Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటడెబ్బదియాఱవ అధ్యాయము - శాంబరాయణితెల్పిన ప్రథమమన్వంతర వర్ణవము

ఇంద్ర ఉవాచ : యస్మిన్‌ కాలే వ్యతీతాయే షడింద్రాభూరితేజసః | తేషాం చరిత మిచ్ఛామి శ్రోతుం విస్తరశః శుభే ||

ప్రతి శక్రం మనుం భ##ద్రేః మనుపుత్రాం స్తథైవచ | దేవాన్‌ సప్త ఋషీంశ్చైవ తథాదాయాద బాంధవాన్‌ || 2

శక్రస్య తేషాంచ వధం తధా దేవాజ్జనార్దనాత్‌ | త్వత్తోహం శ్రోతు మిచ్ఛామి సర్వంతం వేత్సి సుందరి || 3

శాంబరాయణీ: బ్రహ్మతో మానసః పుత్రః ప్రథమస్తు మనుః స్మృతః |

దశపుత్రాశ్చ తస్యేమేఖ్యాతా స్త్రిభువనేశ్వర || 4

అగ్నీధ్రశ్చాతి బాహుశ్చమేదా మేధాతిథి ర్వసుః | జ్యోతిష్మాన్‌ ద్యుతిమాన్‌ హవ్యః సపనః సత్రఏవచ || 5

మరీచి రత్ర్యంగిరిసౌ పులస్త్యః పులహః క్రతుః | వసిష్ఠశ్చ మహాతేజాః ఋషయ స్సప్తకీర్తితాః || 6

జయాఖ్యాశ్చాజి తాఖ్యాశ్చ శుక్రయామాస్తథైవచ | గణా ద్వాదశకా ఏతే చత్వార స్సోమపీథినః || 7

విశ్వభుజ్‌నామ దేవానాం తేషా మింద్రోబభూవహ | అసంస్తస్యాసురా ఘోరాస్తదా దాయాదబాంధవాః || 8

బభూవ నృపతి ర్యేషాం బాష్కలో నామ నామతః | యస్య హస్తా దుభౌలోకౌ వామనేన హృతౌ పురా || 9

క్రమద్వయేన తుహృతం పాతాళంచ సురేశ్వర ! యస్యపుత్రవతస్త్వాసీ త్కేశీనామ బలోత్కటః || 10

జహార భూయసై#్రలోక్యం శక్రస్యా క్రమ దుర్మతిః | తమాహూయ రణవిష్ణుః తార్ష్య ప్రవరవాహనః || 11

ద్విధా చక్రేణ చకార త్రైలోక్యహిత కామ్యయా || 12

ఏవం హృతస్తేన పురారిముఖో మహాత్మనా కాలసమ ప్రభావః |

శక్రప్రియార్థం జగతాం హితార్థం దేవేశ్వరేణాప్రతిమేన తేన || 13

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శాంబరాయణీ వాక్యే ప్రథమ మన్వంతర వర్ణనం నామషట్‌సప్తత్యధిక శతతమోధ్యాయః.

కల్యాణి ! ఏ కాలమందు మహాతేజస్వులా అఱుగురింద్రులు గడచిరి! వారి చరితము విస్తరము వినగోరెద. ఇంద్రుడొక్కొక్కని తరి మనువు మనుపుత్రులు దేవతలు సప్తర్షులు వారివారి జ్ఞాతులు బాంధవులు. ఇంద్రునియొక్క వారియొక్క విష్ణుకృత సంహారమును నీ వలన విన నర్థించెద. ఓ సుందరీ! నీవ యెఱుంగుదు విది యెల్లనన శాంబరాయణి శతక్రతునకిట్లు తెలుప దొడంగెను. త్రిభువనాధీశా! బ్రహ్మమానస పుత్రుడు మొదటి వాడు మనువు. ఆ మనువునకు పది మంది కొడుకులు. 1. అగ్నీధ్రుడు 2. అతిబాహువు 3. మేద 4. మేధాతిథి 5. వసువు 6. జ్యోతిష్మంతుడు 7. ద్యుతిమంతుడు 8. హవుడు 9. సవనుడు 10. సత్రుడు ననువారు. 1 మరీచి 2. అత్రి 3. అంగిరసుడు శ్రుక్ర 4. పులస్త్యుడు 5. పులహుడు 6. క్రతువు 7. మహాతేజస్వి వసిష్ణుడు ననువారు సప్తర్షులు. జయులు అజితులు యాములు ద్వాదశగణములు సోమపీథులు (సోమయాజులు సోమపాణము సేసినవారు) నల్గురువారికి ''విశ్వభుక్క'' అను పేరివాడింద్రుడయ్యెను. ఘోరులయిన యసురు లాతనికి జ్ఞాతులు బంధువులునై యుండిరి. వారికి ప్రభువు బాష్కలుడు. అతని చేతినుండియే మున్ను వామనమూర్తిచే రెండు లోకములు లాగికోనబడినవి. ఆ రెండింటి క్రమములోనే పాతాళము గూడ హరింప బడినది. ఆ బాష్కలుని కొడుకు కేశిబయను ల్యాఢుడు దుష్ణుడు శక్రుని త్రిభువునముల నాక్రమించి లాగికొనెను. విష్ణువు వానిని యుద్ధమునకు బిలిచి గరుడవాహనుడై చక్రముచే త్రిలోకహిత మాచరింప వానిని రెండు ఖండించెను. కాలుని (యముని) తో సమమైన ప్రభావముగల యా శత్రువును నింద్రుని ప్రీతి కొఱకు జగద్ధితము కొఱకు మహానుభావుడు దేవేశ్వరుడు మహాత్ముడునగునా విష్ణువు చేత నిహతుడయ్యెను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున శాంబఠాయణి తెల్పిన ప్రథమమన్వంతర వర్ణనమను నూటడెబ్బదియాఱవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters