Sri Vamana Mahapuranam    Chapters   

తొమ్మిదవ అధ్యాయము

నారద ఉవాచ :

నేత్రహీనః కథం రాజ్యే ప్రహ్లాదేనాంధకో మునే | అభిషిక్తో జానతా7పి రాజధర్మం సనాతనమ్‌. 1

పులస్త్య ఉవాచ:

లబ్దచక్షు రసౌ భూయో హిరణ్యాక్షే7పి జీవతి | తతో7భిషిక్తో దైత్యేన ప్రహ్లాదేన నిజే పదే. 2

నారద ఉవాచ :

రాజ్యే7ంధకో7భిషిక్తస్తు కిమాచరత సువ్రత | దేవాదిభిః సహ కథం సమాస్తే తద్వదస్వ మే. 3

పులస్త్య ఉవాచ :

రాజ్యే7భిషిక్తో దైత్యేంద్రో హిరణ్యాక్షసుతో7ంధకః | తపసారాధ్య దేవేశం శూలపాణిం త్రిలోచనమ్‌. 4

అజేయత్వ మవధ్యత్వం సురసిద్ధర్షిపన్నగైః | అదాహ్యత్వం హుతాశేన అక్లేద్యత్వం జలేనచ. 5

ఏవం స వరలబ్ధస్తు దైత్యో రాజ్య మపాలయత్‌ | శుక్రం పురోహితం కృత్వా సమధ్యాస్తే తతోం7ధకః. 6

నారదుడనెను. మహామునీ! అంధకుడు గ్రుడ్డివాడని తెలిసియు రాజధర్మమునకు విరుద్ధముగా నాతనిని ప్రహ్లాదుడెట్లు రాజ్యాధిపతిని గావించెను?

పులస్త్యుడనెను. నారదా! తండ్రి హరిణ్యాక్షుడు జీవించియుండగనే అంధకునకు చూపు తిరిగి వచ్చింది. అందుచే ప్రహ్లాదుడతనిని తన స్థానమున రాజుగా నిలిపెను.

నారదుడనెను. మహామునీ! రాజ్యాభిషిక్తుడైన అంధకుడేవిధముగ పాలన మొనర్చెను? దేవతలతో నెట్లు మసలు కొనెను?

పులస్త్యుడనెను. రాజైన హిరణ్యాక్ష సుతుడంధకుడు మహాదేవుడగు శూలపాణి తపస్సు చేసి ప్రసన్నుని గావించుకొనెను. దేవసిద్ధ ఋషిపన్నగాదుల నుండి అజేయత్వమూ అవధ్యత్వముతో బాటు, అగ్ని, జలముల వలన భయములేకుండునట్లు వరములనందుకొనెను. తర్వాత శుక్రాచార్యుని పురోహితుని గావించుకొని రాజ్యము చేయసాగెను.

తతశ్చక్రె సముద్యోగం దేవానా మంధకో7సురః | అక్రమ్య వసుదాం సర్వాం మనుజేంద్రాన్‌ పరాజయత్‌.

పరాజిత్య మహీపాలాన్‌ సహాయార్థే నియోజ్యచ | తైః సమం మేరు శిఖరం జగామాద్భుతదర్శనమ్‌. 8

శక్రో7పి సురసైన్యాని సముద్యోజ్య మహాగజమ్‌ | సమారుహ్యామరావత్యాం గుప్తిం కృత్వా వినిర్య¸°. 9

శక్రస్యామ తథైవాన్యే లోకపాలా మహౌజనః |

ఆరుహ్య వాహనం స్వం స్వం సాయుధా నిర్యయు ర్బహిః . 10

దేవసేనా7పిచ సమం శ##క్రేణాద్భుతకర్మణా | నిర్జగామాతివేగేన గజవాజిరథాదిభిః. 11

అగ్రతోద్వాదశాదిత్యాః పృష్ఠతశ్చ త్రిలోచనః | మధ్యేష్టౌవసవో విశ్వే సాధ్యాశ్విమరుతాం గణాః

యక్షవిద్యాధరాద్యాశ్చ స్వంస్వం వాహన మాస్థితాః. 12

అంతట నారాక్షసుడు దేవతల జయింప నెంచి భూతలాన్నంతను ఆక్రమించుకొనిఅందలి రాజుల నందరను నిర్జించెను. ఆట్లు జయించిన భూమిశుల సహాయంతో విక్రమించి మేరుశైల శిఖరమును సమీపించెను. అది చూచిన దేవేంద్రుడు తన బలాలను సమకూర్చుకొని రాజధాని అమరావతి రక్షణకై తగిన ఏర్పాట్లు గావించి, ఐరావత గజాన్ని అధిరోహించి రాక్షసుని పైకి వడలెను. దేవపతి ననుసరించి యితర దిక్పాలకులు సైతము తమ తమ సైన్యాలతో వాహనారూఢులై బయలుదేరిరి. ఇంద్రుని నాయకత్వంలో రథ గజ తురగాదులతో కూడిన దేవసైన్యం వివిధాయుధాలతో పురోగమించెను. ముందు భాగాన ద్వాదశాడిత్యులు వెనుక రుద్రులు. మధ్యభాగంలో అష్టవనువులు విశ్వేదేవతలు సాధ్యులు మరుత్తులు అశ్వినులు యక్షవిద్యాధరాదులందరు తమతమ వాహనాల మీద బయలుదేరిరి.

నారద ఉవాచ:

రుద్రాదీనాం వదస్వేహా వాహనానిచ సర్వశః| ఏకైకస్యాపి ధర్మజ్ఞ పరం కౌతూహలం మమ. 13

పులస్త్య ఉవాచ :

శృణుష్వ కథయిష్యామి సర్వేషామపి నారద | వాహనాని సమాసేన ఏకైకస్యాను పూర్వశ. 14

రుద్రహస్తతలోత్పన్నో మహావీర్యో మహాజవః | శ్వేతవర్ణో గణపతి ర్దేవరాజస్య వాహనమ్‌. 15

రుద్రోరుసంభవో భీమః కృష్ణవర్ణో మనోజవః | పౌండ్రకో నామ మహిషో ధర్మరాజస్య నారద. 16

రుద్రకర్ణమలోద్భూతః శ్యామో జలధిసంజ్ఞకః | శిశుమారో దివ్యగతిర్‌ వాహనం వరుణస్య చ. 17

రౌద్రః శకటచక్రాక్షః శైలాకారో నరోత్తమః | అంబికాపాదసంభూతో వాహనం ధనదస్యతు. 18

ఏకాదశానాం రుద్రాణాం వాహనాని మహామునే | గంధర్వాశ్చ మహావీర్యా భుజంగేంద్రాశ్చ దారుణాః.

శ్వేతాని సౌరభేయాణి వృషాణ్యుగ్రజవానిచ. 19

రథం చంద్రమస శ్చార్ధసహస్రం హంసవాహనమ్‌| హరయో రథవాహాశ్చ ఆదిత్యా మునిసత్తమ. 20

కుంజరస్థాశ్చ వసవో యక్షాశ్చ నరవాహనాః | కిన్నరా భుజగారూఢా హయారూఢౌ తథాశ్వినౌ. 21

సారంగాధిష్ఠితా బ్రహ్మన్‌ మరుతో ఘోరదర్శనాః | శుకారూఢాశ్చ కవయో గంధర్వాశ్చ పదాతినః. 22

ఆరుహ్యవాహనాన్యేవం స్వానిస్వాన్యమరోత్తమాః | సంసహ్యనిర్యయుర్‌హృష్టా యుద్దాయ సుమహౌజనః. 23

నారదుడనెను. మహర్షే! ఏకాదశ రుద్రులు తదితరులూ ఏఏ వాహనాలపై వచ్చిరో వివరంగా వినాలని కుతూహలంగా ఉంది.

పులస్త్యుడనెను. నారదాః అంతా వివరంగా చెబుతాను; వినుము. రుద్రుని అరచేతి నుండి పుట్టి అపూర్వ జవసత్వాలు గలిగిన శ్వేతగజం ఐరావతం. ఇంద్రుని వాహనం. రుద్రుని తొడల నుండి పుట్టిన నల్లని భయంకరాకృతితో మనో వేగంతో పయనించే పౌండ్రకమనే మహిషంయముని వాహనం. రుద్రుని కర్ణమలం (గుమిలి) నుంచి పుట్టి చక్కని గమనం కలిగి జలధి అనే పేరు గల నల్లని శిశుమారం (మొసలి వంటిది) వరుణ వాహనం. అంబికాదేవి చరణాలనుండి ఉద్భవించి బండి చక్రాలంతటి కండ్లతో భయంకరమైన శైలాకారం గల నరోత్తముడు కుబేరుని వాహనం. గంధర్వులు మహాశక్తివంతులగు పన్నగులు, సురభి (కామధేనువు) పుత్రులగు శ్వేత వృషభ రాజాదులు ఏకాదశ రుద్రుల వాహనాలు. మునిశ్రేష్ఠా! చంద్రుని రథాన్ని ఐదు వందలు హంసలు, ఆదిత్యుల రథాలను ఉత్తమాశ్వాలు లాగుతున్నవి. వసువులు ఏనుగుల మీద యక్షులు నరుల మీద స్వారీ చేస్తున్నారు. కిన్నరులు భుజగాలను, అశ్వినులు హయాలను, భయంకరులైన మరుత్తులు లేళ్ళను తమ వాహనాలుగా చేసుకున్నారు. భృగువులు చిలుకలపై బయలుదేరగా గంధర్వులు పాదచారులై నడిచారు. గొప్ప తేజస్సు గల అమరులు తమకు తగిన వాహనాల నధిరోహించి మహోత్సాహంతో బయలుదేరారు.

నారద ఉవాచ:

గదితాని సురాదీనాం వాహనాని త్వయామునే | దైత్యానాం వాహనాన్యేవం యథావద్‌ వక్తుమర్హసి. 24

పులస్త్య ఉవాచ:

శృణుష్వ దానవాదీనాం వాహనాని ద్విజోత్తోమ | కథయిష్యామి తత్త్వేన యథావ చ్ఛ్రోతు మర్హసి. 25

అంధకస్య రథో దివ్యో యుక్తః పరమవాజిభిః కృష్ణవర్ణైః సహస్రారస్‌ త్రినల్వపరిమాణవాన్‌. 26

ప్రహ్లాదస్య రథోదివ్యశ్చంద్రవర్ణైర్హ యోత్తమైః | ఊహ్యమాన స్తథా7ష్టాభిః శ్వేతరుక్మమయః శుభః. 27

విరోచనస్య చ గజః కుజంభస్య తురంగమః | జంభస్య తు రథో దివ్యో హయైః కాంచనసన్నిభైః. 28

శంకుకర్ణస్య తురగో హయగ్రీవస్య కుంజరః| రథో మయస్య విఖ్యాతో దుందుభేశ్చ మహోరగః .

శంబరస్య విమానో 7భూదయఃశంకో ర్మృగాధిపః. 29

బలవృత్రౌచ బలినౌ గదాముసలధారిణౌ | పద్భ్యాం దైవతసైన్యాని అభిద్రవితు ముద్యతౌ. 30

తతో రణో7భూత్‌ తుములః సంకులో7తిభయంకరః | రజసా సంవృతో లోకః పింగవర్ణేన నారద. 31

నాజ్ఞాసీచ్చ పితా పుత్రం నపుత్రః పితరం యథా | స్వానేవాన్యే నిజఘ్నుర్యై పరా నన్యేచ సువ్రత. 32

అభిద్రుతో మహావేగో రథోపరి రథస్తథా | గజో మత్తగజేంద్రంచ సాదీ సాదిన మభ్యగాత్‌. 33

పదాతిరపి సంక్రుద్ధః పదాతిన మథోల్బణమ్‌ | పరస్పరంతు ప్రత్యఘ్న న్నన్యోన్యజయకాంక్షిణః. 34

తతస్తు సంకులేతస్మిన్‌ యుద్ధే దైవాసురే మునే | ప్రావర్తత నదీ ఘోరా శమయంతి రణాద్రజః. 35

శోణితోదా రథావర్తా యోధసంఘట్టవాహినీ | గజకుంభమహాకూర్మా శరమీనా దురత్యయా. 36

తీక్‌ష్ణగ్రప్రాసమకరా మహాసిగ్రాహవాహినీ | అంత్రశైవాలసంకీర్ణా పతాకాఫేన మాలినీ. 37

గృధ్రకంకమహా హంసా శ్యేనచక్రాహ్వమండితా | వనవాయస కాదంబా గోమాయశ్వాపదాకులా. 38

పిశాచముసంకీర్ణా దుస్తరా ప్రాకృతైర్జనైః | రథప్లవైః సంతరంతః శూరాస్తాం ప్రజగాహిరే. 39

ఆగుల్ఫా దవమజ్జంతః సూదయంతః పరస్పరమ్‌ | సముత్తరంతో వేగేన యోధా జయధనేప్సవః. 40

తతస్తు రౌద్రే సురదైత్యసాదనే మహాహవే భీరుభయంకరే7థ|

రక్షాంసి యక్షాశ్చ సుసంప్రహృష్టాః పిశాచయూథా స్త్వభిరేమిరేచ. 41

పిబంత్యసృగ్గాఢతరం భటానా మాలింగ్య మాంసానిచ భక్షయంతి |

వసాం విలుంపంతిచ విస్ఫురంతి గర్జంత్యథాన్యోన్య మథోవయాంసి. 42

ముంచంతి ఫేత్కారరవాన్‌ శివాశ్చ క్రందంతి యోధా భువి వేదనార్తాః |

శస్త్రప్రతప్తా నిపతంతి చాన్యే యుద్ధం శ్మశానప్రతిమం బభూవ. 43

తస్మిన్‌ శివాఘోరరవే ప్రవృత్తే సురాసురాణాం సుభయంకరే హ |

యుద్ధం బభౌ ప్రాణపణోపవిద్దం ధ్వంద్వే 7తి శస్త్రాక్షగతో దురోదరః. 44

నారదుడనెను - మహామునీ! దేవతల వాహనాలను వివరించారు. యికదైత్యుల వాహనాలనుగూడ వివరించండి.

పులస్త్యుడనెను: విప్రోత్తమా! దానవుల వాహనాలేవో వినండి. చెబుతున్నా. అంధకుని దివ్యరథం 1200 మూరల పరిమాణం గలిగి వేయి ఆకుల గల చక్రాలతో నల్లని ఉత్తమాశ్వాలతో నొప్పి యున్నది. ప్రహ్లాదుడెక్కిన రథం, బంగారపు కాంతితో చంద్రునితో సమానమైన తెల్లని కాంతులు వెలార్చే ఎనిమిది ఉత్తమాశ్వాలు పూన్చబడి వెలుగుతోంది. విరోచనుడేనుగునెక్కెను. కుజంభుడుతురగారూఢుతు. జంభుడు కాంచనశోభతో వెలిగే గుర్రాలు కట్టిన రథస్థుడు. శంకుకర్ణుడు గుర్రంమీద: హయగ్రీవుడు ఏనుగు మీదనెక్కారు. మయుడు ఉత్తమ రథాన్ని దుందుభి మహోరగాన్నీ అధిరోహించారు. శంబరుడు విమానం మీద శంకుడు సింహంమీద కూర్చున్నారు. గద, ముసలం ధరించి మహాబలశాలురైన బలుడు వృత్రుడు పాదాచారులై సురసైన్యాన్ని ఎదుర్కునేందుకు విజృంభించారు.

నారదా ! అప్పుడు జరిగిన భయంకరతుముల యుద్ధములో రేగిన దుమ్ము ధూళితో భూమ్యాకాశాలు కప్పబడి నాయి. ఆరజసాంధకారంలో కనులు కనిపించక తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని గుర్తింపలేకపోవడంతో కొందరు వీరులు తమవారినే సంహరింపసాగిరి. మరికొందరు శత్రువుల దనుమాడిరి. రథాలొక దానినొకటి ప్రచండమైన వేగంతో వెంబడించినవి. ఏనుగులు, ఏనుగులను, ఆశ్వికులాశ్వికులను, పదాతులు పదాతులను వెంటాడి పరస్పరం జయకాంక్షతో నొకరినొకరు మర్దింపసాగిరి. మునే! ఆ విధంగా జరిగిన దేవాసురసంగ్రామంలో చెలరేగిన ధూళిమేఘాలను శమింప చేస్తూ ఒక భయంకరమైన నది ప్రవహించింది. అందులో నీటికి బదులు రక్త ప్రవాహం, సుడిగుండాలకు బదులు రథ చక్రాలు, వెల్లువలకు బదులు మృతకళేబరాలు, తాబేళ్ళకు బదులు బాణాలు, మొసళ్ళ స్థానంలో ప్రాసాయుధాలు. ప్రవాహ రూపాన దీర్ఘకరవాలాలు, నాచుకుప్పలకు బదులు వీరుల ప్రేవుల గుట్టలు, తెట్టెలుగట్టిన నురుల స్థానంలో శ్వేత ధ్వజాలు చక్ర, సారసాలకు బదులు భయంకరమైన డేగలు కంకగృధ్రాలు, రోమహర్షకంగా గోచిరించాయి! అడవికాకులు కాదంబ పక్షులుగా, జంబుకాలు మండూకాలుగా, గుంపు గట్టిన పిశాచాలూ డాకినులే నదీ తీరాన తపస్సు చేసే మునులుగా, ఏర్పడి మామూలు జనులకు దాటుటకు వీలుకాకపోయినది. ఆ భయంకరమైన రణనదిని రథాలనే పడవల మీదదాటుటకు ప్రయత్నించిన వీరులు కొందరు అందులోపడి మోకాళ్లవరకు మునిగిపోగా, విజయలక్ష్మిని వరించ గోరిన మరికొందరు సునాయాసంగా దాట గలిగిరి. దేవ దానవులకు జరిగిన ఆ ఘోర సంగ్రామం, పిరికి పందలకు భయావహమైనది. యక్షరాక్షసులకు సంతోషకరమైనది. పిశాచ సమూహాలు ఆనందంతో గెంతులు వేశాయి. వాయసాలు మృతవీరుల రక్తం కడుపార ఆరగించాయి. మాంస ఖండములు భక్షించాయి. మజ్జా మేదస్సులు గంతులు వేస్తూ కేకలు పెడుతూ తినేశాయి. ఒకవైపు వీరులు బాధతో ఆర్తనాదాలు చేస్తుంటే మరోవైపు నక్కలుత్సాహంతో ఊళలు పెడుతున్నాయి. రణ నిహతులైన వారి శవాలు చెల్లాచెదురుగా నలు వైపులబడి ఉన్నాయి. రణభూమి భయంకరమైన శ్మశానంగా మారిపోయింది. యుద్ధానికి ముందుగా దుర్నిమిత్తాలుగా నక్కల అరుపులు కూతలు వినిపించిగా, దేవతలు, రాక్షసులు రాబోయే దుష్పరిణామాన్ని తలచుకొని భయకంపితులయ్యారు. వీరాగ్రేసరులైన వారు తమ ప్రాణాలనే పణంగా పెట్టి ఆ మారణ జూదంలోనికి దిగారు.

హిరణ్యచక్షు స్తనయోరణ7ంధకో రథే స్థితో వాజిసహస్రయోజితే |

మత్తేభపృష్ఠస్థితముగ్రతేజసం సమేయివాన్‌ దేవపతిం శతక్రతుమ్‌. 45

సమాపతంతంమహిషాధిరూఢం యమంప్రతీచ్ఛద్‌ బలవాన్‌ దితీశః |

ప్రహ్లాదనామాతురగాష్టయుక్తం రథం సమాస్థాయ సముద్యతాస్త్రః. 46

విరోచనశ్చాపి జలేశ్వరంత్వగా జ్జంభస్తథాగాద్‌ ధనదం బలాఢ్యమ్‌ |

వాయుంసమభ్యేత్యచ శంబరో7థ మయోహుతాశం యుయుధే మునీంద్ర. 47

అన్యేహయగ్రీవముఖా మహాబలా దితే స్తనూజాదను పంగవాశ్చ |

సురాన్‌ హుతాశార్క వశూరగేశ్వరాన్‌ ద్వంద్వంసమాసాద్య మహాబలాన్వితాః. 48

గర్జంత్యథాన్యోన్య ముపేత్యయుద్ధే చాపానికర్షంత్యతివేగితాశ్చ |

ముంచంతినారాచగణాన్‌ సహస్రశః ఆగచ్ఛ హేతిష్ఠసి కింబ్రువంతః. 49

శరస్తు తీక్‌ష్ఱైరతితాపయంతః శ##సై#్రరమోఘై రభితాడయంతః |

మందాకినీ వేగనిభాంవహంతీం ప్రవర్తయంతోభయదాంనదీంచ. 50

త్రైలోక్యమాకాంక్షిభిరుగ్రవేగైః సురాసురైర్నారదసంప్రయుద్ధే |

పిశాచరక్షోగణపుష్టివర్ధనీ ముత్తర్తుమిచ్ఛద్భి రసృగ్నదీబభౌ. 51

వాద్యంతి తూర్యాణి సురాసురాణాం పశ్యంతి ఖస్థా మునిసిద్దసంఘాః |

నయంతి తానప్సరసాం గణాగ్ర్యా హతారణ యో7భిముఖాస్తు శూరాః. 52

ఇతి శ్రీ వామన మహాపురాణ నవమో7ధ్యాయః

వేయి గుర్రాలు పూన్చిన రథం మీద నెక్కిహిరణ్యాక్ష పుత్రుడు అంధకుడు, మదించి ఏనుగుపైనున్న మహాతేజస్వి దేవేంద్రునిపైకి లంఘించెను. ఎనిమిది అశ్వాలు కట్టిన రథం మీద కూర్చొని మహా బలశాలి యగు దైత్యపతి ప్రహ్లాదుడు, మహిషాధిరూఢుడై మీదకు వచ్చుచున్న యముని ఎదుర్కొనెను. మహర్షే! అంతట విరోచనుడు వరుణుని, బల శాలియగు కుబేరుని జంభుడు, శంబరుడు వాయిదేవుని, మయుడు అగ్నిని ఎదుర్కొని యుద్ధము చేసిరి. హయముఖుడు మొదలయిన యితర దైత్య దానవవీరులు. మహాబలశాలురగు సూర్యాగ్ని వసూరగేంద్రులతో ద్వంద్వ యుద్దానికి తలపడ్డారు. ''ఊరక నిలుచుంటివేమి? యుద్ధానికి రమ్మ''ని ఒకరినొకరు రెచ్చగొడుతూ, గర్జిస్తూ, ధనుస్సులు ఎక్కుపెడుతూ ఒకరిపై నొకరు వేల సంఖ్యలో బాణాలు వదలసాగారు. తీక్‌ష్ణములైన బాణపరంపరలతో ఒకరినొకరు నొవ్వజేస్తూ గురి తప్పని శస్త్రాస్త్రాలతో దేహాలు చీల్చుకుంటూ, నా వీరులు మందాకిని లాంటి రక్తస్రవంతిని ప్రవహింపజేశారు. ఆ నెత్తుటి నది రక్షో పిశాచాలకు సుష్ఠుగా విందు చేసింది. త్రైలోక్య విజిగీషులయిన దేవదానవ వీరులా తరంగిణి నుత్తరించుటకు పోటీపడసాగారు. ఆ సమయాన ఆకాశంలో నిలబడి మునులు సిద్ధులు దందుభులు మ్రోగిస్తూ ఆ భీకర సమరాన్ని వీక్షించగా అప్సరసాంగనలు శత్రుల కెదురొడ్డి యుద్ధంలో నిహతులైన వీరాగ్రేసరులకు స్వాగతాలు పలుకసాగారు.

ఇది శ్రీ వామన పురాణంలో నవమాధ్యాయం సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters