Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ పంచ పంచాశోకధ్యాయః

పులస్త్య ఉవాచ ః

ఇరావతీ మనుప్రాప్య పుణ్యాం తా మృషి కన్యకామ్‌ | స్నాత్వా సంపూజయామాస చైత్రాష్టమ్యాం జనార్దనమ్‌ || 30

నక్షత్ర పురుషం చీర్త్వా వ్రతం పుణ్యప్రదం శుచిః | జగామ స కురుక్షేత్రం ప్రహ్లాదో దానవేశ్వరః || 31

ఐరావతే సమంత్రేణ చక్ర తీర్థం సుదర్శనమ్‌ | ఉపామంత్ర్య తతః సస్నౌ వేదోక్త విధినా మునే ః || 32

ఉపోష్య క్షణదాం భక్త్యా పూజయిత్వా కురుధ్వజమ్‌, కృత శౌచో జగామాధ ద్రష్టుంపురుష కేసరిమ్‌ || 33

స్నాత్వా తు దేవికాయాం చ నృసింహం ప్రతి పూజ్య చ, తత్రోష్య రజనీ మకాం గోకర్ణం దానవో య¸° || 34

తస్మిన్‌ స్నాత్వా తథా ప్రాచీం పూజ్యేశం విశ్వకర్మిణమ్‌, ప్రాచీనే చాపరే దైత్యో ద్రుష్టుం కామేశ్వరం య¸° || 35

తత్ర స్నాత్వా చ దృష్ట్వా చ సంత్రర్ప్య పితృ దేవతాః, పుండరీకం చ సంపూజ్య ఉవాస దివస త్రయమ్‌ || 36

తత్ర స్నాత్వా చ దృష్ట్వా చ పూజయిత్వా చ శంకరమ్‌ | ద్రష్టుం య¸° చ ప్రహ్లాదః పుండరీకం మహాంభసి || 37

తత్ర స్నాత్వా చ దృష్ట్వా చ సంతర్ప్య పితృ దేవతాః | పుండరీకం చ సంపూజ్య ఉవాస దివసత్రయమ్‌ || 38

విశాఖ యూపే తదను దృష్ట్వా దేవం తతా జితమ్‌ | స్నాత్వా తథా కృష్ణ తీర్థే త్రిరాత్రం న్యవస చ్ఛుచిః || 39

తతో హం సపదే హంసం దృష్ట్వా సంపూజ్య చేశ్వరమ్‌, జగామాసౌ పయోష్ణ్యాయా మఖండం ద్రష్టు మీశ్వరమ్‌ || 40

స్నాత్వా పయోస్ణ్యాం ః సవిలే పూజ్య ఖండం జగ త్పతిమ్‌, ద్రష్టుం జగామ మతిమాన్‌ వితస్తాయాం కుమారిలమ్‌ || 41

తత్ర స్నాత్వార్చ్య దేవేశం వాలఖిల్యైర్మరీ చిపైః | ఆరాధ్య మానం యద్యత్ర కృతం పాప ప్రణాశనమ్‌ || 42

యత్ర సా సురభి ర్దేవీస్వసు తాం కపిలాం శుభామ్‌ | దేవ ప్రియార్థ మసృజ ద్ధితార్థం జగత స్తథా || 43

తత్ర దేవహ్ర దేస్నాత్వా శంభుం సంపూజ్య భక్తితః, విదివ ద్దధి చ ప్రాశ్య మణిమంతం తతో య¸° || 44

తత్ర తీర్థవరే స్నాత్వా ప్రాజాపత్యే మహామతిః , దదర్శ శంభుం బ్రహ్మాణం దేవేశం చ ప్రజాపతిమ్‌ || 45

విధానతస్తు తాన్‌ దేవాన్‌ పూజయిత్వా తపోధన | డ్రాత్రం తత్ర స్థిత్వా జగామ మధు నందినీమ్‌ || 46

మధు మత్సదిలే స్నాత్వా దేవం చక్రధరం హరియ్‌ | శూలబాహుం చ గోవిందం దదర్శ దను పుంగవః || 47

శ్రీ వామన పురాణంల ఏబది యైదవ అధ్యాయము

పులస్త్యుడిలా చెప్పసాగాడు. ఓ నారదా ! ఋషి కన్య అయిన పవిత్ర ఇరావతికి వెళ్ళి స్నానం చేసి ఆ ప్రహ్లాదుడు చైత్ర ష్టమి నాడు జనార్దనుని పూజించాడు. అచట శుచియై పుణ్య ప్రద మైన నక్షత్ర వ్రత మాచరించి ఆ దానవేశ్వరుడు కురుక్షేత్రానికి వెళ్లాడు. ఐరావత మంత్రాలతో సుదర్శను డగు చక్రతీర్థుని అర్చించి విధ్యుక్తంగా స్నానం చేశాడు. ఆ రాత్రి ఉపవసించి భక్తితో కురుధ్వజుని పూజిచి శుచియై నృసింహ దేవుని చూచుటకు వెళ్ళాడు. ఆ దానవపతి దేవికా నదిలో మునిగి నృసింహుని పూజించి ఆ రాత్రి అక్కడ వసించి మరునాడు గోకర్ణక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి తూర్పు దిక్కున విశ్వకర్మను పూజించి మరొక దిశగా కామేశ్వరుని దర్శించుటకై వెళ్లాడు. అక్కడ స్నాతుడై కామేశ్వర మహాదేవుని పూజించి ప్రహ్లాదుడు మహాజల మధ్యాన పుండరీకానికి వెళ్లాడు. అక్కడ స్నానం చేసి పితృ దేవతలకు తర్పణాదు లిచ్చి పుండరీకుని అర్చించి మూడు రోజులు గడిపాడు. అనంతరం విశాఖ యూప క్షేత్రంలో అజిత భగవానుని దర్శించి స్నానం చేసి శుచియై కృష్ణు తీర్థంలో మూడు రాత్రులు గడిపాడు.అనంతరం హంస పదంలో హంసేశ్వరుని సేవించి ఆ భాగవతుడు అఖండేశ్వరుని దర్శించుటకై పయోష్ణి వెళ్లాడు. పియోష్ణిలో స్నానం చేసి అఖండేశ్వరుని అర్చించి ఆ మతిమంతుడు కుమారిలుని చూచుటకు వితస్తకు వెళ్లాడు ఆ వితస్తలో మునిగి, జ్యోతి ర్మయులైన వాలఖిల్య ఋషులచే ఆరాధింపబడిన దేవేశ్వరుని అర్చించి తాను చేసిన పాపాలన్నీ నశింప జేసుకున్నాడు. అక్కడ దేవతల ప్రీత్యర్ధమూ లోక కల్యాణార్థం కామధేవు కపిల అను గోవును కనిన, దేవహ్రద మనే తీర్థంలో స్నానం చేసి భక్తితో శివుని ఆరాధించి విధి విధానంగా పెరుగు తిని మణిమంతానికి ప్రయాణ మైనాడు. ప్రజానపతి నిలయమైన ఆ శ్రేష్ఠ తీర్థంలో స్నానం చేసి ఆ మహామతి హరునీ చతుర్ముఖునీ దర్శించి యథావిధిగా పూజించాడు. ఆరు రాత్రులా ప్రదేశంలో గడిపి మధునందిని వెళ్ళాడు. తేనె లాగ తియ్యగా ఉండే ఆ నదీ జలాలలో స్నానమాడి శూలపాణి చక్రధారి హరినీ ఆ దానవ శ్రేష్ఠుడు దర్శించాడు.

నారద ఉవాచ ః

కిమర్థం భగవాన్‌ శంభు ర్దధారాథ సుదర్శనమ్‌ , శూలం తథా వాసుదేవో మమైతద్రూహి పృచ్ఛతః || 48

పులస్త్య ఉవాచ ః

శ్రూయతాం కథయిష్యామి కథా మేతాం పురాతనీమ్‌, కథయామా సయాం విష్ణుర్భవిష్య మనవే పురా 49

జలోద్భవో నామ మహాసురేంద్రో ఘేరం స తప్త్వా తప ఉగ్రవీర్యః,

ఆరాధయామాస విరించి మారా త్సస్య తుష్టో వరదో బభూవ || 50

దేవాసురాణా మజయో మహాహవే నిజైశ్చ శ##సై#్త్ర రమరై రవధ్యః,

బ్రహ్మర్షి శాపైశ్చ నిరీప్సితార్థో జలే చవహ్నౌ స్వగుణోపహర్తా || 51

ఏవం ప్రభావో దనుపుంగవ్యోసౌ దేవాన్‌ మహర్షీ నృపతీన్‌ సమగ్రాన్‌,

ఆ బాధమానో విచచార భూమ్యాం సర్వాః క్రియా నాశయ దుగ్రమూర్తిః || 52

తతోమరా భూమి భవాః సభూపాః జగ్ముః శరణ్యం హరి మీశితారమ్‌,

తైశ్చాపి సార్థం భగవాన్జగామ హిమాలయం యత్ర హర స్త్రినేత్ర ః || 53

సంమంత్ర్య దేవరి హితం చ కార్యం మతిం చ కృత్వా నిధనాయ శత్రో,

నిజాయుధానాం చ విపర్యయం తౌ దేవాధిపే చక్ర తు రుగ్ర కర్మిణౌ || 54

తతశ్చాసౌ దానవో విష్ణు శర్వా సమాయాతౌ తజ్జిఘాంసూ సురేశౌ,

మత్వా కజే¸° శతృభి ర్ఘోర రూపే భయా త్తోయే నిమ్నగాయాం వివేశ || 55

జ్ఞాత్వా ప్రణష్టం త్రిదివేంద్ర శత్రుం నదీం విశాలాం మధుమ త్సుపుణ్యామ్‌,

ద్వయోః సశస్త్రౌ తటయో ర్హరీశౌ ప్రచ్ఛన్న మూర్తీ సహసా బభూవతుః || 56

జలోద్భవ శ్చాపి జలం విముచ్చ జ్షాత్వాగతౌ శంకర వాసుదేవౌ,

దిశ స్సమీక్ష్య భయ కాతరాక్షో దుర్గం హిమాద్రిం చ తదారురోహ || 57

మహీధ్ర శృంగోపరి విష్ణు శంబూ చం చూర్యమాణం స్వరిపుం చ దృష్ట్యా, వేగా

దుభే దుద్రువతుః సశస్త్రౌ విష్ణు స్త్రిశూలీ గిరిశశ్చ చక్రీ || 58

తాభ్యాం స దృష్ట స్త్రిదశోత్తమాభ్యాం చక్రేణ శూలేన చ భిన్నదేహః,

పపాతశైలా త్తపనీయవర్ణె యధాంతరిక్షా ద్విమలా చ తారా || 59

ఏవం త్రిశూలం చ దధార విష్ణుశ్చక్రం త్రినేత్రోప్యరిసూదనార్థమ్‌ ,

యాత్రా ఘ హంత్రీ హ్యభవ ద్వితస్తా హరాంఘ్రి పాతా చ్ఛిశిరా చలాత్తు || 60

తత్ర్పాప్య తీర్థం త్రిదశాధిపాభ్యాం పూజాం చ కృత్వా హరి శంకరాభ్యామ్‌,

ఉపోష్య భక్త్యా హిమవంత మాగా ద్ద్రష్టుం గిరీశం శివ విష్ణు గుప్తమ్‌ || 61

తం సమ భ్యర్చ్య విధివ ద్దత్త్వా దానం ద్విజాతిషు, విస్తృతే హిమవ త్పాదే భృగుతుంగం జగామ సః || 62

యత్రేశ్వరో దేవవరస్య విష్ణోః ప్రాదా ద్రధాంగ ప్రవరాయుధన్తత్‌

యేన ప్రచిచ్ఛేద త్రిధైవ శంకరం జిజ్ఞాసమానో వైస్త్రబలం మహాత్మా || 63

ఇతి శ్రీ వామన పురాణ పంచ పంచాశోధ్యాయః సమాప్తః

నారదుడు పులస్త్యుని మాట విని యిలా ప్రశ్నించాడు. బ్రహ్మర్షీ ! శంకరుడు సుదర్శనాన్ని వాసుదేవుడు శూలాన్ని ఎందుకు ధరించారు దయచేసి చెప్పండి. అందుల కాపులస్త్యుడిలా చెప్ప సాగాడు నారదా ! ఈ ప్రాచీన గాథ చెబుతాను వినుము. దీనిని పూర్వం విష్ణువు భవిష్య మనువుకు చెప్పండి. ఒకప్పుడు జలోద్భవుడనే మహాదైత్యేంద్రుడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మదేవునారాధించాడు. ఆయన సంతోషించి, దేవాసురలకు అవధ్యుడుగాను, స్వంత ఆయూధాల చేత ఎవరిచేతను చంపబడకుండునట్లును, బ్రహ్మర్షుల శాపాలు వానికి తగులకుండు నట్లును, నీటిలో నీటి గుణాన్ని అగ్నిలో అగ్ని గుణాన్ని కలిగియుండునట్లూ అసాధ్యమైన వరాలు ఆ దుష్టుడికిచ్చాడు. అంతటితో మదించి ఆదానవుడు దేవర్షులను రాజులను అందరూ బాధిస్తూ భూమిమీద తిరగడం మొదలుపెట్టాడు. యజ్ఞాది ధర్మకార్యాలు ధ్వంసం చేయసాగాడు. వాడి బాధలు పడలేక దేవతలు మానవులు రాజులు విష్ణునివాసాలికి వెళ్ళి మొరబెట్టుకోగా ఆయన వారిని వెంటబెట్టుకోని హరుని నివాసమైన హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ హరులిరువురు ఆలోచించుకొని ఎలాగైనా దేవతలకు ఋషులకు మేలు చేసేందుకైనా వాడిని సంహరించ నిశ్చయించుకున్నారు. తమ తమ ఆయుధాలను పరస్పరం మార్చుకున్నారు. ఆ జలోద్భవుని సంహరించేందుకు భయంకర రూపాలు ధరించి వాడిని వెతకసాగారు. అలా హరులిరువురు ఆయుధాలు మార్చుకుని తనను పరిమార్చుటకై ఘోర రూపాలతో బయలుదేరడం వారలు అవధ్యులు కావడం తెలుసుకొని ఆ దానవుడు భయకంపితుడై జలాల్లో మునిగి కూర్చున్నాడు. ఆ దేవశత్రువు నీళ్లలో కరిగిపోవడం తెలుసుకుని తీయని జలాలుగల ఆవిశాలానది ఉభయ తీరాల్లో కనపడకుండా అదృశ్యులై నిలిచారు. కొంతవడి జలోద్భవుడు మెల్లగా నీటినుండి బయటకు వచ్చి బెదురు చూపులతో నలువైపులా చూస్తూ హరిహరులు వెళ్లిపోయారని నిశ్చయించుకుని దుర్గమమైన హిమాద్రి శిఖరానికెగబ్రాకి కూర్చున్నాడు. అలా వాడు నాగరాజ శిఖరాన తిరుగాడడం చూచి శంకర నారాయణులిరువురు మహా వేగంతో పరుగెత్తి తమ ఆయుధాలతో వాడి శరీరాన్ని ఛేధించారు. శంఖ చక్రధారులకూ, విష్ణుశూలాఘాతానికి దేహం చిల్లులు పడిపోగా బంగారు కాంతిగల శరీరంతో, ఆకాశాన్నుంచి తెగిపడే ఉజ్వల నక్షత్రంలాగా ఆదుష్టుడా శైలశిఖరాన్నుండి గతప్రాణుడై పడిపోయాడు. ఆ విధంగా లోకకంటకుడైన ఆదుష్టుని సంహరిచేందుకు శివుడు చక్రాన్నీ విష్ణువు శూలాన్నీ ధరించవలసి వచ్చింది. ఆ సంఘటన శివుని పాదాఘాతంవల్ల శిశిరగిరి నుంచి ఉద్భవించిన పాపనాశిని వితస్తానదీ పరిసరాలలో జరిగింది ప్రహ్లాదుడు ఆప్రదేశాన్ని దర్శించి దేవాదిదేవులయిన ఆ హరిశంకరులను పూజించి భక్తితో ఉపవాసం గావించి శివకేశవులచేత రక్షితుడైన ఆనగాధి రాజు హిమవంతుని చూచుటకు వచ్చాడు. ఆ గిరీశుని విధ్యుక్తంగా అర్చించి బ్రాహ్మణులకు దానాలొసగి విశాలమైన హిమాలయ పాద ప్రదేశానగల భృగుతుంగ క్షేత్రానికి వెళ్లాడు. అచ్చట దేవశ్రేష్ఠుడైన విష్ణువునకు శంకరుడు చక్రాయుధాన్ని ప్రదానం చేయగా దాని శక్తిని పరీక్షింపదలచి విష్ణువు దాన్ని ప్రయోగించి, శివుణ్ణ మూడు ముక్కలుగా ఖండించాడు.

ఇది శ్రీ వామన పురాణంలో ఏబదియైదవ అధ్యాయం ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters