Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

పదునేడవ అధ్యాయము

సగరోపాఖ్యానము

మార్కండేయ ఉవాచ ః

ధుంధుమారాద్దృఢాశ్వస్తు హర్యశ్వస్తస్యచాత్మజః | నికుంభ స్తస్యతనయః సుహితశ్చ తదాత్మజః || 1

భృశాశ్వ స్తనయ స్తస్య మాంధాతా తస్యచాత్మజః | దైవేన విధినా రాజా జాత స్తసై#్యవ చోదరాత్‌ || 2

పురుకుత్సస్సుతస్తస్య త్రసద్దస్యుస్తదాత్మజః | శంభుస్తస్యాత్మజః శ్రీమా& అనరణ్యతి విశ్రుతః || 3

రావణన హతోయోసౌ త్రిలోక విజయీపురా | దృశదశ్వః సుతస్తస్య తస్మా ద్వసుమనా నృపః || 4

తస్య పుత్రస్త్రిధన్వాఖ్యః తస్మా త్త్రయ్యారణిస్స్మృతః | తస్యసత్యవ్రతః పుత్రః త్రిశంకుంయం ప్రచక్షతే || 5

హరిశ్చంద్రస్సుత స్తస్య రోహితాశ్వస్తదాత్మజః | హరితస్తత్సుతో రాజా చంచుర్హారిత ఉచ్యతే || 6

విజయ స్తస్య తనయశ్చాలర్క స్తస్య చాత్మజః | అలర్కస్య వృకః పుత్రస్తస్మాద్బాహుస్తు జజ్ఞివా& || 7

పానస్త్రీ మృగయాక్షేషు సబహువ్వసనాన్వితః | వ్యసనే తస్యసక్తస్య నరేంద్రస్యారిభిస్తదా || 8

హైవాయై స్తాలజం ఘైస్చ సర్వవ్లుెచ గణావృత్తైః | ఛలేనా పహృతం రాజ్యం హతరాజ్యో వనంగతః || 9

పద్భ్యమనుయ¸° తస్యవనం భార్యా గుణాన్వితా | గుర్విణీ ప్రాగ్దదౌయస్యాస్సపత్నితు గరంకిల|| 10

తతస్సా సగరం పుత్రం సుషావ వనగా శుభా | జాతపుత్రో నరపతిః సంయుక్త కాలకర్మణా || 11

అన్వారురోహ తంరాజ్ఞీ యాదవీ ధర్మ వత్సలా | సంస్కృత స్సర్వ సంస్కారైః సగరశ్చ్యపనేన చ || 12

శాస్త్రగ్రామే ధనుర్వేదే నీతఃపారం తథాపరమ్‌ | స¸°వన మనుప్రాప్య ఏక ఏవ నరాధిపః || 13

పదాతిర్బద్ధ నిస్త్రింశః చ్యవనస్య ప్రసాదతః | హైహయా& తాల జంషూంశ్చ నిజఘాన పరంతపః || 14

తతస్త్వయోధ్యాం సంప్రాప్యలేఖే రాజ్యమకంటకమ్‌ | సగరో రాజ్యమాసాద్య బలేన చతురంగిణా || 15

విజిత్య సకలాన్‌ వ్లుెచ్ఛా& వశంచక్రేచ పార్థివా& | విజిత్య పృథివీం కృత్స్నాం ప్రాప్యరాజ్య మకంటకమ్‌ || 16

చ్యవనం పూజయామాస సత్కారేణ పునః పునః | చ్యవనే నాభ్యనుజ్ఞాతః సచక్రేదార సంగ్రహమ్‌ || 17

అసీద్భార్యా ద్వయం తస్య సగరస్య మహాత్మనః | సతాభ్యాం సహితో రాజా పుత్రార్థంత ప్తవా& తపః || 18

తపసోన్తే హరః ప్రాహ రాజానం తపసాకృశమ్‌ | ఏకం వంశకరం పుత్రమేకా తేజనయిష్యతి || 19

షష్టఃపుత్ర సహస్రాణి ద్వితీయాజనయిష్యతి | ఏవం లబ్ధవరో రాజా సభార్యః స్వపురం గతః || 20

పుత్రం పుత్రాంశ్చ ధర్మాత్మా జనయామాస వీర్యవా& | కర్మణాచైవ నామ్నాచ రాజపుత్రోసమంజసః || 21

పిత్రా నిరాసితో రాజ్యత్‌ పౌరాణా మహితేరతః |

తస్య పుత్రోంశుమాన్నామ సర్వైస్సముదితో గుణౖః తోషయామాస పితరం పితుః పృథ్వీపతించ సః|| 22

పౌత్రేణతేనా నఘః సేవ్యమానః పుత్రైర్మహావీర్య పరాక్రమైశ్చ |

సరంజయ& రాజవరో జితారిః శశాస పృథ్వీం సకలాం మహాత్మా || 23

ఇది శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే సగరోపాఖ్యానంనామ సప్తదశోధ్యాయః

మార్కండేయుడిట్లు పలుకదొడంగెను: ధుంధుమారుని వలన దృఢాశ్వుడు, వాని వలన హర్యశ్వుడు, వానివలన నికుంభుడు, వానివలన సుహితుడు, వానికి భృశాశ్వుడు, వానికి మాంధాతయు, వానికి దైవవిధిచే పురుకుత్సుడు, వానికి సద్దశ్యుడు, వానిక శంభువు కుమారుడై అనరణ్యుడని ప్రసిద్ధుడాయెను. త్రిలోక విజయి యగు నాతడు రావణునిచే నిహతుడాయెను. వానికి దృషదశ్వుడు వానికి వసుమనస్కుడను రాజు కలిగెను. వాని కుమారుడు త్రిధన్వుడు వానినుండి త్రయ్యారణియు, వాని పుత్రడు సత్యవ్రతుడు వానినే త్రిశంకువందురు, వాని పుత్రుడు హరిశ్చంద్రుడు, వాని కుమారుడు రోహితాశ్వుడు వాని పుత్రడు హరితుడు వానికి హారితుడు, వానికి విజయుడు ఆతనికి అలర్కుడు, వాని పుత్రడు వృకుడు, వానికి బాహువు పుట్టిరి. అతడు త్రాగుడు, స్త్రీ, వేట, జూదములతో మిక్కిలి వస్యసనముగలవాడు. ఇట్టి వ్యసనాసక్తుడగు వాని రాజ్యమును శత్రువులగు హైహైయులు, తాలజ-ఘలు వ్లుెచ్ఛగణములతో గూడి మోసముతో అపహరించిరి. రాజ్యము కోల్పోయి బాహురాజు అడవి చేరెను. గుణవతి యగు నాతని భార్య పాదచారిణియై భర్తననుసరించెను. ఆమె సవతి అమెకు వెనుక విషము (గరళము) నిచ్చుటచే అరణ్యస్థు రాలగు నామె సగరుడను పుత్రునిబడసెను. అక్కడ రాజు కాలగతినందెను. ధర్మవత్సలయగు నాతని భార్య వానిననుగమించెను. సగరుని సర్వసంస్కారములతో చ్యవనుడు. సంస్కరించెను. అతడు శస్త్రవిద్యయందు అస్త్రవిద్యయందుపారంగతుడయ్యెను. ¸°వనగతుడై యేకఛత్రాధిపతయై సగరుడు చ్యవనుని అనుగ్రహమువలన ఖడ్గము ధరించి హైహయులను. తాళజంఘలను చంపి అయోధ్యను చేరి నిష్కంటకమగు రాజ్యము నందెను. చ్యవనుని మాటను అదరముతో పూజించెను సగరువు రాజ్యమును పొంది చతురంగ బలముతో వ్లుెచ్ఛలనెల్ల జయించి రాజులను వశముచేసికొనెను. చ్యవనుని అనుజ్ఞతో వివాహముచేసికొనెను మహానుబావుడగు సగరు చక్రవర్తికి నిద్దరు భార్యలుండిరి వారితోకలిసి పుత్రప్రాప్తికై అతడు తపస్సు చేసెను తపస్సు ముగించగనే తపస్సుచే కృశించిన సగరచక్రవర్తితో శివుడిట్ల పలికెను: '' నీ భార్య యొక్కతె వంశకరుడైన పుత్రునొక్కని కనును. రెండవ భార్య యరువదివేల పుత్రలను కనగలదు '' సగరుడిట్లు వరమునుబడసి భర్యలతో గూడతన పట్టణముచేరుకొనెను. ధర్మాత్ముడు వీర్యవంతుడునగు సగరుడట్లు పుత్రులను గనెను. పుత్రుడు కర్మచేతను పేరు చేతను గూడ అసమంజసుడే పౌరుల యహితమం దాసక్తిగల యాతడు తండ్రిచే రాజ్యమునుండి తొలగించబడెను. దానిపుత్రడంశుమంతుడు, అతడు సద్గుణపుంజుడు పితామహుని, రాజగు తండ్రిని సంతోషపెట్టెను. పౌత్రునిచే సేవింపబడుచు, మహాత్మడగు నంశుమంతుడు శత్రువుల జయించి భూమినెల్లర రంజింపజేయుచు పాలించెను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమ ఖండమున మార్కండేయ వజ్రసంవాదమున సగరోపాఖ్యానమను

పదునేడవ అధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters