Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటయేబది యేడవ అధ్యాయము - రాజ్యప్రద ద్వాదశీవర్ణనము

వజ్రఉవాచ : ద్వాదశీషు కథం విష్ణుః సోపవాసేన పూజితః | రాజ్యప్రదఃస్యాద్ధర్మజ్ఞ! తన్మేత్వంబ్రూహి తత్త్వతః ||

పశ్యరాజ్యస్య మహాత్మ్యం యత్రధర్మ సఖావుభౌ | శృణుతస్య ఛదర్మస్య ఫలభాగ్ధార్మికో నృపః || 2

బ్రహ్మచారీగృహస్థశ్చ వానప్రస్థోథ భిక్షుకః | రాజ్ఞాసంరక్షితాః సర్వేశక్యా ధర్మం నిషేవితుమ్‌ || 3

మానుషేణశరీరేణ రాజా దేవవపుర్ధరః | క్షత్త్రియోపి సదాపూజ్యో బ్రాహ్మణానాం మహాత్మనామ్‌ || 4

వినారాజ్యంహియాలక్ష్మీః పరతంత్రాహిసామతా | తస్మాద్రాజ్యం ప్రశంసంతి తత్రాజ్ఞా న విహన్యతే || 5

తుల్యధాతు శరీరాణాం తుల్యావయవజీ వినామ్‌ | నరేంద్రాణాం నరైర్‌ బ్రహ్మన్‌ దేవవద్భువి మస్యతే || 6

రాజ్యదాంద్వాదశీం తస్మాద్వక్తు మర్హతిమే భవాన్‌ | యాముపోష్య మహద్రాజ్యం ప్రాప్ను యాత్సతు వైద్వజః || 7

వజ్రుడు విష్ణువును ద్వాదశులందుపవసించి పూజించిన రాజ్యలాభమగునట యా విషయము యదార్థము నాకానతిమ్ము రాజ్యముయొక్క మహిమమెంత గొప్పదో కనుము. రాజు ధర్మము ననువారిద్దరు మిత్రులు. ధర్మము చేసినందువలన గల్గు ఫలమును బొందువాడు ధర్మపరుడైన రాజు. బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థు భిక్షువు ననువారు రాజుయొక్క సంరక్షణం బొంది ధర్మము నాచరింప శక్తులగుదురు. రాజు మానుష శరీరధారియగు దేవుడు. మహాత్ములగు బ్రాహ్మణుల కతడుగూడ పూజనీయుడే. రాజ్యములేకుండ గల్గినలక్ష్మి పరతంత్ర యనంబడును. గావున రాజ్యమును పెద్దలు కొనియాడుదురు. అందు రాజాజ్ఞ కడ్డులేదు. మానవులందరి శరీరములో ధాతువులు సమానములే శరరీములును సమములే. అపయవములు ప్రాణములు సమానములే. అయినను భూమిమీద భూపతి దేవుడని భావింపబడును. కావున రాజ్యము నొసంగు ద్వాదశీవ్రతముంగూర్చి నాకు వచింపదగుదువన మార్కండేయుడిట్లనియె.

మార్కండేయ ఉవాచ : శృణుష్వావహితో రాజన్రాజ్యదాంద్వాదశీంశుభామ్‌ |

యాముషోష్య నరోలోకే రాజ్యమాప్నోత్య కంటకమ్‌ || 8

మార్గశీర్ష స్యమానస్య శుక్లపక్షే నరాధిప! | దశమ్యాం ప్రయతః కృత్వాస్నాన మభ్యంగ పూర్వకమ్‌ || 9

ఉపవాసస్య సంకల్పంశ్వోభూతస్యతుకారయేత్‌ | దేవాగారేకు శాస్తీర్ణామే కవస్త్రోత్త రచ్ఛదామ్‌ || 10

అధ్యాసీత మహీంతత్రతాం రాత్రిం ప్రయతోనయేత్‌ | ద్వితీయేహ్నితతః కుర్యాద్బహిః స్నానమతంద్రితః || 11

పూజనందేవ దేవస్య సర్వం శుక్లేన కారయేత్‌ | కర్పూరం చందనందేయం మల్లికా శ్వేతయూథికా || 12

జాత్యాచ శుక్లా రాజేంద్ర ధూపే కర్పూరమే వచ | ఘృతేన దీపాదాతవ్యాః శుక్లవర్తి సమన్వితాః || 13

ఘృతౌదనం దధిక్షీరం పరమాన్నంత థైవచ | ఇక్షుమిక్షు వికారాంశ్చదేవదేవే నివేదయేత్‌ || 14

కాలోద్భవం మూలఫలం వర్ణంతత్రన చింతయేత్‌ | యథాలాభేన తద్దేయం శుక్లం చేత్స్యాద్విశేషతః || 15

హవనంచ తతః కార్యం పరమాన్నేన పార్థివ | తద్విష్ణోః పర ఇత్యేవ హోమ మంత్రో విధీయతే || 16

ద్వాదశాక్షారకం మంత్ర స్త్రీ శూద్రస్య విధీయతే | తతోగ్ని హవనం కృత్వా శక్త్యా సంపూజ్యచ ద్విజాన్‌ || 17

సితరంగేన కర్తవ్యా భూమి శోభా సురాలయే | రాత్రౌజాగరణం కార్యం గీతం నృత్యంచ పార్థివ! 18

కర్మణాంచైవ దేవస్య కర్తవ్యం శ్రవణం తథా | ద్వాదశ్యాం విధినాకేన భూయః పూజ్యోజనార్దనః || 19

రాజలింగం ప్రదాతవ్యమే కం విప్రాయ దక్షిణా | తతస్తు పశ్చాద్భోక్తవ్యం హవిష్యం పార్థివో త్తమ! 20

ఏకాదశీ యథా మధ్యేస్నానయోరంత రేనృప ! కష్టం మౌనంతు కర్తవ్యం జప్యం కార్యంతు మానసమ్‌ || 21

ద్వాదశీ ష్వేప శుక్లాసు సర్వాస్వేవావి శేషతః | విధిస్తవాయం నిర్దిష్టః కృష్ణాస్వేవచ కారయేత్‌ || 22

విశేషంతే ప్రవక్ష్యామి తన్మేనిగదతః శృణు | రక్త వర్ణేన కర్తవ్యా దేవపూజాంయథావిధి || 23

రక్తంచ దేయం నైవేద్య పుష్పగంధాను లేపనమ్‌ | తిలతైలేన దీపాశ్చ మహారంజన రంజితాః || 24

దీపేషు వర్తయో దేయా హోమః కార్య స్తథా తిలైః | భూమిశోభాచకర్తవ్యా రక్తై ర్భూపాల వర్ణకైః || 25

అనేన విధినాకృత్వా రాజన్సంవత్సరం తతః ! కార్తిక్యాం సమతీతాయాం కృష్ణాయా ద్వాదశీ భ##వేత్‌ || 26

ప్రతాపసానే తస్యాంతు మహావర్తింతుదా పయేత్‌ | వాససాచ సమగ్రేణతులయాచ ఘృతస్యవై ||27

బ్రాహ్మణాయప్రదా తవ్యా ధేనుః కాంస్యోపదోహనా | హేమశృంగీరౌప్యఖురా ముక్తాలాంగుల భూషితా || 28

వస్త్రోత్తరీయా దాతవ్యా శక్త్యా ద్రవిణసంయుతా | సంవత్సరేణ రాజాస్యాన్నరః పర్వత గహ్వరే || 29

త్రిభిః సంవత్సరైః పూర్ణైర్జాయతే సఫలం తతః | తథా ద్వాదశభిః పూర్ణై రాజాభవతి పార్థివః || 30

రాజ్య ప్రదాతే భిషితా మయైషా సుద్వాదశీ పాపహరావరిష్ఠా |

ఉపోష్యయాం భూమితలే నరేంద్రో | భవత్యజేయశ్చ రాణరి సంఘైః || 31

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే

రాజ్యప్రదద్వాదశీ విధిర్నామ సప్తపంచాశదధిక శతతమో7ధ్యాయః.

రాజా! శ్రద్ధతో నాలింపుము. మార్గశీర్ష శుక్లదశమినాడు శుచియై యభ్యంగ స్నానముసేసి రేపు ఏకాదశినాడుపవాస మాచరింతునని సంకల్పము సేయవలెను. దేవగృహమున నేలపై దర్భాసనముపై వస్త్రము పరచుకొని దానిమీదనే కూర్చుండి యా రేయిగడుపవలెను. మారునాడేగిస్నానముసేసి తెల్లనివస్తువులతో గంధాక్షతలతో పువ్వులతో విష్ణుపూజసేయవలెను. పచ్చకర్పూరము చందనము మల్లెపువ్వులు తెల్లయూథికలు బొడ్డుమల్లెలు విరజాజులతో పూజసేయవలెను. తెల్లనివత్తులువేసి ఆవునేతి దీపములు పెట్టవలెను. నేతియన్నము పెరుగు పాలు పరమాన్నము చెరకురసము మరియు చెరకురసముయొక్క పలురకములయిన పంచదార మొదలగు వస్తువులతోడి పదార్థములను వారికి నివేదింపవలెను. అకాలములో దొరకుపండ్లు మూలములు రంగునుగూర్చి వమర్శింపక సమర్పింపవలెను. తెల్లని పదార్థము లేనియైన లభించినంతవరకీయవలెను. అవ్వల పరమాన్నముతో హవన మొనరింపవలెను. ''తద్విష్ణోః పరమం పదం'' అన్నమంత్రము హోమమున బ్రయోగింపవలెను. స్త్రీలకు శూద్రులకు ద్వాదశాక్షర మంత్రము విధింప బడినది. ఆమీద నగ్ని హవనమొనరించి యథాశక్తి విప్రులం బూజించి దేవగృహమున తెల్లని రంగవల్లికలతో భూమిని శోభింప జేయవలెను. రాత్రి గీతనృత్యాదులతో జాగారణము సేయవలెను. భగవచ్చరిత్రలను బురాణములను వినవలెను. ఇది ద్వాదశీ విష్ణు పూజావిధానము. విప్రునికొక రాజలింగమును దక్షిణ యీవలయును అటుపై హవిష్యాన్న మారగింపవలెను దశమీ ద్వాదశీ స్నానముల నడుమ ఏకాదశినాడు మౌనమూని మానసిక జపము సేయవలెను. సర్వ శుక్లద్వాదశులందు నెట్టిభేదములేకుండ ననుష్ఠింప వలసిని విధి యిదినీకు నిర్దేశించితిని. కృష్నద్వాదశు లందును నిట్లు సేయవలయును. అందు విశేషము తెల్పెద వినుము. అప్పుడు ఎరుపురంగుతో పూజయెల్ల జరుపవలెను. పుష్పగంధాను లేపనాదులు నైవేద్యము నెఱ్ఱని వస్తువులతోనే నివేదింపవలయును. నువ్వుల నూనెతో దీపములు వత్తులు మహారంజన రంజితములుగా నుండవలెను. తిలలు హోమము సేయవలెను. పూజాస్థలముశోభ రక్త వర్ణములయిన రంగవల్లులు మొదలయిన వానితో గూర్పవలెను. ఇట్లొక సంవత్సర మీవ్రతము సేసి తుదకు కార్తిక బహుళ ద్వాదశి నాడు మహావర్తి సమర్పింపవలెను. ఆ వర్తి పూర్తివస్త్రముతో జేయవలెను. నెయ్యి సంపూర్ణమయిన తూనికలో నుపయోగింప వలయును. కొలిచిపెట్టిన నేతిలో కొంతభాగముతీసి వాడరాద్నమాట. కంచుపాలచెంబుతో నొకగోవును బ్రాహ్మణుని కీయవలెను. కొమ్ములకు బాంగారుతొడుగులు గిట్టలకు వెండివి తోకకు ముత్యాలుకట్టి నూతన వస్త్రముత్తరీయముగ గప్పి యథాశక్తి ద్రవిణ సంయుతముగ (ధనముతోడి) దక్షిణయీయవలెను. ఈ వ్రతమొక సంవత్సరమట్లు సేయవలెను. యతడు పర్వత గహ్వరమందు రాజగును. (కొండరాజగును) మూడుసంవత్సరములు సేసిన నరపాలుడగును. ఇది రాజ్యప్రదము. ఉపవాసముండి చేయదగినది. దీన నజేయుడయిన ప్రభువగును.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమయిన రాజ్యప్రద ద్వాదశీవర్ణనమను నూటయేబదియేడవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters