Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటయెనుబదియవ అధ్యాయము - ఐదువరైవతమన్వంతర చరిత్ర

శాంబరాయణీ : రైవతస్య మనోః పుత్రాన్‌ పంచమస్య నిబోధమే | మహాపురాణఃసంభావ్యః ప్రత్యంగః వరహా శుచిః ||

చల బిందు ర్నిరామిత్రః కేతు శృంగో దృఢవ్రతః | రైవతస్య మనోః పుత్రా ఋషయః తస్యవచ్మితే || 2

వేదశ్రుతి ర్వేదబాహు రూర్ధ్వబాహు ర్యజు స్తథా | హిరణ్యరోమా వర్జన్య సత్యనేత్ర స్తథైవచ || 3

ఆభూతరాజసశ్చైవ తథా దేవాః సుమేధనః | వైకుంఠా శ్చామృతాశ్చైవ చత్వారో దేవతాగణాః || 4

ఏకై కస్మిన్‌ గణదేవాః కథితాస్తు చతుర్దశ | తేషామింద్రో విభుర్నామ లోకేవిఖ్యాత విక్రమః || 5

ఆసం స్తస్యాసురా ఘోరా స్తదా దాయాద బాంధవాః | తేషా మాసీన్మహాతేజాః శంభుర్నామ మహేశ్వరః || 6

బ్రహ్మలోకేన మరణం వృతం యేన పితామహాత్‌ | స కదాచి న్మహాకాయః సముద్రజల చారిణమ్‌ || 7

హంసం దృష్టైవ జగ్రాహ తంచారోహతి దుర్మతిః | అరూఢమాత్ర మాదాయ బ్రహ్మలోకం జగామ సః ||

హంసరూపేణ తత్రైవ జఘాన భగవాన్‌ హరిః || 8

ఏవం స హంసేన హతో మహాత్మా | సర్వేశ్వరేణాప్రతిమేన తేన |

మహాబలః పర్వతమాత్రకాయః | సురాంతకారీ సమరే ష్వజేయః || 9

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ఇంద్ర శాంబరాయణీ సంవాదే పంచమ రైవత మన్వంతర వర్ణనంనామ అశీత్యధిక శతతమోధ్యాయః.

శాంబరాయణి యనియె : రైవతమనువైదనవాడు. అతని కొడుకులు మహాపురాణుడు సంభావ్యుడు ప్రత్యంగుడు పరహంత శుచి చలబిందువు నిరామిత్రుడు కేతుశృంగుడు దృఢవ్రతుడు ననువారు. అతని సప్తర్షులు వేదశ్రుతి వేదబాహువు ఊర్ధ్వ బాహువు యజువు హిరణ్యరోముడు పర్జన్యుడు సత్యనేత్రుడు అనువారు. అతని దేవగణములు నాల్గు. అభూత రాజసులు సుమేధసులు వైకుంఠులు అమృతులు ననువారు. ఒక్కొక్క గణమందు పదునాల్గుమంది వంతున దేవతలు సెప్పబడినారు. వారికి విభుడను పేరుగలవాడు ప్రఖ్యాతపరాక్రము డింద్రుడు. అతనికి ఘెరులయిని యసురులు దాయాదులు బాంధవులు గలరు. మహాతేజస్వియగు శంభువను మహేశ్వరుడు వారికి ప్రభువు. ఆయన బ్రహ్మవలన బ్రహ్మలోక మరణముంగోరెను. దుర్మతియై అతడొకప్పుడు సముద్రజలమందు తిరుగు మహాకాయముగల హంసను జూచి పట్టుకొని దానిపైకెక్కెను. ఎక్కినదేతడవుగ వానింగొని యా హంస బ్రహ్మలోక మేగెను. హంసరూపియై యా విష్ణువే వానిం గూల్చెను. ఆ మహాత్ముడు మహాబలుడు పర్వతాకారుడు సురాంతకుడు సమరములందజేయుడునగు శంభువు ఆ ప్రతిముడైన యా విష్ణువుచే నిహతుడయ్యెను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమునందు యైదవ రైవత మన్వంతరచరిత్రయను నూటయెనుబదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters