Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటఅరువదినాల్గవ అధ్యాయము - తిలద్వాదశీవ్రతకథ

మార్కండేయఉవాచ : 

అత్రాప్యుదాహ రంతీమ మితిహాసంపురాతనమ్‌ | మాగధేషుతు యద్వృత్తం తచ్ఛృణుష్వ నరాధిప ! || 1

బభూవమాగధోరాజా చండవేగ ఇతిశ్రుతః | తస్యాసీద్రూప సంపన్నా భార్యానయన సుందరీ || 2

సర్వధర్మా న్పరిత్యజ్య ప్రతిసంవత్సరంతుసా | తిలాన్‌ హోమయతే విపై#్ర ర్జుహోతి చ తథాస్వయమ్‌ || 3

శ్రవణ ద్వాదశీయోగే మాఘేమాసి హుతాశ##నే | దేవస్య చైవ నైవేద్యం కరోతి తిలమోదకైః || 4

అర్చనేనచ వాసోభిః పూజయత్య పి మాధవమ్‌ | మహారంజిత రక్తానివాసాంసి వివిధానిచ || 5

బ్రాహ్మణీనాంచ గేషేషు విసర్జయతి తత్పరా | మహావర్తి ప్రదానంచ విధత్తే కేశవాలంయే || 6

తాం కదాచిత్సుఖాసీనాం బ్రాహ్మణీ తు వసన్తికా | పప్రచ్ఛ సభిభావేన రహస్యం నిర్జనేస్థితా || 7

వసన్తికోవాచ : సర్వధర్మాన్పరిత్యజ్య మాఘేమాసి శుభాననే |

ద్వాదశ్యాం కృష్ణపక్షస్య కస్మాదర్చ యసేహరిమ్‌ ! || 8

కస్మాత్తథా బహుతిలం హవయస్యనలే తథా | ఏతన్మే సం శయంఛిం ది రహస్యం చేన్నతేశుభే! || 9

మార్కండేయుడిట్లనియె. ఈ తిలద్వాదశీమహిమను దెలుపు నితిహాసమొకటి మాగధదేశములందు జరిగినది వినుము. మాగధాధిపతి చండవేగుడను నాతడుండెను. ఆయనకు రూపవతి నయనసుందరియను భార్యయుండెను. ఆమె సర్వధర్మములను మాని యొక్కయేడు మాఘశ్రవణ ద్వాదశినాడు విప్రులచే తిలహోమము సేయించెను. తానునుంజేసెను. నువ్వుపప్పుండలను (చిమ్మిరి) నివేద్యముసేయుచుండెను. అర్చనమందు విష్ణువునకునూతన వస్త్రములు సమర్పించుచుండెను. బ్రాహ్మణస్త్రీలకు చక్కని ఎఱ్ఱజరీచీరలనేకములను అనేకమందికిచ్చుచుండెను. విష్ణ్వాలయములో మహావర్తి దీపదానము కూడ చెసెను. ఒకప్పుడు సుఖాసీనయై యున్న యామెనేకాంతమున వసంతికయను బ్రాహ్మణిచెలిమియై సర్వధర్మములువడిచి ఒక్క మాఘకృష్నద్వాదశినాడు కృష్ణార్చనము మాత్రమే యెందులకు జేయుచున్నావు. ఎందులకు తిల సమృద్ధిగా హోమముసేయుచున్నావు. ఓ శుభానన ! ఇది రహస్యముగాదేని నాసందియము వాపుమన నయనసుందరి యిట్లనియె.

నయనసుందర్యువాచ : రహస్య మేతత్పరమం నరహస్యం తథాత్వయి | త్వంమే సఖీశ్వరీ ప్రాణ స్త్వంమే ప్రాణధనేశ్వరీ! ||

అస్తివైతస్తికోనామదేశః పరమధార్మికః | తత్రగ్రామవరేచా సీద్వసతిర్మే సుశోభనా || 11

చండవేగశ్చ విప్రోభూద్భర్తా మేపూర్వజన్మని | నాస్తికోనిరను క్రోశస్తర్క శాస్త్రరతః సదా || 12

తత్రైవ విషయేరాజా బభూవ దధివాహనః | తస్యభార్యావయస్యామే బభూవకమలాశుభా || 13

సాకదాచిన్మాయువాచ రహస్యం వరవర్ణినీ | నారీభర్తృకృతాదర్ధం పుణ్యం ప్రాప్నోతిసుందరీ || 14

నాస్తిస్త్రీణాం పృథగ్యజ్ఞోన వ్రతం నాప్యుపోషితమ్‌ | పతింశు శ్రూషతేయాతు తేనస్వర్గేమహీయతే || 15

కర్తవ్యం యోషితాపుణ్యం పృథగ్వా పి తదిచ్ఛయా | పతిస్తేనాస్తికోభ##ద్రే కించిన్నాచరతేశుభమ్‌ || 16

సచాచరసిధర్మంత్వంతథా చతదనుజ్ఞయా | కాగతిః పరలోకేచ భవిష్యతిశుబాననే || 17

ఇహయత్ర్కియతే కర్మప్రేత్యతత్రోపభుజ్యతే | యేనోప్తం ఫలకాలేతు సఏవాశ్నాతి భామిని! || 18

మానుష్యం దుర్లభం ప్రాప్య విద్యుత్సంపాతచంచలమ్‌ | నాచరంతిశుభంయేతు తేషాంజన్మ నిరర్థకమ్‌ || 19

కదాచిద పివామోరు! యోనిష్వథ పరిభ్రమమ్‌ | మానుష్యం నామజాయేత యత్రాయత్తం శుభాశుభమ్‌ || 20

చాండాలత్వేపిమానుష్యం సర్వథా సభిదుర్లభమ్‌ | ఆత్మాశక్యస్త్వయాత్రాతుం మానుష్యాన్నాన్యతరఃశుభే! || 21

తవోపరితథాజాతాసఖీ భావేనమేకృపా | కదర్యస్యాస్యభార్యాత్వం సుస్వభావా పతివ్రతా || 22

తత్రతేనుగ్రహంకించిత్కరిష్యామినిబోధతత్‌ | హరస్యదయితాభార్యా శైలేంద్రతనయా ఉమా || 23

విస్తారిత మహాకూలాసా వితస్తా మహానదీ | అవృత్తికర్షితః పాపం కృత్వైవ ఋతుపంచకమ్‌ || 24

స్నానేనైకేన సకలం శైశిరేణ వ్యపోహతి | యస్యాం యస్యాంతిథౌ స్నాతః స్వర్గమాప్నోత్య సంశయమ్‌ || 25

తస్యాం సంవత్సరం స్నాత్వామోక్షోపాయంతు విందతి | యాచనుస్వాదుసలిలాయాచ పాపక్షయంకరీ || 26

తస్యాస్తీరే మయానిత్యం ప్రతిసంవత్సరంశుభే! | ఉపోష్యమాఘ కృష్ణస్యద్వా దశ్యాం శ్రవణతథా || 27

పూజితోభగవాన్విష్ణుర్ర్బాహ్మణాశ్చ హుతాశనః | తిలైస్తన్మాత్తు తేఖ్యాతం బ్రాహ్మమేతద్ర్వతంమమ || 28

తస్మాత్స్కన్నం తిలంయచ్చ యదగ్నౌ పతితంనచ | తతఃపుణ్యఫలం సర్వంత్వమాప్నుహి వరాననే ! || 29

ఇది పరమరహస్యమే. అయినను నీయెడి నిదిదాపరికము చేయరానిది. నీవు నాసభీశ్వరివి ప్రాణమవు. ప్రాణధనేశ్వరివి. వైతస్తికమను నొకవరము ధార్మికమైన దేశముగలదు. అందొక గ్రామమందు మామిక్కిలి చక్కని యిల్లున్నది. పూర్వజన్మమందు చండవేగుడను విప్రుడు నా భర్త. అతడు నాస్తికుడు. జాలిలేనివాడు. తర్కశాస్త్రరతుడు. అదేదేశమందు దధివాహనుడను రాజుండెను. అతనిభార్య కమల నాచెలికత్తె. అసుందరి ఒకప్పుడు రహస్యముగ నాతో ''స్త్రీ భర్తచేసిన పుణ్యములో సగము పొందును. స్త్రీలకు వేరే యజ్ఞము వ్రతము ఉపవాసము నను నదిలేదు. పతి శుశ్రూషచేసినంజాలు స్వర్గమునందును ఒకవేళ నాడు దేదైన పుణ్యము చేయవలెనన్న మగని యనుమతితోనే చేయవలెను. నీ పెనిమిటి నాస్తికుడు. కొంచెమేని మంచిపనిచేయడు. అతనియనుజ్ఞతో నీవేని యించుక పుణ్యకార్యము సేయవు. ఓ పద్మానన! నరకలోకమునందు నీకేగతిపట్టును? ఇక్కడ యేకర్మమాచరించిన మరణించి యది యక్కడయనుభవింపవలయును భామిని ! ఎవ్వడు విత్తనము వేయునాతడు ఫలకాలమందది యనుభవించును. వట్టి మెరపువోలె నతిచంచలమైన మనుష్యజన్మము దుర్లభ##మైనదెత్తి యెవ్వరుపుణ్యముసేయరో వారిజన్మము వ్యర్థమగును. అనేక యోనులం దిరుగాడిన మీదట మానుష్యమనునదివచ్చును, శుభాశుభములా మనుష్యజన్మమున కధీనములయి యుండును. సఖి ! చండాలుడుగనేని మనుష్యుడైపుట్టుట దుర్లభము. మానుష్యమువలననే నిన్నీవు కాపాడుకొనగలవుగాని మరియొక జన్మమువలనగాదు. నీపై చెలికారమున జేసి నాకుజాలికల్గినది. ఈ పరమనీచునికి పరమోత్తమ స్వభావవు భార్యవైతివి. అందు నీయెడ నేనొకింత యనుగ్రహము సేసెద నిదెతెలియుము. హరుని యిల్లాలు శైలరాజుకూతు రుమాదేవి. ఆమెయే వితస్తా మహానది. సువిశాలములైన యభయతీరముల నొరసి పారుచున్నది. అనేకావృత్తులు అయిదుఋతువులు పాపములు సేసినవాడగూడ యందొక్కమారు మాఘమాసమున మునిగిన జాలు నెల్లపాపముల బాయగలడు. అందే యేతిథియందు స్నానముసేసి స్వర్గముపొందునో యదేతిథియందొక్క సంవత్సరము స్నానముసేసెనేని మోక్షోపాయముం బొందును. ఆ నదీమతల్లి స్వాదూదక. పాపక్షయంకరి. ఆ నదీతీరయందేదేనొక్క సంవత్సరము స్నానముసేసెనేని మోక్షోపాయముం బొందును. ఆ నదీమతల్లి స్వాదూదక. పాపక్షయంకరి. ఆ నదీతీరమందేదేనొక్క సంవత్సరముపవాసముండి మాఘకృష్ణ ద్వాదశి శ్రవణనక్షత్రము కలిసిననాడు స్నానముసేసి విష్ణుభగవానుని బూజించితిని. బ్రాహ్మణులనర్చించితిని అగ్నిని తిలలచే వేల్చితిని. అందుచే నీనావ్రతము బ్రాహ్మమను ప్రఖ్యాతి నందెను. అప్పుడక్కడ జారిననువ్వు గింజ యగ్ని లోపడనిదేదేని యున్నదానివలని పుణ్యఫలమెల్ల నోశుభానన ! నీవుపడయుదువుగాక !

ఇత్యేవముక్తయాగత్వా భర్తా పృష్టస్తదామయా | హసతాతేనచా ప్యుక్తాగచ్ఛగృహ్ణీష్వ తత్ఫలమ్‌ || 30

స్వయం కృత్వాశుభం కర్మ కమలాసాసఖీమమ | సహభర్త్రా విశాలాక్షీ విష్ణులోకమితోగతా || 31

తల్లోక మక్షయం తస్యాః శ్రుతం వైవస్వతాన్మయా | తస్మాద్దృష్టఫలంభ##ద్రేకరోమి తిలద్వాదశీమ్‌ || 32

ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం పృచ్ఛసి సుందరి! |

మార్కండేయ ఉవాచ ఐ ఏతచ్ర్ఛత్వాశుభంవాక్యం బ్రాహ్మణ్యపివసంతికా | 33

శ్రవణద్వాదశీయోగే పూజయామాసకేశవమ్‌ | మాఘకృష్ణేమహాభాగ! తిలైర్నిత్యమతంద్రితా || 34

పూజయిత్వాపి సాదేవం శ్వేతద్వీపమితోగతా | సాపిరాజ్ఞోమహాభాగా తథానయన సుందరీ! || 35

అమలం స్థానమాసాద్య విరరాజ శశి ప్రభా | తస్మాత్సర్వ ప్రయత్నేన తదా పూజ్యోజనార్దనః. 36

తిలైర్నిత్యం మహాభాగహోతవ్యాశ్చ తథాతిలాః | తిలాశ్చదేయా విప్రేభ్యస్తస్మిన్నహని పార్థివ! || 37

ఏకైక స్వాత్తిలాద్రాజం స్తిలబీజోద్భవేయథా | సుకృష్ణక్షేత్ర జాద్దృష్టం దేవేకాలప్రవర్షిణి || 38

ఏకైకస్మాత్తిలా త్తద్వత్ఫల మక్షయ్యమశ్నుతే | స్వర్లోకేవిష్ణులోకేవామానుష్యేయది వానృప! ||

అక్షయ్యంఫలమాప్నోతి ఏకైకస్మాత్తిలాత్తిలాత్‌ || 39

తస్మాత్ర్పయత్నే ననరేంద్ర చంద్ర! తస్యాం సమభ్యర్చయ వాసుదేవమ్‌ |

ఉపోషితః ప్రీతమనాయథావత్‌ త్రాణం సదేవః ప్రథితోనరాణామ్‌ |

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే చండవేగోపాఖ్యానే తిలద్వాదశీమాహాత్మ్యవర్ణనం నామ చతుఃషష్ట్యధిక శతతమోధ్యాయః.

ఇట్లామో పలుకవిని చనినంత నామగడడుగ నిది యెల్లనేనెరిగింప నతడు పరిహసించి పోపొమ్ము! అఫలమెల్ల మూటగట్టు కొమ్మన నాసఖి కమల తాను స్వయముగ నాపుణ్యమెల్ల నాచరించి యటనుండి భర్తతో విష్ణులోకమేగెను. అపుణ్యలోక మామెకక్షయ మైనదనికూడ యమధర్మరాజు వలననేనువినియున్నాను. కావున కల్యాణి ! ఇదిదృష్టఫలము. తిలద్వాదశీవ్రతము నేనుజేయుచున్నాను. ఇదెల్ల నడిగితివని నీకు దెల్పితిని. అన నీపుణ్య వచనమాలించి యా బ్రాహ్మణి వసంతిక శ్రవణద్వాదశీయోగమందు మాఘబహుళములో తిలలతో విష్ణువునారాధించి యేపాటితో ట్రుపాటులేక యా మహానుభావురాలిటనుండి శ్వేతద్వీపమునకేగెను. అరాజ్ఞి నయనసుందరియుం చంద్రప్రభనంది పుణ్యలోకమునంది రాజిల్లెను. కావున సర్వవిధముల నా పుణ్యతిథియందిట్లు హరి పూజనీయుడు. తిలలతో పూజ హోమము దానము నానాడు ప్రశస్తము. చక్కగా దున్నిననేల ఒక్కనువ్వుగింజనుండి పెక్కు నువ్వుగింజలు పుట్టినట్లు ఒక్కొక్క నువ్వుగింజవలన నక్షయ్యమయిన ఫలమందు. స్వర్గమందుగాని విష్ణులోకమందుగాని మనుష్యలోకమందుగాని యక్షయ్య ఫలము గల్గితీరును. కావున నప్రయత్నముగ నో నరేంద్రచంద్ర ! ఆ మాఘద్వాదశీ తిథియందు వాసుదేవు నుపవసించి పూజించి సంప్రీత మనస్కుడగునేని వానికాదేవుడు రక్షకుడగునను విషయము ప్రసిద్ధము.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున తిలద్వాదశీవ్రతకథయను నూటఅరువదినాల్గవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters