Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ సప్తపంచాశోధ్యాయః

పులస్త్య ఉవాచ ః

తస్మిం స్తీర్థవ రేస్నాత్వా దృష్ట్వా దేవం త్రిలోచనమ్‌ | పూజయిత్వా సువర్ణాక్షం నైమిషం ప్రయ¸°తతః || 1

తత్ర తీర్థసహస్రాణి త్రింశత్పాపహరాణి చ | గోమత్యాః కాంచనాక్ష్యశ్చ గురుదాయాశ్చ మధ్యతః || 2

తేషు స్నాత్వా ర్చ్య దేవేశం పీతవాససమచ్యుతమ్‌, ఋషీనపి చ సంపూజ్య నైమిషారణ్యవాసినః || 3

దేవదేవం తథేశానం సంపూజ్య విదినా తతః, గయాయాం గోపతింద్రష్టుం జగామ స మహాసురః || 4

తతోబ్రహ్మధ్వజే స్నాత్వా కృత్వా చాస్య ప్రదక్షిణామ్‌ | పిండనిర్వ ణంపుణ్యం పితౄణాం స చకారహ || 5

ఉదపానే తథా స్నాత్వా తత్రా భ్యర్చ్య పితౄన్‌ వశీ, గదాపాణిం సమభ్యర్చ్య గోపతిం చా పిశంకరమ్‌ ||6

ఇంద్రతీర్థే తథా స్నాత్వా సంతర్ప్య పితృదేవతా ః | మహానదీ జలే స్నాత్వా సరయూమాజగామ సః || 7

తశ్యాం స్నాత్వా సమభ్యర్చ్య గోప్రతారే కుశేశయమ్‌ | ఉపోష్య రజనీ మేకాం విరజాం నగరీం య¸° || 8

స్నాత్వా విరజసే తీర్థే దత్వా పిండం పితౄంస్తథా, దర్శనార్థం య¸° శ్రీమాన్‌ అజితం పురుషోత్తమమ్‌ || 9

తం దృష్ట్వా పుండరీకాక్ష మక్షరం పరమం శుచిః, షడ్రాత్రము ష్యతత్రైవ మహేంద్రం దక్షిణం య¸° || 10

తత్ర దేవవరం శంభు మర్ధనారీశ్వరం హరమ్‌, దృష్ట్వా ర్చ్య సంపూజ్య పితౄన్‌ మహేంద్రం చోత్తరం గతః || 11

తత్ర దేవవరం శంభుం గోపాలం సోమపాయినమ్‌, దృష్ట్వా స్నాత్వా సోమతీర్థే సహ్యా చల ముపాగతః || 12

తత్ర స్నాత్వా మహూదక్యాం వైకుంఠం చా ర్చ్య భక్తితః, సురాన్‌ పితౄన్‌ సమభ్యర్చ్య పారియాత్రం గిరిం గతః || 13

తత్ర స్నాత్వా లాంగలిన్యాం పూజయిత్వా పరాజితమ్‌, కశేరుదేశం చా భ్యేత్య విశ్వరూపం దదర్శ సః|| 14

యత్రదేవవరః శంభు ర్గణానాం తుసు పూజితమ్‌, విశ్వరూప మథాత్మానం దర్శయామాస యోగవిత్‌ || 15

ఆ శ్రేష్ఠ తీర్థంలో స్నానం చేసి శంకరుని దర్శించి సువర్ణాక్షుని అర్చించి అతడు నైమిపారణ్యానికి వెళ్లాడు. అక్కడ గోమతి కాంచనాక్షి గురుదా నదుల మధ్య నున్న పాపనాశ కాలయిన ముప్పదివేల తీర్థాలలో స్నానాలు చేసి పీతాంబరుడగు నచ్యుతుని అర్చించి, అచటగల నైమిషారణ్యవాసులయిన ఋషులనందరను పూజించాడు. మహాదేవుడగు శంకరుని ఆరాధించి అటనుండి గోపతిదేవుని దర్శించుటకు గయాక్షేత్రానికి ఆ ప్రహ్లాదుడు ప్రయాణించాడు. అచట బ్రహ్మధ్వజంలో స్నానం చేసి ప్రదక్షిణలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానం గావించాడు. ఉదపానంలో స్నానం చేసి పితృతర్పణాలొసగి గదాధరస్వామినీ గోపతీశ్వరునీ పూజించాడు. ఇంద్ర తీర్థంలో స్నానపితృతర్పణాలు గావించి మహానదీ జలాల్లో మునిగి ఆ పైన సరయూ తీరాన్ని చేరుకున్నాడు. అందులో స్నాతుడై గోప్రతారంలో కుశేశయ ప్రభువును అర్చించి ఒక రాత్రి నిద్రచేసి ఉపవసించి అటునుండి విరజానగరాన్ని చేరాడు. విరజలో స్నానమాడి పితృలకు పిండ ప్రదానం చేసి ఆ మహనీయుడు అజితుడగు పురుషోత్తముని దర్శించుటకు వెళ్ళాడు. అటశుచియై అక్షరుడైన పుండరీకాక్షుని దర్శించి ఆరురాత్రులుండి దక్షిణ దిశగా మహేంద్రానికి వెళ్ళాడు. అచట దేవేశ్వరుడగు అర్థనారీశ్వరుని దర్శించి పితృపూజలు చేసి ఉత్తర మహేంద్రానికి చేరాడు. అచట శివుని గోపాలుని సోమపాయిని దర్శించి సోమతీర్థంలో స్నానం చేసి సహ్యాద్రికొచ్చాడు. అచట మహూదకిలో మునిగి భక్తితో నారాయణుని దర్శిచి దేవపితరుల తృప్తి పరచి పారియాత్ర గిరికి వెళ్లాడు. అచట లాంగలినిలో మునిగి అపరాజిత ప్రభువునర్థించి కశేరుదేశానికి వెళ్లి విశ్వరూపుని దర్శనం చేసుకున్నాడు. ఆ చోటనే గణాల ఆరాధ్యదైవతం యోగవేది అయిన శంకరుడు తన విశ్వరూపం ప్రదర్శించాడు -

తత్ర మంకుణికా తోయే స్నాత్వా భ్యర్చ్య మహేశ్వరమ్‌ | జగామా ద్రిం స సౌగంధిం ప్రహ్లాదో మలయా చలమ్‌ || 16

మహాప్రదే తతః స్నాత్వా పూజయిత్వా చ శంకరమ్‌ | తతో జగామ యోగాత్మా ద్రష్టుం వింధ్యే సదాశివమ్‌ || 17

తతో విపాశా సలిలే స్నాత్వా భ్యర్చ్య సదాశివమ్‌ | త్రిరాత్రం సముపోష్యా ధ అవంతీం నగరీం య¸° ||18

తత్ర శిప్రాజిలే స్నాత్వా విష్ణుం సంపూజ్య భక్తితః | శ్మశానన్థం దదర్ళా థ మహాకాళ వపుర్థరమ్‌ || 19

తస్మిన్‌ సర్వసత్వానాం తేన రూపేణ శంకరః | తామసం రూప మాస్థాయ సంహారం కురుతే వశీ || 20

తత్రస్థేన సురేశేన శ్వేతకి ర్నామ భూపతిః | రక్షిత స్త్వంతకం దగ్ధ్వా సర్వభూతాపహారిణమ్‌ || 21

తత్రా తిహృష్టో వసతి నిత్యం శర్వఃసహూమయా | వృతః ప్రమధకోటిభి ర్చహుబి స్త్రిదశార్చితః || 22

తం దృష్ట్వా థమహాకాళం కాలకాలం తకాంతకమ్‌, యమ సంయమనం మృత్యో ర్మృత్యుం చిత్రవిచిత్రకమ్‌ || 23

శ్మశాననిలయం శంభుం భూతనాధం జగత్పతిమ్‌, పూజయిత్వా శూలధరం జగామ నిషధాన్‌ ప్రతి || 24

తత్రా మరేశ్వరం దేవం దృష్ట్యా సంపూజ్య భక్తితః, మహూదయం సమభ్యేత్య హయగ్రీవం దదర్శనం || 25

అశ్వతీర్థే తతః స్నాత్వా దృష్ట్వా చ తురగాననమ్‌, శ్రీధరం చైవ సంపూజ్యపాంచాల విషయం య¸° || 26

తత్రేశ్వరగుణౖ ర్యుక్తం పుత్ర మర్ధపతే రథ, పాంచాలికం వశీ దృష్ట్వా ప్రయోగం పరతో య¸° || 27

స్నాత్వా సన్నిహితే తీర్థే యామునే లోకవిశ్రుతే, దృష్ట్వా వటేశ్వరం రుద్రం మాధవం యోగశాయినమ్‌ || 28

ద్వావేవభక్తితః పూజ్యాపూజయిత్వా మహాసురః, మాఘమాస మధోపోష్య తతో వారాణసీం గతః || 29

తతో స్యాం వరణాయం చ తీర్థేషు చ పృథక్‌ ప్రృథక్‌, సర్వపాపహరాద్యేషు స్నాత్వా ర్చ్య పితృదేవతాః || 30

ప్రదక్షిణీకృత్య పురీం పూజ్యా విముక్తకేశవౌ, లోలం దివాకరం దృష్ట్వా తతో మధువనం య¸° || 31

అక్కడ మంకుణిక నదిలో మునిగి మహేశ్వరునర్చించి మంచి వాసనలతో నొప్పిన మలయగిరికి వెళ్ళాడు. అచట సరోవరంలో మునిగి శంకరుని పూజించి ఆ ప్రహ్లాదుడు సదాశివుని దర్శించుటకై విధ్యకు వెళ్లాడు. అక్కడ విపాశానదిలో స్నానమాడి సదాశివుని పూజించి మూడు రాత్రులుపవసించి అనంతరం అవంతీనగరానికి చేరాడు. అచట శిప్రానదిలో మునిగి విష్ణుదేవునకు ప్రణమిల్లి స్మశాన నిలయుడైన మహాకాళ##దేహుని చూచాడు. అక్కడనే తమోగుణాత్మకమైన మహాకాలరూపాన్ని ధరించి సర్వవశంకరుడైన శంకరుడు ప్రాణులందరను సంహరిస్తూంటాడు. ఆచోటనే శ్వేతకి అనే రాజును, శంకరుడు సర్వప్రాణి సంహారకుడైన అంతకుణ్ణి దగ్ధంచేసి కాపాడాడు. ఆ పవిత్రభూమిలో ఉమాసహాయుడైన ఈశ్వరుడు ప్రమధకోటిగణాలు దేవ గణాలు సేవిస్తూ ఉండగా సంతోషంతో నివసిస్తూంటాడు. ఆకాలకాలాంతకులనంతమొందించే మహాకాళేశ్వరుని, మృత్యువుకు మృత్యువైనవానిని, యమునకు ముక్కుత్రాడు వేసిన ప్రభువు, చిత్రవిచిత్ర చరిత్రుని, శ్మశానవాసిని, జగత్పతిని మంగళకరుడైన త్రిశూలిని దర్శనం చేసికుని ఆదానవేశ్వరుడటనుండి నిషిధకు వెళ్లాడు. అచట నమరేశ్వర మహాదేవుని సేవించి మహూదయ క్షేత్రానికి వెళ్లి హయగ్రీవుని దర్శించాడు. అచట అశ్వతీర్థంలో మునిగి హయాననుని దర్శించి శ్రీథరుని సేవించుకుని పాంచాలదేశానికి వెళ్లాడు. అచట నుంచే వీరపుత్రుడైన ఐశ్వర్యగుణసంపన్నుడు పాంచాలికుని సందర్శించి ఆ జితేంద్రియుడు ప్రయాగకు చేరుకున్నాడు. సర్వదేవసన్నిహితాలైన పవిత్రయమునా జలాల్లో స్నానమాడి అక్షయవటేశ్వరరుద్రునీ, మధవుడ్ని శ్రద్ధభక్తులతో ఆరాధించాడు. మాఘమాసమంతా ఉపవాస వ్రతం నెరపి అక్కనుండి వారణాసికి వెళ్లాడు. సర్వపాపహారిణులైన అసీ వరణా నదులలో వేరు వేరుగా స్నానం చేసి పితృదేవతలను అర్పించాడు. ఆ అవిముక్తేశ్వరుడ్ని, మాధవుడ్నీ పూజించి నగర ప్రదక్షిణ గావించాడు లోలార్కదేవుని సేవించి అటుపై మధువనానికి చేరుకున్నాడు.

తత్రస్వయంభువం దేవం దదర్మా సురసత్తమః, తమ భ్యార్చ్య మహాతే జాః పుష్కరారణ్య మాగమత్‌ || 32

తత్రత్రిష్వపి తీర్థేషు స్నాత్వా ర్చ్య పితృదేవతాః, పుష్కరాక్ష మయోగంధిం బ్రహ్మాణం చా ప్యపూజయత్‌ || 33

తతో భూయః సరస్వత్యా స్తీర్థే త్రైలోక్య విశ్రుతే, కోటి తీర్థే రుద్రకోటిం దదర్శ వృషభధ్వజమ్‌ || 34

నైమిషేయా ద్విజవరా మాగదేయాః ససైంధవాః, ధర్మారణ్యాః పౌష్కరేయా దండకారణ్యకా స్తథా || 35

చాంపేయా భారుకచ్చేయా దేవికాతీరగాశ్చ యే, తే తత్ర శంకరం ద్రష్టుం సమాయాతా ద్విజాతయః || 36

కోటిసంఖ్యస్తపస్సిద్ధా హరదర్శనలాలసాః, అహం పూర్వమహం పూర్వ మిత్యేవం వాదినోమునే! || 37

తాన్‌సంక్షుబ్దాన్‌ హరో దృష్ట్వా మహర్షీన్‌ దగ్ధకిశ్చిషాన్‌, తేషా మేవా సుకంపార్థం కోటిమూర్తి రభూద్బవః || 38

తతస్తేమునయః ప్రీతాః సర్వే ఏవ మహేశ్వరమ్‌, సంపూజయంత స్తస్థుర్వై తీర్థం కృత్వా పృథక్‌ పృథక్‌ || 39

ఇత్యేవం రుద్రకోటీతి నామ్నా శంభు రజాయత, తం దదర్శ మహాతేజాః ప్రహ్లాదో భక్తిమాన్‌వశీ || 40

కోటితీర్థే తతః స్నాత్వా తర్పయిత్వా వసూన్‌ పితౄన్‌, రుద్రకోటిం సమ్యభ్యర్చ్య జగామ కురుజాంగలమ్‌ || 41

తత్రదేవవరం స్థాణుం శంకరం పార్వతీప్రియమ్‌, సరస్వతీ జలే మగ్నం దదర్శ సురపూజితమ్‌ || 42

సారస్వతేంభసి స్నాత్వా స్థాణుం సంపూజ్య భక్తితః, స్నాత్వా దశాశ్వమేధే చ సంపూజ్య చ సురాన్‌పితౄన్‌ || 43

సహస్రలింగం సంపూజ్యా స్నాత్వా కన్యాహ్రదే శుచిః, అభివాద్య గురుం శుక్రం సోమతీర్థం జగామహ || 44

తత్ర స్నాత్వార్చ్య చపితౄన్‌ సోమంసంపూజ్య భక్తితః, క్షీరకావాస మభ్యేత్య స్నానం చక్రే మహాయశాః || 45

ప్రదక్షిణీ కృత్య తరుం వరుణం చార్చ్య బుద్దిమాన్‌, భూయః కరుధ్వజం దృష్ట్వా పదాఖ్యాం నగరీం గతః || 46

తత్రార్చ్య మిత్రవరుణౌ భాస్కరౌ లోకపూజితౌ, కుమారధారామభ్యేత్య దదర్శ స్వామినం వశీ || 47

స్నాత్వా కపిలధారాయం సంతర్ప్యార్చ్య పితౄన్‌ సురాన్‌, దృష్ట్వా స్కందం సమభ్యర్చ్య నర్మదాయాం జగామ హ || 48

తస్యాం స్నాత్వా సమభ్యర్చ్య వాసుదేవం శ్రియఃపతిమ్‌, జగామ భూధరం ద్రష్టుం వరాహం చక్రధారిణమ్‌ || 49

ఆ అసురేశ్వరుడచట స్వయంభూదేవుని ఆరాధించి పుష్కరారణ్యానికి వెళ్లాడు. అచ్చట పుష్కరాక్ష అయోగంధి బ్రహ్మలను పూజించి మూడు తీర్థాలలో స్నాతుడై పితృదేవతలను నర్చించాడు. అక్కడ నుంచి మరల ముల్లోకవిఖ్యాతమైన సరస్వతీ తీరాన కోటి తీర్థంలో వెలసిన రుద్రకోటేశ్వరదేవుని సన్నిధి చేరాడు. నై మిషలు మాగధులు సైంధవులు ధర్మారణులు పౌష్కరేయులు, దండకారణ్యవాసులు, చుంపేయులు, భారుకచ్ఛవాసులు దేవికా తీరస్థులూ నగు విప్రవరు లసంఖ్యాకంగా అక్కడ మహాదేవుని చూచుటకు సమావేశమౌతారు కోటి సంఖ్యలో వచ్చే ఆ తసస్వులు మేము ముందు అంటే మేము ముందు అంటూ తోసుకుంటూ ఆహరుని చూచేందుకు ఉబలాటపడతారు. అలా దగ్ధకల్మషులైన ఆ శ్రద్ధాళువలు మహర్షులూ తన దర్శనకోసం పెనగులాడటం చూచి వారిని అనుగ్రహించుటకై ఆ దయామయుడగు మయస్కరుడు కోటి రూపాల్లో వారలకు దర్శనమిస్తాడు. అందుచే అచట ఆ దేవునికి రుద్రోటేశ్వరుడు అని పేరు వచ్చింది. అలా కోటి మూర్తులుగా దర్శనమిచ్చే స్వామిని వారలు వేరువేరు తీర్థాలలో అర్చించి కోటితీర్థాలేర్పరిచారు. అలాంటి అద్భుతమైన కోటితీర్థంలో స్నానం చేసి ఆ తేజస్వి రుద్రకోటేశ్వరుడుని పూజంచి పితృవసుదేవతలకు తర్పణాలిచ్చాడు. పిదప ఆయవోధనుడు కురుజాంగలానికి వెళ్లి సరస్వతీ పవిత్రోదకాల్లో నిమగ్నుడైన పార్వతీధవుడు దేవపూజితుడగు స్థాణ్వీశ్వరుని దర్శించాడు. సరస్వతీ నదిలో స్నానం చేసి తర్వాత దశాశ్వమేధ తీర్థలో మునిగి దేవ పితరుల నర్పించాడు. కన్యాసరోవరంలో మునిగి శుచియై, సహస్ర లింగేశ్వరుని పూజించి గురువైన శుక్రునకు ప్రణామం చేసి సోమతీర్థానికి వెళ్ళాడు అక్కడ స్నానార్చనలు కావించి చంద్రుని పితరులను భక్తితో పూజించి ఆ జితేంద్రియుడు క్షీరకావాసం వెళ్లి స్నానం చేశాడు. అక్కడ తరు ప్రదక్షిణం చేసి వరుణ దేవుని పూజించి ఆ మహామతి మరల కురుధ్మజాన్ని చూచి పద్మానగరికి వెళ్లాడు. అక్కడ లోకపూజితులైన భాస్కరులను మిత్రుని వరుణుని అర్చించి కుమారధారకు వెళ్ళి కుమారస్వామిని దర్శించాడు. అక్కడ కపిలధారలో మునిగి పితరులను దేవతలను ఆరాధించాడు. ఆపైన నర్మదానదికి వెళ్ళాడు. నర్మదలో స్నానం చేసి శ్రీ వల్లభుడగు వాసుదేవుని అర్చించి ఆయన భూధరుడూ చక్రపాణియగు వారాహస్వామిని చూచుటకు వెళ్ళాడు.

స్నాత్వా కోకాముఖే తీర్థే సంపూజ్య ధరణీధరమ్‌, త్రిసౌవర్ణం మహాదేవం అర్భుదేశం జగామ హ || 50

తత్ర నారీహ్రదే స్నాత్వా పూజయిత్వా చ శంకరమ్‌, కాలింజరం సమభ్యేత్య నీలకంఠం దదర్శన ః || 51

నీలతీర్థజలే స్నాత్వా పూజయిత్వా తతఃశివమ్‌, జగామ నాగరా నూపే ప్రభాసే ద్రష్టు మీశ్వరమ్‌ || 52

స్నాత్వా చ సంగమే నద్యాః సరస్వత్యార్ణవస్య చ, సోమేశ్వరం లోకపతిం దదర్శ సకపర్దినమ్‌ || 53

యో దక్షశాపనిర్దగ్ధః క్షయీ తారాధిపః శశీ, ఆప్యాయితః శంకరేణ విష్ణూనా సకపర్దినా || 54

తావర్చ్యదేవప్రవరౌ ప్రజగామ మహాలయమ్‌, తత్ర రుద్రం సమభ్యర్చ్య ప్రజగామోత్తరాన్‌కురూన్‌ || 55

పద్మనాభం స తత్రాభ్యర్చ్య సప్తగోదావరం య¸°, తత్ర స్నాత్వార్చ్య విశ్వేశం భీమం త్రైలోక్యవందితమ్‌ || 56

గత్వా దారువనే శ్రీమాన్‌ లింగం స దదర్శహ, తమర్చ్య బ్రాహ్మణీం గత్వా స్నాత్వా ర్చ్యత్రిదశేశ్వరమ్‌ || 57

ప్లక్షావతరణం గత్వా నివాస మపూజయత్‌, తతశ్చ కుండినం గత్వా సంపూజ్య ప్రణాతృప్తిదమ్‌ || 58

శూర్పారకే చతుర్చాహుం పూజయిత్వా విధానతః, మాగధారణ్య మాసాద్య దదర్శ వాసుదేవం ప్రణమ్య చ || 59

తమర్చయిత్వా విశ్వేశం స జగామ ప్రజాముఖమ్‌, మహాతీర్థే తతః స్నాత్వా వాసుదేవం ప్రణమ్య చ || 60

శోణం సంప్రాప్య సంపూజ్య రుక్మవర్మాణ మీశ్వరమ్‌, మహాకోశ్యాం మహాదేవం హంసాఖ్యం భక్తిమా నథ ||

పూజయిత్వా జగామా ధ సైంధవా రణ్య ముత్తమమ్‌ || 61

కోకాముఖ తీర్థంలో స్నానం చేసి ఆభూవరాహమూర్తిని పూజించి అర్బుదేశ్వరుడైన త్రిసౌవర్లేశ్వరుని చూచుటకు వెళ్ళాడు. అచట నారీహ్రదంలో స్నానం చేసి శంకరు నారాధించి కాలింజరానికి వెళ్ళి నీలకంఠేశ్వరుని దర్శిచాడు. నీతీర్థంలో మునిగి ఆ శివుని అర్చించి అచటనుండి సాగరతీరాన గల అనుపమానమైన ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. అచట సరస్వతీ సాగర సంగమాన స్నానమాడి లోనాధుడైన సోమేశ్వరుని దర్శించాడు. దక్షుడి శాపంవల్ల కళలు క్షీణించిన తారానాధుడీ ప్రదేశాననే శంకరుని ఆరాధించి ఆ కపర్ది కృపవల్లా శ్రీ విష్ణువు అనుగ్రహం వల్ల తిరిగి తన కాంతిని పొందాడు. అలాంటి క్షేత్రంలో ఆదేవాధిదేవుల నిద్దరనూ అర్చించి మహాలయానికి వెళ్ళాడు. అక్కడ రుద్రుని సేవించి ఉత్తర కురుభూములలో పద్మనాభుని సేవించి నేరుగా సప్తగోదావరానికి చేరాడు. అక్కడ గోదావరిలో స్నాతుడై త్రైలోక్యవందితుడగు భీమేశ్వరుని అర్చించి, ఆ అసురోత్తముడు దారుకావనానికి వెళ్లి శ్రీ లింగదర్శనం అర్చనం చేసికొన్నాడు. అటునుండి బ్రాహ్మణినదికి వెళ్ళి స్నానం చేసి శివార్చన గావించాడు. అనంతరం ప్లక్షావతరణానికి వెళ్లి శ్రీనివాసుని సేవించాడు. అటుపైన కుండినపురికి వెళ్లి ఆ ప్రాణరక్షకుని అర్చించి శూర్పారక క్షేత్రంలో చతుర్భుజుని సేవించుకున్నాడు. అచటనుండి మగధారణ్యంలో వసుధాధికుడైన విశ్వేశుని అర్చించి ప్రజాముఖానికి చేరి అచట మహాతీర్థంలో స్నానం చేసి వాసుదేవుని పూజించి శోణపురిని రుక్మవర్ణేశ్వరుని అర్చించాడు. అనంతరం మహాకోశీలో హంశేశ్వరదేవుని పూజించి ఆ భక్తుడు ఉత్తమమైన సైంధవారణ్యానికి వెళ్లాడు.

తత్రేశ్వరం సునేత్రాఖ్యం శంఖ శూలధరం గురుమ్‌, పూజయిత్వా మహాబాహుః ప్రజాగామ త్రివిష్టపమ్‌ || 62

తత్ర దేవం మహేశానం జటాధరమితి శ్రుతమ్‌, తం దృష్ట్వా ర్చ్య హరిం చా సౌ తీర్థం కనఖలం య¸° || 63

తత్రా ర్చ్య భద్రకాళీశం వీరభద్రం చ దానవః, ధనాధిపం చ మేఘాంకం యయావథ గిరివ్రజమ్‌ || 64

తత్ర దేవం పశుపతిం లోనాధం మహేశ్వరమ్‌, సంపూజయిత్వావిధివ త్కామరూపం జగామహ || 65

శశిప్రభం దేవవరం త్రినేత్రం సంపూజయిత్వా సహవైమృడాన్యా,

జగామ తీర్థ ప్రవరం మహాఖ్యం తస్మిన్‌ మహాదేవ మపూజయత్సః || 66

తత స్త్రికూటం గిరిమత్రిపుత్రిం జగామద్రష్టుం సహి చక్రపాణినమ్‌,

తమీడ్య భక్త్యా తు గజేంద్రమోక్షణం జజాప జప్యం పరమం పవిత్రమ్‌ || 67

తత్రోష్యదైత్యేశ్వరసూను రాదరా న్మాసత్రయం మూలఫలాంబు భక్షీ

నివేద్య విప్రవ్రరేషు కాంచనం జగామ ఘోరం సహి దండకం వనమ్‌ || 68

తత్ర దివ్యం మహాశాఖం వనస్పతి వపుర్ధరమ్‌, దదర్శ పుండరీకాక్షం మహాశ్వాపదవారణమ్‌ || 69

తస్యాధస్తా త్త్రిరాత్రం స మహాభాగవతో సురః, స్థితః స్థండిల శాయీతు పఠన్‌ సారస్వతం స్త్రమ్‌ || 70

తస్మాత్తీర్థవరం విద్వాన్‌ సర్వపాపప్రమోచనమ్‌, జగామ దానవోద్రష్టుం సర్వపాపహరం హరిమ్‌ || 71

తస్యాగ్రతో జజాపా స్తౌ స్తవౌపాప్రణాశనౌ, ¸° పురాభగవాన్‌ ప్రాహ క్రోడరూపీ జనార్దనః || 72

తస్మాదథా గాద్దైత్యేంద్రః శాలగ్రామం మహాఫలమ్‌, యత్రసంనిహితోవిష్ణు శ్చరేషు స్థావరేషు చ || 73

తత్ర సర్వగతం విష్ణుం మత్వా చక్రే రతిం బలీ, పూజయన్‌ భగవత్పాదౌ మహాభాగవతోమునే ! || 74

ఇయం తనోక్తామునిసంఘజుష్టా ప్రహ్లాదతీర్థానుగతిః సుపుణ్యా,

యత్కీర్తనాచ్ఛ్రవణాత్‌ స్పర్శనాచ్చ విముక్తపాపా మనుజా భవన్తి || 57

ఇతి శ్రీ వామన పురాణ పప్తపంచాశోధ్యాయం సమాప్తః

అచట శంఖం ధరించిన సునేత్రేశ్వరుని పూజించి ఆ మహాభుజుడు త్రివిష్టపానికి వెళ్ళాడు. అక్కడ జటాధరుడుగ్రా ప్రసిద్ధి గాంచిన మహాదేవుని హరినీ అర్చించి కనఖల తీర్థానికి వెళ్లాడు. అచట భద్రకాళీశ్వరునీ, వీరభద్రునీ కుబేరునీ, మేఘాంకునీ పూజించి గిరివ్రజానికి వెళ్లాడు. అచట లోకేశ్వరుడైన పశుపతిని పూజించి కామరూపదేశానికి వెళ్లాడు. అచట చంద్రకాంతితో వెలిగే ఉమాసహితుడగు త్రినేత్రుని పూజించి మహాతీర్థానికి వెళ్ళి మహాదేవుని విద్యుక్తగా ఆరాధించాడు. అటునుండి మూడు శిఖరాలతో వెలిగే అత్రిపుత్రమనే పర్వతాన నెలకొన్న చక్రపాణిని దర్శించి భక్తియుక్తుడై పరమపవిత్రమై గజేంద్ర మోక్షణ స్తవం జపించి ఆ ప్రభువును ప్రార్థించాడు. ఆ దైత్యేశ్వరపుత్రుడాక్షేత్రంలో మూడు నెలలపాటు గడ్డలు పండ్లు జలం సేవిస్తూ గడపి ద్విజోత్తములకు స్వర్ణదానం చేసి అటునుండి ఘోరమైన దండకారణ్యానికి వెళ్లాడు. అచట మహాశాఖలతో దివ్యమైన వృక్షరూపం ధరించి హింసకమృగాలను దరిజేరనీయక విరాజిల్లే నారాయణుని దర్శించి, ఆ వృక్షమూలాన ఆ భాగవతోత్తముడు నేలమీద పరుండి సారస్వత స్తోత్ర పారాయణం చేస్తూ మూడు రాత్రులు గడిపాడు. అచట నుండి ఆ దానవ విద్వాంసుడు సర్వపాప ప్రమోచన మనే క్షేత్రానికి సర్వపాప హరుడైన శ్రీ హరిన దర్శించుటకు వెళ్ళాడు. పూర్వకాలాన వరాహారూపుడైన భగవంతుడు ప్రసాదించిన పాప ప్రణాశకాలైన రెండు స్తోత్రాలను ఆస్వామి ఎదుట జపించాడు. అచట నుండి ఆ ప్రహ్లాదుడు స్థావర జంగమా లన్నింటిలో విష్ణుని సాన్నిహిత్యం కలిగిన మహాక్షేత్రం శాలగ్రామానికి వెళ్ళాడు. అచట ప్రతివస్తువులోనూ సర్వగతుడైన విష్ణుని భావించి మహాప్రీతితో ఆప్రభువు పాదాలను పూజించాడు. ఓ నారదా! ఈ విధంగా మహాభాగవతుడైన ప్రహ్లాదుడుగావించిన పుణ్యప్రదమైన తీర్థయాత్రా వివరణము నీకు వినిపించాను. దీనిని గానంచేసినా శ్రవణం చేసినా, యితరులకు దానం చేసినా మానవుడు సర్వ పాపాలనుండి విముక్తుడౌతాడు ||

ఇది శ్రీ వామన పురాణంలో ఏబది ఏడవ అధ్యాయం ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters