Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటెఎనుబదిమూడవ అధ్యాయము - అష్టమసావర్ణ మన్వంతర వర్ణనము

శక్రః ఉవాచ : అస్మిన్‌కల్పే మహాభాగే భవిష్యా మనవస్తుయే | తేషాం పుత్రాన్నృషీన్‌ దేవాన్‌ శక్రదాయాద బాంధవాన్‌ ||

తస్య ఘాతం తథా కృష్ణాత్‌ సర్వమేతత్‌ ప్రకీర్తయ! సర్వజ్ఞ కల్పాభవతీ దివ్యజ్ఞానా మతామమ || 2

శాంబరాయణీ - అష్టమస్య భవిష్యస్య సావర్ణస్య మనోః సుతాన్‌ | కథయిష్యామి తే శక్రః మహాబల పరాక్రమాన్‌ || 3

విజయ శ్చావరీ వాంశ్చ నిర్దోహ స్సత్య వాక్కృతిః | చరిష్ణు శ్చాప్యధృష్ణుశ్చ వాచ స్సమతి రేవచ || 4

సావర్ణస్య మనోః పుత్త్రాన్‌ ఋషీం శ్చైవ నిబోధమే | అశ్వత్థామా కృపో వ్యాసోగాలవో దీప్తిమా నథ || 5

ఋష్యశృంగ స్థారామ ఋషయః పరికీర్తితాః | సుతపా అమృతాభాశ్చ అత్రేయాశ్చ గణాస్త్రయః || 6

సర్వే విశంతిభిర్దేవ గణౖర్యుక్తా మహాత్మనామ్‌ | యేషా మింద్రో భవిష్యస్తు బలిర్దానవ సత్తమః || 7

త్వత్కృతే దేవదేవేన బద్ధో యస్త్రిదశేశ్వరః | దాయాదా బాంధవాస్తస్య నభవిష్యన్తి వాసవ | 8

శక్రత్వం తేన కర్తవ్యం మన్వంతర మకంటకమ్‌ | దేవదేవ కరస్యస్తం దానమేతన్మహా సురః || 9

త్రైలోక్యరాజా భవతి సావర్ణ స్యాంతరే మనోః | తస్మిన్‌ మన్వంతరే ప్రాప్తే హిం శైలాలయో బలీ || 10

భవష్యతి దురాచారో నానాలో నామరక్షసః | బ్రహ్మ లబ్ధవరో రౌద్ర సై#్తలోక్యోత్సాదనే రతః || 11

తం వధిష్యతి ధర్మాత్మా విష్ణుర్గరుడవాహనః | చక్రేణ శతధారేణ జగతాం హితకామ్యయా || 12

దంష్ట్రాకరాళం వికటోగ్రవేషం నీలాంజనాభం భయదం త్రిలోకే |

చక్రేణ దేవః ప్రవిదార్య కర్తా లోకం సమగ్రం భయ విప్రయుక్తమ్‌ || 13

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శక్రశాంబరాయణీ సంవాదే అష్టమసావర్ణి మన్వంతర వర్ణనం నామ త్ర్యశీత్యధిక శతతమోధ్యాయః.

ఓ మహానుభావురాల ! ఈ కాలమందు కాబోవు మనువులు వారి పుత్రులు ఋషులు దేవతలు ఇంద్ర శత్రువులు బంధువులు కృష్ణునిచే వారి సంహారము గీర్తింపుము. పూజ్యురాలవు నీవు సర్వజ్ఞవు దివ్యజ్ఞాన సంపన్నవని నా తలంపన శాంబరాయణి యిట్లనియె. అష్టమ మనువు కాబోవు వాడు సావర్ణుడు. విజయుడు, అవీరవంతుడు, నిర్దోహుడు సత్యవాక్కు కృతి చరిష్ణువు అధృష్ణువు వాచుడు సుమతి యనువారు సావర్ణ మనువు కుమారులు అశ్వత్థామ కృపుడు వ్యాసుడు గాలవుడు దీప్తిమంతుడు ఋష్యశృంగుడు రాముడుననువారు అతనిసప్తర్షులు. సుతవులు అమృతాభులు ఆత్రేయులు ననునవి మూడు దేవగణములు. ఇందు ఇరువది దేవగణములుండును. వీరికింద్రుడు దానవోత్తముడగు బలి కాబోవు చున్నాడు. నీ కొఱకై దేవదేవునిచే నా త్రిభువనేశ్వరుడు బద్ధుడై యున్నాడు. అతనికి జ్ఞాతులుబంధువు లెవ్వరునుండరు. దేవదేవుని చేతిలో నాతడుచేసిన దానమహిమచే నొక్కమన్వంతరమాతడింద్రత్వము న్కిషంటకముగ నిర్వహించును. మహాసురుండయ్యు నా చేసిన దానప్రభావముచే ద్రిభువనేశ్వరుడుడగును. అమన్వంతరము వచ్చినపుడు హిమశైలమందువసించువాడు బలవంతుడు దురాచారుడు నగునానోలుడును రాక్షసుడు బ్రహ్మవరములందిరౌద్రుడై ముల్లోకమముల నాశనము సేయనెంచును. వానిచే ధర్మమూర్తియను విష్ణువు గరుడవాహనుడై శతధారలుగల చక్రముచే జగద్ధితమునకూ ఖండించును. కోరలచే కారాలుడై వికటో గ్రవేషియై నల్లని కాటుక కొండవోలెనున్న త్రిలోక భయంకరుని వానిని స్వామి చక్రమునంజీల్చి సమగ్ర లోకమును భయరహితముం గావించును.

ఇది శ్రీవిష్ను ధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున అష్టమసావర్ణుని మన్వంతర వర్ణనమను నూటయెనుబదిమూడవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters