Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీవామన పురాణ ఏకోనషష్టిత మో%ధ్యాయః

పులస్త్య ఉవాచ:-

కశ్చి దాసీద్ద్విజ ద్రోగ్దా పిశునః క్షత్రియాధమః | పర పీడారుచిః క్షుద్ర స్వభావా దపినిర్ఘృణః || 1

పర్యాసితాః పదాతేన పితృ దేవ ద్విజాతయః | ఫ త్వాయుషి పరిక్షీణ జజ్ఞేఘోరో నిశాచరః || 2

తేనైవ కర్మదోషేణ స్వేన పాప కృతాం వరః | కౄరై శ్చక్రే తతో వృత్తిం రాక్షసత్వా ద్విశేషతః || 3

తస్య పాప రతసై#్యవం జగ్ముర్వర్ష శతాని తు | తేనైవ కర్మదోషేణ నాన్యం వృత్తి మరోచయత్‌ || 4

యం యం పశ్యతి సత్వం స తం తమాదాయ రాక్షసః | చఖాద రౌద్ర కర్మాసౌ బాహు గోచర మాగతమ్‌ || 5

ఏవం తస్యా తిదుష్టస్య కుర్వతః ప్రాణినాం వధమ్‌ | జగామ చ మహాన్‌ కాలః పరిణామం తథా వయః || 6

స కదా చిత్‌ తపస్యంతం దదర్శ సరితస్తటే | మహాభాగ మూర్ద్వభుజం యధావ త్సంయతేంద్రియమ్‌ || 7

అనయా రక్షయా బ్రహ్మన్‌! కృతరక్షం తపోనధిమ్‌ | యోగా చార్యం శుచిం దక్షం వాసుదేవ పరాయణమ్‌ ||

విష్ణుః ప్రాచ్యాం స్థితశ్చక్రీ విష్ణుర్దక్షిణతో గదీ | ప్రతీచ్యాం శార్‌ జ్ఞధృ గ్విష్ణుః ఖడ్గీమమోత్తరే ||

హృషీకేశో వికోణషు తచ్ఛిద్రేషు జనార్దనః | క్రోడ రూపీ హరి ర్భూమౌ నారసింహో%ంబరే మమ ||

క్షరాంత మమలం చక్రం భ్రమత్యేత త్సుదర్శనమ్‌ | అస్యాశుమాలా దుష్ప్రేక్ష్యా హంతు ప్రేత నిశాచరాన్‌ ||

గదా చేయం సహస్రార్చి రుద్వమన్‌ పావకో యథా | రక్షోభూత పిశాచానాం డాకినీనాం చ శాతనీ ||

శార్‌జ్ఞం విస్పూర్జితం చైవ వాసుదేవస్య మద్రిపూన్‌ | తిర్యఙ్ఞ మనుష్య కూష్మాండ ప్రేతాదీన్‌ హంత్వశేషతః ||

ఖడ్గ ధారా జ్వలజ్ఞ్యో త్స్నానిరేర్దూతా యే మమాహితాః | తే యాంతు సౌమ్యతాం సద్యో గరుడేనైవ పన్నగాః ||

యే కూష్మాండా స్తథా యక్షా దూత్యాయే చ నిశాచరాః | ప్రేతా వినాయకాః కౄరా మనుష్యా జృంభకాః ఖగాః ||

సింహాదయో యే పశవో దంద శూకాశ్చపన్నగాః | సర్వే భవంతు మే సౌమ్యా విష్ణు చక్ర రవా హతాః ||

చిత్త వృత్తి హరాయే చ యే జనాః స్మృతి హారకాః | బలౌజసాం చ హర్తార శ్చాయా విధ్వంస కాశ్చయే ||

యే చో పభోగహర్తారో యే చ లక్షణ నాశకాః | కూష్మాండాస్తే ప్రణశ్యంతు విష్ణు చక్ర రవాహ తాః ||

బుద్ది స్వాస్థ్యం మన స్వాస్థ్యమైంద్రియకం తథా | మామాస్తు దేవ దేవస్య వాసుదేవస్య కీర్తనాత్‌ ||

శ్రీ వామన పురాణంలోని ఏబది తొమ్మిదవ అధ్యాయము

పులస్త్యుడిలా అన్నాడు.-- ఒకప్పుడు బ్రాహ్మణ హింసకుడు, దగా కోరు, పరులను పీడించువాడు, నీచుడు, క్రూర స్వభావుడు నైన క్షత్రియాధము డుండెడి వాడు. పితృ దేవతలను, ద్విజులను, వాడెల్లప్పుడు ద్వేషించి హింసించేవాడు. కొంతకాలానకు ఆయువు తీరి వాడు మరణించి భయంకర రాక్షసుడైనాడు. ఈ కర్మదోషం వల్ల రాక్షస యోనిలో కూడ వాడు మరింత జన పీడకుడుగా నరభక్షకుడుగా రూపొందాడు. అదే రాక్షస వృత్తిలో వాడు నూరేండ్లు గడిపాడు. కంటికి కన పడిన జీవిని, చేతికి అందిన ప్రాణినీ ఏ మాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా భక్షించేవాడు. అలా చాలా కాలం పాపాచారుడుగా జీవించాడు. వయస్సు బాగా ముదిరిపోయింది. ఒక పర్యాయం వాడోక నదీ తీరాన ఊర్ధ్వ బాహువై జితేంద్రియుడై తపో దీక్షలో మునిగిన ఒక మహా సాధువును చూచాడు. ఆ యోగి దక్షుడు, వాసుదేవ పరాయణుడు. ఈ రక్షాస్తోత్రంతో ఆత్మరక్షణ చేసుకుంటూ తపస్సులో నిమగ్నుడైనాడు. చక్ర ధారియై విష్ణువు నాకు తూర్పున ఉండుగాక, గదాధరుడై ఆ విష్ణువు ఉత్తర దిశన నిలచుగాక. శార్‌ఙ్గ పాణియైన విష్ణువు నాకు పడమరగాను, ఖడ్గ ధరుడై ఆ విష్ణువు ఉత్తర దిశన ఉండుగాక హృషీకేషుడు దిక్కుల మూలలందునూ తక్కిన సందులలో జనార్దనుడూ ని బడి నన్ను కాపాడుదురు. గాక వరాహ విష్ణువు భూతలాన, నృసింహుడు ఆకాశాన ఉందురు గాక, పదునైన అంచులతో, కన్నులు చెదరి పోయే సూర్యమండల దీప్తితో వెలిగే సుదర్శన చక్ర ప్రేతరాక్షసాదులను సంహరించుటకు సర్వత్రా తిరుగుచున్నది. వేయి కిరణాల వెలుగును గ్రుమ్మరిస్తూ అగ్నిలాగా గద రక్షో భూత పిశాచ డాకినీ శక్తులను సంహరిస్తున్నది. వాసుదేవుని ధనుస్సు విజృంభించి నాశత్రువులను, పశు పక్షి మనుష్య కూష్మాండదులను హత మార్చుగాక. గరుడుని చూచి విషసర్పాలు లొంగిపోయినట్లు ప్రభువు నందక ఖడ్గ ధారజ్వాలలోల మాడిపోయి నా శతృవులు శాంతులౌదురు గాక. విష్ణు చక్ర ధ్వని తరంగాలతాకిడికి యక్షులు, దైత్యులు, కూశ్మాంగనిశాచరులు ప్రేత వినాయకాదులు, క్రూరులైన మనుష్య జృంభక (రాక్షసులు) ఖగసింహాది మృగాలు విషసర్పాలు, సర్వులూ శక్తి కోల్పోయి శాంతులౌదురు గాక. స్మరణ శక్తినీ ఆలోచనా శక్తినీ బల పౌరుషాలను, నీడలను, సుఖ భోగాలను, శుభలక్షణాలను. హరించే కూష్మాండాది దుష్ట శక్తులు విష్ణు చక్ర ధ్వనులచే నశింతురుగాక. దేవ దేవుడగు శ్రీ హరి భజన వల్ల నా బుద్ధీ, మనస్సు, యింద్రియాలు సంపూర్ణ స్వస్థతను భజించు గాక. పృష్ఠే పురస్తా దధ దక్షిణోత్తరే| వికోణత శ్చాస్తు జనార్దనో హరిః | తమీడ్యమీశాన మనంత మచ్యుతం |

జనార్దనం ప్రణిపతతో న సీదతి || 20

యథా పరం బ్రహ్మ హరి స్తథా పరం | జగత్స్వరూపశ్చ స ఏవ కేశవః | ఋతేన తేనాచ్యుత నామకీన్తనాత్‌ |

ఫ్ప్రణాశ##మేతు త్రివిధం మమాశుభమ్‌ || 21

ఇత్యసా వాత్మ రక్షార్థం కృత్వావై విష్ణు పంజరమ్‌ | సంస్థితో%సావసి బలీ రాక్షసః సముపాద్రవత్‌ || 22

తతో ద్విజ నియుక్తాయాం రక్షయాం రజనీ చరః | నిర్థూత వేగః సహసా తస్థా మాస చతుష్టయమ్‌ || 23

యావ ద్ద్విజస్య దేవర్షే! సమాప్తిర్వై సమాధితః | జాతే జప్యవసానో%సౌ తం దదర్శ నిశాచరమ్‌ || 24

దీనం హత బలోత్సాహం కాందిశీక హతౌజనమ్‌ | తం దృష్ట్వా కృపయావిష్టః సమాశ్వాస్య నిశాచరమ్‌ || 25

పప్రచ్చా గమనే హేతుం స చా చష్ట యథా తథమ్‌ | స్వభావ మాత్మనో ద్రష్టుం రక్షయా తేజనః క్షితిమ్‌ || 26

కథయిత్వా చ త ద్రక్షః కారణం. వివిధం తతః | ప్రసీదేత్యబ్రవీ ద్విప్రం నిర్విణ్ణం స్వేన కర్మణా || 27

బహూని పాపాని మయా కృతాని | నరాశ్చ దీనా బహవో మయా హతాః | కృతాః స్త్రియో మయా బహ్వ్యోవిధవాః

పుత్రవర్జితాః| అనాగసం చ సత్వానా మల్పకానాం క్షయంః కృతః || 28

తస్మాత్పాపా దహం మోక్ష మిచ్ఛామి త్వత్ప్రసాదతః | పాప ప్రశమనాయా లం కురు మే ధర్మదేశనమ్‌ || 29

పాప స్యా స్య క్షయకర ముపదేశం ప్రయఛ్ఛామే | తస్య తద్వచనః శ్రుత్వారాక్షస స్య ద్విజోత్తమః || 30

వచనం ప్రాహ ధర్మాత్మా హేతుమచ్చ సుభాషితమ్‌ | కథం క్రూరస్వభావస్య సత స్తవ నిశాచర | సహపైన సమాయాతా

జిజ్ఞాసా ధర్మ వర్త్మని || 31

రాక్షస ఉవాచ :-

త్వాంవై సమాగతో%స్మ్యద్య క్షిప్తో%హం రక్షయా బలాత్‌ | తవ సంసర్గతో బ్రహ్మన్‌! జాతో నిర్వేద ఉత్తమః || 32

కా సా రక్ష న తాం వేద్మి వేద్మి నా%స్యాః పరాయణమ్‌ | యస్యాః సంసర్గ మాసాద్య నిర్వేద ప్రాపితం పరమ్‌ || 33

త్వం కృపాం కురు ధర్మజ్ఞ మయ్యసుక్రోశ మావహ | యథా పాపా పనోదోమే భవత్వార్య తథా కురు || 34

పులస్త్య ఉవాచ :-

ఇత్యేవ ముక్తః స ముని స్తదా వై తేన రక్షసా | ప్రత్యువాచ మహాభాగో విమృశ్య సుచిరం మునిః || 35

ఋషి రువాచ :-

యన్మమాహోపదేశార్థం నిర్విణ్ణః స్వేన కర్మణా | యుక్తమేతిద్ధి పాపానాం నివృత్తి రుపకారికా || 36

కరిష్యే యాతుధానానాం నత్వహం ధర్మదేశనమ్‌ | తాన్‌ సంపృచ్చ ద్విజాన్‌ సౌమ్య యేవై ప్రవచనే రతాః || 37

ఏవ ముక్త్వా య¸° విప్ర శ్చింతా మాప స రాక్షసః | కథం పాపాపనోదః స్యా దితి చింతాకులేంద్రియః || 38

నాకు ముందు వెనుక కుడి ఎడమన మూల మూల యందు జనార్దను డుండు గాక. అనంతుడు, నచ్యుతుడు నగు విష్ణునకు ప్రణతుడైన వాని కెట్టి కష్టాలూ కలుగవు. శ్రీ విష్ణుడు, పరబ్రహ్మ పరావధికుడు. అతడే జగత్స్వరూపి. విశ్వాసం తో అచ్యుత నామ స్మరణం చేసి నందున నా త్రివిధాలయిన పాపాలు నశించు గాత. ఈ విధంగా విష్ణు పంజర స్తోత్రం ద్వారా ఆత్మరక్షగావించుకొని ఆపీనుడైన ఆ తపస్వి మీదికారాక్షసుడు లంఘించాడు. అయితే ఆ ద్విజుడు గావించు కున్న రక్షల ప్రభావం వల్ల ఆ రాక్షసుని శక్తి వేగాలన్నీ ఉడిగిపోయి అతడట్లే నాలుగు నెలల కాలం అక్కడ నిలబడి పోయాడు. జపానం తరం సమాధి ముగిసిన తర్వాత నా ద్విజోత్తముడు లేచి ఎదురుగా తేజస్సు గోల్పోయి దీనుడుగా కాందిశీకుడుగా అసహాయ స్థితిలో నిలబడిని రాక్షసుని చూచి వాడి మీద జాలి గొని ఓదార్పు మాటలతో వాడి వృత్తాంతం అడిగాడు అందుకా నిశాచరుడు తన ఉదంతం దాచకుండా చెప్పి ఆయనను చూచి నంతనే తన శక్తులన్నీ ఎలా నశించినదీ చెప్పి, నికృష్టమైన తన స్వభావం మీద విరక్తితో ఆయనను కరుణించమని అర్ధించాడు. మహాత్మా! నేను చాలా కౄర కర్ముడను. ఎన్నో పాపాలు చేశాను. ఎందరనో చంపి వేశాను. ఎందరు స్త్రీలనో విధవలుగా పుత్రహీనలుగా చేశాను. ఏ పాప మెరుగని అల్ప ప్రాణుల నెన్నింటినో వధించాను. అలాంటి నాకు పాపాల నుంచి విముక్తి ప్రసాదించండి. నాకీ జీవితం మీద రోత పుట్టింది. నాకు తరణోపాయంగా ఏదైనా ఉపదేశం చేయండి. ఆ రక్కసుని వచనాలకు అబ్బురపడి ఆయన సహేతుకమైన ప్రశ్న అడిగాడు. ఇంతటి ఘోర కర్ముడవైన నీకు అకస్మాత్తుగా ఈ మంచి బుద్ది ఎలా కలిగిందయ్యా? ఇదెలా సంభవం? అందుల కానిశాచరుడు--మిమ్ములను సమీపించగానే మీరు గావించిన రక్షా స్తోత్రాలు నన్ను నిర్వీర్యుణ్ణి చేశాయి. నా జవ సత్యాలనీ హరించేశాయి. మీ సాంగత్యం నాలో నిజమైన నిర్వేదాన్ని విరక్తిని కలిగించింది. ఆ రక్షా జపా లేవో అవి ఎలా ఉచ్చరించాలో నేనెరుగను. కాని వాని సంసర్గ మాత్రాన్నే నాలో నిర్వేదం కలిగింది. మీరు ధర్మం తెలిసినవారు. నా మీద దయ దలచి నా పాపాలు ఎలా పోతాయో ఆ విధంగా చేసి నన్ను కాపాడండి. అని దీనంగా ప్రార్థించాడు. అలా రాక్షసుడు చేసిన దీనాలాపాలు విన ఆ మహనీయుడు చాల సేపు ఆలోచించి ఇలా అన్నాడు. ఓయీ నీ నికృష్ట జీవితం మీద రోత కలిగి నన్ను ఉపదేశించ మని కోరడం బాగానే వుంది. పాప క్షయం జీవికి ఉపకారకమే కదా! కాని నేను నర భక్షలగు రాక్షసులకు ఉపదేశం చేయజాలను. అందులకై నీవు ప్రవచన పరులైనవిప్రులను వెళ్లి ఆర్దించుము. అలా సలహా యిచ్చి ఆ ఋషి సత్తముడు వెళ్లి పోగా నా రాక్షసుడు, ఈ పాప మెట్లు పోగొట్టుకో నగునా యని చింత తో క్రుంగి పోయి నాటి నుండి భయంకరమైన ఆకలికి గూడ ఓర్చుకుని ప్రాణులను తినడం మానుకున్నాడు.

న చఖాద సస త్వాని క్షుథా సంబాధితో%పి సన్‌ | షష్ఠే షష్ఠే తదా కాలే జంతు మేక మభక్షయత్‌ || 39

స కదాచిత్‌ క్షుధా విష్టః పర్యటన్‌ విపులే వనే | దదర్శా థ ఫలాహార మాగతం బ్రహ్మ చారిణమ్‌ || 40

గృహీతో రాక్షసా తేన స తదా ముని దారకః | నిరాశో జీవితే ప్రాహ సామ పూర్వం నిశాచరమ్‌ || 41

బ్రాహ్మణ ఉవాచ :-

భో భద్ర బ్రూహి యత్కార్యం గృహీతో యేన హేతునా | తదను బ్రూహి భద్రం తే అయ మస్మ్యనుశాధి మామ్‌ || 42

రాక్షస ఉవాచ :-

షష్ఠే కాలే త్వమాహారః క్షుధితస్య సమాగతః | నిః శ్రీకస్యా తిపాపస్య నిర్ఘృణాయ ద్విజద్రుహః || 43

బ్రాహ్మణ ఉవాచ :-

యద్య వశ్యం త్వయా చాహం భక్షితవ్యో నిశాచర | ఆవాస్యామి తవాద్యైవ నివేద్య గురవే ఫలమ్‌ || 44

గుర్వర్థ మేత దాగత్య యత్ఫల గ్రహణం కృతమ్‌ | మామాత్ర నిష్ఠా ప్రాప్తస్య ఫలాని వినివేతుమ్‌ || 45

స త్వం ముహూర్త మాత్రం మా మత్రైవం ప్రతి పాలయ | నివేద్య గురవే యావ దిహాగచ్చా మ్యహం ఫలమ్‌ || 46

రాక్షస ఉవాచ :-

షష్ఠే కాలేన మే బ్రహ్మన్‌ కశ్చిద్గ్రహణ మాగతః | ప్రతిముచ్యేత దేవో%పి ఇతి మే పాప జీవికా || 47

ఏక ఏవాత్రమోక్షస్య తవ హేతుః శ్రుణుష్వ తత్‌ | ముంచా మ్యహ మసందిగ్ధం యది తత్కురుతే భవాన్‌ || 48

బ్రాహ్మణ ఉవాచ :-

గురో ర్యన్నవిరోధాయ యన్నధర్మో పరోధకమ్‌ | తత్కరిష్యా మ్యహం రక్షోయన్న వ్రతహరం మమ || 49

రాక్షస ఉవాచ :-

మయా నిసర్గతో బ్రహ్మన్‌ జాతిదోషా ద్విశేషతః | నిర్వివేకేన చిత్తేన పాపకర్మ సదా కృతమ్‌ || 50

ఆబాల్యా న్మమ పాపే షు న ధర్మేషు రతం మనః | యత్పాప సంక్షయా న్మోక్షం ప్రాప్నుయాం యేన తద్వద || 51

యాని పాపాని కర్మాణి బాలత్వా చ్చరితాని చ | దుష్టాం యోని మిమాంప్రాప్య తన్ముక్తిం కథయద్విజ || 52

యద్యేత ద్విజ పుత్ర త్వం సమాఖ్యా స్యస్యశేషతః | తతః క్షుధార్తా న్మత్తస్త్యం నియతం మోక్ష మాస్స్యసి || 53

న చేత్‌ తత్‌ పాపశీలో%హ మత్యర్థం క్షుత్పిపాసితః | షష్టే కాలే నృశంసాత్వా భక్షయిస్యామి నిర్ఘృణః || 54

ఆరు పూటల కోక పర్యాయం మాత్రమే దో ఒక జంతువును చంపి తినసాగాడు. ఒక పరి ఆకలితో నక నక లాడుతూ తిరుగుతూన్న ఆ రాక్షసుడికి అరణ్యంలో పండ్ల కోసం వచ్చిన ఒక బ్రహ్మాచారి కంట బడ్డాడు. వెంటనే అతనిని గట్టిగా పట్టు కోగా ఆ బ్రాహ్మణ బాలుడు చావు నిశ్చయమని తలచి మృదువుగా సామ వచనాలతో వాని కిట్లా చెప్పాడు. సౌమ్యుడా! నీకు మేలగు గాక. నీవు నన్నేల పట్టు కొంటివో చెప్పుము. నేనేమి చేయ వలయునో ఆదేశించుము. అందులకు ఆ రక్కసుడు ఆరు పూటలు ఆహారం లేకుండా ఉన్న నాకు నీవు దొరికావు. నేనునికృష్టుడను. క్రూరుణ్ణి. బ్రాహ్మణ ద్రోహిని మహాపాపిని. ఆకలి నన్నే దహిస్తున్న దన్నాడు. అందు కాముని కుమారుడిలా అన్నాడు. నీవు తప్పని సరిగా నన్నుతిననెంచినచోనేనిప్పుడే ఈ ఫలాలు మా గురు దేవునకు ఆర్పించి వస్తాను. గురువు గారి కోసమే నేను అడవికి వచ్చాను. ఆయన కొరకై ఏరిన ఫలాలు ఆయన కర్పించుట నా ధర్మము. వ్రతము. అది నెరవేర్చి క్షణంలో తిరిగి వస్తాను. కొంచె మాగుము. ద్విజపుత్రుని మాటల కా నిశాచరుడు, ఆరు పూటల తర్వాత లభించిన జంతువు ఏదైనా సరే దేవుడైనా సరే నేను తిన కుండా వదలను. ఇది నా పాపిష్టి జీవిత చర్య. ఒకవేళ నీవు అంతగా తప్పించు కో దలచితే ఒకే మార్గం ఉంది అది నీవు చేస్తే తప్పకుండా నిన్ను వదిలేస్తాను. అన్నాడు దానికి బ్రాహ్మణ బాలుడు గురువుకు ధర్మానికి నా వ్రతానికి భంగం కలుగని పని ఏదైనా సరే చేస్తాననగా నా దుష్టుడిలా అన్నాడు ఓ విప్రకుమారా! రాక్షసజాతిలో పుట్టిన నేను ప్రకృతి సిద్దంగానే కౄరుడను, వివేక హీనుడిని పాపకర్ముడను. బాల్యం నుండీ పాపా లంటేనే మక్కువ. ధర్మం మీదికి నా బుద్ది వెళ్లేది కాదు. అలానే నేను మూట కట్టుకున్న పాపాల నుంచి నాకు విముక్తి కలిగే విధాన చెప్పుము. నాపాపాలు నిశ్శేషంగా నశించే ఉపాయం చెప్పావంటే ఎంతటి ఆకలికైనా ఓర్చుకుని నిన్ను వదలు తాను లేదో ఈ ఆరవ పూట పాపా చారుడనైన నేను విధిగా నిన్ను భక్షించి ఈ ఆకలి బాధ తీర్చుకుంటాను. నరభక్షకుడనైన నాకు దయ అంటూ లేదు.

పులస్త్య ఉవాచ:-

ఏవ ముక్తో ముని సుతస్తేన ఘోరేణ రక్షసా | చింతా మవాప మహతీ మశక్త స్తదుదీరణ || 55

స విమృశ్య చిరం విప్రః శరణం జాతవేదసమ్‌ | జగామ జ్ఞాన దానాయ సంశయం పరమం గతః || 56

యది శుశ్రూషితో వహ్ని ర్గురు శశ్రూషణా దను | వ్రతాని వా సుచీర్ణాని సప్తార్చిః పాతుమాం తతః || 57

న మాతరం న పితరం గౌరవేణ యథా గురుమ్‌ | సర్వధైవావగచ్ఛామి తధా మాం పాతు పావకః || 58

యధా గురుం న మన సా కర్మణా వచసా పి వా | అవజానామ్యహం తేన పాతు సత్యేన పావకః || 59

ఇత్యేవం మనసా సత్యాన్‌ కుర్వతః శపధాన్‌ పునః | సప్తార్చిషా సమాదిష్టా ప్రాదురాసీ త్సరస్వతీ || 60

సా ప్రోవాచ ద్విజ సుతం రాక్షస గ్రహణాకులమ్‌ | మాభై ర్ద్విజసు తాహం త్వాం మోక్షయి ష్యామి సంకటాత్‌ || 61

యదస్య రక్షసః శ్రేయో జిహ్వాగ్రే సంస్థితా తవ | తత్సర్వం కథయిష్యామి తతోమోక్ష మవాప్స్యసి || 62

అదృశ్యా రక్షసా తేన ప్రోక్త్వేత్థం సా సరస్వతీ | అదర్శనం గతా సో%పి ద్విజః ప్రాహ నిశాచరమ్‌ || 63

బ్రాహ్మణ ఉవాచ:-

శ్రూయతాం తవ యచ్ఛ్రేయ స్తథా న్వే షాం చ పాపినామ్‌ | సమస్త పాపశుద్ద్యర్థం పుణ్యోపచయ దం చ యత్‌ || 64

ప్రాతరుత్థాయ జప్తవ్యం మధ్యాహ్నే హ్నఃక్షయే పి వా | అసంశయం సదా జప్యా జపతాం పుష్టిశాంతిదః || 65

ఆ క్రూర రాక్షసునకు కావలసిన తరణోపాయం చెప్పుటకు ఏమీ తోచక ఆ బ్రహ్మచారి గొప్ప విషాదానికి లోనై నాడు చాలా సేపు విచారించి చేయునది లేక జాతవేదుని (అగ్ని దేవుని) కి శరణాగతుడై తగిన జ్ఞానమొసగుమని ఆర్ధించాడు గురు శుశ్రూష తర్వాత శ్రద్దతో అగ్నిని సేవించిన వాడ నగుచో ఆ పావకుడు నన్ను రక్షించును గాక! బ్రహ్మ చర్యవ్రతం చక్కగా నిర్వర్తించిన వాడనైతే తల్లి దండ్రులను గురువును గౌరవిచువాడను గనుక నన్ను అగ్ని రక్షించు గాక. మనో వాక్కాయ కర్మాలలో గురువుపట్ల అనాదరం లేనివాడనైతే నన్ను జాత వేదుడు కాపాడతాడు. నేను చెప్పిన వన్నీ నీజా లైతే ఆ సత్య బలం వల్ల పావకుడు నన్ను కాపాడు గాక ఇలా మనస్సులోనే శపధాలు గావించుకుని నంతనే అగ్ని దేవుని ఆదేశాన్ననుసరించి వెంటనే సరస్వతి అతని ఎదుట గోచరించి ఓ బ్రాహ్మణ బాలకా! భయ పడకుము. నిన్నీ ఆపద నుంచి తప్పించుటకు వచ్చాను. ఈ రాక్షసునకు కావలసిన శ్రేయే పాయాన్ని నీ నాలుక మీద నిలచి నేను ఉపదేశించి నిన్ను విడిపించెదను. అలా చెప్పి ఆ లాగే ఆ రాక్షసునకు కనుపించ కుండా బాలకుని నాలుకపై నిలచి యిలా చెప్పసాగింది ఓ నిశాచరా నీకు నీలాంటి పాపులకు శ్రేయస్సు కలుగజేసే విధానము చెబుతున్నా వినుము. సమస్త పాపాలు పోగొట్టి పుణ్యం కలుగజేసే ఈ స్తవం ప్రతి దినమూ ప్రాతః కాలాన మధ్యాహ్న దినాంతములందు జపింప వలయును. ఎల్ల వేళ లందూ జపిస్తే శాంతిని పుష్టినీ కలిగిస్తుంది ఇందుకు సందేహంలేదు

ఓం హరిం కృష్ణం హృషీకేశం వాసుదేవం జనార్దనమ్‌ | ప్రణతోకస్మి జగన్నాథం సమే పాపం వ్యపోహతు || 66

చరా చర గురుం నాథం గోవిందం శేషశాయినమ్‌ | ప్రణతో స్మి పరం దేవం సమే పాపం వ్యపోహతు || 67

శంఖినం చక్రిణం శార్‌ ఙ్గధారిణం స్రగ్ధరం పరమ్‌ | ప్రణతోస్మి పతిం లక్ష్మ్యాః సమే పాపం వ్యపోహతు || 68

దామోదరం ముదారాక్షం పుండరీకాక్ష మచల్యతమే | ప్రణతో%స్మి స్తుతం స్తుత్యైః స మే పాపం వ్యపోహతు || 69

నారాయణం నరం శౌరిం మాధవం మధుసూదనమ్‌ | ప్రణతోస్మి ధరాధారం సమే పాపం వ్యపోహతు || 70

కేశవం చంద్రసూర్యాక్షం కంసకేసి నిషూదనమ్‌ | ప్రణతోస్మి మహాబాహుం సమే పాపం వ్యపోహతు || 71

శ్రీ వత్స వక్ష సం శ్రీశం శ్రీధరం శ్రీనికేతనమ్‌ | ప్రణతోస్మి శ్రియః కాంతం సమే పాపం వ్యపోహతు || 72

యమీశం సర్వ భూతానాం ధ్యాయంతి యతమో క్షరమ్‌ | వాసుదేవ మనిర్దేశ్యం తమస్మి శరణం గతః || 73

సమస్తాలంబనే భ్యో యం వ్యావృత్య మనసో గతిమ్‌ | ధ్యాయంతి వాసుదేవాఖ్యం తమస్మి శరణం గతః || 74

సర్వగం సర్వ భూతం చ సర్వ స్యాధార మీశ్వరమ్‌ | వాసుదేవం పరంబ్రహ్మ తమస్మిశరణం గతః || 75

పరమాత్మాన మవ్యక్తం యం ప్రయాంతి సుమేధసః | కర్మక్షయే క్షయం దేవం సతమస్మి శరణం గతః || 76

పుణ్య పాప విని ర్ముక్తా యం ప్రవిశ్య పునర్భవమ్‌ | న యోగినః ప్రాప్నువంతి తమస్మి శరణం గతః || 77

బ్రహ్మ భూత్వా జగత్సర్వం సదేవాసుర మానుషమ్‌ | యః సృజత్యచ్యుతో దేవ స్తమస్మి శరణం గతః || 78

బ్రహ్మత్వేయస్య వక్త్రేభ్య శ్చతుర్వేదమయం వపుః | ప్రభుః పురాతనోజజ్ఞే తమస్మి శరణంగతః || 79

బ్రహ్మరూప ధరం దేవం జగద్యోనిం జనార్దనమ్‌ | స్రష్ట్రత్వే సంస్థితం సృష్టౌ ప్రణతో స్మి సనాతనమ్‌ || 80

స్రష్టా భూత్వాస్థితో యోగీ స్థితా వసు రసూదనః | తమాది పురుషం విష్ణుం ప్రణతో%స్మి జనార్దనమ్‌ || 81

యజ్ఞై ర్యజంతీ యం విప్రా యజ్ఞేశం యజ్ఞ భావనమమ్‌ | తం యజ్ఞ పురుషం విష్ణుం ప్రణతో స్మి సనాతనమ్‌ || 82

ధృతా మహీ హృతా దైత్యాః పరి త్రాతా స్తథా సురాః | యేన తం విష్ణు మా%ద్యే శం ప్రణతో కస్మి జనార్దనమ్‌ || 83

ప్రణవ (ఓం) స్వరూపుడైన శ్రీహరి కి కృష్ణునకు హృషీకేశు నకు జగన్నాధు డగు వాసుదేవ జనార్దనునకు నమస్కరించుచున్నాను. ఆయన నా పాపాలు పోగొట్టు గాక! చరా చరా లకు గురువు, నాధుడు, గోవిందుడు నైన శేషశాయికి నమస్సులు. ఆయన నా పాపాలు నశింపజేయు గాక. శంఖ చక్ర శార్‌ ఙ్గ మాలా ధరుడగు శ్రియః పతికి నమస్సులు. నా పాపాలు పోనడచుగాక. విశాలనేత్రుడు, పుండరీకాక్షుడు, అచ్యుతుడు, ఆ రాధ్యులచేత నారాధింప బడే ప్రభువు కు ప్రణామము. నా పాపాలు ఆయన పోగొట్టు గాక. నారాయణునకు నరునకు శౌరికి మాధవునకు మధుసూదనునకు జగదాధారునకు నమస్సులు. నా పాపాలనతడు హరించుగాక. కేశవుడు చంద్ర సూర్య నయ నుడు కంస కేశి సంహారకుడు నగు మహా భుజునకు నమస్సులు. ఆయన నా పాపాలను పోకొట్టు గాక. శ్రీవత్సాంకునకు లక్ష్మీపతికి శ్రీదరునకు శ్రీనివాసునకు శ్రీవల్లభునకు నమస్సులు. ఆ స్వామి నా పాపాలను నశింప జేయు గాక. యోగీశ్వరులు ధ్యానించే సర్వ భూతేశ్వరునకు అక్షరునకు అనిర్దేశ్య స్వరూపి యగు వాసుదేవునకు నమస్సులు. ఆయనకు శరణాగతుడ నగు చున్నాను. తమ మనస్సుల నితర విషయాల నుండి మళ్లించి యోగులై ప్రభువు పై నిలపి ధ్యానితురో అట్టి వాసుదేవుని శరణు వేడుచున్నాను. సర్వ జీవులకు ఆధార భూతుడు సర్వ గమనుడు నగు వాసుదేవుడు పర బ్రహ్మకు శరణాగతుడను. విజ్ఞులు తమ కర్మ క్షయానంతరం ఏ అవ్యక్త అక్షయ తత్వాన్ని చేరుదురో అట్టి దేవునకు శరణాగతుడను. యోగులు పుణ్య పాపాల నుండి ముక్తులైన ఏ ప్రభువును చేరి పునర్జన్మ రహితులయ్యెదరో అట్టి ప్రభువుకు శరణాగతుడను. చతుర్ముఖబ్రహ్మ రూపాన దేవాసుర మానుషసహితమైన జగత్తు నంతా సృష్టించే అచ్యుతునకు శరణాగతుడను బ్రహ్మరూపాన ఎవని నోటి నుండి చతుర్వేదములు వెలువడినవో అట్టి వేద పురుషునకు శరణాగతుడను సృష్టి కార్యం నెరవేరు టకు బ్రహ్మ రూపాన్ని ధరించిన జగన్మాతునకు జనార్దనునకు సనాతనునకు ప్రణామములు. సృష్టి గావించిన తర్వాత యోగి యై నిలచిన రాక్షసాంతకు డగు ఆది పురుషునకు విష్ణువునకు ణ్రామములు చేయుచున్నాను. భూమి నుద్దరించి దైత్యుల వధించి దేవతల రక్షించిన ఆది విష్ణువు జనార్దనునకు ప్రణతుడను. విప్రులు ఏ దేవుని యజ్ఞాల ద్వారా ఆరాధిస్తారో యజ్ఞేశ్వరుడు యజ్ఞ భావనుడు యజ్ఞ పురుషుడు నగు నా సనాతన విష్ణు దేవునకు ప్రణతుడ నగు చున్నాను.

పాతాళ వీధీ భూతాని తథా లోకా నిహంతి యః | నమంత పురుషం రుద్రం ప్రణ తోస్మి సనాతనమ్‌ || 84

సంభక్షయి త్వా సకలంయధా సృష్ట మదం జగత్‌ | యోవై నృత్యతి రుద్రాత్మా ప్రణాతో స్మి జనార్దనమ్‌ || 85

సురాసురాః పితృ గణాః యక్ష గంధర్వ రాక్షసాః | సంభృతా యస్య దేవస్య సర్వగం తం నమామ్యహమ్‌ || 86

సమస్త దేవాః సకలా మను ష్యాణాం చ జాతయః | యస్యా ంశభూతా దేవస్య సర్వగం తం నతో స్మహమ్‌ || 87

వృక్ష గుల్మా దయో యస్య తధా పశు మృగాదయః | ఏకాంశ భూతా దేవస్య సర్వగం తం నమామ్యహమ్‌ || 88

యస్మాన్నాన్యత్‌ పరం కించిత్‌ యస్మిన్‌ సర్వం మహాత్మని | యః సర్వమధ్య గో%నంతః సర్వగం తం నమామ్యహమ్‌ || 89

యథా సర్వేషు భూతేషు గూఢో%గ్ని రివదారుషు | విష్ణు రేవం తథా పాపం మమా%శేషం ప్రణశ్యతు || 90

యధా విష్ణు మయం సర్వం బ్రహ్మాది సచరాచరమ్‌ | యచ్చ జ్ఞాన పరిచ్ఛేద్యం పాపం నశ్యతు మే తథా ||91

శుభాశుభాని కార్మాణి రజః సత్వ తమాంసి చ | అనేక జన్మ కర్మోత్థం పాపం నశ్యతుమే తథా || 92

యన్ని శాయాం చ యత్ర్పాత ర్యన్మధాహ్నా పరాహ్ణయోః | సంధ్యయోశ్చ కృతం పాపం కర్మణా మనసా గిరా || 93

యత్‌ తిష్ఠతా యద్‌ వ్రజతా యచ్చ శయ్యాగతేన మే | కృతం య దశుభం కర్మకాయే న మనసా గిరా || 94

అజ్ఞాన తో జ్ఞాన తో వా మదా చ్చవితమానసైః | తత్‌ క్షిప్రం విలయం యాతు వాసు దేవస్య కీర్తనాత్‌ || 95

పర దార పర ద్రవ్య వాంఛా ద్రోహోద్భవం చ యత్‌ | పరడీడోద్భవాం నిందాం కుర్వతా యన్మహాత్మనామ్‌|| 96

యచ్చ భోజ్యే తథా పేయే భ##క్ష్యే చోప్యే విలేహనే | తద్యాతు విలయం తోయే యథా లవణ భాజనమ్‌ || 97

యద్బాల్యే యచ్చ కౌమారే యత్పాపం ¸°వనే మమ | వయః పరిణతౌ యచ్చ యచ్చ జన్మాంతరే కృతమ్‌ || 98

తన్నారాయణ గోవింద హరి కృష్ణేశ కీర్తనాత్‌ | ప్రయాతు విలయం తో యే యథా లవణ భాజనమ్‌ || 99

విష్ణవే వాసుదేవాయ హరయే కేశవాయ చ | జనార్దనాయ కృష్ణాయ నమో భూయో నమో నమః || 100

భవిష్యన్నరకఘ్నాయ నమః కంస విఘాతినే | అరిష్ట కేశి చాణూర దేవారి క్షయిణ నమః || 101

కో%న్యో ర్బలే ర్వంచయిత్వా త్వా మృతే వై భవిష్యతి | కో%న్యో నాశయతి బలాత్‌ దర్పం హై హయ భూపతేః || 102

పాతాళ వీధీ భూతాలను, లోకాలను లయింప జేయు అంతకు డగు రుద్రునకు సనాతనున కు నమస్కరించెదను. సృష్టింపబడిన ఈ జగత్తు నంతనూ భక్షించి రుద్ర రూపాన తాండవ నృత్యం చేయు నా సనా తను డగు హరికి నమస్సులు సురాసురులు పితృ గణాలు దేవ గంధర్వ యక్ష రాక్షసులు ఏ ప్రభువు నుండి సంభవించు చున్నవో, ఆ సర్వవ్యాపియగు సనాతనునకు నమస్సులు సమస్త దేవ జాతులు మనుష్య జాతులు ఎవని అంశాలో, ఆ సర్వ వ్యాపి యగు ప్రభువు కు నమస్కరింతును. చెట్టు చేమలు పొదలు పశు మృగాదులు ఏ దేవుని అంశాలో, ఆ విష్ణువునకు నమస్కరించెదను. ఎవని కన్న ఇతరమైనదిలేదో, ఏ మహాత్మునిలో అన్నీ యిమిడి యున్నవో, ఎవడు అన్నింటికి మధ్యన, చివరన నుండునో, అట్టి దేవునకు నమస్కరించు చున్నాను. కొయ్యలో నిప్పు వలె అన్నింటిలో విష్ణువు లీనుడై యున్నాడు. ఆ ప్రభువు నా పాపాలన్నీ మిగుల కుండ నశింప చేయు గాక. బ్రహ్మాది చరా చర జగత్తంతా విష్ణుమయం. బుద్ది గమ్యమైన దంతా ఆయన రూపం. ఆ మహనీయుడు నా పాపం నశింపచేయు గాక. రజస్సత్వ తమో గుణ మయమైన నా వలన జన్మల శుభాశుభ కర్మల వల్ల గలిగిన పాపాలన్నీ నశించు గాక నేను మనో వాక్కాయ కృతములైన కర్మల ద్వారా రాత్రు లందు ప్రాత ర్మధ్యాహ్న పరాహ్ణ సమయాలలోను, సంధ్య వేళలలోను, మూట గట్టు కొనిన పాపములూ, లేస్తూ, నడుస్తూ, శయనిస్తూ, చేసిన అశుభ కర్మలు; తెలిసీ తెలియక మదాతిరేకంతో గావించిన సకల పాపాలూ వాసుదేవ నామస్మరణ మాత్రాన్నే నశించి పోవు గాక. పరస్త్రీ పర ధనముల కాశించి పరులకు ద్రోహం తల పెట్టి పర హింసా నిందలు గావించి మహాత్ముల నవమానించి ఆర్జించిన పాపాలు భక్ష్య పేయ (త్రాగుడు) చోష్య లేహ్యముల ద్వారా కూడ బెట్టి కొన్న పాపాలూ అన్నీ నీళ్లలో నుంచిన ఉప్పునకు వలె కరిగి పోవు గాక. బాల్య కౌమార ¸°వన వార్థ క్యాలలో జన్మ జన్మాంతరాలలోనేను చేసిన పాప సమూహం నారాయణ గోవింద హరి కష్ణ ఈశ్వర సంకీర్తనం వల్ల నీళ్లలోని లవణ పాత్రలోని ఉప్పువలెకరగి పోవు గాక. వాసుదేవా! విష్ణూ! హరీ! కేశవా! జనార్దనా! కృష్ణా! భవిష్య నరకాంతకా! కంస నాశకా! అరిష్ట కేశి చాణూరిది దేవశతృ సూదనా నీకు నమస్సులు. మాటి మాటికీ ప్రణామములు. నీవు దక్క బలిని వంచింప గల వాడెవడు? నీవు దక్క హైహయ నరపతి (కార్తవీర్యుని) బాహుబల దర్పం అణచ గలిగిన ప్రభువెవడు?

కఃకరిష్య త్యథా న్యోవై సాగరే సేతు బంధనమ్‌ | వధిష్యతి దశ గ్రీవం కః సామాత్య పురస్సరమ్‌? || 103

కస్త్వా మృతే న్యో నందస్య గోకులే రతి మేష్యతి | ప్రలంబ పూతనాదీనాం త్వామృతే మధు సూదన |

నిహంతా ప్యథవా శాస్తా దేవ దేవ భవిష్యతి || 104

జపన్నేనం నరః పుణ్యం వైష్ణవం ధర్మముత్తమమ్‌ | ఇష్టా ప్రసంగేబ్యో జ్ఞానతో%జ్ఞానతో పివా || 105

కృతం తేన తు తత్పాపం సప్త జన్మాంతరాణి వై | మహా పాతక సంజ్ఞం వా త దా చైవోపపాతకమ్‌ || 106

యజ్ఞా దీని చ పుణ్యాని జప హోమ వ్రతాని చ | నాశ##యే ద్యోగినాం సర్వ మామ పాత్ర మివా ంభసి || 106

నరః సంవత్సరం పూర్ణం తిల పాత్రాణి షోడశ | అహన్యహని యో దద్యాత్‌ పఠ త్యేతచ్చ తత్సమమ్‌ || 108

అవిలుప్త బ్రహ్మ చర్యం సంప్రాప్య స్మరణం హరేః | విష్ణులోక మవాప్నోతి సత్యమేతన్మయోదితమ్‌ || 109

యధై తత్సత్య త్యముక మ్మే నహ్యల్పమపి మే మృషా | రాక్ష సస్త్రస్త సర్వాంగం తథా మామేష ముంచతు || 110

పులస్త్య ఉవాచ :-

ఏవ ముచ్చారితే తేన ముక్తో విప్రస్తు రక్షసా | అకామేన ద్విజో భూయ స్తమాహ రజనీ చరమ్‌ || 111

బ్రాహ్మణ ఉవాచ :-

ఏతద్‌ భద్ర! మయా ఖ్యాతం తవ పాతక నాశనమ్‌ | విష్ణోః సారస్వతం స్తోత్రం యజ్ఞ గాద సరస్వతీ || 112

హుతాశ##నేన ప్రహితా మమ జిహ్వా గ్ర నంస్థితా | జగాదైనం స్తవం విష్ణోం సర్వేషాం చో పశాంతిదమ్‌ || 113

అనే నైవ జగన్నాధం త్వమారాధయ కేశవమ్‌ | తతః శాపాపనోదం తు స్తుతే లప్స్యసి కేశ##వే || 114

అహర్నిశం హృషీకేశం స్తవేనా నేన రాక్షస | స్తుహి భక్తిం దృఢాం కృత్వా తతః పాపా ద్విమోక్ష్యసే || 115

స్తుతో హ సర్వ పాపాని నాశయిష్యత్యసంశయమ్‌ | స్తుతో హి భక్త్యా నౄణాం వై సర్వ పాప హరో హరిః || 116

పులస్త్య ఉవాచ-

తతః ప్రణమ్య తం విప్రం ప్రసాద్య చ నిశాచరః | తదై వ తపసే శ్రీమాన్‌ శాలగ్రామ మగా ద్వశీ || 117

అహర్నిశం స ఏవైనం జపన్‌ సారస్వతం స్తవమ్‌ | దేవ క్రియా రతి ద్భూత్వా తప స్తేపే నిశాచరః || 118

సమారాధ్య జగన్నాధం స తత్ర పురుషోత్తమమ్‌ | సర్వపాప వినిర్ముక్తో విష్ణులోక మవాప్తవాన్‌ || 119

ఏతత్తే కధితం బ్రహ్మాన్‌! విష్ణోః సారస్వతం స్తవమ్‌ | విప్ర వక్త్రస్థయా సమ్యక్స రస్వత్వా సమీరితమ్‌ || 120

య ఏతత్‌ పరమం స్తోత్రం వాసు దేవస్య మానవః | పఠిష్యతి స సర్వేభ్యః పాపేభ్యో మోక్షమాప్స్యతి|| 121

ఇది శ్రీ వామన పురాణ ఏకోన షష్టిత మో ధ్యాయ సమాప్తం

మధునాశకా! మరొకరెవరు సాగరాన్ని బంధించి, మంత్రి పరివార సైన్య సమేతంగా దశకంఠుని వధించ గలరు? ప్రభూ! నీవు దక్క మరెవ్వరు నంద గోకులంలో విహరిస్తూ ప్రలంబాసుర పూత నాది రాక్షసులను వధించ గలరు? అదుపాజ్ఞలలో పెట్టగలరు? కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, ఈ విధంగా పవిత్రాలైన పుణ్య ప్రదాలయిన విష్ణుని గుణగణాలు కీర్తిస్తే, మానవుడు ఏడు జన్మాల్లో, తెలిసి కాని తెలియక కానీ చేసిన మహా పాతక ఉపపాతకా లన్నీ నశించి పోతాయి: యజ్ఞాలు, వ్రతాలు, తపోనిష్ఠలలో మునిగి ఉండే యోగులు తమ పాప పుణ్య ఫలాల నన్నింటినీ, నీళ్లలో పడవేసిన పచ్చి కుండ వలె నశింప జేసుకుంటారు. ఈ స్తోత్రాన్ని ఒక పర్యాయం పఠిస్తే సంవత్సరం పాటు రోజూ పదహారు కుండలతో నువ్వులు దానం చేసింనంత ఫలం కలుగుతుంది. బ్రహ్మ చర్య దీక్ష చెడిపోకుండా మానవుడొక సంవత్సర కాలం ఈ స్తోత్రం జపిస్తే విష్ణు లోకం పొందుతాడు. ఇది నిజమునేనిదంతా సత్యము చెప్పాను ఇందులో లేశ మాత్రమైనా అబద్దం లేదు భయంతో వణికి పోతున్న నన్నీ రాక్షసుడు వదలి వేయు గాక. నారదా! ఆ బ్రాహ్మణుడలా అనగానే రాక్షసుని బంధం విడిపోయింది ముక్తుడైన అతడెలాంటి కోరిక లేకుండానే రాక్షసుని తో యిలా అన్నాడు. ఓ సౌమ్యుడా నా ద్వారా నీకు చెప్పబడిన పాపనాశక మైన ఈ విష్ణు సారస్వత స్తోత్రాన్ని అగ్ని దేవుని పంపున వచ్చిన సరస్వతీ దేవి నా నాలుక మీద నిలచి వివరించినది. ఇది ఎల్ల వారలకు శాంతిని చేకూర్చుతుంది. ఈ స్తోత్రం జపిస్తూ ఆ జగన్నాధుని ఆరాధిచినచో నీ శాపం తొలగి పోతుంది. కనుక నో రాక్షసా! దీనిని రాత్రింబవళ్లు జపిస్తూ ఆ హృషీకేశుని దృఢమైన భక్తితో పూజించుము. నీ పాపాలన్నీ పటా పంచలౌతాయి. స్తోత్ర ప్రియుడైన శ్రీహరి ఈ స్తోత్రంతో కీర్తించిన నరుల పాపాలన్నీ నశింప జేస్తాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నారదా! అంతట నా బ్రాహ్మణునకు మొక్కి ప్రసన్నుని గావించుకుని ఆ మహిమాన్వితుడైన నిశాచరుడు తక్షణమే శాల గ్రామ క్షేత్రంలో తపస్సు చేసేందుకు వెళ్లాడు. వాడు యింద్రియాల నదుపులో నుంచుకుని సర్వదా సారస్వత స్తోత్రాన్ని జపిస్తూ అత్యధిక మైన ప్రీతిలో దేవ కార్యాలు నెర వేర్చుకుంటూ జగన్నాధుని ఆరాధించాడు. చివర కాపురుషోత్తమని కృపతో సర్వ పాపాల నుండి విడివడి విష్ణు లోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా బ్రాహ్మణుని నోట వాగ్దేవి సరస్వతి ప్రవచించిన పవిత్ర విష్ణు స్తోత్రాన్ని నీకు చెప్పాను. వాసుదేవుని ఈ ఉత్తమోత్తమ స్తవాన్ని చదివిన మానవుడు సర్వ పాపాలు పోగొట్టుకుని మోక్ష పదవిని పొందగలడు.

ఇది శ్రీ వామన పురాణంలో ఏబది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది

Sri Vamana Mahapuranam    Chapters