Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ ఏకోన సప్తతి తమో%ధ్యాయ

ఫలశ్రుతిః

పులస్త ఉవాచ : -

ఏత న్మయా పుణ్య తమం పురాణం తుభ్యం తథా నారద ! కీర్తితం వై |

శ్రుత్వా చ కీర్త్యా పరయా సమేతో భక్త్యా చ విష్ణోః పద మభ్యుపైతి || 1

యథా పాపాని పూయంతే గంగా వారి విగాహనాత్‌ తథా పురాణ శ్రవణా ద్దురితానాం వినాశనమ్‌ || 2

న తస్య రోగా జాయంతే న విషం చా భిచారికమ్‌ శరీ రే చ కులే బ్రహ్మన్‌ యః శ్రుణోతి చ వామనమ్‌ || 3

శ్రుణోతి నిత్యం విధివచ్చ భక్త్యా సంపూజయన్‌ యః ప్రణతశ్చవిష్ణుమ్‌ |

స చా శ్వమేధస్య సదక్షిణస్యఫలం సమగ్రం పరిహీణ పాపః || 4

ప్రాప్నోతి దత్తస్య సువర్ణభూమేశ్వస్య గో నాగ రథస్య చైవ |

నారీ నర శ్చాపి చ పాద మేకంశృణ్వన్‌ శుచిః పుణ్యతమః పృథివ్యామ్‌ || 5

స్నానే కృతే తీర్థ వరే సుపుణ్య గంగా జలే నైమిష పుష్కరే వా |

కోకా ముఖే యత్‌ ప్రవదంతి విప్రాః ప్రయాగ మాసాద్య చ మాఘ మాసే || 6

స తత్పలం ప్రాప్య చ వామనస్య సంకీర్తయన్‌ నా న్య మనాః పదం హి |

గచ్ఛే న్మయా నారద! తే%ద్య చోక్తం యద్రాజ సూయస్య ఫలం ప్రయచ్చేత్‌ || 8

యద్‌ భూమి లోకే సురలోక లభ్యే మహా త్సుఖం ప్రాప్య నరః సమగ్రమ్‌ |

ప్రాప్నోతి చా%స్య శ్రవణా న్మహర్షే సౌత్రామణ ర్నాస్తిచ సంశ యోమే || 9

రత్నస్య దానస్య చ యత్ఫలం భ##వేత్‌ యత్సూర్యస్య చేందోర్గ్రహణచ రాహోః |

అన్నస్య దానేన ఫలం యధోక్తం బుభుక్షితే విప్ర వరే చ సాగ్నికే || 10

దుర్భిక్ష సంపీడిత పుత్ర భార్యే యామీ సదా పోషణ తత్పరే చ |

దేవాగ్ని విప్రర్షిరతె చ పితో శుష్రూషణ భ్రాతరిజ్యేష్ఠ సామ్నే |

యత్త త్ఫలం సంప్రవదంతి దేవాః స తత్ఫలం లభ##తే చాస్య పాఠాత్‌ || 11

చతుర్థశం నామ మాహ కగ్ర్యం శ్రుతే చ యస్యాఘ చయాశ్చ నాశమ్‌ |

ప్రయాంతి చాస్త్యత్ర సంయోమే మహంతి పాపా న్యపి నారదా%శు || 12

పాఠాత్‌ సంశ్రవణా ద్విప్రశ్రవణ దపి కస్యచిత్‌ సర్వ పాపాని నశ్యంతి వామనస్య సదా మునే ! || 13

ఇదం రహస్యం సరమంతవోక్తం వాచ్యమేత ద్దరి భక్తి వర్జితే |

ద్విజస్య నిందా రతి హీన దక్షిణన హేతు వాక్యావృత పాప సత్వే || 14

నమో నమః కారణ వామనాయ! | నిత్యం యో వదే న్నియతం ద్విజఃతస్య విష్ణుః పదం మోక్షం దదాతి సుర పూజితః || 15

వాచకాయ ప్రదాతవ్యం గో భూ స్వర్ణ విభూషణమ్‌ | విత్త శాఠ్యం న కర్తవ్యం కుర్వన్‌ శ్రవణ నాశకమ్‌ || 16

త్రిసంధ్యం చ పఠన్‌ శ్రుణ్వన్‌ సర్వ పాప ప్రణాశనమ్‌ | అసూయా రహితం విప్ర! సర్వ సంప త్ర్పదాయకమ్‌ || 17

ఇతి శ్రీ వామన పురాణ ఏకోన సప్తతి తమో%ధ్యాయః

శ్రీ వామన పురాణం సంపూర్ణమ్‌

ఓం నమో నమః కారణ వామనాయ

ఓం నమోభగవతే వాసుదేవాయ!

శ్రీ వామన పురాణంలో అరువది తొమ్మిదవ అధ్యాయము

ఫలశ్రుతి

పులస్త్యుడిలా అన్నాడు. బ్రహ్మర్షీ నారదా! పుణ్య తమమైన ఈ వామన పురాణాన్ని నీకు సాకల్యంగా వినిపించాను. దీనిని శ్రద్ధా భక్తుల తో వినినా పఠించినా కీర్తించినా విష్ణు పద ప్రాప్తి కలుగుతుంది. గంగా నదీ జలాల్లో మునిగి నందున పాపాలు తొలగు నట్లుగానే ఈ పురాణ శ్రవణం వల్ల సకల దురితాలు నశిస్తాయి ఈ వామన పురాణాన్ని చదివించు కుని విన్నందు వల్ల, అటు వంటి వారికి, వ్యాధులు కలుగవు. విషప్రయోగాలు, మంత్ర ప్రయోగాలు బాధించవు. వారలకే కాక వారి వంశంలో నున్న వా రెవ్వరకీ ఎలాంటి బాధలు కలుగవు. ప్రతి దినం విష్ణు దేవుని పూజించి, నమస్కరించి, భక్తి పూర్వకంగా దీనిని విన్నచో సమస్త పాపాలు నశించి దక్షిణలతో సహా అశ్వమేధ యాగం చేసి నంత సంపూర్ణ ఫలం లభిస్తుంది. గో భూ సువర్ణ, రధ, గజ, తురగాలు దానం చేసిన ఫలం దక్కుతుంది. పురుషులుగాని, స్త్రీలుగానీ కనీసం ఒక శ్లోకంలో ఒక పాదాన్నైనా భక్తితో వింటే పృథివిలో పవిత్రులు, పుణ్యాత్ములు అవుతారు. నైమిషారణ్య పుష్కర క్షేత్రాల్లో స్నానం చేస్తే, ప్రయాగలో మాఘస్నానాలు, చేస్తే భాగీరథిలో కోకాముఖక్షేత్రం లో స్నానం చేస్తే, కలిగే పుణ్య ఫలం అనన్యచిత్తంతో వామన పురాణం వింటే కలుగు తుందని విప్రులు వక్కాణిస్తారు. నారదా! ఇక నా దృడ విశ్వాసం వినుము. ఈ మహా పురాణ శ్రవణం వల్ల రాజసూయ యాగం చేసిన ఫలం వస్తుంది. భూలోకంలో దీనిని విన్న వారలకు దేవలోకంలో సౌత్రామణి క్రతువు చేస్తే ఏ మహ త్సుఖం కలుగుతుందో అది సంపూర్ణంగా లభిస్తుందనడంలో సంశయం ఏ మాత్రం లేదు. సూర్య చంద్ర గహణ పవిత్ర పర్వాల్లో రత్న రాసులు దానం చేస్తే వచ్చే ఫలం అగ్ని పూజా నిరతు డగు విప్ర వరునకు ఆకలి గొన్న వేళ భోజనం పెడితే వచ్చే పుణ్యం కరువు కాటకాల్లో ఆకలితో బాధపడే పుత్ర కళత్ర సహితుడైన వానికి అన్నం పెట్టిన పుణ్యం, స్త్రీలకు తోడు గానిలచే వారలకు, దేవ అగ్ని ఋషి బ్రాహ్మణ పితృదేవతల నర్చించే వారలకు, తల్లి దండ్రులకు, జేష్ఠ సోదరులకు, శుశ్రూష చేసి, సహాయ పడితే కలిగే సత్ఫలాలన్నీ ఈ పవిత్ర పురాణ పఠనం వల్ల తప్పక లభిస్తాయి. పదు నాల్గవ దైన వామన పురాణాన్ని ప్రముఖమైన (అగ్ర్య) పురాణంగా కీర్తిస్తారు. దీనిని విన్నందున సాధారణ పాపాలే కాక మహా పాతకాలు సర్వమూ నశిస్తాయి. నారదా! ఇది మమ్మాటికీ నిజం. దీనిని పఠించినా విన్నా యితరులకు వినిపించినా సర్వ పాపాలు తొలగుతాయి. ఇది చాలా రహస్యమైన పురాణం. దీనిని హరి భక్తులకు తప్ప యితరులెవరకు చెప్ప రాదు. సుమా! పర నింద చేసే వారికీ బ్రాహ్మణ ద్వేషులకు కుతర్కాలతో తాము చేసే దురాచారాలను సమర్ధించుకొనే నాస్తికులకు, హేతువాదులకు చెప్పరాదు. వారలు దీనిని వినుటకు అధికారులు కారు!

నమో నమః కారణ వామనాయ! దేవకార్య సిద్దికై వామన రూపం ధరించిన విభో నీకు నమస్కారం! అంటూ నియమంతో ప్రభువు నామాభివదనం చేయు ధన్యులకు దేవ పూజితు డైన విష్ణుడు మోక్షపదం ప్రదానం చేస్తాడు ఈ పురాణాన్ని చదివి వినిపించిన సజ్జనులను గో భూ హిరణ్యవస్త్ర ఆభరణాలతో భక్తితో సత్కరించాలి. ధన లోభం చూప రాదు. అలాచేస్తే శ్రవణ ఫలం నశిస్తుంది. త్రిసంధ్యలలోను చదివినా వినినా సర్వ పాపాలు తొలగి పోతాయి ఈర్ష్యా అసూయలు లేని విప్రుల కిది సర్వ సంపదలు ప్రసాదిస్తుంది!

ఇది శ్రీ వామన పురాణంలో అరువది తొమ్మిదవ అధ్యాయము

సర్వమూ ముగిసినది

హరిః ఓం తత్‌ సత్‌

శ్రీ హరి భక్త చరణ రేణువు

Sri Vamana Mahapuranam    Chapters