Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటఎనుబదిరెండవ అధ్యాయము - సప్తమవైవస్వత మన్వంతరవర్ణనము

శాంబరాయణీ : అథాన్యస్య భవిష్యస్య మనోర్వైవస్వతస్యచ | సప్తమస్య ప్రవక్ష్యామి తస్య పుత్రాన్‌ యశస్వినః ||1

ఇక్ష్వాకు రథ నాభాగో విష్ణుః శర్యాతి రేవచ | అపృధ్యతు స్తథా ప్రాంశు ర్మహాత్మా దిష్ట ఏవచ || 2

కరూషశ్చ పృథుధ్రశ్చ సుద్యుమ్నశ్చ మనోః సుతాః | అత్రి ర్వసిష్ఠో భగవాన్‌ జమదగ్నిశ్చ కాశ్యపః || 3

గౌతమశ్చ భరద్వాజో విశ్వామిత్రోథ సప్తమః | దేవాహ్యేకోన పంచాశ న్మరుతః పరికీర్తితాః || 4

ద్వాపశ్వినౌ వినిర్దిష్టౌ విశ్వేదేవా స్తథా దశ | దశైవాంగిరసో దేవా హ్యేవం దేవగణానవ || 5

యేషాం శక్రస్తు మోజంబీ నామ్నా శత్రుభయంకరః | ఘోరాస్తథాపి యే త్వాసన్‌ దైత్యాదాయదబాంధవాః || 6

తేషాం బభూవ నృపతిః హిరణ్యాక్షో మహాబలః | నృవరాహేణవపుషా తం జఘాన హరిః పురా || 7

దైత్యేశ్వరం తం సుర సంఘభీమం మహాబలం పర్వత మాత్రకాయమ్‌ |

జఘాన చక్రేణ హరిః ప్రసహ్య రూపం సమాశ్రిత్య వరాహ శీర్షమ్‌ || 8

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే సప్తమవైవస్వత మన్వంతర వర్ణనంనామ ద్వ్యశీత్యధిక శతతమోధ్యాయః.

శాంబరాయణి యనియె : ఇక కాబోవు వైవస్వతమనువేడవవాడు. ఆయశస్వి కుమారులు ఇక్ష్వాకువు నాభాగుడు విష్ణువు శర్యాతి అవృధ్యతువు ప్రాంశువు దిష్టుడు కరూషుడు పృథుధ్రుడు సుద్యుమ్నుడు అనువారు. అత్రి వశిష్ఠభగవానుడు జమదగ్ని కశ్యపుడు గౌతముడు భరద్వాజుడు విశ్వామిత్రుడు ననువారా మనువు కాలమందు సప్తర్షులు దేవతలు నలుబదితొమ్మిదిమంది మరుత్తులనబడుదురు. అశ్వినీదేవత లిద్దరు విశ్వేదేవతలు పదిమంది అంగిరసులను దేవతలు పదిమంది. వీరు దేవగణములు తొమ్మిది. వీరి కింద్రుడు మోజాంబి యను పేరుగలవాడు శత్రుక్షయంకరుడు ఘోరులు దైత్యులతనికి దాయాదులు బంధువులునై యుండిరి. వారికి రాజు హిరణ్యాక్షుడు మహాబలుడు. నరవరాహావతారమెత్తి వానిం గూల్చెను. సురసంఘభయంకరుని మహాబలశాలిని పర్వతమాత్రశరీరు నైద్యత్యేశ్వరుని హరి వరాహశీర్షావతారమెత్తి చక్రముచే సంహరించెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున సప్తమ వైవస్వత మన్వంతర వర్ణనమను నూటయెనుబదిరెండవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters