Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటనలుబదియైదవ అధ్యాయము - అశూన్యశయన ద్వితీయావ్రతవర్ణనము

మార్కండేయ ఉవాచ :

అతః పరం ప్రవక్ష్యామి పితృభిర్యాః ప్రకీర్తితాః | గాథాః పార్థివ శార్దూల! కామయద్భిః పురేస్వకే || 1

అపిస్యాత్సకులేస్మాకం యోనోదద్యాజ్జలాంజలిమ్‌ | నదీషు బహుతోయాసు శీతలాసు విశేషతః || 2

అపిస్యాత్సకులేస్మాకం హిమమిశ్రం జలాంజలిమ్‌ | తిలమాక్షిక సంయుక్తం యోనోదద్యాత్సమాహితః || 3

అపిస్యాత్సకులేస్మాకం యోనోదద్యాచ్చ భక్తితః | పాయసం మధుసంమిశ్రం వర్షాసు చ మఘాసుచ || 4

దాల్భ్యఉవాచ :

పత్న్యో నృణాం మునిశ్రేష్ఠ! మోషితాంచ తథా నరాః | తచ్ఛ్రోతు మిచ్ఛా విప్రర్షే! విధవాస్త్రీ నజాయతే || 5

ఉపోషితేన యేనాగ్ర్య! పత్న్యా న రహితో నరః || 6

మార్కండేయుడు పితృదేవతలు కోరి తమపురమున కీర్తించిన గాథలను దెల్పెద. మాకు బహూదకములయిన జలాంజలి (చల్లనినదులలో) నొసగువాడు మాకులములో గల్గునా? మంచుగలిపినది, నువ్వులు తేనెయుం గూడిన జలాంజలి (తర్పణము) సేయువాడు మాకుటుంబమున బుట్టునో భక్తితో తేనెకలిపిన పాయసమును వర్షర్తువున మఘునక్షత్రమందు మాకు నివేదించువాడు మాకులమున బుట్టునో అని యాగాధల యభిప్రాయము. దాల్భ్యుడనియె. భర్తలకు భార్యలు భార్యలకు భర్తలు వియోగము పొంద కుండుటకు స్త్రీకి వైధవ్యము కలుగకుండుటకు ఉపవాసమున్న పురుషుడు పత్నీవియోగము పొందకుండుట కుపాయము సెప్పుమన పులస్త్యుం డశూన్య శయన ద్వితీయా వ్రతమందులకు గావింపవలయు నదివినుము.

పులస్త్య ఉవాచ :

అశూన్యశయనాం నామ ద్వితీయాం శృణు భో ద్విజ!

యాముషోష్యన వైధవ్యం ప్రయాతి స్త్రీ ద్విజోత్తమ! | పత్నీ విముక్తశ్చనరో న కదాచిత్ర్ప జాయతే || 7

శేతేజల నిధౌకృష్ణః శ్రియా సార్ధం యదాద్విజ! అశూన్యశయనా నామ తదా శ్రాద్ధేహి సా తిథిః || 8

కృష్ణపక్ష ద్వితీయాయాం శ్రావణ ముని సత్తమ! ఇమముచ్చారయేన్మంత్రం ప్రణమ్య జగతః పతిమ్‌ || 9

శ్రీవత్స ధారిణం శ్రీశం భక్త్యాభ్యర్చ్య శ్రియాసహ | శీవత్సధారిన్‌! శ్రీకాంత! శ్రీధామన్‌ శ్రీపతేచ్యుత! 10

గార్హస్థ్యం మా ప్రణాశం మేయాతు ధర్మార్థకామద! అగ్నయోమా ప్రణశ్యంతు మా ప్రణశ్యంతు దేవతాః || 11

పితరో మాప్రణశ్యంతు మత్తోదాంపత్య భేదతః | లక్ష్మ్యా వియుజ్యతే దేవనకదాచి ద్యథాభవాన్‌ || 12

తథాకలత్ర సంబంధో దేవమేనైవభిద్యతు | లక్ష్మ్యాహ్యశూన్యం వరద! యథాతే శయనం సదా || 13

శయ్యామమాన్యాస్తు తథైవ మధుసూదనః | ఏవం ప్రాసాద్య పూజాంచ కృత్వాలక్ష్మ్యాస్తథా హరేః || 14

ఫలానిదద్యాచ్ఛాయాయామ భీష్టాని జగత్పతేః | నక్తంప్రణమ్యాయతనే హవిర్భుంజీత వాగ్యతః || 15

బ్రాహ్మణాయద్వితీయే హ్నిశయ్యాందద్యాత్సదక్షిణామ్‌ | ఏవంకరోతియః సమ్యజ్నరో మాసచతుష్టయమ్‌ || 16

తస్య జన్మత్రయేదాల్భ్య! గృహభంగోన జాయతే | అశూన్య శయనశ్చాసౌ ధర్మ కర్మార్థ సాధకః || 17

భవత్య వ్యాకృతైశ్వర్యః పురుషోనాత్ర సంశయః | నారీచదాల్భ్య ధర్మజ్ఞ! వ్రతమేత ద్యథావిధి || 18

యాకరోతినసాశోచ్య బంధువర్గస్య జాయతే | వైధవ్యం దుర్భగత్వంవా భర్తృవ్యంగ్యంచ సత్తమ || 19

నాప్నోతి జన్మత్రితయ మేతచ్చీర్త్వా పతివ్రతా |

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే

అశూన్యశయన ద్వితీయా వర్ణనం నామ పంచచత్వారింశ దుత్తర శతతమోధ్యాయః.

ఓవిప్రోత్తమ అశూన్య ద్వితీయనాడుపవాస ముండిన స్త్రీపురుషు లన్యోన్యవియోగము పొందరు. కృష్ణుడు లక్ష్మితో సముద్రమును నిద్రవోపు తిథి ''అశూన్య శయన తిథి'' యనబడును. అది శ్రాద్ధమునకు చాల ప్రశస్తము. అది శ్రావణబహుళ ద్వితీయ. అనాడు జగత్పతి మ్రొక్కి యీమంత్రము పఠింపవలెను. దీనిభావము శ్రీవత్స చిహ్నమును దాల్చిన శ్రీపతిని శ్రీదేవితోగూడ భక్తి తో బూజించి, శ్రీవత్సధారీ! శ్రీకాంత! శ్రీధామ ! శ్రీపతే ! అచ్యుత ! ధర్మార్ధకామద ! దాంపత్య భేదముచే నావలన నాగార్హస్థ్యము నశింపకుండుగాత : అగ్నులు నశింపకుండుగాక! దేవతలు నశింపకుండుగాక! పితృదేవతలు నశింపకుందురుగాక. తమరు లక్ష్మితో నెన్నడుగాని వియోగము పొందకుండునట్లు నాకు కలత్ర సంబంధమెన్నడుగాని విడివడకుండుగాక! ఓ వరద ! నీ శయనము (పాన్పు) లక్ష్మీదేవితో నెన్నడు శూన్యము కానట్లు మధుసూదన ! నా శయ్యయును అశూన్యమగుగాక ! అనియిట్లు హరిం బ్రసన్నుం గావించి లక్ష్మితో హరింబూజించి ఛాయయందు (ఎండయుండగా, పగలు) ఫలములు నివేదించి, రాత్రి మరలదేవతా గృహమునందు నమస్కరించి హవిస్సును మౌనముతో భుజింపవలెను. మరునాడు దక్షిణతో బ్రాహ్మణునికి శయ్యాదానము సేయవలెను. ఇట్లేనరుడు నాల్గుమాసములీ వ్రతము సేయునో యతనికి మూడు జన్మములు గృహభంగము కలుగదు. అశూన్య శయన వ్రతము ధర్మకర్మ సాధకము. మానవుడు దీనిచే నవ్యాకృతైశ్వర్య సంపన్నుడు గాగలడు. స్త్రీకూడ యీ వ్రతము సేసినది బంధువులకు శోకింపవలసినది గాదు. దాల్బ్య ! ఆ పతివ్రత వైధవ్యము దౌర్భాగ్యము భర్తృవిరహమును మూడు జన్మలు పొందురు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున అశూన్యశయన ద్వితీయావ్రతవర్ణనమను నూటనలుబదియైదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters