Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటనలుబదిమూడవ అధ్యాయము - పాత్రాపాత్ర నిరూపణము

కసై#్మ శ్రాద్ధంనదాతవ్యం కేన భుక్తం మహా ఫలమ్‌ | భవతీహ ద్విజశ్రేష్ఠ తన్మమాచక్ష్వ పృచ్ఛతః || 1

మార్కండేయఉవాచ:

అనూఢా తనయో రాజన్యశ్చ పౌనర్భవః సుతః | శూద్రా పతిర్దురాచారో వాణిజ్యాయుధ జీవనః || 2

తథా వార్ధుషికో యశ్చ శూద్రస్యచ పురోహితః | పర్వకారస్తథా సూచీయస్యచో పపతిర్గృహే || 3

కృత్వానక్షత్ర నిర్దేశం యశ్చ జీవతి పార్థివ! | చికిత్సి తేన చ తథా య స్యపృత్తి ర్నరేశ్వర! || 4

వేదవిక్రయకో యశ్చ వేదనిందక ఏ వచ | తర్క శాస్త్రేణ దగ్ధశ్చ నాస్తి కోధర్మవర్జితః || 5

పిత్రావివద మానశ్చయశ్చైవోపనయేద్బహూన్‌ | అయాజ్యయాజీస్తేనశ్చయక్ష్మీ కితవ ఏవచ || 6

శ్విత్రీచయస్తథాకాణో బధిరోంధఃకుణిస్తథా | పరపూర్వా పతిశ్చైవ గ్రామప్రేష్యో నిరాకృతిః || 7

అవకీర్ణీ కుండగోలీ కునభీ శ్యావదంతకః | కన్యా దూష్య భిశస్తశ్చ మిత్రధ్రుక్‌ పిశునస్తథా || 8

పరివిత్తః పరివేత్తా తస్యకన్యా ప్రదశ్చయః | యాజకశ్చ తథా తస్య సోమవిక్రయకస్తథా || 9

కూట సాక్షీచ వాగ్దుష్టః పరదారో వికర్మకః | తథా చైవాపవిద్ధాగ్నిః విరుద్ధ జనకస్తథా || 10

యశ్చహీనాతిరిక్తాంగో దుశ్చర్మాదమ కస్తథా | యశ్చయుక్తస్తథా రాజన్‌ పాతకైశ్చోపపాతకైః || 11

ద్నిషన్మిత్రే ఉభే చైవ ప్రయత్నేన వివర్జయేత్‌ అతః పరంప్రవక్ష్యామి బ్రాహ్మణాన్పంక్తి పావనాన్‌ || 12

వజ్రుడెవ్వనిని శ్రాద్ధమందు బ్రాహ్మణునిగా బిలిచిపెట్టవలెను. ఎవనికి పెట్టగూడదో తెలుపుమన మార్కండేయుడనియె. వివాహముకానిదానికి బుట్టినవాడు పౌనర్భవుడు శూద్రస్త్రీ మగడు దురాచారుడు వాణిజ్యముచేత ఆయుధముచేత జీవించువాడు వార్ధుషికుడు శూద్రపురోహితుడు పర్వాకారుడు సూచి ఉన్నవాడు తిథులు నక్షత్రాలు చెప్పి జీవించువాడు వైద్యవృత్తి సేయువాడు వేదవిక్రయి వేదనిందకుడు తర్కశాస్త్రదగ్ధుడు నాస్తికుడు ధర్మదూరుడు తండ్రితో వివాద పడువాడు పెక్కుమందికి (సామూహిక )ఉపనయనములు చేయించువాడు అపాత్రునిచే యజ్ఞము సేయించువాడు దొంగ యక్ష్మవ్యాధిగలవాడు జూదరి శ్విత్రి ( బొల్లిగలవాడు) కాణుడు గ్రుడ్డివాడు చెవిటివాడు కుణి పరపూర్వాపతి (జారిణి మగడు గ్రామ నౌకరు పరివేత్త (అన్నకు పెండ్లికాకుండ పెండ్లైనవాడు) వానికి కన్యనిచ్చినవాడు వాని యాజకుడు సోమవిక్రయి కూట సాక్షి దుష్టవాక్కు పరదారుడు వికృతకర్ముడు దైవికముగ నగ్నిభ్రష్టుడు (జఠరాగ్నిలేనివాడేమో) లోకవిరుద్దులను గన్నవాడు హీనాంగుడు అధికాంగుడు దుష్టచర్మముగలవాడు దమకుడు పాతకోపపాతకములుకలపాడు శత్రుడును మిత్రుండును (వీరిద్దరు మిక్కిలి నింద్యులు). ఇక పంక్తిపావనులైన (పంక్తిలో గూర్చున్న పంక్తిలో నందరిని బవిత్రులంజేయగలవారు) బ్రామ్మణులం జెప్పెద వినుము.

బ్రహ్మదేయాను సంతానః తపస్వీ విజితేంద్రియః | పారగోయజుషాంయశ్చ సామవేదస్య పారగః || 13

ఋగ్వేదపారగో యశ్చ భృగ్వంగి రసపారగః | అథర్వ శిరసోధ్యేతా త్రిసువర్ణస్య పారగః || 14

త్రిణాచికేతః పంచాగ్ని ధర్మశాస్త్ర విశారదః | పురాణపారగో యశ్చ ఇతిహాస విశారదః || 15

అధీతే సోత్తరం యశ్చ విష్ణుధర్మ మిదంశుభమ్‌ | విజానాతి యథా వచ్చ యశ్చ వ్యాకరణం నృప! 16

జ్యోతిషశ్చ తథా వేత్తా ఆయుర్వేద స్యచద్విజః | తాభ్యాంవృత్తింనచేత్కుర్యాద్వృతిస్తా భ్యాం విగర్హితా || 17

అహితాగ్నిశ్చయో విద్వాన్‌ సోమపశ్చద్వి జోత్తమః | గురు శుశ్రూషణ పరస్తీర్థ పూతశ్చయాదవ!

గాయత్రీ జాపనిరతో యోగీధ్యాన పరాయణః || 18

యస్వాప్యనంతేజగతా మధీశే భక్తిః పరాయాదవ! దేవదేవే |

తస్మాత్పరం నాపరమస్తి కించిత్‌ పాత్రంత్రిలోకే పురుష ప్రవీర!

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే పాత్రాపాత్ర పరీక్షా విధిర్నామ త్రిచత్వారింశదుత్తర శతతమోధ్యాయః.

బ్రహ్మదేయానుసంతానుడు=బ్రహ్మణ ''పరబ్రహ్మార్పణమస్తు'' అని పరబ్రహ్మకు సమర్పణముగా దేయం=ఇవ్వబడినది. శ్రౌతస్వార్తాది కర్మ. దాని అను=అనుసృత్య అనుసరించి ప్రవృత్తమైన సంతానం=పితృపితామహాది సంతతిగలవాడు అనగా పరబ్రహ్మ ప్రీతిగా కర్మానుష్ఠానులైనవారి వంశమునుబుట్టినవాడు-లేదా బ్రహ్మ=వేదము కర్మ-ఉపాస-జ్ఞానరూపకాండ త్రయాత్మకము యథాధికారం =వేదవేదార్థ విదులచే శ్రేయోర్థులకు ఉత్తమాధికారులకు దేయః=ఇవ్వదగినది. అట్టివారిని అను =అనుసరించి ప్రవృత్తమైన సంతతి కలవాడు అనగా పరం పరబ్రహ్మ విద్యా గురుశిష్య సంప్రదాయాను గతుడైనవాడు. అతడు పంక్తి పావనుడని భావము. మొత్తముమీద మొట్టమొదటి యర్థములో అనూచాప శ్రౌత స్వార్తాది కర్మానుష్ఠాత యని రెండవ సమన్వయార్థములో అనూచాన సగుణ నిర్గుణ బ్రహ్మవిద్యాభిజ్ఞుడనియు తేలిన యీ యిద్దరును పంక్తి పావనులని ఫలితార్థము.

తపశ్శాలి జితేంద్రియుడు యజుర్వేదపారగుడు సామవేద విశారదుడు ఋగ్వేద పారగుడు భృగ్వంగిరస పారగుడు అథర్వ శిరోధ్యయన మాచరించినతడు త్రిసువర్ణ వేత్త త్రిణాచికేతుడు పంచాగ్ని ధర్మశాస్త్ర విశారదుడు పురాణతిహాస పారంగతుడు. ఈ విష్ణు ధర్మోత్తరముతో శుభదమై విష్ణుపురాణ మధ్యయనము సేసినయతడు వ్యాకరణవేత్త జ్యోతిశ్శాస్త్రాయుర్వేదములు దెలిసినవాడు. వానివలన (వృత్తి) జీవనము సేయనివాడు (జ్యోతిషాయుర్వేదముల వలన జీవనము బహునింద్యము) అహితాగ్ని విద్వత్సోమయాజి గురుశుశ్రూషాపరుడు తీర్థపూతుడు (తీర్థయాత్రలను సేవించినవాడు) గాయత్రీజప తత్పరుడు యోగి ధ్యానపరుడు. ఎవని కనంతుడు జగదధీశుడగు దేవదేవుని యందు పరమభక్తిగలదో వానికిపైని క్రిందనుగూడ ముల్లోకములందు నేకొంచెము లేదు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున పాత్రాపాత్ర నిరూపణమను నూటనలుబదిమూడవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters