Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటతొంబదిమూడవ అధ్యాయము - గంధర్వశాపమోక్షణము

మార్కండేయః : అత్రాప్యుదాహరన్తీమ మితిహాసం పురాతనమ్‌ | స్తుతేన దేవ దేవేన గజేంద్రస్యతు యత్కృతమ్‌ ||

పురా వజ్ర మహాబాహోగంధర్వౌ¸° హాహాహూహూ | గీతేః పరస్పరం స్పర్ధా చక్రతుస్తౌ వరన్తవ ! 2

స్పర్ధమానౌ పరం రాజన్‌ ! చక్రతుస్తౌ పరస్పరమ్‌ | ఆవయోః ప్రాశ్నిక స్సాధుః కోస్మిన్‌లోకే భవిష్యతి || 3

తయోరథాహుర్గంధర్వా దేవలోయం భవిష్యతి | ఏవముక్తౌ తతస్తౌతు నేచ్ఛేతాం దేవలం మునిమ్‌ || 4

నాయంజానాతి గీతస్య విశేషమితి మోహితౌ | తౌ శశాప మహాక్రుద్ధో దేవలః సుమహాతపాః || 5

అవజ్ఞా జానతో యస్మాద్భవద్భ్యాం మమవైకృతా | తస్మాచ్ఛాపం ప్రదాస్యామి యువయోర్దేవగాయనౌ! 6

హాహాభవిష్యతి కరీ, హూహూ నక్రోభవిష్యతి | నక్రంచ దేవ దేవేశో గజాకర్షణ తత్పరమ్‌ || 7

నాగస్తుతస్తు చక్రేణ ద్విధాకర్తాతదాయువామ్‌ | ఉభౌ స్వం లప్స్యథోరూపం శాపస్యాన్తేతు గాయనౌ || 8

శాపేన తౌ తస్య తతస్తుజాతౌ మయాయథోక్తౌ తవరాజసింహ !

గజస్తుతేనాపి జనార్దనేన సమ్మోచితౌ తౌద్విజ వర్యశాపాత్‌ || 9

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే గంధర్వయోర్గజ నక్రీ కరణం నామ త్రినవత్యధిక శతతమోధ్యాయః.

మార్కండేయుడిట్లనియె : ఈయెడ పురాతనేతిహాస మొకటి పెద్దలుదాహరింతురు. దేవదేవ వర్ణనము నొక గజేంద్రము సేసి చెందిన విశేషమిది. మున్ను హాహా హూహూ గంధర్వు లిద్దరు మహాపరాక్రములు. ఒక పాటనుగూర్చి పరస్పరము తగవు లాడికొనిరి. మాకు సాధువైన ప్రాశ్నికుడు (తీర్పరి) లోకములో నెవ్వడు గలుగు నన గంధర్వులు ఇదిగో దేవలుండున్నాడనిరి. కాని వారతనిమిష్టపడరైరి. వీనికి గీత విశేషము తెలియదని పొరబడిరి. ఆతడు క్రుద్ధుడై తపస్విగావున వారిని మీరు నా సంగతి తెలియక యవమానము సేసినారుకావున మిమ్మిదిగో శపించుచున్నాను, హాహా యనువా డేనుగగును. హూహూ యనువాడు మొసలి కాగలడు. ఏనుగు నాకర్షించి మొసలిని విష్ణువు గజముచే బొగడబడి చక్రముచే రెండుగావించును. అప్పుడు మీరిద్దరు శాపము చివర స్వరూపమందుదురు. దేవలుని శాపముచే వారిరువురు నే జెప్పినట్లయిరి. విష్ణుని స్తుతించిన యేనుగు శాపవిముక్తి నందెను. మొసలి చక్రాయుధముచే హత్రమై శాపమోక్షమందెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున గంధర్వ శాపమోక్షణమను నూటతొంబదిమూడవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters