Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటయెనిమిదవ అధ్యాయము - వేననాస్తికవారము

వజ్రః : -దక్షస్య వంశం సకలం నక్షత్రాణాంచ సంభవమ్‌ | త్వత్తోహం శ్రోతు మిచ్ఛామి సర్వ ధర్మభృతాంవీరః || 1

మార్కండేయః ఔత్తన పాది ర్ధర్మాత్మా ధ్రువః పూర్వం మయోదితః | ధ్రువస్త్వజనయత్‌ సృష్టిం మహాబల పరాక్రమామ్‌ ||

తస్య ప్రాచీన గర్భస్తు పుత్ర స్తస్యాప్యుదారధీః | దివంజయస్తస్య సుత స్తస్య పుత్రో రిపుః స్మృతః || 3

రిపోః పుత్ర స్తథా శ్రీమాన్‌ చాక్షుషః కీర్తితో మనుః | ఊరుస్తస్య సుతః శ్రీమానంగ స్తస్యాప్యధాత్మజః || 4

అత్రిర్జగ్రాహ తంపుత్రం దత్తకంతు యశస్వినే | అంగస్య వేనః పుత్రస్తు నాస్తికో ధర్మవర్జితః || 5

అసచ్ఛాస్త్రరతో నిత్యం లోకాయతిక సత్తమః | చకారలోకే మర్యాదాం ధర్మబాహ్యో నరాధి పః || 6

న యష్టవ్యం నహోతవ్యం న దేయం ధర్మ కారణమ్‌ | ఋషయ స్తమాగమ్య కదాచిద్వాక్య మబ్రువన్‌ || 7

ఋషయః-పూర్వప్రవృత్తాం మర్యాదాం ప్వూఃరై పుర్వతరైః కృతామ్‌ | లోకాయతిక వాక్యేన నత్వం హన్తు మిహార్హసి || 8

కర్మణా సుకృతే నేహ సుఖంజన్తుః సమశ్నుతే | దుఃఖం జన్తువ్చ ప్రాప్నోతి దుష్కృతేన చ కర్మణా || 9

యే యజన్తే సదా దేవాన్‌ గురుశుశ్రూషకాశ్చ యే | విప్రపూజారతాయేచ తీర్థయాత్రా రతాశ్పయే || 10

తపస్వినః సత్యరతా యేచదానే సదా రతాః | సమశ్నువన్తి భూపాల పరలోకే సుభాని తే || 11

సత్వం సుఖపరిభ్రష్టాన్‌ నృలోకాన్‌ గంతుమర్హసి |

వజ్రుండు, దక్షవంశము నక్షత్ర వంశమును నా తిమ్మన మార్కండేయు డిట్లనియె: ధ్రువుని గురించి లోగుడ నేను జెప్పితిని. ధ్రువుడు సృష్టియను మహాపరాక్రమునిం గనెను. వాని కొడుకు ప్రాచీన గర్భుడు. వాని కొడుకు దివంజయుడు. వాని కొడుకు రిపుడు. రిపుని కొడుకు చాక్షుషుడను మనువు వాని కొడుకు ఊరువు. వాని కొడుకంగుడు. ఆ అంగుని అత్రి మహర్షి దత్తు చేసి కొనెను. అంగుని కొడుకు వేనుడును నాస్తికు డొకడు. అసచ్ఛాస్త్రరతుడు. లోకాయతిక మతము వాడు. ధర్మ దూదుడై వాడు యజ్ఞములు సేయవలదు. ధర్మనిమిత్తము దానమీయరాదని కట్టడ సేసెను. వానిని ఋషులు సమీపించి యొకతఱి నీకంటె పూర్వులు అంతకు పూర్విలేర్పరచిన మర్యాదను లోకాయతికుల మాటచే నీవు చెఱుప దగదు. ఇహ మందలి పుణ్యకర్మలచేత జీవుడు సుఖమందును. రుష్కృతము వలన దుఃఖమందును. ఎవరు దేవతలను యజింతురు గురుశుశ్రూష సేయుదురు విప్రుల పూజింతురు తీర్థయాత్రలు సేయుదురు. నిత్యతపస్సత్య దానరతులగుదురు వారు పరలోకమందు ముఖములనుభవింతురు. నీవు ముధ పరిభ్రష్ట ములయిన నరలోకముల కేగనర్హుడవు. అనవిని వేనుం దిట్లనియె.

వేనః - భవతాం కిం ప్రలాపేన వృధైవ ద్విజపుంగవాః || 12

యే మృతాస్తే మృతాస్సర్వే మృతానాం సంభవం కుతః | ప్రాణస్య వాయుభూతస్య నిష్ర్కా న్తస్య శరీరతః || 13

భూయః శరీర గ్రహణం యుక్త్యా నైవోప పర్యతే | తపాంసి హాయనాశ్చిత్రాః సంయమో భోగ వంచనా || 14

అగ్ని హోత్రాదికం కర్మ బాలక్రీడేన లక్ష్యతే | గ్రామ్యాణాం మూఢచిత్తానాం స్వగ్విణాంచైవ యోషితాం || 15

అన్యేషాం చైవధనినాం ధూర్తై రాదిత్సుభిర్దనమ్‌ | శాస్త్రాణ్యనేకరూపాణి గ్రథితాని సహస్రశః || 16

దేహి నిత్యం యజసై#్వవం దేవస్తేనుగ్రహీకృతాః | ధనమాప్స్యసి శత్రూంశ్చ విజేష్యసి సుఖంచతే || 17

ముగ్ధాఏవం ప్రతార్య న్తే ధూర్తైర్ధన జిహీర్షయా | యావజ్జీవం సుఖం జీవే న్నాస్తి మృత్యో రగోచరమ్‌ || 18

భన్మీభూతస్య శాంతస్య పునరాగమనం కుతః | నాస్తిదత్తం హుతం చేష్టం నదౌనవా ఋషయోదేచ || 19

మయా ప్తం భువిరాజ్యంచ భోగాశ్చౌన్యే పృథగ్విధాః | కథంప్రా ప్తంహిత్యక్ష్యామి భవతాం వచనేనవై || 20

మార్కండేయ ఉవాచ :- ఏతఛ్చ్రుత్వా వచ స్తస్య వేనస్య నృపసత్తమ! | ఋషయస్తమ థోచుస్తే రాజానం దుష్టచేతనమ్‌ ||

ఓ ద్విజోత్తములారా! వృధాప్రలావము లెందుకు, గిట్టనివారు గిట్టని వారే వారికి పుట్టుక యెక్కడిది. వాయు రూపమైన ప్రాణము శరీరము నుండి పోయిన తర్వాత తిరిగి శరీరగ్రహణము చేయుట యుక్తికి కుదరదు. తపస్సులు చిత్రములయిన హాయనములు=కాలక్షేపములు. పంయమము భోగముల వంచించుట. అగ్నిహోత్రాది కర్మ వట్టి పిల్లలాట. పల్లెటూరి పందల యొక్కయు హారాద్యలంకారములు దాల్చిన స్త్రీలయొక్కయు వితర ధనికుల యొక్కయు ధనముంగా జేయుటకు దూర్తులు శాస్త్రములను అనేక రూపముల గూర్తురు. నిత్యము ఇమ్ము లూజింపుము. దేవతలు నిన్ననుగ్రహింతురు. ధనవంతుడగుదువు. శత్రులంగెల్తువు. సుఖము నీకు గల్గునని యిట్లు ధనము గుంజుకొననెంచి ధూర్తులచే సమాయకులు మోనపుచ్చ బడుచుందురు. బ్రతికినన్నాళ్లు సుఖముగా భ్రతుక వలెలు. మృత్యువు వాతబడని దొక్కటియు లేదు. బూడిదయై చల్లారిన వానికి తిరిగి రాక యెట్లు? ఇచ్చినదిచ్చినదే. హుతమైనది హుతమైనదే. యజించినది యజింప బడినిదే అదేదియు లేనేలేదు. దేవతలువేరు ఋషులు వేరు. భువిలో నేను రాజ్యము బడసి నాను. ఈ ప్రాప్తించిన దాని నేనెట్లు మీ మాటంబట్టి వదలి వేయగలను. అనిన వేనుని మాట విని యాదుస్యభావునింగని ఋషునిట్లనిరి.

ఋషయువాచ: - నైత దాపయికం వాక్యం ధ్రువ వంశోద్భవస్యతే | ప్రత్యక్షం కర్మణాంలోశే ఫలం పార్ధివ దృశ్యతే || 22

రౌంక్ష్యమాణాంన్జనాన్పశ్య భోజనాచ్ఛాదనం పరమ్‌ | సహస్రం భరకానన్యా న్పశ్యభూపాల! మాకవాన్‌ || 23

శిబికాభ్య స్త థై వాన్యా న్గచ్ఛమానాన్యథా సుఖమ్‌ | క్షుథయాచరీపతాంశ్చ శాకొచ్చాష్ట భుజస్తధా || 24

కాష్ఠభార సమాక్రాంతా న్పరి భూతాన్పరై న్తథా | జుగుప్సితాం స్తథా దీనాన్బహుశల్యాన్న రాం స్తథా || 25

వంగూనన్యా న్కుబ్జికాంశ్చ కుష్టజ్వర విపీడితాగి | రోగైర్బహుభిరాక్రాంతా న్బరిభూతాన్పరైస్తథా || 26

తార్కికా న్కృపాణాన్దీనా వ్వ్యాధిగ్రస్తాన్‌ సుఖచ్యుతాన్‌ | ఇష్టబంధు వియోగార్తా నృశ్య పాపేనమానవాన్‌ || 27

ఆరోగ్య రూపసత్వౌజో ధనధాన్య సమన్వితాన్‌ | ధర్మేణచ జనాన్పశ్య బంధుభృత్య సమన్వితాన్‌ || 28

రాజుమార్గ మిమంలోకా న్తవ కర్మానువర్తతే | మార్కండేయ ఉవాచ: తతస్తేషాంవచః శ్రుత్వా ఋషీణాణుగ్రచేత సామ్‌ ||

హస్తేన హస్తం సంఘట్య ప్రహసం స్తానువాచహ | శుభేనకర్మాణ సౌఖ్యం దుఃఖం పాడేన కర్మాణావేనః || 30

నాప్నువంతిజనా విప్రాః ప్రాప్నువంతి స్వభావతః | స్వభావశ్చ విచిత్రోయం సంసారోద్వేజకః సదా || 31

నాత్ర పూర్వకృతం కర్మ దూర్తవాదో యథాద్విజాః | అశ్మానః కర్మణాకేన సూక్ష్మాశ్చాన్యే మహత్తరాః || 32

విన్యస్తాః కర్మణాకేన సురార్చా పాపభూమిషు | పాషాణార్చాది దత్తేన కథం తుష్యంతి దేవతాః || 33

కే దేశా నమయాదృష్టానాపి పూర్వం పితామహైః | నాన్యైర్జన్యై స్తధాతాంశ్చ దూర్తవాక్యాత్ర్పతీమహే || 34

అన్యభు క్తేన చాన్యస్య తృప్తిశ్చైవ కథం భ##వేత్‌ | అన్యభుక్తేన బాన్యస్యయిది తృప్తిర్భ విష్యతి || 35

దద్యాత్ర్పవసితేశ్రాద్ద న స పథ్యౌ దనం మహత్‌ || మృతస్య వక్షేదగ్దస్య భగ్మిభూతస్యవా పునః || 36

సర్వభావ వినష్టస్య కింను శ్రాధ్ధైః ప్రయోజనమ్‌ | కృపణౖర్యజ దేహీతి ధనలుబ్దైః ప్రకీర్తితమ్‌ || 37

ధనినాం ధననాశాయ సతతం స్వార్థతత్వరైః ధర్మేనిపిష్టాః ప్రరుషా దృశ్యంతే దుఃఖజీవినః || 38

సుఖాన్వితాకాదృశ్యంతే పాపకర్మరతా స్తథా | తస్మాద్ధర్మేణకింకార్యం సుఖం జీవేత్తు పండితః || 39

ధ్రువుని వంశమునంబుట్టిన నీకీమాట యుచితము గాదు. కర్మఫలము లోకములో ప్రత్యక్షముగా గనబడుచున్నది. భోజనా చ్ఛాదనము కావలయునను వారింజూడుము. రాజా! వేలకొలది దీణుల భరించువారిం గనుము. శిభికలెక్కి సుఖముగా దిఱుగువారిం గనుగొనుము. ఆకలింగుములుచు నెంగిలి కూరాకులకు దినువారికి కట్టెల మోపులమోయొవారిని మొరులచే పరాభవింపబడు వారిని చూడ సమహ్యముగా నున్న వాండ్రను దీణులను శల్యమాత్రావశిష్టులను కుంటి, గూను, గ్రుడ్డి వాండ్ర నుకుష్టు, జ్విరాది, బహురోగా క్రాంతులను తార్కకులను నీచులను వ్యాధిగ్రస్తులను సుఖణ్రష్టులను పాపమునచే నిష్టబంధు వియోగమున నేడ్చు వారిని జూడుము. ఇంకొక వంక ధర్మముచే ఆరోగ్యము అందము సత్తువ ఓజశ్శక్తి ధనధాన్యములు గల్గి బంధుభృత్య పరివాదముతో నున్నవారిని జూడుము. రాజువగు నీ మార్గము నీలోకమనుసరించును. (యాథారాజా తథాప్రజాః - రాజెట్లో ప్రజలట్లుగదా) బని మహాగ్ర చిత్తులయిన ఋషులు పల్కిన మాట విని చేతంజేయు చఱచి (చప్పట్లు కొట్టి) నవ్వుచు వేణుడిట్లనియె.

పుణ్యకర్మలచే సౌఖ్యము పాపముచే దుఃఖమును జణులు పొందుట శుద్ధమైన యబద్ధము. సుఖదుఃఖములు స్వభావసిద్ధ సంసారోద్వేజక మయిన యీ స్వభావమెప్పుడును విచిత్ర మైనది. ఇక్కడ పూర్వకృతమైన కర్మలేదు. అట్టి ధూర్తులనిడి మాట. రాళ్ళు ఏ కర్మచేత చిన్నవగును? దేనిచో పెద్దవగును? అందు గొన్ని యే కర్మము చేత దేవపూజ పీఠమునకు కొచ్ని సాప భూముల యందు నుంప బడును. పాషాణములకు బూజ పురహ్కరములు చేయుటచే దీవతలెట్లు సంతోషింతుదు? నేను నా పూర్వులు తాత ముత్తాతలు మరి ఇతర జీవులు నే ప్రదేశము లెన్నడును జూడబడినవి. స్వర్గాదులునుగ ధూర్తులు ప్రేమ మాటల చేత మాత్రమే నమ్మ వలసిది కాని వాటి మార్గము లేదు. ఒకడు తిన్నతిండి చేత నింకొకనికి దృప్తి కగుటెట్లు? అట్టు తృప్తి కలుగనేని ప్రవాసము వెళ్ళిన వానికి శ్రాద్ధము పెట్టినది వానికి దారిబత్తెము కాదే. బ్రతికి యున్న పరదేశవాసికే యది యందనప్పుడు, చచ్చినా వాని విషయములో కాలి బూడిదయైన వానికది యెట్లుందును. సర్వభావ వినష్టుని (సర్వాత్మనా రూపుమాసిన వానికి) శ్రాద్ధముల వలన నేమి ప్రయోజనము, కృపణులు (నీచులు దరిద్రులు) ధనలుబ్ధులు యజ=యాగము సేయుము. దేహి=ఇమ్ము అని పలకరించుదురు స్వార్ధపరులు ధనవంతుల ధనము నాశనమగుటకిట్లు నిత్యము ప్రేలుచుందురు. ధర్మనిపుణులయిన మానవులు దుఃఖజీవులగుచున్నారు. పాపరతులు సుఖవంతులుగా కనిపించుచున్నారు. కావున ధర్మములతో నేమి పని? పండితుడు (తెలిసినవాడు) హాయిగా జీవింపవలెను. కామ పురుషార్థము ధనముచే లభించును అన విని బుద్ధులు వేణునితో నిట్లనిరి.

పురుషార్థః పదః కామోధనేనచ తదావ్యతే | ఋషయఊచః.-ప్రత్యక్షమేవ పశ్యంతః పూర్వజన్మనిమానవాః || 40

పరలోకం నపశ్యంతి వశ్యదేవేన వంచితాః | జాతమాత్రోయధా జంతుస్తనం గృహ్ణాతి పార్థివ || 41

పూర్వ జన్మాంత రాభ్యనం వినా తత్కస్య చేష్టితమ్‌ | ప్రాణన వాయుతేభూన జన్మన్యస్మిన్యధానరః || 42

కరోతిదెవాగ్రహణం జన్మాంతర గత స్తధా | మహీవికారమశ్మానః కర్మజీవ వివర్జితాన్‌ || 43

సూక్ష్మత్త్వంచ మహత్త్వంచ తేషా మిశృర కారితమ్‌ | మంత్రేణనీయతే శ్రాద్ధం పరలోకగతే జనే || 44

దృష్టః ప్రవాసినోనైవ తధా మంత్రస్య పార్థివ | ప్రాకామ్యయుక్తా లఘిమనాతధా || 45

జ్ఞానయుక్తాశ్చగృహ్ణంతి సర్వత్రవినివేదితమ్‌ | ధర్మమా సేవతాంన్హణాం విపత్తిర్వానరాధిప || 46

పూర్వజన్మకృతేనేహ సుకృతేన కర్మణా || సుతప్తే నేహతవసా బ్రాహ్మణౖ ర్వసుధాధిప || 47

శాపాని దీయమానాని ప్రత్యక్షం కిన్నపశ్యసి అమోఘాశాన్తథావిప్రా నుతప్త తపసోనృప || 48

కిన్నవశ్యసిలోకేస్మి న్ప్రత్యక్షం ధర్మ దర్శనమ్‌ | బీజాని బీజ కావేషు యైరే పూప్తాని పార్థివ || 49

త ఏవలోకే దృశ్యంతే ప్రత్యక్షం ఫలభాగినః | దృష్ట్యా మంత్ర ప్రభావేణ విప్రకర్‌ష్ణణ తత్పరాన్‌ || 50

విషావహారం కుర్యాణన్ద ర్మోప్యస్తీతి చింతయ | మేషామపివచః క్షుద్రం పరలోకం న విద్యతే || 51

తేప్యుద్విజన్తేపాపానాం తస్మాద్రాపం వివర్జయ ||

మార్కండేయ ఉవాచ :- ఏతచ్ఛ్రుత్వాతు వచన యృషీణాం భావితాత్మనామ్‌ || 52

హృత్తోత్తర స్తదాదీనో నోత్తరం ప్రత్యభాషత | చింతయామాస మనసా బ్రాహ్మణౖర్ధర్మ తత్పరైః || 53

యదేత దుక్తంవచనం మిథైత న్మాత్ర సంశయః | అభిప్రాయం నరేంద్రస్య జ్రాత్వా బ్రాహ్మణ ప్రంగణః || 54

వినష్టం మేనిరేసర్వం త్రైలోక్యం సచరాచరమ్‌ | ఏతస్మిన్నంతరేదేవై ర్ర్బాహ్మణనాం మహాత్మణమ్‌ || 55

బుద్ధిర్నివేశితాతస్య వినాశాయదురాత్మనః | సర్వేశ్వరః సర్పశక్తిః సర్వదృక్సర్వ సాధనః || 56

ప్రార్థితశ్చతదా విష్ణుః పృథివీరాజ్య కారణత్‌ | దేవాఊచుః:- ధ్రువ వంశోద్భవం దేవవేనం భూపాల కిర్బిజం || 57

బ్రాహ్మణ ఘాతయిష్యంతి మంత్ర పూతైః కుశోదకైః | ఊరూచాన్యతతః క్షిప్రం మథిష్యంతి సమాహితాః || 58

కురుష్య సంభవంతత్ర లోకానాంహిత కామ్యయా | కృత్వాతునంభవంతత్ర పాలయిస్వ జగత్తయిమ్‌ || 59

అస్థాయ మానుపంరూపం త్వహిపాలయితాపతః | ఏం కరిష్య ఇత్యుక్తం దేవదేవేన దక్షిణః 60

దేవక్రోధేన సంక్రుద్ధా నిజఘ్న ర్బ్రాహ్మణ నృపమ్‌ | మంత్రపూతైః కుశైః న్తర్వే స్తతస్తస్యదురాత్మనః 61

ఊరూమనుస్థుః సహిసాతతోస్య తనయోభవత్‌ | హ్రస్వాతిమాత్రం కృష్టాంగో దారుణో దారుణకృతిః 62

నిషేదౌతీ తమూచుస్తే బ్రాహ్మణ వేదపారగాః | సర్వభూత నిషాదానా మృషివ్యాక్యేన పార్థివ | 63

నిషాద వంశకర్తారం వేనకల్మష సంభవమ్‌ తతోస్య దక్షిణంపాణింమమంథుః సహసాద్రిజాః 64

తస్మా దన్యసుతోజాతో విష్ణుర్మానుష రూపధృకి | పృథురిత్యేష నామాస్య చక్రుస్తే ద్విజప్రంగనాః

తేన జాతేన పుత్రణదేనః పాపాదముచ్యత్‌ || 65

తత్రుత్యలాభాత్త్రిది వంజగామ వేనోదురాత్మా కృతసర్వపాపః |

దృష్ట్వాపిజాత మృషయః కుమారం సంమేనిరే లోకమిదం కృతార్థమ్‌ ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే పృథూద్సపూనామాష్టోత్తర శతతయోధ్యాయః

పూర్వజన్మ మందు మానవులు ప్రత్యక్షమునే చూచుచున్న వారైకూడ దైవవంచితులై పరలోకమును జూడలేరు. ప్రాణి పుట్టగానే తల్లి స్తనముం జేకొనును. అది పూర్వజన్మా భ్యాసమున కాక మరిదేని చేష్ట? ఈ జన్మ మందు నరుడు వాయుభూతమైన ప్రాణము చేత దేహగ్రహణ మెట్లు సేయునో జన్మాంతర మొందిన వాడు నట్లే దేహముం బొందును. రాళ్ళు భూమి యొక్క వికృతులు. కర్మ జీవము వానికి లేరు, వాని సూక్ష్మత్వము మహత్త్వమును (చిన్నవగుట పెద్దవగుట) ఈశ్వరుడు చేసినదే. పరలోక మున కేగిన జీవునుద్దేశించి మంత్రము చేత శ్రాద్ధమందింప బడును. పరదేశమునకు వెళ్ళిన వాని కట్లాహారమందించుటకు మంత్ర మేదియు గనబడదు. ప్రాకామ్యము లఘిమ అను నణిమాదిశక్తులు గలవారు దేవతలు కనబడుచున్నారు. వారు జ్ఞానము కల వారు కూడ. కావున వీరెక్కడ నెవరు నివేదించిన పదార్థమునైన గ్రహింతురు. ధర్మమును సేవించు వారికి విపత్తునునదేది. పూర్వజన్మ కృతమైన పుణ్యము చేత నలోకములో మిక్కిలిగ జేసిన తపస్సుచేత బ్రాహ్మఱులిచ్చు శాపములను నీవు చూచుట లేదా? అట్లేమిక్కిలిగ తపస్సు చేసిన విప్రుల యభిలాషలు కూడ అమోఘములు. పప్పక ఫలించి తీరును. ధర్మము, ధర్మఫలము నీలోకమునందు ప్రత్యక్షముగ నీవు చూచుట లేదా? విత్తనములు బీజకాలములో బీజరూపమున నభీంచినవే. ఫలవంతములయి ప్రత్యేకముగ లోకమందు గనబడుట లేదా? మంత్రప్రభావముచేత విప్రులను ఆకర్షించువారిని హరించువారినిచూచి రాజా! ధర్మమున్నదిని యాలోచింపుము. పరలోకములేదనితుచ్ఛముగా నెవరుమాట్లాడుదురో వారుకూడపాపముల కాందోళనపడుచునే యుందురు. అందుచే పాపమును విడుపుము. అని ఋషులు పలికినది విని వేనుడు జవాబు తోచక మాఱుపలుకదయ్యెను. మనసులో ధర్మతత్పరులు బ్రాహ్మణులు పలికిన యీమాట వట్టిబూటకమని సంశయము లేదనుకొనెను. ఆరాజు నభిప్రాయము బ్రాహ్మణపుంగవులు గ్రహించి చరాచర ప్రపంనము నాశనమై పోయినదే యనుకొనిరి. ఈలోన దేవతలు మహానుభావులైన యా బ్రాహ్మణుల యందు దురాత్మని వీని కడతేర్ప వలెనను తలంపును వారిలో బ్రవేశ పెట్టిరి. పృథ్వీరాజు రక్షణ నిమిత్తముగ వారు సర్వేస్వరుని సర్వశక్తిని సర్విద్రష్టను సర్వసాధకుని విష్ణువు నిట్లు బ్రార్థించిరి. ప్రభూ! ధ్రువవంశజుడైన వేనునీ పాపాత్ముని రాజును మంత్రపవిత్రములయిన కుశోదకములచే జంపుదురు. అందరేకమై వీని తొడలు వేన్వెంటన మథింతురు. ఆ మథించిన తఱినీవు లోక హితము గోది యవతరింపుము. అవతరించి మానుష రూపముగొని పరితాపము నుండి దక్షింపుము. పిష్ణువును నిట్ల యొనరింతుననియె.

ఆ దేవుని కోపముచే ఋషులను కోపించి బ్రాహ్మణులు మంత్రపూత కుశలచే నా దుష్టుని జంపి వాని తొడల నోక్కుమ్మడి మధించిరి. అంతట వీనికొక పుత్రుడు గల్గెను. వాడు మరుగుజ్జు దారుణా కారుడు. మహాదారుణుడు వేదపారగులు వారు వానిని నిషీద =కూర్చుండుము. అనిరి. వేనుని కల్మషము (పాపము) నుండి పుట్టిన వానినిఋక్షి వాక్యాను సారము సర్వనిషాద వంశములకు (బోయవాళ్ళజాతకి) కర్తను గానించిరి. ఆ మీద వీని కుడి బాహువును తొందరగ మథించిరి, అందుండి విష్ణువు మానుష రూపము గొని కొడుకై పుట్టెను ఆ విప్రవరులాతనికి ''పృథువు'' అను పేరుపెట్టిరి. ఆ పుట్టిన పుత్రునిచే వేనుడు పాపము. నుండి ముక్తుడయ్యె. సత్పుత్రలాభమున వేడుము స్వర్గమున కేగెను. పుట్టిన కుమారుని ఋషులు చూచి యీలోకము ధన్యమైనదనుకొనిరి.

ఇది శ్రీ విష్ణధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున వేచనాస్తిక వారము:పృథుసంభవమునను నూటయెనిమిదవ అధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters