Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటముప్పది రెండవ అధ్యాయము - చంద్రోదయ వర్ణనము

సూర్యాస్తమయ మిచ్ఛంతీం జ్ఞాత్వారంభా తథోర్వశీమ్‌ | వినోదార్థంహి తస్యాశ్చదర్శయామాసతద్వనమ్‌ || 1

చారుప్రసూనం పశ్యేమంసుభ##గే చంవకద్రుమమ్‌ | త్వర్గాత్రవర్ణ సదృశైః సమంతాత్కుసుమైశ్చితమ్‌ || 2

ఇమంచదాడిమం పశ్యః పుష్పితం వామలోచనే! | యోయంచిభర్తి కుసుమైస్త్వ దీయామధరశ్రియమ్‌ || 3

పశ్యకామశరాకారం సహకారం మనోరమమ్‌ || యత్రచాత్మ సముత్పన్నా రూఢా స్తస్యమహాత్మనః || 4

శ్రియంకపోలయోన్తుభ్యమాదదానైర్మనోరమైః | పుషై#్పరుపేతా! చార్వంగి! మధూకం వశ్యశోభ##నే! || 5

త్వత్పయోధరసంకాశైర మ్యైరుపచితంఫలైః | పర్యతాల ద్రుమం సౌమ్యే !మనసఃప్రీతివర్థనమ్‌ || 6

స్తంభై స్త్వదూరు సంకాశైః కదలీం పశ్యశోభ##నేః | సువర్ణాచారుసర్వాంగీ నిర్మితా విశ్వకర్మణా! || 7

వశ్యామిముక్తకలతాం కుసుమాఢ్యాం మనోహరామ్‌ | త్వత్కేశపాశ సంకాశై ర్ర్భమరైరుపశోభితామ్‌ || 8

వశ్యేమం కుందవిటవం త్వద్దంత సదృశైఃశుభైః | సమంతా చ్ఛోభితం పుషై#్ప ర్విశాలాక్షి! మనోహరైః || 9

పశ్యచోత్పలినీమేతా ముత్పలై రుపశోభితామ్‌ | త్వన్నేత్రసదృశైః పుల్లైర్మనోహృదయ నందనైః || 10

నశినీంసుభ##గే! పశ్య కమలైః పుష్పితైర్యుతామ్‌ | తవనిఃశ్వాసగంధాఢ్యైః సావర్ణె ర్వజ్రకేసరైః || 11

రాజహంసానిమా స్పశ్య! నశినీతీర గోచారాన్‌ | గమనంసు మనోహారి త్వదేయమివ శిక్షితాన్‌ || 12

త్వత్సరాగ్ర విధానౌమ్యే! ధారయత్భిశ్చపల్లవాన్‌ | క్రీమశైలమిమంపశ్య యుక్తంబహు విధైర్ద్రుమైః || 13

క్రీడాశైలేచూత గతః కోకిలః కామవర్ధనః | కూజత్యయం మనోహారి స్వనేన సదృశేన తే || 14

క్రీడాశైలే నదీం పశ్యః నినృతాం శీతలోదకామ్‌ | తుల్యంతే మనసాసామ్యే వహంతం నిర్మలంజలమ్‌ || 15

బహ్వాశ్చర్య యుతంసౌమ్య! దర్శనీయం వనంబహు | కింసుపశ్య విశాలాక్షః సూర్యోస్తముపగచ్ఛతి || 16

త్వాంతుకామవశాంజ్ఞాత్వా కృపయేవదివాకరః | సంవృత్తాంశుధరో దేవప్త్వస్త మాయాతి భామిని! || 17

కఠోరాణ్యపి పత్రాణి పల్లవానీవసుందరి! | అస్తతాసాసుర క్తాని రాజంతే శాభినాం భృశమ్‌ || 18

గిరీణాం శిఖరాన్రక్తా న్కరోత్యేష దివాకరః | జగామాస్తం విశాలాక్షిః కృతకర్మా దినక్షయే || 19

సంధ్యాకాలేర క్తేన ప్రతీచం పశ్యశోభ##నే! | ఆలింగమానాం సహసాకామినీమివ కామినా || 20

సాంప్రతం నియమోపేతా ద్విజా ద్విజవరౌద్భవే! | సంధ్యాకాలముపాసంతే సంతాంమార్గమనువ్రతాః || 21

అనుయాతారవింసంధ్యా గతమ స్తమపిప్రభుమ్‌ | సాధ్వీవవనితా కాంతేకులజాతా మనస్వినీ || 22

యాస్యమానం సునాసోరుః తమసాపశ్యభూతలమ్‌ | భృంగోదరత మాలానాం తుల్యేనవవర్ణిని || 23

వ్యాప్తంహి తమసాసర్వర్‌ న విరాజతికించన | మనినేనాయతా పాకగి! జగత్సర్వం సమీకృతమ్‌ || 24

అస్యాంహి సభి! వేలాయాం మదనేన వశీకృతాః | నీలాంబరధరాః కాంతాః యాంతికాంతానల ంకృతాః || 25

పశ్యోదితంచసుభ##గే! సుభగంచంద్రమండలమ్‌ | పానమత్తపురంధ్రీణారవదనేన సమత్విషమ్‌ || 26

కించిదాక్రమ్యగగనం శ్వేతకాంతిగతంసఖి | పశ్యచంద్రమసంసుభ్రు! నయనానందకారకమ్‌ || 27

జగతోన్యతమోగత్వా శశాంకః సత్త్వసంనిభః | విరాజత్యమలం సౌమ్యే! గగనేసితసుప్రభే! ||28

కామబాణహతాయాస్తే సదృశం గండయోఃశ్రియా | బిభర్త్యుభయతశ్చంద్రో జ్యోత్స్నాజాలం సముత్సృజన్‌ || 29

చంద్రరాజతకుంభేన దిశేయం వరవర్ణిని! | జ్యోత్స్నాచ్ఛలేన క్ష్మాదేవీ రాజతీవ విరాజతే || 30

చంద్రమస్యుదితే పశ్య పుల్లాం కుముదినీం శుభే! | త్వదీయహాససంకాశైః కుసుమైరుపశోభితామ్‌ || 31

విరహే చక్రవాకోయం రక్తాముత్పలినీంశుభే! | సితామివ సుదుఃఖార్తో విశత్యాయతలోచనే || 32

చంచ్రకాంతగృహాదస్మాచ్చంద్రరశ్మి సమప్రభాః | చంద్రరశ్మి పరామృష్టాః పతంత్యుదక బందవః || 33

ఆలింగితా చంద్రమసా జహౌరాత్రి స్తమఃపటమ్‌ | కామినేవవిశాలాక్ష! కామినీవసనం శుభా || 34

చంద్రోదయే చంద్రసమాన వక్త్రే ! నరేంద్ర చంద్రే ప్రమదావరీస్మిన్‌ |

పశ్యత్యమాశంసచజీవితాశాం | త్వద్భాగ్యనున్నం సహసాప్రవిష్టమ్‌ || 35

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ఉపవనే చంద్రోదయ వర్ణనోనామ ద్వాత్రింశదుత్తర శతతమోధ్యాయః.

మార్కండేయుడనియె:- రంభ చంద్రోదయమున కెదురు నూచుచున్న యూర్వశింగని వినోదము కొఱకామె కావనమున జూపించెను. చెలీ? ఈ తోటలో పూవులతో నిలపుగుల్కు నీ చంపక ద్రుమముం జూడవె. ఇది నీ మేని రంగునకు సరియగు నిండ జూచిన విరుల నిండుకొని యున్నది. ఓ వామనయనా! ఇదిగో పుష్పించిన యీ దానిమ్మ చెట్టు గనవె. పువ్వులతో నిది నీ యధర బింబము సొంపుగొని యుల్నది. ఇరిదె జూడు మీ సహకారము పంచశర శరాకారమెంత మనోహరముగ నున్నది! నీ మెఱుగు చెక్కిళ్లు కొక క్రొత్తయనుందల వరించు పువ్వులతో నున్న మదూకమును (ఇప్పచెట్లును) గనుము. నీ పయోధరములట్లతి రమ్యములయిన పండ్ల బరువెక్కి మనసున కెంతేని వేడుక గూర్చు నీ తాటిచెట్టు వంక చూపు నిల్పుము. కల్యాణీ? నీ యూరపులకు సరైయై నిల్భు నీయరటింగ గనుగొనవె. విశ్వకర్మ దీనికి చక్కని వన్నె గూర్ఛి సర్వాంగ సుందరముగ నిర్మించినాడు. పువ్వుల విరియబూచి మనసుందొంగిలుచున్న యీ యవిముక్తలతికం దిలకింపవే. ఇది వేనలి కెనయై తుమ్మెదలు ముసరనెంతేని ముచ్చట గొల్పుచున్నది. విశాలాక్షీ! ఇటుచూడు మీమొల్ల తరువు. నీ పలువరుస కీడుగా చక్కని హపుల మిగుల రాణించుచున్నది. ఇది యుం గనుగొనవె. ఈ కలువపూ దీగ నీ కనుల కెనయగు విరిసిన కలువలడెందమున కానందము నించుచున్నది చక్కగ విరసిన కమలములతో నిండిన యీ తామర తీగనో సుందరీ! కాంచు మిది నీ యూర్పులనెత్తావుల జిమ్ముచు బంగారు కింజల్కముల నొల్లసిల్లు విప్పారిన కమలము నెంతేని సొంపు నింపుచున్నది. తామర కొలని దరులందరిసిన యీ రాయచలం గనుమివి నీ మనోహర మందగమనము పిలాసము పేర్చికొన్నట్టున్నవి. నీ కెంగేలి రంగు గొనిన లేజిపురులం దేజిరిల్లు పలురకము లయిన తరుపులనలము కొన్న యీ క్రీడా శైలమును నీక్షింపుము. ఈ విహార గిరిపై నున్న తీయ మావిగున్నపై నుండి మరునూరక యెస కొల్పుచుం నీ మథుర కంఠ స్వరమునకు సరిగ గూయుచు మనసు నాచికొనుచున్నధదిగో కోకిల. క్రీడాద్రి నుండి వెడలుచున్న యీనదిం జూడుమిది నీ మనసు వలె నతి స్వచ్ఛమైన చల్లని తేట నీట గాటముగ దనియంచుచున్నది. ఎంతయు వింత గొల్పుచు నెంతేని జూడ ముచ్చటయగు నీ చల్లని పూదోట నాలో కింపు ముదిమదిగో నీవు కాము బారికిం జిక్కితవని తెలిసి జాలిం గొని కాబోలు జగద్భంధువు తన కరముల నిమిడించి కొని రవి చాటగు చున్నాడు. ఓ సుందరి! ఎంతచిరు సైనవియు చెట్ల యాకులం జివురాకులును సూర్యాస్తమయ సమయ తాపమున తాయెఱుపెక్కి మిక్కిలి దీపించుచున్నవి. దినకరుడు గిరి శిఖరముల నెరుపార జేయుచున్నాడు.

రవి స్వధర్మము నిర్వర్తించి దివసాన మందస్త మించి నాడు. కల్యాణీ! అదురక్తిమైన సంధ్యా కాలము తనంత నొక కాముకు డొక్క కామిని నట్ట ప్రాగ్దిక్కును కౌగిలించు కొనుచున్నదల్లదిగో చూడుము! ద్విజశ్రేష్ఠులు నీయమముగొని సత్పురుషుల మార్గముననువర్తించుచు నిపుడు సంధ్యాకాలము నుపాసించుచున్నారు. (సాయం సంధ్యా వందనము సేయుచున్నారన్నమాట.) అస్తంగతుడైనను సూర్య ప్రభువును కులీనయమునస్వినయు నగు సాధ్వివలె సంధ్యా దేవి అనువర్తించు చున్నది. ఓ నునాసోరూ! (చక్కని ముక్కు చక్కని ఊరువులును గలదానా!) చూడు మిది. భూతలము తుమ్మోదలలముకొన్న తాపింఛ వృక్షములతో పోలికగ చీకటిం గ్రమ్ముకొన్నది. సర్వము గాఢాంధకార బంధురమై యేమియు గనిపించుట లేదు. సర్వజగత్తు మాలిన్యముచేనేకరూప మయినది. సఖీ! ఇత్తఱి బిత్తఱులు కామాయత్తలై నల్లని చీరలు గట్టుకొని నగలుపెట్టుకొని కాంతులు గదియ జనుచున్నారు. ఓ సుందరీ! అల్లదిగో చూడు చంద్ర బింబముదయించినది. అది పౌన్మతవైన మత్తకాశినుల నెమ్మోములతో సమముగ ప్రభలొల్కు చున్నది. ఇంచుకగ గగన మాక్రమించి యది తెల్లదన మంది నయనానందకరమగుచు చంద్రుని జూడుము. శశాంకు డొక సత్త్వ మట్టీ జగమ్ము నలము కొన్న తమస్సును (చీకటిని) దూరి పాటి అచ్చము తెలికాంతి గులుకు నాకసమున స్వచ్ఛముగ రాజిల్లు చున్నాడు. అనగా తమోగుణవశుడైన వాడు. పుడమి విడిచి కేనలసత్త్వగుణ సంపన్నుడై మీది కేగి పుణ్య లోకముల రాజిల్ల బూనిన పుణ్యాత్ము నట్లున్నాడని భావము. చంద్రుడిరు వంకల నేకరూపముగ వెన్నెలల జిమ్ముచు కామబాణ నిహతలైన నీ చెక్కిశుల తళుకు గొని యున్నాడు. ఈ తూర్పుదిశ చంద్రుడును వెండిబిందెందాల్చి ఈ భూదేవి వెన్నెల నెపమున కేవల రజతమయయో యన్నట్లు (కేవలం వెండితో చేసినదో యన్నట్లు) రాజిల్లు చున్నది.

చంద్రుడుదయింప విప్పారిన కునుదిని (నల్లకలువ తీగ) నీ చిఱు నవ్వుల సరిపుచ్చు పువ్వులతో మిక్కిలి శోభించు చున్నదల్లదె చూడుము. విశహము గొని యీ చక్రవాక వక్షి మిక్కిలి దుఃఖము గని పిరహ తాప శాంతికి కాబోలు చల్లని తెల్ల గలువ గతీ లోనికి జొచ్చుచున్నట్లున్నది.

ఈచంద్రకాంతసదసమునుండి చంద్రకిరణసమప్రభలును చంద్రకిరణ సంఘృఫ్టములునైన నీటిచినుకులుపడుచున్నవి. విరహదశలో నాయకుడు గురియు నశ్రుబిందువులో యన్నట్లు మంచు బిందువులు గురియు చున్న వన్నమాట. చంద్రునిచే గౌగిలికిం దార్చబడి రాత్రి (కాముని కౌగిట నున్న కామినివలె) తమః పటమును (చీకటి యను పలువను) విప్పికొన్నది. ఓ చంద్రాసనా! ఈ చంద్రోదయమందు ప్రమదామనోహరుడైన యీ నరేంద్ర చంద్రునందూర్వశీ! నీవు జీవితాశను దర్శింపుము (బతుకుతెఱువు గమనింపు మన్నమాట) అంతియకాదాతని యందు ప్రాణములమీది యాశనుబెట్టుకొనుము. అని రెండవయర్థము (ఇది నీ భాగ్య విశేషమున తటాలున నీకు తారసిల్లినది.)

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున చంద్రోదయవర్ణనమను నూటముప్పదిరెండవ అధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters