతమ్‌ ||

ప్రవివేశ పురం హృష్టో మాతులస్య యధాజితః | పతాకా ధ్వజ సంబాధం సిక్తం చందనవారిణా || 3

ధూ పేనాగురు సారాణాం సమన్తా చాకులీకృతమ్‌ | కృతోవహారం సర్వత్ర కుసుమైః పంచవర్ణకై ః || 4

సర్వఫణ్యవిసంయుక్త సమాలంకృత బాలకం | ఖముల్లిఖద్భిః ప్రాసాదైః శ్వేత మేఘ గణౖ ర్యుతమ్‌ | 5

విన్య స్తబలిపూజంచ దేవతాయతనేషు చ | మహావాది త్రఘోషేణ సమంతాత్‌ కృత నిస్వసమ్‌ || 6

పారై ః దిదృక్షుభిః సర్వై రాకీర్ణావణ వీథికమ్‌ | రాజమార్గే మహారాజా! పిండీకృత మహాజనమ్‌ ||7

రాజమార్గా దపాకృష్ణ శూన్య సర్వ నివేశనః | యోషిద్‌ బృంభ సమాకాంత రాజమార్గ మహాగృహమ్‌ || 8

పవివేళ పురం శ్రీమాన్‌ భరతో నాగధూర్గత ః తస్య కామాభవపుషః ప్రవేశే భరతస్య తు || 9

గృహకార్యాణి సంత్యజ్య యయు ర్నార్యోగ వాక్షికాన్‌ | కాశ్చి దుర్దానులిప్తాంగ్యః కాశ్చిదేకాంజితేక్షణాః || 10

కేశైః సంయమితై కార్థైః కాశ్చిదర్ధ నివేశితైః | ఏకస్మిం శ్చరణ కాశ్చిత్‌ గృహీత్వా కాష్ట పాదుకాః || 11

త్వరితాస్తా యయుః నార్వో ద్వితయే చర్మపాదుకాః | తథా పరాః సమాక్షివ్య పూర్వాక్రాంత గవాక్షకాః || 12

వ్రజన్తీషు తథ7న్యాసు కాశ్చిన్నార్యో గవాక్షకాత్‌ | వేగవత్యో యయుః శీఘ్రం సంత్యక్త్వా చర్య పాదుకాః || 13

నార్వః స్వపదనైన శ్చకు సువక్త్రా స్తాన్‌ గవాక్షకాన్‌| అర్థప్రవిష్ట సత్కంబు పాణి వారిజ కుట్మలాః || 14

ద్వితీయ పాణి సందర్శ సమాక్రాంతైర్యయుః కరైః | నీవీ బంధన విశ్లేష సమాకూలిత చేతనాః || 15

యయురేవా7పరస్తత్ర పాణి సంశ్లిష్ట నీవయః | కుసుమ ప్రకరం కాశ్చిత్‌ గూహమానా ః శిరోగతై ః || 16

యయు రేవాంశుకైర్దీర్ఘైస్త్వరమాణా గవాక్షకాన్‌ | సీతాసితేన రామాణాం రమణీయేన రాఘవః || 17

య¸° దృష్టి నిపాతేన రజ్యమాన ఇవాంశుమాన్‌ | సచకర్ష తదా తాసాం పతిత్తేర్నేత్ర రశ్నిభిః || 18

హృదయా న్నిగృహీత్వేవ గచ్చమాన స్సరాఘవః | సతు దృగ్విషయే యాసాం యాసాం తస్మా త్పరా గతః || 19

న తా బుబుధిరే కాశ్చిత్‌ క్రియాం చిత్రగతా ఇవః భరతే దూరయాతే7పి నిశ్చేష్టాః కాశ్చిదేవ తాః || 20

ఆకృష్టాస్తా యయుః క్షోణిం ప్రేర్యమాణౖస్సభీజనై ః | ప్రద్యుమ్నాంశ సముత్పన్నః ప్రద్యుమ్న సమదర్శనః || 21

ఆదాయ తాసాం చేతాంసి య¸° రాజగృహం ద్రుతమ్‌ | తస్మిన్‌ రాజగృహే రాజన్‌ ! రాఘవో రాజమందిరమ్‌ ||

ఆససాద మహాతేజాః కైలాస మివ చాపరమ్‌ | ప్రవిశ్య స గృహం ముఖ్యం ప్రేషయామాస

భూభుజమ్‌ || 23

పానభోజనవాసాంసి సైనికానాంచ యాదవః | ఉవాస ససుఖం తత్రపూజితశ్చ యుధాజితా|| 24

జగామ చాస్తంసవితా జపాపుష్పోత్కర ప్రభః |

జాంబూనదే రత్నసహస్ర చిత్రే సరాజ పుత్రః శయనే విచిత్రే |

సుష్యాప రాత్రౌభవనే విచిత్రే నిదాఘరాత్రిం పవనే విచిత్రే || 25

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాడే

భరతస్య రాజగృహ ప్రవేశ వర్ణనం నామ అష్టోత్తర ద్విశతతమో7ధ్యాయః.

మార్కండేయుడనియె ః ధర్మప్రియుడగు భరతుడు స్వల్పపరివారములతో నేగెను. కైకయాధిపతి భరతమాతులుడు యుధాజిత్తు భరతుని బిగ్గకౌగలించుకొని పలుమారులు శిరమ్ము మూర్కొని ప్రీతితో నాదరించెను. భరతుడు తన గృహమున రాజుతో యుధాజిత్తు రాజధాని నానందముతోజూడ బ్రవేశించెను. ఆకేకియ రాజనగరము పతాకాధ్వజ సంబాధమై చందనోదకములచే దడుపబడి ఆగురుసార ధూమములు నలుదెసలఘమ ఘమలాడు చందన పంచవర్ణములయిన పూవులచే సంతట సలంకృతమై సర్వ విధములయినవస్తువులమ్ముబజారులతో నలంకృతమైన బాలురతోగూడి తెల్లని మేఘసముదాయమట్లున్న ప్రాసాదములతోగూడి, దేవాలయములందుంచబడిన బలులతో నలంకృతమైన బాలురతోగూడి తెల్లని మేఘసముదాయమట్లున్న ప్రాసాదములతోగూడి, దేవాలయములందుంచబడిన బలులతో బూజలతోగూడి మహావద్య ధ్వనిచే బ్రతిధ్వనించుచు పురసందర్శన కుతూహలురైన పౌరులతో నిండనలమునకొనిన బజారువీధులతో రాజమార్గమందు గుమిగూడిన మహాజనముతో రాచబాటనుండి శూన్యగృహములెల్ల దొలగింప బడినది రాజమార్గమందలి మహాగృహములందు భదరతదర్శనమునకై గుమిగూడిన సుందరీబృందముతో గనువిందైన కుంతల రాజధానీ గనరమును గజరాజునెక్కి భరతుడు ప్రవేశించెను. మన్మథుడట్టి యందంగాని నాతని పుర ప్రవేశము నందింటి పనులువదలి పద్మాక్షులు గవాక్షములదరికరిగిరి. అందుకొందరు మేనికి గంధము సగము పూసికొన్నవారు ఒక్క కంటికి కాటుక పెట్టుకొన్నవారు జుట్టు సగము కొప్పముడిచికొన్నవారు. కొందరు సగము ముడివైచుకొనిరి. కొందరొకకాలికి కర్రపాదుకను దొడిగికొని భరతుని జూచునాశతొందరపెట్ట రెండవకాలికి చర్మపాదులు దొడిగికొన్నవారు అట్లే కొందరంతముందే కిటికీల నాక్రమించికూర్చున్న వారిని కిటికీల దగ్గరకు వెళ్ళుచున్న వారిని లాగిత్రోసి యతివేగముగొని చర్మపాదుకలనువదలి పరువెత్తిరి. అగవాక్షములను (గోవు కన్నువలె నమర్చిన కిటికీకి గవాక్షమనిపేరు) తమ ముఖములచే సుముఖతములను (శోభనముఖములను)గావించి. నలుపు తెలుపునైన సహజమైన తెలుపు కాటుకవలని నలుపుచే రెండు విధములయిన రమణీయణుల దృష్టి ప్రసారముచే రంజితుడైట్లు తనపై వ్రాలు వారి నేత్రకాంతులచే రంజితుడై సూర్యునట్లు రంజితుడై యారాజనీథింజనుచు తన హృదయమును నిగ్రహించుకొనుచునే యా రఘు వంశవర్ధనుడా పురవీథిం జనెను. ఏయేరమణీమణుల చూపులగురి నాతడు దవిలెనో యాయా యంగనలు కొందరు చిత్తరుపునం బొమ్మలట్లు కర్త్యవ్యములను ఇంటిపనులను మరచిరి. భరతుడు దూరమేగ కొందరంగనలునట్లే నిశ్చేష్టలైరి. సఖీజనము ప్రేరపింప(భరతుడు దూరమేగెనని తెలుపబడి) కొందరు క్షోణికింజనిరి (మేడ క్రిందికి దిగిరన్నమాట)ప్రద్యుమ్నుని యంశమున నవతరించిన వాడు ప్రధ్యమ్నునితో సమమయినయందము గలవాడునగు భరతుడాపుర సుందరుల డెందముల గొనివేగముగ రాజ గృహమునకుంజనెను. ఆ రాజ్యగృహమందతడు రెండవ కైలాసమట్లున్న రాజసౌధముం బ్రవేశించెను. ముఖ్యగృహమది ప్రవేశించి భూపతిని (యధాజిత్తును) బంపెను. సైనికులకు పానభోజన వసనాదులనుం బంపించెను. యధాజిత్తుపూజింప నతడక్కడ సుఖముగా వసించెను. అంతట పూర్యుడు జపాకుసును పుంజమట్లు (దాసానిపూవుగుత్తివలె )నెర్రనికాంతిగొనెను. రత్న సహస్ర చిత్రమై విచిత్రమునై బంగారు తల్పమునందా గ్రీష్మ ఋతు రాత్రి చల్లనిగాలిలోనిదురపోయెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున భరతుని రాజగృహ - ప్రవేశమను రెండువందల యెనిమిదవయధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters