Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటఎనుబదిఎనిమిదవ అధ్యాయము - త్రయోదశ మనువగు రౌచ్యునికథ

శాంబరాయణీ : త్రయోదశస్య రౌచ్యస్య మనోఃపుత్రా న్నిబోధమే | చిత్రసేనో విచిత్రశ్చ నయోధర్మభృతో ధృతిః || 1

సునేత్రో పృక్షవృద్ధిశ్చ సురయో ధర్మయో దృడః | రౌచ్యసై#్యతే మనోః పుత్రాః శృణుష్వఋషయో మమ || 2

ధృతి మానవ్యయ శ్చైవ విష్‌ప్రకోప నిరుత్సుకః | నిర్మాణ స్తత్వ దర్శీచ దయయా తవకీర్తితాః || 3

సుత్రామాణః సుధర్మాణః శుభ కర్మాణ ఏవచ | ఏతే శక్ర! తదాప్రోక్తాః దేవతానాం గణాస్త్రయః || 4

ఎకైకస్మిన్‌ గణ దేవా ఏకాదశ తదాశుభాః | దేవేంద్రశ్చ తదా తేషాం భవిష్యతి బృహస్పతిః || 5

దాయాదా బాంధవాస్తస్యయే భవిష్యన్తి వాసవ! | టిట్టిభో నామ దుష్టాత్మా తేషాం రాజా భవిష్యతి || 6

తస్యాపి భవితా మృత్యుః దేవదేవా జ్జనార్దనాత్‌ | మాయూరేణ చరూపేణ సతతం పన్నగాశినా || 7

సతు దేవాసురే యుద్ధే సర్పరూపేణ దుర్మతిః | యుద్ధం కృత్వా నిరుత్సాహాన్‌ సర్వాన్‌ దేవగణాం స్తథా || 8

నిష్ప్రయత్నేషు దేవేషు మాయూరం రుపమాశ్రితః | ఘాతయిష్యతి తం దుష్టం దేవదేవో జనార్దనః || 9

మహా కలాపః నశిఖీ మహాత్మా ప్రబుద్ధ నీలోత్పల చారుకంఠః |

తం దానవం తత్ర రణ ప్రసహ్యహత్వా త్రిలోకీం ముదితాం హికర్తా || 10

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే త్రయోదశరౌచ్యక మన్వంతర వర్ణనోనమ అష్టాశీత్యధిక శతతమోధ్యాయః.

శాంబరాయణి యనియె రౌచ్యుడనునతడు పదమూడవ మనువు. అతని పుత్రులు చిత్రసేనుడు విచిత్రుడు నయుడు ధృతి నునేత్రుడు వృక్షవృద్ధి సునయుడు ధర్మయుడు దృఢుడు ననువారు ఋషులు ధృతిమంతుడు అవ్యయుడు నిష్‌ప్రకోపుడు నిరుత్సుకుడు నిర్మాణుడు తత్వదర్శియు ననువారు. సుత్రాములు సుధర్ములు శుభకర్ములు ననువారప్పుడు దేవ గణములు. ఒక్కొక్క గణమందు పదకొండుమంది పుణ్యాత్ములుందురు. బృహస్పతి వారికింద్రుడగును. అతనికి దాయాదులు బంధువులు నుందురు. దుష్టుడు టిట్టిభుడనువాడు వారికిరాజుఅగును వానినికూడ దేవదేవుడగు జనార్దనునివలన మృత్యువగును. అపుడు విష్ణువు నెమలి రూపముదాల్చి వానిని జంపును. వాడు దేవాసుర సంగ్రామమందు సర్పరూపియై యుద్ధము సేసి దేవతలను నిరుత్సాహులనొనరించును. దేవతలు ప్రయత్న శూన్యులుకాగా మయూర రూపధారియైహరి సర్పరూపుడైన వానిం జంపును. పెద్దపురి చక్కనిశిఖ నిండైన నల్లగలువ వన్నెకల యెడయుంగల నెమలి రూపుపూని యాదానవునిజంపి విష్ణువు త్రిలోకములను ఆనందపరచును.

ఇది శ్రీవిష్ణుధర్మో త్తర మహాపురాణమందు ప్రథమఖండమున పదుమూడవ మునువు రౌచ్యుని చరిత్రమను నూటయెనుబది యెనిమిదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters