Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటతొమ్మిదవ అధ్యాయము - పృథుపట్టాభిషేకము

అద్య మాజగవం నామ ధనుర్గృహ్య మహాయశాః | దృష్ట్వా జాతం పృథుం దేవాః సర్వఏవసవాసవాః || 1

అజగ్ముః పుష్కరంతీర్థ మభిషేక్తుంతదా పృథుమ్‌ | తంచాభిసిషిచుర్దేవా రత్నచిత్ర వరాసనే || 2

బ్రహ్మా విష్ణుశ్చ రుద్రక్చ చంద్రాదిత్యౌ ప్రభాకరౌ | దిశశ్చ విదిశ##శ్చైవ లోకపాలాః నవాసనాః || 3

సర్వదేవగణాశ్చైవ ఋషయశ్చ తపోధనాః | స్వంస్వంతోయముపాదాయ నముద్రాశ్చనరాధిప || 4

సరాంసి సరితశ్చైవ సర్వేతీర్థవరాస్తధా | సోభిషిక్త స్తదాశ్రీమాన్‌ వేనపుత్రః పరంతప! || 5

సంవత్సరః కృతస్తస్య వృద్ధగర్గో మహాయశాః | స్థితాః శిష్యపరావిత్యం తస్యోత్పాత నిరీక్షణ || 6

పురోహితః కృతస్తస్య యాజ్ఞవల్కో మహాయశాః | అధర్వణ నయస్తస్య సర్వాన్దోషాన్వ్యపోహత || 7

ఉశనాశ్చ తథామంత్రీ కృతస్తస్య మహాత్మనః | షాడ్గుణ్యమోగాద్యస్తస్య సర్వదోషాన్వ్యపోహత || 8

కమలాభరణోనామ సువ్రతీక సుత స్తదా | రాజహస్తీ కృత స్త స్వస్యయంగర్గేణధీమతా || 9

శ్రీసుత స్తురగః శ్రేష్ఠః శశాంకసదృశచ్ఛవిః | మంగలాశ్వః కృతస్తస్య వృద్ధగర్గేణ పార్థివ || 10

స్వయందేవ వరైస్తస్య దత్తాని మనుజాధిప | ఛత్రం సవాలవ్యజనం ఖడ్గంచ వసుధాధిప || 11

తస్యలక్షణ సంయుక్తం దదుర్దేవా నరేశ్వర! | ఇత్యేవంచాభిషిక్తస్తు ర్వైనో మహాయశాః || 12

దేవతలా అజగవమను విల్లు పట్టుకొని పుట్టిన పృథుపుంగని యందరు నతని నభిషేకించుటకు పుష్కరతీర్థమున కేతెంచిరి. రత్న చిత్ర సింహాసన మందాతని నిలపి యభిషేకించిరి. బ్రహ్మ విష్ణు రుద్రులు చంద్రాదిత్యలు దిక్కులు విదిక్కులు నింద్రునితోడి దిక్పాలురు సర్వ దేవగణములు తపోధనులయిన యెల్ల ఋషులు, తమ తమ తోయములంగొని సముద్రములు సరస్సులు నరిత్తులు (నదులు) సర్వతీర్థ రాజములు వచ్చిరి. వేనసుతుడుం తట శ్రీమంతుడు పృథు వభిషిక్తుడయ్యెను. మహాయశుడు పృద్థ గర్గుడు సంవత్సరుడుగ (జ్యోతిషుకుడుగ) నుండ నాయన శిష్యులు నిరంతర మాతని కేవేని యుత్పాతములు గలుగునేమోయని కనిపెట్టుచుండు వారైరి. అతనికి యాజ్ఞవల్క్యుడు పురోహితుడుగావింపబడెను. అధర్వ వేదోక్త విధానమున నాతడా రేనికేదోషము గలుగకుండ శాంతి నోనరించెను. (ఉపద్రవ శాంతి కల్ప మధర్వ వేదోక్తము. రాజ పురోహితుడందుచే నధర్వ వేదవేత్తయయి యుండవలెనచి శాస్త్రములు తెల్పుచున్నవి.) ఆ మహాత్మునికి ఉశనుడు=శుక్రాచార్యుడు మంత్రి గావింప బడెను. ఆయన షాడ్గుణ్యముచే =సంధివిగ్రహయానాసనద్వైధీభావసమాశ్రయములను రాజనీతి ప్రతిపాదితములగు నాఱువిధానముల వలన రాజ్యాంగ మందేదోషము లేకుండ జూచెను. సుప్రతీకమను దిగ్గజము యొక్క కొడుకు కమలాభరణుడను గజరాజును ప్బద్ధగర్గా చార్యుడాతనికి పట్టపుటేనుంగొనరించెను. అతడే శ్రీదేవికి పుట్టిన చంద్రసమాన వర్ణమగు శ్రేష్ఠమైన గుఱ్ఱమును ఆతనికి మంతళాశ్వముం గావించెను. (ఇట మంగళ శబ్దము పంచకల్యాణి గుఱ్ఱమును జ్ఞాపనము చేయును.) దేవతాశ్రేష్ఠులు స్వయముగ ఛత్రము చామరము సులక్షణ మైన ఖడ్గమును నాతని కొసంగిరి. ఇట్లా వైస్యుడు శాస్త్రోక్త విధానమున పట్టాభిక్తు డయ్యెను.

విధినాశాస్త్రదృష్టేన బ్రాహ్మణౖర్మంత్ర పారగైః | తస్యపైతామహేయజ్ఞే హయమేధే పురాతనే || 13

ఆప్తుర్యామన్యసుత్యేహ్ని సూతోజాతః పరంతప! | పామగేష్వథగాయత్సు అధ్యరే వైశ్వదేవికే || 14

మాగధశ్చ సముత్పన్న న్తస్మిన్నేవ మహాక్రతౌ | పృథోన్తవార్థలతౌరేవౌ చోదితా వృషిభిస్తధా || 15

ఊతుచస్తౌ తదాదేవా నృషీంశ్చ ప్రణతౌ స్థితౌ | కర్మభిస్తూయతేసర్వః కర్మచాస్యన విద్మహే || 16

కర్మణశ్చప్యవిజ్ఞానా స్తోషావ స్తత్కంథం పృథుమ్‌ || 17

ఋషయఊచుః : అస్మత్ర్పభావ విజ్ఞాతౌ స్తువతా మవిచారతః ||

మార్కండేయ ఉవాచ : ఋషిభిన్తౌ నియుక్తౌతు తుష్టువాతే స్వకర్మభిః | భవిష్యత్పృథివీపాలం దివ్యజ్ఞానౌ పరంతపౌ || 18

తయోర్వైన్యస్తు సంప్రీతః ప్రభుఃప్రాదాత్ర్పజేశ్వరః | అనూపదేశం సూతాయ మగధం మాగధాయచ || 19

ఆ పృథుచక్రవర్తి పితామహుడు సేసిన యశ్వమేధ యాగమందు ఆప్తుర్యామము యొక్క సుత్యాహస్సువందు సూతుడు జనించెను. వైశ్వదైనిక యాగమందు సామగులు (ఉద్గాతలు) సామగానము సేయుచుండగ నదే యజ్ఞమందు ఇద్దఱు సూతమాగధులనువారు పుట్టిరి. ఋషులు వారిని పృథుచక్రవర్తిని స్తుతించుచు పాటలు పాడుడని ప్రేరణ సేసిరి. ఆ యిద్దదును దేవతలకు ఋషులకు ప్రణతిసేసి నిలువడడి యెవ్వడేని చేవిన పనులంబట్టి (చరిత్రంబట్టి) కీర్తింప బడును. ఇతని పనులేమో (చరిత్రయేమో) మేమెఱుంగము. బౌత్తిగా నది యెరుంగకే మీతని నెట్లు పొగడుదు మనిరి. అప్పుడు ఋషులు మా ప్రభావము మీఱరుగుదురు గద! దానిం బట్టి యీతనిం గొనియాడుడన వారిద్ధరు కాబోవు చక్రవర్తి నానానిని దివ్య జ్ఞానమును గొని స్తుతించిరి. వారియెడ పృథువు మిక్కిలి ప్రీతినొంది సూతునికి అనూపదేశమును (జలప్రాయ ప్రాంతమును) మగదునతి మగధదేశమును బహూకదించెను.

తతో వైన్యం మహాభాగం ప్రజాస్తాః సంప్రదుద్రుపుః | త్వంనో వృత్తిం దదస్వేతి మహర్షివచనా త్తదా || 21

సోభిద్రుతః ప్రజాభిస్తు ప్రజాహితచికీర్షయా | ధనురాదాయబాణాంశ్చ వసుధాం మర్దయ న్బలీ || 21

తతో వైన్యం భయత్రస్తా గోర్భూత్వా ప్రాద్రవన్మహీ | బ్రహ్మలోకాదికాన్లోకా న్నచత్రాణ మవిందత || 22

సర్వత్రైవ పృథుంవైన మాత్తకార్ము మచ్యుతమ్‌ | దదర్శసుమహాభాగం తేజసా భాస్కరప్రభమ్‌ || 23

అలభంతీతు సాత్రాణం వైన్యమేవాన్వపద్యత | కృతాంజలిపుటాదేవీ పూజ్యాలోకై స్త్రిభి న్తదా || 24

ఉవాచవైనృం నాధర్మం స్త్రీవధే పరివశ్యసి | కథంధారయితా చాసి మాయాహీనస్త్విమాః ప్రజాః || 25

అటుపై నా మహాబాగుని దరికాతని ప్రజలు పరుగెత్తి మహర్షులు మాటం బట్టి నీవు మాకు వృత్తము (బ్రతుకు తెరువు) దయ సేయుమనిరి. ఆతడు ప్రజల హితము కోరి దనుర్పాణమును గొని వసుధను మర్తింపబరువిడెను. ఆ బలశాలిని గని పుడమి గోవై జడిసి పారిపోయెను. బ్రహ్మలోకాదుల వెంటనెటకు బరువెత్తి పోయినను రక్షణ పొంద దయ్యెను. ఎటుకేగిననక్క డధనుష్పాణియై భాస్కరునట్లు వెలుగు మహానుభావుని వైన్యునే యెట్ట యెదుట జూచెను. రక్షణ దొరకక యామె వైన్యునే శరణం బొందెను. దోసిలొగ్గి యాత్రిలోక పూజనీయ మహీదేవి పృథునితో స్త్రీ వధ యధర్మమని కనవా? నేను లేనీ యీప్రజల నీ వెట్లు ధరింతువన పృథుచక్రవర్తి యిట్లనియె.

పృథురువాచ : ఏకస్యార్థాయ యోహన్యా దాత్మనోవాపరస్యంవా | ఏకం జీవంబహుత్వేపి కామంనైవా స్తిపాతకమ్‌ ||

యస్మింస్తు నిహతే భ##ద్రే ఏధంతే బహవః సుఖమ్‌ | తస్మిన్హతే నాస్తిపరే పాతకం నోపపాతకమ్‌ || 27

సోహం ప్రజానిమిత్తంత్వాం వధిష్యామి వసుంధరామ్‌ | ఆత్మానంప్రథయిత్వాతు ధారయిష్యే ప్రజా స్త్విమాః || 28

వృత్యుపాయం నచేదాసాం ప్రజాం నాం త్వం విధాస్యసి | విధాస్యసి యధా భ##ధ్రే తదా త్వం సుఖ మాప్స్యసి || 29

పృభిప్యువాచ : ప్రజానాం జీవనోపాయం విధాస్యామి నరేశ్వర | విధత్స్వవత్సం ధర్మజ్ఞ క్షరేయం యేన వత్సలా || 30

సమాంచ కురుసర్వత్ర మమ ధర్మభృతాంవర! | యధా నిష్వంద మానంవై క్షీరం సర్వత్ర భావయేత్‌ || 31

మార్కండేయ ఉవాచ : తత ఉత్సారయామాస శిలాజాలాని సర్వతః | పృదుద్వైన్యో మహాతేజా స్తేనశైలా వివర్ధితాః

తతః ప్రభృతి రాజేంద్ర! గ్రామాశ్చ నగరాణిచ | కృష్యాదికంచ సకలం భువి కర్మ ప్రవర్తితమ్‌ || 33

తస్యాః సస్యాని సాదుర్గా పృథునా పృథివీక్షితా | వత్సం స్వాయంభువం కృత్వా మనుం వైదక్షిణకరే || 34

తతస్తు ఋషిభిర్దుగ్థా ఛందః పాత్రే వసుంధరా | వత్సః సోమోభవత్తేషాం దోగ్ధాచైవ బృహస్పతిః || 35

ఊర్జం దేవగణౖర్దుగ్ధా రుక్మపాత్రే వసుంధరా | వత్సస్తు మఘవానాసీ ద్దోగ్ధా చ సవితా తధా || 36

సుధాంచ పితృభిర్దుగ్ధా రౌప్యపాత్రే వసుంధరా | దుగ్ధా రజతనాభేన వత్సం కృత్వా ధనేశ్వరమ్‌ || 37

అన్తకశ్చాభవద్దోగ్ధా వత్సో నైవస్వతో యమః | పయశ్చైవాయసేపాత్రే దుగ్ధా దైత్యైం ర్వసుంథరా || 38

దుగ్ధా గగనమూర్ధాసా వత్సం కృత్వా విరోచనమ్‌ | అలాబుపాత్రే సర్పైశ్చ విషం దుగ్ధా ధరా తధా || 39

తేషాంచ వాసుకిర్దోగ్ధా వత్సశ్చాసీచ్చ తక్షకః! అంతర్దానం యదా యక్షే రామపాత్రే వసుంధరా || 40

దుగ్ధా రజతనాభేన వత్సం కృత్వా ధనేశ్వరమ్‌ | కపాలే రుధిరం చుగ్ధా రాక్షసై ర్భీమ విక్రమైః || 41

హేతిః ప్రహేతిశ్చతధా దోగ్ధా వత్సస్తధాభవత్‌ | దుగ్ధా గంధా న్పద్మపాత్రే గంధర్వాప్సరసాంగణౖః || 42

వత్సశ్చిత్రర్థస్తేషాం దోగ్ధా వసురుచి స్తధా | ఔషధ్యశ్చ తధా శైలై ర్దుగ్థాఃపాత్రే శిలామయే || 43

వత్సస్తు హిమవానాసీ ద్దోగ్దా మేరు ర్మహాగిరిః | పాలాశపాత్రే వృక్షైస్తు దుగ్ధం పుష్పం ఫలం శుభమ్‌ || 44

ఒక్కని ప్రయోజనమునకై తనయొక్క లేక యింకొకని యొక్కగాని ప్రాణమును దీసినచో పాపముండదు. ఒక్కని తుదముట్టించిన ననేకులు సుఖపడుదురేని వానిం జంపుట వలన పాతకము ఉపపాతకమేనిగలుగదు. అందుచే నేను వసుంధరను నిన్ను జంపెదను. నన్ను నేను ప్రకటించుకొని ప్రజలు బ్రతుకు నుపాయము నీవు సేయవేని వీరిని నేను భరింతును. కల్యాణి! నీవే యదిసేయుదువేని సుఖము నందెదవు. అనగా ధాత్రి నరేశ్వరా! అయుపాయ మేనొనరింతును. అందులకొక దూడను సమకూర్చుము. అప్పుడు నేను జేసెదను. నన్నంతట సమురాలిం గావింపుము. అప్పుడు నా చేసిన పాలెల్లెడల సమమగా తడప గాలదనెను. అదివిని ప్బథువంతటనున్న శిలలను లేపెను. అందుచే శైలము లేర్పడెను. అదిమొదలెగుడు దిగుడులు మెట్టపల్లములు లేకుండ సరిచేయబడిన యీ పృథివిపై పల్లెలు పట్టణములు కృషి వ్యవసాయము మొదలగు నదెంతయు నేర్పడినది.

ఆ ఱనిచే భూమి పంటలు పిదుక బడెను. అప్పుడు ఋషులు స్వాయం భవమనువును దూడంజేసి కుడిచేతి యందు ఛందస్సులనెడి పాత్రాయందు వసుంధరం బిదికిరి. సోముని దూడంచేసి బృహస్పతి పితుకు వాడుగా దేవతలు ఊర్జమును బంగారు చెంబు లోనికి బిదికిరి. ఇంద్రుడు దూడగా సవితదోగ్ధగా వెండి పాత్రలోనికి పితరులు స్వధనుబిదికిరి. అంతకు డుదోగ్ధయై వైవస్వతు డగుయముడు దూడగా ఆయన (ఇనుప రాగి) పాత్రయందు దైత్యులు పాలు పిదికిరి. గగన మూర్ధుడు (ప్నూమకేశుడు =శివుడు) విరోచనుని దూడంజేసి అలాబు (సొరకాయ) పాత్రయందు నాగులు విషము బిదికిరి. అప్పుడు వాసుకిదోగ్ధ. దూడ తక్షకుడు, యక్షులలో రజతనాభుడు ఆమ (మట్టి) పాత్రలో ధనేశుని (కుబేరుని) దూడగావించి యంతర్థానము బిదికెను. భీమ విక్రములు రాక్షసులు 'హేతి' పిదుకు వాడుగా ప్రహేంతి దూడగా కపాలములోనికి రక్తముం బిదికిరి. గంధర్వాప్సరోగణములు చిత్రరధుని దూడగావించి వసురుచిమూలమున పద్మ పాత్రయందు గంధములను బిదికిరి. శైలముచే శిలామయ పాత్రయందు హిమవంతుని దూడం జేసి మేరుపు పితుకు వాడుగా ఔషథులం బితికి కొనెను. వృక్షములు పలాశపాత్రము నందు (మోదుగదొచ్నె) పుష్పఫలరూ పక్షీరమును బితికి గొన్నవి. కామదోగ్ధయత్తరి సాలవ్భక్షమయినది. ప్లక్షము=జువ్యిచెట్టు దూడ యయ్యెను.

కాం మధుక్‌ చ తతః సాలం ప్లక్షో వత్సస్తువై స్మృతః | సర్వకామదుఘా దోగ్థ్రీ పృథివీ భూతభావినీ || 45

సైషా ధాత్రీ విధాత్రీచ జననీ భావినీ తధా | చరాచరస్య లోకస్య ప్రతిష్టోత్పత్తి రేవచ || 46

సర్వభూత శరణ్యాంచ సర్వభూత హితైషిణీ | వర్గదా మేదినీ భూమిః క్షమాక్షోణి వసుంధరా || 47

సర్వభూత శరీరస్థా సర్వానుగ్రహకారిణీ | మన్వంతరేస్మి న్సంప్రాప్తే వైన్యేన పృథివీక్షతా || 48

ప్రథమం వసుధా దుగ్ధా తతో దుగ్ధా యధోదితైః | దుహితృత్వంగతాతస్య పృథీవీ తేన చోచ్యతే || 49

ఏవం ప్రభావః స పురా పృథురాసీ న్మహీపతిః | పిత్రా వరంజితా స్తస్య ప్రజా స్తేనానురంజితాః || 50

ప్రజానాంరంజనా త్తస్య నామ రాజేతి కీర్తితమ్‌ | రాజాభోజో విరాట్‌ సమ్రాట్‌ గో పతిః పార్థివ స్తధా || 51

స ఏవోక్తో మహీనాథ శ##బ్దైః పర్యాయవాచకైః | నమస్కారస్తు కర్తవ్యస్తస్య నిత్యం ద్విజో త్తమైః || 52

వేదకామైర్వేదవిద్భిః ప్రార్థయద్భిర్మహద్యశః | పార్థివైశ్చ మహాభాగైః ప్రార్థయద్భి ర్మహద్యశః || 53

వృత్తిదాతా తధావైశ్యై ర్నమస్కార్య స్తధాపృథుః | శూద్రైరపి నమస్కార్యో ధర్మకామైర్మహీపతిః | 54

క్షేమేప్సుభి స్తధా ధ్యానే నమస్కార్యః పృథుర్నృపః | యోహియోధో రణయాతి కీర్తయిత్వా పృథుం నృపమ్‌ || 55

స ఘోరరూపాత్సంగ్రామా త్షేమీభవతి పార్థివ | పృథోః కృత్వా నమస్కారం సర్వత్ర విజయీభ##వేత్‌ || 56

తస్మాత్తస్య నమస్కారః సదా కార్యో జయేప్సునా | వైన్యస్యభూపాలవరస్య రాజన్‌! శ్రుత్వాభిషేకం ప్రయతో మనుష్యః ||

పాపం సమగ్రల విజహాతి శీఘ్రం జయం తధాప్నోతి యశశ్చలోకే || 57

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణ ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే పృధ్వభిషేకాది వర్ణనం నామ నవోత్తర శతతమెధ్యాయః

ఇట్లు సర్వకామదోగ్ధ్రీయై భూతభావిని యైన యీ పృథివి ధాత్రి (దాది) విధాత్రియు జననియునైనది. చరాచర లోకము పాలిట ప్రతిష్ట (అధారము) ఉత్పత్తి=పుట్టుకకు కారణమునై సర్వభూతములకు శరణ్యమై సర్వభూత హితైషిణియు నై వర్గద మేదిని భూమి క్షమ క్షోణి వసుంధర యను సార్టకమైన పేర్లతో సర్వభూత శరీర సర్వాస్థను గ్రహకారిణి యైనది. ఈ మన్వంతరమందు పృధువుచే మొట్టమొదట పిదుకబడి తరువాత నింతమున్ను చెప్పబడిన వారివారిచె వారివారి కనువైన క్షీరము పిదుక బడినది. అందుచే పృధువును కామెదుహితయై (కూతురై) పృధివియను పేరు గూడ పొందెను. మున్నా పృధు చక్రవర్తి యిట్టి ప్రభావము గలవాడై యుండెను. అతని తండ్రి యగు వేమనిచేత నపరంజితులు = బాధితులు అయిన ప్రజలు ఆతనిచే రంజింప (ఉల్లసింప) బడిరి ప్రజల రంజించుటచే నతనకి 'రాజు' అనునది సార్ధకమైల పేరయ్యెను. రాజు భోజుడు విరాట్టు సమ్రాట్టు గోపతి పార్థివుడు ననునీ పర్యాయ వాచకములయిన శబ్దములచే నతడే చెప్పబడెను.

వేదకాములు వేదవిదులు మహాకీర్తి కోరువారునై ఉత్తమ ద్విజులు కూడ నాతనికి నమస్కరింప వలయును. మహాకీర్తి కాములయిన మహాభాగులు పార్షివులాతనికి మొక్కవలయును. వృత్తిదాతగా (జీవన ప్రదాత) నతడు వైశ్యులకు వందనీయుడు. శూద్రులు కూడ ధర్మకాములై క్షేమముకోరువారై ధ్యానమునందు పృథుచక్రవర్తి నమస్కార్యుడు. ఏయోధుడు పృధువును గీర్తించి (ఆపేరు పేర్కొని) యుద్దమును కేగు నాతడు ఘోరమైన సంగ్రామమునుండి క్షేమముగ వచ్చును. పృథువుకు మ్రొక్కిన యాతడెల్లయెడల విజయము గాంచును. జయార్థియైన వాడెల్లపుడు నతనికి నమస్కరింప వలయును. నియమముతో మానవుడు వేన సుతుడైన పృథువు యొక్క పట్టాభిషేకమునువిని సర్వపాపముల బాయును. వెంటనే విజయముగాంచును. లోకమందు యశస్సు నందును.

ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమ ఖండమున పృధుచక్రవర్తి పట్టాభిషేకమను నూట తొమ్మిదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters