Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందలనాల్గవ అధ్యాయము - భరత ప్రస్థానము

మార్కండేయః : 

ఏతస్మి న్నేవ కాలేతు రామః శుశ్రావ తన్మహత్‌ | శంఖవాద్య రవోన్మిశ్రంభరతస్యానుయాత్రికమ్‌ || 1

రాజద్వారముపాగత్య భరతో7పి మహాయశాః | పద్భ్యాం జగామ రాజాన మవతీర్య తురంగమాత్‌ || 2

స దదర్శ తదా రామం రత్నసింహాసన స్థితమ్‌ | అనులిప్తం పారర్ధ్యేన చందనేన సుగంధినా || 3

సూక్ష్మం వసానం వసనం సర్వాభరణ భూషితమ్‌ | తేజసా భాస్కరాకారం సౌందర్యేణోడుపోపమమ్‌ || 4

క్షమాయా పృథివీతుల్యం క్రోధే కాలానలోపమమ్‌ | బృహస్పతిసమం బుద్ధ్యా విష్ణుతుల్యం పరాక్రమే || 5

సత్యేదానే7ప్యనౌపమ్యం దమే శీలేచ రాఘవమ్‌ | పురోహితై రమాత్యైశ్చ యుతం ప్రకృతిభిస్తథా || 6

దృష్ట్వా తం భరతః శ్రీమాన్‌ జగామ శిరసా మహీమ్‌ | భరతం యువరాజానం రామాయ విదితాత్మనే || 7

న్యవేదయత ధర్మాత్మా ప్రతీహారః సలక్ష్మణం | ఉత్థాయ కంథే జగ్రాహ రామో7పి భరతం తదా || 8

మూర్ధ్నిచైన ముపాఘ్రాయ ఆదిదేశాస్య చాసనమ్‌ | భరతంతు సుఖాసీనం రామోవచన మబ్రవీత్‌ || 9

మార్కండేయుడనియె : ఇదేసమయమందు శంఖవాద్యాదులతో మిశ్రమైన భరతుని యనుయాత్రికుల పెనుసందడిని రాముడాలించెను. భరతుడును రాజద్వారమున కేతెంచి గుఱ్ఱము దిగి పాదచారియై రాజుదరికేగెను. అతడయ్యెడ రత్నసింహాసన మందున్న రాముని దర్శించెను. ఘుమఘుమలాడు గడువిలువైన గంధముపూసికొని మిక్కిలి జిలుగైన వసనములం దాల్చి సర్వాభరణ భూషితుడై తేజమున భాస్కరుని రూపై యందమున నుడురాజు నెనయై ఓర్పున పృథివికీడై కోపమున కాలానలుడట్లై బుద్ధిచే బృహస్పతికి సరియై పరాక్రమమందు విష్ణువు సమమై సత్యమందు దానమందు దమమందు (ఇంద్రియనిగ్రహమందు) శీలమందు సాటిలేకున్న రాఘవుని పురోహితులతో మంత్రులతో బ్రకృతులతో బేరోలగమైయున్న ప్రభువును శ్రీమంతుడు భరతుడు చూచి తలతో నిలనంటి మ్రొక్కెను. యువరాజు భరతుని లక్ష్మణునితో వచ్చినవానిని నాత్మవిదుడగు రామునికి ప్రతీహారుడెరింగించెను. రామచంద్రుడును లేచి భరతునపుడు కంఠముగొని కౌగలించెను. శిరముమూర్కొనెను. కూర్చుండ నాసనము సూపెను. సుఖాసీనుండైనంత భరతునితో రాముడిట్లనియె.

గంధర్వ పుత్రాంస్తాన్‌హత్వా కర్తవ్యం నగర ద్వయమ్‌ సింధోరుభయ పార్శ్వేతు పుత్రయో రుభయోః కృతే || 10

అభిషిచ్య తదా వత్స! పుత్రౌ నగరయోస్తయోః | యుధాజితి పరీధాయ క్షిప్రమాగన్తు మర్హసి || 11

త్వయా వినా నరవ్యాఘ్ర! నాహం జీవితు ముత్సహే | క్షత్రధర్మం పురస్కృత్య తత్ర త్వం ప్రేషితో మయా || 12

సత్వం గచ్ఛ! మహాబాగ! మాతేకాలాత్యయో భ##వేత్‌ | స్వస్త్యస్తు తేంతరిక్షేభ్యః పార్థివేభ్యశ్చ గచ్ఛతః || 13

దివ్యేభ్యశ్చైవ భూతేభ్యః సమరే చతథా7 నఘ! | 14

స్వాం స్వాం దిశ మధిష్ఠాయ దిక్పాలా దీప్తతేజసః | పాలయన్తు సదా తుభ్యం దీప్త విగ్రహధారిణః || 15

బ్రహ్మావిష్ణుశ్చ రుద్రశ్చ సాధ్యాశ్చ సమరుద్గణాం | ఆదిత్యా వసవోరుద్రాః అశ్వినౌచ భిషగ్వరౌ || 16

భృగవోంగిరసశ్చైవ కాలస్యావయవాస్తథా | సరిత స్సాగరాః శైలాః సముద్రాశ్చ సరాంసిచ || 17

దైత్యదానవ గంధర్వాః పిశాచోరగ రాక్షసాః | దేవ పత్న్యస్తథా సర్వాః దేవమాతర ఏవచ || 18

వస్త్రాణ్యస్త్రాణి శాస్త్రాణి మంగళాయ భవస్తుతే | విజయం దీర్ఘమాయుశ్చ ఖోగాంశ్చాన్యాన్‌ దిశన్తుతే || 19

గంధర్వపుత్రులం జంపి సింధునదికి నిరువైపుల నీ యిర్వురు కుమారులకు రెండు పురములను నిర్మింపవలయును. వత్సా ! ఆ నగరముల రెండింట కుమారులను బట్టాభిషేకించి యుధాజిత్తున కప్పగించి నీవు వేగమ యిటకు రాదగును. నిను విడిచి నేను జీవింపనొల్లను. క్షత్రధర్ముంబట్టి నిన్నేనటకంపుచున్నాను. మహాభాగ ! నీవటు చనుము. విలంబము సేయవలదు. నీకు నంతరిక్షమందలి భూమియందలి దివమందలి భూతములవలన యుద్ధమందు నీకు శుభమగుగాక ! దిక్పాలురు తమ తమ దిక్కులందుండి దీప్తతేజులుద్దీపించు విగ్రహములందాల్చి నీకొరకు రక్షణసేయుదురుగాక! బ్రహ్మ విష్ణువు రుద్రుడు సాధ్యులు మరుత్తులు ఆదిత్యులు వసువులు రుద్రులు దేవవైద్యవరులశ్వినులు కాలావయములయిన భృగులు అంగిరసులు సరిత్తులు సాగరములు శైలములు సముద్రములు సరస్సులు దైత్య దానవ గంధర్వులు పిశాచులు నాగులు రాక్షసులు దేవపత్నులందరు దేవమాతలు శస్త్రము లస్త్రములు శాస్త్రములు నీ మంగళముకొరకగుంగాక ! విజయము దీర్ఘాయువు భోగములను నీకనుగ్రహింతురుగాక !

ఇతిస్వస్త్యయనం శ్రుత్వా రాజ్ఞా స సముదీరితమ్‌ | రామస్య పాదౌ శిరసా త్వభివంద్య ధనుర్ధరః || 20

నిర్గత్య రాజభవనా ద్రామాజ్ఞా కల్పితం జగత్‌ | హిమాద్రికూట సంకాశం చారు దంష్ట్రోజ్వలాననమ్‌ || 21

మదేన సించమానంచ నృపవేశ్మాజిరం నృప! సమాక్రాంత కటం చాపి పానలుబ్ధ శిలీముఖైః || 22

స్తబ్ధచారు మహాకర్ణం మధుప కృపయైవతు | దీర్ఘాగ్ర మధ్వక్షకృతం కృత శృంగావతంసకం || 23

స్వాసనం వ్యూఢ కుంభంచ తథోదగ్రం మహాబలమ్‌ | నక్షత్రమాలాం శిరసా ధారయానంతు కాంచనీమ్‌ || 24

పటుస్వనే తథాఘంటే దర్శనీయే మనోహరే | కుథం విచిత్రరమ్యంచ కోవిదారం మహాధ్వజమ్‌ || 25

వైజయన్త్యః పతాకాశ్చ కింకిణీజాల మాలితాః | సమారూఢం నయవిదా మహా మాత్రేణ ధీమతా || 26

వైడూర్య దండతీక్షాణగ్ర కాంచనాంకుశధారిణా | జఘనస్థేన చాన్యేన వరతోమర ధారిణా || 27

తథావైజయికైర్మంత్రైః దైవజ్ఞేనాభి మంత్రితమ్‌ | ఆరురోహ మహాతేజాః జయత్కారాభినందితః || 28

పూర్ణేందు మండలాకారం రుక్మదండం మనోహరమ్‌ | చత్ర మాదాయ తంప్రేవ్ణూచారురోహ స లక్ష్మణః || 29

చామరౌద్వౌ సమాదాయ చంద్రరశ్మి సమప్రభౌ | ఆరూఢం యోషితో ర్యుగ్మం రూపేణా ప్రతిమం భువి || 30

తం సమారుహ్య నాగేంద్రం మదలేఖాభిగామినమ్‌ | జగామ సహ గార్గ్యేణ రథా రూఢేన యాదవ ! 31

త మన్వయాన్‌ మహాభాగ! చతురంగ మహాబలమ్‌ | పతాకాధ్వజ సంబాధం కల్పయన్తం వసుంధరామ్‌ || 32

శ్యేనాః కాకవహాః కంకాః పిశాచా యక్ష రాక్షసాః | యయుః పురస్సరా స్తస్య భరతస్య మహాత్మనః || 33

గంధర్వ పుత్రమాంసానాం లుబ్ధా మాంసోపజీవినః | తూర్యఘోషేణ మహతా వందినాం నిస్స్వనేనచ || 34

వాయునా చానులోమేన సేవ్యమానః సుగంధినా! | మంగళానాంచ ముఖ్యానాం దర్శనా ద్ధృష్టమానసః || 35

నిర్య¸° రాజమార్గేణ జన సంబాధశాలినా | తేజస్వినాంచ తేజాంసి హృదయానిచ యోషితామ్‌ || 36

ఆదదానో మహాతేజా నగరాత్స వినిర్య¸° | క్రోశమాత్రం తతో గత్వా సమేదేశేచ సోదకే || 37

ప్రశస్తద్రుమ సంకీర్ణే శిబిరం ప్రాఙ్ని షేవితమ్‌ | సేనాధ్యక్షైః సునిపుణౖః వివేశ భరతస్తదా || 38

అని యిట్లు ఱనిచే బలుకబడిన స్వస్త్యయనమును (మంగళాశాసనమును) విని భరతస్వామి రామచరణముల శిరముచే మ్రొక్కి ధనువూని రాజభవనము రామాజ్ఞావశ##మై యున్న జగమును దాటి హిమగిరిశృంగమట్లున్నది చక్కనిదంతములతో దీపించు మోముగలది మధుపములపై (మూగు తుమ్మెదలపై) దయగలదట్టు కదల్పకున్న చక్కని చెవులు గలది తుదిని నిడుదలై మదఘూర్ణితములైన కన్నులు గలది ఒక శృంగవతంసముగా (శిరోభూషణముగ) దాల్చినది సుపుష్టమైన కుంభస్థలము గలది సుఖముగ కూర్చుండనైనది మహాబలశాలి భయముగొలుపునదియు శిరమున బంగారు నక్షత్రమాలం దాల్చినది (27 బంగారు పూసలుగల మాలయన్నమాట) పెద్దగ ధ్వనించు రెండు చక్కని ఘంటలు మెడలో వ్రేలాడుచున్నది రంగురంగుల రమ్యమైన కుథము = రత్నకంబళి (అంబారీలో గూర్చుండుట కమర్చిన తివాసీ యన్నమాట) కోవిదారధ్వజము = కాంచనవృక్షము చిరుగంటల మాలలతోడి వైజయంతీపతాకల నలంకృతమైనది గజశాస్త్రమెరిగిన బుద్ధిమంతుడు వైడూర్యమణిదండముగల్గి పదునైన యగ్రముతో బంగారు తొడుగుగల యంకుశము ధరించిన మావటీడు పైనెక్కినది వెనుకభాగమున గట్టి తోమరమూని యింకొక మావటీడెక్కికూర్చున్నదియు, వైజయిక మంత్రములచే దైవజ్ఞుడు (జ్యౌతిషికుడు) అభిమంత్రించినదియునగు మహాగజమును మహాతేజస్వి భరతుడు జయజయ నినాదములచే నభినందితుండగుచు నెక్కెను.

లక్ష్మణుడును సంపూర్ణ చంద్రమండలమువంటిది బంగారుదండముగలది మనోహరమైనదియునగు ఛత్రముంగొని (తెల్లగొడుగు) ప్రేమతో లక్ష్మణుడునెక్కెను. చంద్రకిరణములట్టి ప్రభగల రెండుచామరములూని నిరుపమాన సౌందర్యవతులిద్దరు సుందరీమణులు నా యేనుగెక్కిరి. ఓ యాదవ! మదరేఖననుసరించి నడుచుచున్న యా గజేంద్రమెక్కి రథమునెక్కి యేతెంచుచున్న గార్గ్యునితో (పురోహితుడితో) భరతుండేగెను. చతురంగమహాసైన్యము పతాకాధ్వజ నికరముచే వసుంధరను సమ్మర్దపరచుచు నతనిని వెంబడించెను. శ్యేనములు (డేగలు) కాక వహములు కంకములు పిశాచములు యక్షరాక్షసవర్గములు మాంసలుబ్ధములై గంధర్వపుత్ర మాంసములపై నాసగొని యా మహానుభావుడు భరతుని ముందేగినవి. గొప్ప వాద్యఘోషముచే వందిజనస్వనముచే అనుకూల పరిమళవాయువుచే సేవింపబడుచు సుముఖ్యములైన మంగళపదార్థముల దర్శనమున నానందభరితమైన మనస్సుతో జనసమ్మర్దమైన రాజమార్గమువెంట భరతుడు విజయయాత్ర వెడలెను. తేజశ్శాలుర తేజస్సులను రమణీమణుల హృదయములను ఆకర్షించుచు నమ్మహాతేజస్వి నగరమునుండి వెడలెను. అటు క్రోశమాత్రముగడచి ఉదకసమృద్ధము సమమునైన ప్రశస్తవృక్షసంకీర్ణమైన చోట నంతమున్న సునిపుణులైన సేనాధ్యక్షులు విడిదిచేసిన శిబిరము నతడుప్రవేశించెను.

స ప్రవిశ్య మహాతేజాః శిబిరం స్వం నివేశనమ్‌ | మంగళాలంభనం కృత్వా వరాసన గతః ప్రభుః || 39

పౌరజాన పదం సర్వం ప్రేషయామాస యాదవ! | పరిష్వజ్య తతః పశ్చాల్లక్ష్మణం శుభలక్షణమ్‌ || 40

మూర్ధ్నిచైన ముపాఘ్రాయ ప్రేషయామాస ధర్మవిత్‌ | ప్రాయాణంకచ శ్వోభూతే దుందుభిస్తాడ్యతాం మమ || 41

దైశికాః పురతో యాన్తు యేచ వృక్షావరోహకాః | ఆజ్ఞాప్య సకలం చైవ శిబిరం చ తవిథమ్‌ || 42

అవృక్షేషు తు దేశేషు రోపయన్తు ద్రుమాం జనాః | ద్రుమాః కంటకిన శ్చైవ ఏచ మార్గ ప్రరోధకాః 43

ఛిన్తన్దు గత్వా తా నద్య తీక్షెణౖః శీఘ్రం పరశ్వథైః | తోయ హీనేషు దేశీషు కూపాన్‌ కుర్వన్తు మే తథా || 44

విషమాంశ్చ తథా దేశాన్‌ సమాన్‌ కుర్వన్తు మే పథి | తీరాణి సరితాం చైవ కుర్వన్తు పులినానిచ || 45

న భ##వే ద్యేన సంఘట్టో జనన్య పథి యాస్యతః | పురః ప్రయాన్తు సైన్యేన విజయే రతివర్ధనాః || 46

నీల శ్చ నక్రదేవ శ్చ వసుమాన్‌ మునయ స్తథా | మధ్య ప్రయాణ గాంధారో జయనాభో రణోత్కటః || 47

సుశీలః కామపాలశ్చ యాన్తు సైన్యేన దంశితాః || జఘనం కటక స్యాహం పాలయానో యథాసుఖమ్‌ || 48

సైన్యేన సహ యాస్యామి విజయాయ నృపస్యతు | పశ్యన్తు దైశికాః స్థానం ప్రభూత యవసేంధనమ్‌ || 49

సోదకంచ సమం యత్ర సేనావాసో భ##వేన్మమ | ఏవ మాజ్ఞాప్య భరతో విజహార యథాసుఖమ్‌ || 50

సుష్వా ప చ నిశాం తత్ర ఘర్మ కాలే మనోహరామ్‌ ||

సుప్తస్యసా తత్ర రఘూద్వహస్య పుణ్యాయ¸° రాత్రి రదీన సత్వా | 51

సంపూర్ణ చంద్రా భరణా ప్రతీతా జ్యేష్ఠస్య మాసస్య రణోత్సుకస్య || 52

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే మహాపురాణ ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే

భరత ప్రస్థాన వర్ణనం నామ చతురధిక ద్విశత తమో7ధ్యాయః.

అటు తనశిబిరము నమ్మహాతేజస్వి ప్రవేశించి మంగళాలంభనముసేసి ఉత్తమాసనము నధివసించి యా ప్రభువు పౌరజానపదులను సెలవిచ్చి వెనుకకు అయోధ్యకుబంపెను. అటుపై శుభలక్షణుడైన లక్ష్మణుని శిరము మూర్కొనిబంపెను.

రేపు జరుగనైనప్రయాణసూచనలేమైన దుందుభి మ్రోయింప నాజ్ఞయిచ్చెను. వృక్షముల నాటు దైశికులు (ఆయా ప్రదేశముల నెరింగినవారు అందుండువారు) ముందేగుదురుగాకయని తన శిబిరమువారందరకు నాజ్ఞయిచ్చెను. చెట్లు లేనిచోట్ల చెట్లను నాటుడని, దారికభ్యంతరముగూర్చు ముండ్లచెట్లను పదునైన గండ్రగొడ్డళ్ళతో నరకుడని నిర్జలప్రదేశములందు కూపముల ద్రవ్వుడని నాదారిలో విషయములైన (మెట్టపల్లములైయున్న) ప్రదేశములను సమములొనరింపుడని నదీతీరములందలి యిసుకమేటలను సమముసేయుడని యాజ్ఞాపించెను. మరియు దారిలో జనునపుడెవ్వనికిని సంఘట్టము (ఇబ్బంది) కలుగకూడదు. విజయము నందుల్లాసము (నుత్సాహమును) రేకెత్తించువారు సైన్యముతో ముందేగవలయును. నీలుడు నక్రదేవుడు వసుమంతుడు సుతపుడు ముందరుగుదురుగాక. మధ్యప్రయాణమందు గాంధారుడు జయనాభుడు రణోత్కటుడు సుశీలుడు కామపాలుడు సైన్యముతో దంశితులై (రక్షాకవచముచే రక్షయివ్వబడినవారై) నడువవలయు. సైన్యముయొక్క జఘనమును (వెనుకభాగమును) రక్షించుచు నేను సైన్యముతో సుఖముగా రామచంద్రప్రభువు విజయముకొరకు నేనునడతును. దైశికులు(ఆయా ప్రదేశములను నెరిగినవారు చూచువారు) సమృద్ధమైన తృణకాష్ఠజల సమృద్ధిగల స్థానమును నాసేనావాసమునకు జూచెదరుగాక ! ఇట్లు భరతుడాజ్ఞాపించి సుఖముగా నటవిహరించెను. ఆ గ్రీష్మకాలమందా చక్కనిరేయి నటనిదిరించెను. నిదిరించిన యారణోత్సుకుని కనుపమబలశాలికి పుణ్యమై (శుభ##మై) పూర్ణచంద్రాభరణయై జ్యేష్ఠమాసముయొక్క పూర్ణిమానిశి పరమప్రీతి జనకమై జరిగెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున భరతప్రస్థాన వర్ణనమను రెండువందలనాల్గవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters