Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటయేబదియైదవ అధ్యాయము - రూపసత్రవర్ణనము

పురూరవా ఉవాచ : 

శ్రోతుమిచ్ఛామి భగవన్రూ వసత్రం మహాఫలమ్‌ | యత్సమాప్తౌ భవిష్యామి దివ్య రూపధోరోమునే || 1

అత్రిరువాచ : తత్సత్రం కర్తుకామేన చాన్వేష్యో బ్రాహ్మణోగురుః |

జ్యోతిషం యోవిజానాతి ఇతిహాసాంశ్చ కృత్స్నశః || 2

తత్ర్పదిష్టేన విధినా పాదర్షాత్ర్పభృతి క్రమాత్‌ | ఉపోషితవ్యం నక్షత్రం ప్రత్యేకం తన్నిబోధమే || 3

ఫాల్గున్యాం సమతీతాయాం కృష్ణపక్షాష్టమీతుయా | సమూలాం తాంతు సంప్రాప్య వ్రతం గృహ్ణీత మానవః || 4

ఉషోషితవ్యం నక్షత్రం నక్షత్రస్యచ దైవతం | వరుణంచ తథా చంద్రం పూజయేద్విధినానరః || 5

పూజయేద్దేవదేవేశం భగవంతంజనార్దనమ్‌ | ఉషోష్య సంగం దేవస్య ప్రయత్నేనచ పూజయేత్‌ || 6

తతోగ్ని హవనం కృత్వాపూజయిత్వాతథా గురుమ్‌ | ఉపవాసస్తుకర్తవ్యోద్వితీయేహని పార్థివ || 7

ఉపోష్యఋక్షేవిగతే స్నాత్వా సంపూజ్యకేశవమ్‌ | కృత్వాత్ని హవనం శక్త్యాపూజయిత్వాద్విజోత్తమాన్‌ || 8

హవిష్య మన్నం భోక్తవ్యం శృణుచాంగ క్రమం మమ | పాదయోః కథితం మూలం ప్రాజాపత్యంతు జంఘయోః || 9

ఆశ్వినం జానుయుగలం చోరుయుగ్మంచ పార్థివ! | సహితేద్వే తథా షాఢేగుహ్యేచ సహితేస్మృతే || 10

పూర్వోత్తరేచ ఫాల్గున్యౌకృత్తికాసు కటిర్భవేత్‌ | పార్శ్వయోః కుక్షియుతయోర్నక్ష త్రతత్రియంమతమ్‌ || 11

ఉభేప్రోష్ఠపదే రాజన్రేవతీచ తథాభ##వేత్‌ | ఉరోనురాధాసుతథా పృష్ఠనిష్ఠ్యాసు కీర్తితమ్‌ || 12

భేజౌజ్ఞేయా విశాఖా సుహస్తే ప్రోక్తా తథాకరౌ | అంగుల్యశ్చ తథాప్రోక్తా రాజసింహపునర్వసౌ || 13

ఆశ్లేషాయాం తథాప్రోక్తా జ్యేష్ఠాయాం నృపకంధరా | శ్రవణౌ శ్రవణౌజ్ఞేయే ముఖంపుష్యే ప్రకీర్తితమ్‌ || 14

దంతాః స్వాతౌశతభిషా హనూప్రోక్తా తథానృప! మఘాయాం నాసికాప్రోక్తా మృగశీర్షంచలోచనే || 15

చిత్రాలలాటే విజ్ఞేయా భరణ్యశ్చతథాశిరః | శిరోరుహాస్తథార్ద్రా సువ్రతస్యాంతే నరాధిప! || 16

మాఘశుక్లావసానేతు సత్రం పరిసమాప్యతే | యద్యంతరాయం నభ##వేత్‌ కించిచ్ఛౌ చనిమిత్తజమ్‌ || 17

అంతరాయం మహారాజ! యదిశౌచ నిమిత్తజమ్‌ | ఉషోషమేవో పవసేన్నక్షత్రమపరం పునః || 18

క్రమప్రాప్తం హినక్షత్రం చాశుద్ధ్యామప వర్జితమ్‌ | ఉల్లం ఘయన్మహీపాల! ప్రత్యవాయం సమశ్నుతే || 19

అంగక్రమేణసకలం ఋక్షవర్గము పోషితః | వ్రతాంతే ప్రయతః స్నాత్వా పూజయేన్మధు సూదనమ్‌ || 20

పురూరవ చక్రవర్తి ఓఋషి చక్రవర్తీ! మహాఫల ప్రదమగు దేవిసమాప్తి యందు దివ్యరూప ధరుండనగుదు నా రూప సత్రముంగూర్చి విన వేడుక గొంటినన నత్రి యిట్లనియె : రూపసత్రము సేయుగోరు నతడు మొట్టమొదట జ్యోతిషము ఇతిహాసము లను నెఱింగిన బ్రాహ్మణుని గురువుగా వెదకి కొనవలెను. ఆయన చెప్పినట్లుగా నక్షత్ర పాదమునుండి ఒక నోత్రము పూర్వియగు దాక ఉపవాసముండ వలయును. ఫాల్గున మాసమందు బహుళాష్టమి మూలానక్షత్రముతో గూడిన నాడు వ్రత సంకల్పము సేయవలయును. ఆ నక్షత్ర మంతయునుపవసించి ఆ నక్షత్రాధిదైవత మగు వరుణుని చంద్రుని యథావిధిగ బూజించి విష్ణువును బూజింప వలెను.

-: ప్రత్యంగ పూజావిధానము :-

ప్రత్యంగ పూజా విధానము వినుము. పాదములందు మూలానక్షత్రము ప్రాజాపత్య నక్షత్రము (రోహిణి) పిక్కలందు మోకాళ్లయందు తొడలయందు గుహ్యమందు పూర్వోత్తరాషాఢలు కటి(నడుమునందు) పూర్వోత్తర ఫల్గునులు కడుపు ఇరుపార్శ్వము లందు పూర్వోత్తర ప్రోష్ఠపదములు అనగా పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి పక్షమునం దనూరాధ పృష్ఠమునందు నిష్ఠ్యలు రెండు భుజములందు విశాఖ రెండు చేతులందు హస్త వ్రేళ్లయందు ఋనర్వసువు మెడయందు ఆశ్లేష జ్యేష్ఠయును శ్రవణమందు (చెవులందు) శ్రవణ నక్షత్రము ముఖమునందు పుష్యమి దంతములందు స్వాతి చెక్కిళ్ళయందు శతభిషము ముక్కునందు మఘకన్నులందు మృగశిర నుదుటియందు చిత్తశిరస్సునందు భరణి జుట్టునందు అర్ద్రమును పూజా నక్షత్రములుగా జెప్పబడినవి. శౌచ నిమిత్తమైన యభ్యంతరము నడుమ కల్గనిచో మాఖశుద్ధిపూర్ణిమతో నీ వ్రతము పూర్తి యగును. నడుమ నేమేని యంతరాయము గల్గినచో తరువాతి నక్షత్రమందుపవాసము సేయవలెను. అనాచారము (అశుచి) గల్గినపుడు వరుసగా వచ్చిన నక్షత్రమును వర్జించ వలెను. పూజావిధానము నందు మాత్రము నక్షత్రోల్లంఘనము సేసినచో ప్రత్య వాయవు (దోషము) వచ్చును. అంగక్రమముననున్న నక్షత్రముల యందుపవసించి వ్రతాంతమున నాచారవంతుడై స్నానము సేసి జనార్దను నర్చింప వలెను.

చందనాగురుకర్పూర మృగదర్పైః సకుంకుమైః | జాతీఫలైః సకంకోలైర్లవంగ కుసుమైస్తథా || 21

బోల గుగ్గుల నిర్యాసైః పుషై#్పః కాలోద్భవైః శుభైః | ధూపోనరేంద్రాగురుణా చందనేన సుగంధినా || 22

దీపాశ్చదేయా రాజేంద్ర! తిలతైలప్రపూరితాః | దీపేషువర్తయః కార్యాః మహారంజనరంజితాః || 23

నై వేద్యంచతథా కార్యం పరమాన్నేన భూరిణా | దధ్నాక్షీరామృతా భ్యాంచ మధునాచ గుడేనచ || 24

సితయాచతథాభ##క్ష్యైః ఫలమూలైర్యథావిధి | అపూపైః పానకైర్హృద్యైః శీతలైశ్చ సుగంధిభిః || 25

లవణస్యచ పాత్రాణికృసరం చనివేదయేత్‌ | సర్వబీజాని రాజేంద్ర! భూషణానిచశక్తితః || 26

మహర్ఘాణిచవస్త్రాణి భక్త్యా ప్రయతమానసః | తద్విష్ణోః పరమమితి హోమఃకార్యోహ్యనంతరమ్‌ || 27

ద్వాదశాక్షరకం మంత్రంస్త్రీ శూద్రేషు విధీయతే | ఘృతంమాక్షిక సంయుక్తం జుహుయాత్తిల తండులమ్‌ || 28

తతస్తుదక్షిణాదేయా గురవేనృపసత్తమ | నాగాశ్చమదమతైవైగ్రామాశ్చ వివిధాస్తథా || 29

తురగాశ్చతథాముఖ్యా రత్నాని వివిధానిచ | బ్రాహ్మణశ్చ పితాజ్ఞేయో రుపసత్ర ప్రదర్శకః || 30

రూపసౌభాగ్యలావణ్య జన్మభోగ ప్రదాయకః | రాజ్యస్యవాద్వి జత్వస్య బహువిత్తస్యదాయకః || 31

నతస్యనిష్కృతిః శక్త్యా గంతుందా నేనభూరిణా | గురుప్రసాద ఏవాత్ర దక్షిణానాంతు కారణమ్‌ || 32

తస్మాత్ర్ప సాదమాకాంక్షేత్‌ రూప సత్ర ప్రదర్శకాత్‌ | అవశ్యంతస్య దాతవ్యం ఘృతపూర్ణంతు భాజనమ్‌ || 33

చతుష్పలంతు కాంస్యస్య సువర్ణంకాంచనస్యచ | తతః పరంభోజనీయాః స్వశక్త్యా ద్విజపుంగవాః || 34

లవణక్షీర మధ్వాజ్యగుడ భక్ష్యసితోత్కటమ్‌ | భోజనం పానకోపేతం పశ్చాద్దేయాచ దక్షిణా || 35

వస్త్రయుగ్మంప్రదా తవ్యం బ్రాహ్మణస్యనవంశుభమ్‌ | బ్రాహ్మనాయ చదాతవ్యం మహారాజత రంజితమ్‌ || 36

సప్తబీజాని దేయాని లవణం రూప్యమేవచ | యచ్చాస్య దవ్య భీష్టంస్యాచ్ఛత్రోపానత్కమేవచ || 37

విత్తశాఠ్యంనకర్తవ్యం సత్రదానే మహీపతే! అవశ్యదేయం సత్రేస్మిన్‌ ఘృతపూర్ణంచ భాజనమ్‌ || 38

చతుష్పలంతుకాంస్యస్య సువర్ణం కాంచనస్యచ | వ్రతేనానేన చీర్ణేన దేహత్యాగే దివంగతః || 39

తత్రోష్యసుచిరంకాలం మానుష్యేయది జాయతే | రాజాభవతి ధర్మాత్మా బ్రాహ్మణోవాధనాన్వితః || 40

కులేమహతి సంభూతో రూపేణాప్రతిమోభువి! | ఆరోగ్యం మహదాప్నోతి సౌభాగ్యమపిచోత్తమమ్‌ || 41

లావణ్యం బుద్ధిమేధేచ మతింధర్మేచ శాశ్వతమ్‌ | సంపూర్ణచంద్ర ప్రతిమః సర్వసత్త్వ వశంకరః || 42

నరోభవతి రాజేంద్ర! నారీచాప్సరసోపమా | సుభగాదర్శనీయాచ లావణ్య గుణసంయుతా || 43

బహుధాన్యా బహుధనా బహుభూషణసంయుతా | భక్తుశ్చాత్యంత దయితాలోకే ఖ్యాతాచ సద్గుణౖః ||

నిత్యారోగ్యవతీకాంతా సర్వదోష వివర్జితా ||44

చంద్రాసనా నీలసరోజనేత్రా త్రైలోక్యకాంతా పతివల్లభాచ | 45

భవత్యవశ్యం సుభగా సుశీలా లావణ్యయుక్తాయ శసాశ్రియాచ || 46

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే

రూపసత్ర వర్ణనంనామ పంచ పంచాశదధిక శత తవీమోధ్యాయః.

చందనము అగురు కర్పూరము (పచ్చకర్పూరము) కస్తూరి కుంకుమ పువ్వు జాతీఫలములు (జాజికాయలు) కంకోల ములు లవంగాలు బోల గుగ్గులు గుగ్గిలము యాయా కాలములందు పూయుపూవులు అగురు చందనములతో ధూపము తైలదీపములు సమృద్దిగ పరమాన్నము నివేదనము సేయవలె. దీపము వత్తులు మహారంజనరంజితములుగా వలెను. (మహారజనము) నైవేద్య మందు పెరుగు పాలు అమృతము మధువు (తేనె) బెల్లము పంచదార భక్ష్యము పండ్లు దుంపలు ఆపూపములు. సుశీత సుంగంధి పానకములు లవణముల కృసరము =పులగము సర్వ బీజములు (నవధాన్యములు) నివేదింపవలెను. అలంకార సమర్పణము కూడ యథాశక్తి చేయవలెను. అమూల్యవస్త్రములు సమర్పించ వలెను. అటుపై ''తద్విష్ణోః పరమ పదం '' అన్నమంత్ర ముతో హోమము సేయవలెను. స్త్రీ శూద్రులకు ద్వాదశాక్షరమంత్ర జపము సెప్పబడినది. ఆపైని నెయ్యితేనె తిలలు బియ్యము హోమద్రవ్యములు మదగజములు వివిధగ్రామములు జాతిగుఱ్ఱములుగురువులకు దక్షిణయీయవలెను. వ్రతముజేయించు బ్రాహ్మణుడు తండ్రియేయనితెలియనగును. అతడు రూపసౌభాగ్య లావణ్య జన్మభోగప్రదాత. రాజ్యము ద్విజత్వము ధనసమృద్ధి యీయగలడు. భూరిదానమెంత సేసినను గురువు ఋణము తీరదు. అన్ని దక్షిణలకు గురు ప్రసాదమే కారణము. రూప సత్రప్రదర్శకుడైన యాచార్యు నుండి కోరవలసినది యొక్క గురు ప్రసాదమే (అనుగ్రహమే). ఆయనకు ఘృతప్ణూర కుంభము (ఆవునేతి నిండు కడవ) అవశ్య మీయ వలెను. నాల్గుపలాలు కంచు బంగారము నొసగవలెను. ఆ మీద స్వశక్తి ననుసరింని బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఆభోజనము లవణ క్షీరమధు ఆజ్యగుడభక్ష్యసిత (పంచదార) పానీయములతో సమృద్ధముగా నుండవలెను. అటుపై దక్షిణ యీయవలెను. వస్త్రయుగ్మమీయవలెను. ఆ వస్త్రములు మహారాజత రంజితములుగా (వెండిజరీతో నందగింప బడినవిగా) నుండ వలెను. సప్తబీజములు లవణము వెండి (రూప్యము =రూపాయి) మఱియుం దనకు వారికి యభీష్టమైన దెల్ల యీయవలెను. గొడుగు పాదరక్షలు నీయవలెను. రాజా! సత్రదానమందు ధనలౌభ్యము పనికిరాదు. ఈ సత్రమందవశ్య మిచ్చి తీరవలసినది ఘృతపూర్ణ కుంభము నాల్గుపలములు కంచు నాల్గు పలములు బంగారమును జాల ముఖ్యము.

ఈ వ్రతము సేసిన తదవ సానమందు స్వర్గమందు చిరకాలమట నుండి మనుష్యలోకమందు బుట్టెనేని ధర్మాత్ముడగు రాజగును. ధనవంతుడగు బ్రాహ్మణుడేని గాగలడు. పరమ సుందర రూపుడైపుట్టును. ఆరోగ్య సౌభాగ్య లావణ్యాదులను జ్ఞానమును మేధాశక్తిని సర్వసమృద్ధముగ నొందును. సంపూర్ణ చంద్రబింబమట్లుడును. కాంతిమంతుడై సర్వసత్త్వ వశంకరుడై యుండును. ఈ వ్రతమాచరించిన స్త్రీయప్సరసలతో సమమగు రూపవతి సౌభాగ్యవతి లావణ్యగుణశాలిని ధనధాన్య సంపన్నయు బహూభూషణ భూషితయునై భక్తకత్యంత ప్రీతిపాత్రమై సద్గుణ సంపదచే సర్వజగత్ర్ప సిద్ధయగును. నిత్యరోగగ్రస్తయైన కాంత సర్వదోష ములువాసి చంద్రానన నీలసరోజనేత్రత్రై లోక్యమనోహారిణి భర్తృవల్లభసుభగ సుశీల లావణ్యవతి యశస్విని శ్రీమంతు రాలునగును.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమునందు రూపసత్ర వర్ణనమను నూటయేబది యైదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters