Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటడెబ్బదిమూడవ అధ్యాయము - అనంతవ్రతమాహాత్మ్యము

వజ్ర ఉవాచ : 

యువనాశ్వేన యద్రజ్ఞా పుత్రీయంతు కృతం వ్రతమ్‌ | తమహం శ్రోతు మిచ్ఛామి జానానాం హితకామ్యయా || 1

మార్కండేయః : పుత్రీయం తే ప్రవక్ష్యామి వ్రతం భూపాల సత్తమః |

అనన్తవ్రత మిత్యుక్తం సేవతాం పుత్రజన్మదమ్‌ | 2

మాసిమాసితు నక్షత్రం మాసనామ్నాతు చిహ్నితమ్‌ | సంప్రాప్య పుజయేద్దేవం సోపవాసో నరోత్తమ! || 3

ఏకైక మంగం దేవస్య ప్రతిమాసం విశేషతః | పూజయే ద్యత్నతః శుద్ధః శృణుః ఛాంగక్రమం మమ || 4

మార్గశీర్షాదథ೭೭రభ్య వ్రతమేతత్సమారభేత్‌ | దేవస్య మార్గశీర్షేతు వామం జానుం సమర్చయేత్‌ || 5

కటిభాగం తథావామం పౌషే మాసి సమర్చయేత్‌ | మాఘే మాఘాసు వామం చ భుజం పూజయేత్‌ || 6

ఉత్తర ఫల్గునీ ఋక్షేస్కంధంవామం ప్రపూజయేత్‌ | చతుర్ష్వేతేషు వామేషు గోమూత్ర స్నానమాచరేత్‌ || 7

పూజనం దేవ దేవస్య రక్తైః పుష్పాదిభి స్తథా | హోమోఘృతేన కర్తవ్యః తిలదానం ద్విజాతిషు || 8

తామ్రస్యచ తథా దానం గోమూత్రప్రాశనం తతః | హవిష్యాన్నేన చాహారం తతః కార్యం విజానతా || 9

దేవస్య దక్షిణం స్కంధం చైత్రేచిత్రాసు పూజయేత్‌ | వైశాఖేచ విశాఖాసు బాహుం దేవస్య దక్షిణమ్‌ || 10

దక్షిణం కటిభాగం చ జ్యేష్ఠేజ్యేష్ఠాసు పూజయేత్‌ | దక్షిణంచ తథా జాను మాషాఢే వైశ్వదేవకే || 11

చతుర్ష్వేతేషు మాసేషు క్షీరస్నానం విధీయతే | పీత పుష్పాది పూజాచ దేవ దేవస్య చక్రిణః || 12

హోమంచశాలిభిః కుర్యా ద్యవా దేయా ద్విజాతిషు | రజతంచ తథా దేయం యవాన్నేన భుజిక్రియా || 13

తథా కార్యా మనుష్యేంద్రః శ్రావణ శ్రవణ తతః | పాదాదౌ పూజయేత్తస్య యస్యేదం సఫలం జగత్‌ || 14

గుప్తం భాద్రపదే మాసి ఆశ్వినే హృదయం తతః | శిరసః పూజనం కార్యం కార్తికే కృత్తికాసుచ || 15

చతుర్ష్వేతేషు మాసేషు దధ్నాస్నానం విధీయతే | పూజనం దేవ దేవస్య శుక్లైః పుష్పాదిభిస్తథా || 16

క్షీరేణ హోమః కర్తవ్యో ఘృతం దేయం ద్విజాతిషు | సువర్ణంతు తథా రాజన్‌! దధ్నా కార్యా భుజిక్రియా || 17

అనంతనామ జప్తవ్యం సర్వమాసేషు పార్థివ! | తేనైన నామ్నా దేవస్య హోమకర్మాపి నిర్దిశేత్‌ || 18

వ్రతావసానే దాతవ్యం బ్రాహ్మణభ్యస్తు భోజనమ్‌ | దానం శక్త్యాచ దాతవ్యం బ్రాహ్మణభ్యో నరాధిప! || 19

సంవత్సరా దవాప్నోతి సర్వానేవ మనోరథాన్‌ | పుత్రార్థిభిర్వృత్తి కామైర్భృత్యదార ధనేప్సుభిః || 20

ప్రార్థయద్భిశ్చ కర్తవ్యం బలమారోగ్య సంపదమ్‌ | ఏతద్ర్వతం మహారాజ! పుణ్యం స్వస్త్యయనం పరమ్‌ || 21

అనంత వ్రత మిత్యుక్తం సర్వ కల్మషనాశనమ్‌ | వ్రత మేత త్పురా కృత్వా యవనాశ్వో మహీపతిః || 22

మాంధాతారం సుతం లేభే రాజానం చక్రవర్తినమ్‌ | కృతవీర్యస్య రాజేంద్ర! భార్యా శీలధరా తథా || 23

వ్రతేనానేన సా లేభే పుత్రం బాహు సహస్రిణమ్‌ | కార్తవీర్యార్జునం నామ రాజానం చక్రవర్తినమ్‌ || 24

య మా వివేశ భగవాంస్తేజసా స్వేన మాధవః | సమస్తే కార్తవీర్యాయ అర్జునాయ మహాత్మనే || 25

సప్తద్వీప సముద్రాయాం మేనాద్యి మీశ్వరాయచ | ఏతావదుక్తా పుణ్యన తిల ప్రస్థస్య యుజ్యతే || 26

రాజన్‌ ! దత్తస్య విధివత్‌ బ్రాహ్మణాయ యతాత్మనే | యస్యవైజాత మాత్రస్య ప్రవహా వనిలః శుభః || 27

నీరజస్క మభూద్వ్యోమ ముదం ప్రాపాఖిలం జగత్‌ | సమాశ్రయార్థం నృపతిం దైత్యా మానుష్యతాం గతాః || 28

ఆశ్రయామాసు రవ్యగ్రాశ్శతశోథ సహస్రశః | యస్మిన్‌ రాజన్వతీ వార్తా భూమిర్భరావ పీడితా || 29

పుత్రీయమేత త్తవ రాజసింహ! మయావ్రతం తేకథితం పురాణమ్‌ |

కర్తవ్య మేతద్భువి పుత్రకామైః పాపావహం ధర్మవివర్ధనంచ || 30

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే అనంత వ్రత మహాత్మ్యవర్ణనం నామ త్రిసప్తత్యుత్తర శత తమోధ్యాయః.

యువనాశ్వమహారాజు పుత్రప్రదమైన అనంతవ్రతము సేసెను జనహితముకొరకది యేనువిగోరెదనన వజ్రునికి మార్కండేయుడిట్లనియె. పుత్రలాభముంగూర్చు నావ్రతముం దెల్పెదవినుము. చైత్రాదిమాసములు పండ్రెండును నానెలలో పూర్ణిమనాడున్న నక్షత్రముననుసరించి యేర్పడినవి. కావున యనక్షత్రమందు విష్ణదేవునియొక్కొక్క యంగమునొక్కొక్క నక్షత్రమందు బూజింప వలెను. అయంగక్రమమిది. ఈ పూజ మార్గశీర్షమున మొదలుపెట్టవలెను. మార్గశీర్షమందు ఎడమమోకాలును, పుష్యమాసమున నడుము నెడమభాగమును, మాఘమందు ఎడమభుజమును ఉత్తరాఫల్గునీ నక్షత్రమందెడమవైపు స్కంధమును (మూపును) పూజింపవలెను. ఈనాలుగెడమవైపులందు గోమూత్రముతో స్నానముసేయింపవలెను. ఎఱ్ఱపువ్వులు ఎఱ్ఱనిచందనముతో నీపూజసేయవలెను. నేతితోహోమము బ్రాహ్మణులకు తిలదానము సేయవలెను రాగిపాత్రయు నీయవలెను. గోమూత్రప్రాశనము సేయనగును. హవిష్యాన్న మాహారముగ దినవలెను చైత్రమందు చిత్రానక్షత్రమందు హరియొక్క కుడిమూపు వైశాఖానక్షత్రమందు కుడిబాహువు జ్యేష్ఠమందు జ్యేష్ఠానక్షత్రమందు కుడి కటిభాగము ఆషాడమందు విశ్వేదేవతానక్షత్రమగు ఉత్తరాషాఢా నక్షత్రమందు కుడిమోకాలునుం బూజింపవలెను. ఈ నాల్గునెలలందు స్వామికి క్షీరస్నానము సేయింపనగును. విష్ణుపూజ వసుపుపచ్చనిపూలతో జేయవలెను (పచ్చగన్నేరు మొదలయినవన్నమాట) శాలిబియ్యముతో హోమము యనలు విప్రునికి దానమును సేయవలెను వెండియును నీయవలెను. భోజనముపెట్టవలెను.

అట్లే శ్రావణమాసమందు శ్రవణనక్షత్రమందా జగత్పతికి పాదాదిగ పూజసేయవలెను. భాద్రపదమందు గుప్తాంగము అశ్వినమందు హృదయము కార్తికమందు శిరస్సును బూజసేయవలెను. ఈ నాల్గునెలల పెరుగుతో స్నానము విహితము. తెల్లని పువ్వులు గంధాక్షతలతో పూజా, క్షీరముతో హోమము, బ్రాహ్మణులకు నేయి దానము సువర్ణదక్షిణయు నీయవలెను. పెరుగుతో భొజనమును బెట్టవలెను. అన్ని మాసములందు అనంతనామజపము సేయవలెను. ఒక సంవత్సరమిదిసేసిన సర్వాభీష్టములను బొందును. పుత్రార్థులు వృత్తి (బ్రతుకుతెరువు) కోరువారు ఆలుబిడ్డలు దానదాసీజనము ధనమును బలము ఆరోగ్యము సంపదను కోరువారీ వ్రతమాచరింపవలెను. ఇది పరమమంగళప్రదము. పుణ్యప్రదము. సర్వపాపహరము. ఈ అనంతవ్రతమును యువనాశ్వుడాచరించి మాంధాతచక్రవర్తిని గనెను. కృతవీర్యునిభార్య శీలధరయను నామె యీవ్రతముచే వేయిబాహువులుగల కొడుకుని బడసెను. ఆయనయే కార్తవీర్యార్జునుడు చక్రవర్తి. ఆయనయందు విష్ణుభగవానుడావేశించి యుండెను. 'మహాత్ముడగు కార్తవీర్యార్జునునకు సప్తద్వీపసముద్రయైన మేదినికెల్ల సార్వభౌముడైన నీకునమస్కారము' అని యీమంత్రముపఠించి యథావిధిగ బ్రాహ్మణుని కొక్కతిలప్రస్థము (కుంచెడు నువ్వులు) దానముసేసినవాడు పుణ్యసంపన్నుడగును. ఏ కార్తవీర్యార్జునుడవతరింపగనే పుణ్యసుగంధ బంధుర వాయువులునీచెనో, యాకాశ##మెల్ల రజోరహితము (స్వచ్చము) అయ్యెనో సర్వజగమానందమందెనో ఎవనినాశ్రయింప దైత్యులు మానుష్యభావమునంది యే యాందోళనముగొనక వందలువేలువచ్చి యాశ్రయించిరో ఎవ్వని పాలనమందు భూమి యా మున్ను భారాపీడితయై రాజన్వతి (ఉత్తమ రాజుగలది) యనుప్రఖ్యాతిగాంచెనో, జలసమృద్ధితో నా వసుమతి తననుదా ధరించి యుఱ్ఱూతలూగెనో అట్టి కార్తవీర్యార్జునునయొక్క విష్ణుతేజోమూర్వియొక్క యవతార మీపుత్రీయ వ్రతప్రభావమువలననే జరిగినది. ఇట్టిపురాణవ్రతమేను నీకెరెంగించితి. నిదిపుత్రార్థులై నవారు సేయవలసినది. పాపహరము ధర్మవివర్ధనమును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున అనంతవ్రతమహాత్య్మమను నూటడెబ్బదిమూడవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters