Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటపదమూడవ అధ్యాయము - అత్రివంశాను కీర్తనము

మార్కండేయువాచ :- 

అత్రివంశ సముద్రూతాన్గో త్రకారాన్ని బోధమే | కర్పూరాయణ శాఖేయాస్తధా శారాహణాశ్చయే ||

శైవాలకీ శౌనవర్ణిరఘో సౌద్రుతయశ్చయే | గౌరగ్రీవ స్సకారంజి రథ మైత్రాయణాశ్చయే || 2

అత్మయన్యా నామరథ్యా గోపనాస్తాకి బిందవః | హ్వానజిద్బాహు రింద్రోవి రైద్రాలికి శాకటాయనః || 3

తైతీయశ్చైవ జాతీయ శ్చాత్రిగౌణీ మతిస్తధా | జలదోభాగపాదశ్చ సౌపుష్పిశ్చ మహాతపాః || 4

ఛాందోగేయ స్తధైతే షామార్షేయః ప్రవరోమతః | ధ్యారాశ్వాశ్చత ధాత్రిశ్చ ఋచనానసంఏవచ || 5

పరస్పరమ వైవాహ్యా ఋషయః పరికీర్తితాః | దక్షిర్మాలిః పాలకృచ్చ జార్ణనాభిః సిలిర్మిలిః || 6

భీజవాపీ శిరీషశ్య మౌంజకేశి గవిష్ఠిరౌ || బలంధన స్తధైతేషాం త్ర్యార్షేయః ప్రవరో మతః || 7

అత్రిర్గవిష్టిరశ్చైవ తధా పూర్వాతిథిః స్మృతాః | పరస్పరమవైవాహ్వాః ఋషయః పరికీర్తితాః || 8

ఆత్రేయాన్పుత్త్రికా పుత్రై నత ఊర్ధ్వం నిబోధమే | హాలేయశ్చ సవాతీయో నామమథ్య స్తధైవచ || 9

గోత్రేయశ్చైవ గోత్రేయాః త్ర్యార్షేయాః పరికీర్తితాః | అత్రిశ్చవామరథ్యశ్చ పౌత్రిశ్చైవనుహానృషిః 10

పరస్పర మవై వాహ్యాఋషయః పరికీర్తితాః | ఇత్యత్రి వంశ ప్రభవాస్తవోక్తా || మహానుభావ నృప | గోద్రకారాః || 11

యేషాంతునామ్నాం పరికీర్తనేన | పాపం సమగ్రం పురుషో జహాతి ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరె ప్రధమఖండే అత్రివంశాను కీర్తనం నామద్రయోధశాధిక శతతమోధ్యాయః

మార్కండేయుడనియె. అత్రివంశీయులగు గోత్ర కర్తల నిక దెలియుము. వారు కర్పూరాయణ శాఖేయులు శారాహణులు శైవాలకుకు శైనవర్జులు రఘో సాద్రుతులు నను పేరనున్నవారు. గౌరగ్రీవుడు సకారంజి మైత్రాయణులు ఆత్మయనులు వామరథ్యులు గోపనులు తాకిబిందులు హ్వానజిత్తు బాహువు ఇంద్రోవి ఐంద్రాని శాకటాయనుడు తైలేయుడు బౌలేయుడు అత్రిగౌమణితి జలదుడు భగపాదుడు సౌపుష్పి ఛాందోగేయుడు నను నీ ఋషుల ప్రవర చెప్పబడినది. ధ్యారాశ్వులు అత్రి ఋచనాకానసుడు ననువీరు పరస్పర వివాహమాడ తాదు. దక్షి బలి పాలకృత్తు జార్ణనాభి సిలి మిలి బీజవాపి శిరీషుడు మౌంజకేశి గవిష్ఠిరుడు బలంధనుడు ననువారి ప్రవర త్ర్యార్షేయము. అత్రి గవిష్ఠిరుడు పూర్వాతి యనువారు పరస్పర వివాహమాడరాదు. ఆత్రేయుల పుత్రాకాపుత్రుల నిక నావలన వినుము. హాలేయుడు సరాలేయుడు వామమథ్యుడు గోత్రేయుడు నను నీ గోత్రములవారు త్ర్యార్షేయులు. అత్రి వామరథ్యుడు పౌత్రియు ననువారు పరస్పరము వివాహమాడరాదు. అత్రి వంశీయులు మహానుభావులు గోత్ర కర్తలు వేరిని నీకుదెల్పితిని. వీరి నామ సంకీర్తనముచే మానవుడు సర్వపాపమును వీడును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున అత్రి వంశాను కీర్తనమను నూటపదమూడవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters