Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటడెబ్బదిఐదవ అధ్యాయము - ఇంద్రాఖ్యానము

మార్కండేయః : 

అత్రతే వర్ణయిష్యామి కథాం పాప ప్రణాశినీమ్‌ | స్వర్తేవృత్తాం సమాశ్రిత్య మాసనక్షత్ర పూజనమ్‌ ||

పూర్త్వెస్తు చరితం శక్ర ! నాహంజానామి కించన | భవతస్సమ కాలీనం విద్ధి మాం సురసత్తమ || 2

ఇయం సిద్ధా విజానాతి ప్రఖ్యాతా శాంబరాయణీ | ఏవముక్తస్తతః శక్రః పప్రచ్ఛ బలసూదనః || 3

జగాద సాచ శక్రస్య పూర్వేంద్రచరితం మహత్‌ | శక్రాణాం సావ్యతీతానాం శతశోథ సహస్రశః || 4

జగాద తత్ర చరితం కల్పేష్వ న్యేష్వపి ప్రభోః ||

శాంబరాయణ్యువాచ : సర్వేషా మపి శక్రాణాం యేతు దాయాదబాంధవాః : 5

సర్వే వినాశితాస్తేన విష్ణునా ప్రభవిష్ణునా | సర్వే శక్రాస్తథాయుక్తాస్తేన వైష్ణవ తేజసా || 6

భూతేభ్య స్వ్వతిరిచ్యన్తే తేన తేగుణ సంపదః | దానేన యజ్ఞైః శౌర్యేణ తపసాచబలేనచ || 7

శ్రుతేన ధర్మిష్ఠతయా దేవదైత్య మహోరగాన్‌ | ఋషయశ్చ మహాభాగా స్తేపి పార్థివ సత్తమ! || 8

వర సంపాదనం తైశ్చ కృతం సర్వం స్వయం భువా | పరాజయం యతః ప్రాప్తాః దాయాదేభ్యః పునః పునః ||

సర్వేశ్వరా వీర్య బలోపవన్నాః ధర్మేనివిష్టా జగతః ప్రధానాః |

త్యక్తాధికారాశ్చ తతః క్రమేణ సర్వేగతా విష్ణు సహాయతాంచ || 9

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శక్రచరితాఖ్యానంనామ పంచసప్తత్యధిక శతతమోధ్యాయః.

మార్కండేయుడనియె : ఈ మాసనక్షత్ర పూజనము ననుసరించి స్వర్గమందు జరిగిన పుణ్యకథను వర్ణింతును. ఇంద్రా దీనినిబూర్వులాచరించిరి. నేనిది యేకొంచె మెఱుంగను. నేను నీ సమకాలీనుడనుగదా! శాంబరాయణి యను నీ సిద్ధురాలిది యెఱుంగును. అని పలుక నింద్రుడు విని యా సిద్ధురాలినడుగ నామె శక్రునికి నంతమున్నింద్రులైన వారాచరించిన యీవ్రత కథను దెలిపెను. ఇప్పటి యీయింద్రునకు ముందటి దేవేంద్రులు వందలు వేల మంది యొక్క యితర కల్పములందు జరిగిన చరిత్ర నిట్లామె చెప్పెను.

ఇంద్రులందరి యొక్క దాయాదులు (జ్ఞాతులు) బంధువులును సర్వసమర్థుడైన యా విష్ణువుచే నశింప జేయబడిరి. అందరింద్రులు నా విష్ణువు యొక్క తేజస్సుతో గూడిన వారే. అందువలన సకల సద్గుణ సంపన్నులయి వారన్ని భూతముల కంటె మిన్నయై యుండిరి. వైష్ణవ తేజస్సు వలన దానములచే యజ్ఞములచే శౌర్యములచే తపస్సుచే బలముచే శ్రుతముచే (పాండిత్యముచే) ధర్మనిష్ఠచే వారు దేవదైత్య నాగకులముల నతివయించి యుండిరి. వారందరు మహాను భావులైన మహర్షులు. వారు స్వయంభువు వలన (బ్రహ్మవలన వరసంపాదనము చేసినవారే. అట్టివారయ్యు తిఱిగితిఱిగి వారపజయమునొందిరి. సర్వేశ్వరులు వీర్యబలోపపన్నులు ధర్మనిష్ఠులు జగత్ర్పధానులయిన వారుగూడ అధికారములు నోయి క్రమముగ విష్ణువును సహాయునిగా బొందిరి.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున ఇంద్రాఖ్యానమును నూట డెద్బదియైదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters