Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామ పురాణత్రి పంచాశోధ్యాయః

పులస్త్య ఉవాచ :

కాళందీ సలిలే స్నాత్వా పూజయిత్వా త్రివిక్రమమ్‌, వుపోష్య రజనీ మేకాం లింగ భేదం గిరిం య¸° || 76

తత్ర స్నాత్వా చ విమలే భవం దృష్ట్వా చ భక్తితః | ఉపోష్య రజనీ మేకాం తీర్థం కేదార మావ్రజత్‌ || 77

తత్ర స్నాత్వార్చ్య చేశానం మాధవం చాప్యభేదతంః | ఉషిత్వా వాసరాన్‌ సప్త కుబ్జామ్రం ప్రజగామ హ || 78

తతః సుతీర్థ స్నాత్వా చ సోపవాసీ జితేంద్రియః | హృషీకేశం సమభ్యర్చ్య య¸° బదరికాశ్రమమ్‌ || 79

తత్రోష్య నారాయణ మర్ఛ్యభక్తా స్నాత్వాధ విద్వాన్‌ స సరస్వతీ జలే,

వరాహతీర్థే గరుడాసనం స దృష్ఠ్వాధ సంపూజ్య సుభకిమాంశ్చ || 80

భద్రకర్ణే తతో గత్వా జయేశం శశిశేఖరమ్‌, దృష్టా సంపూజ్య చ శివం విపాశామభితో య¸° || 81

తస్యాం స్నాత్వా సమభ్యర్చ్య దేవదేవం ద్విజప్రియమ్‌, ఉపవాసీ ఇరావత్యాం దదర్శ పరమేశ్వరమ్‌ || 82

యమారాధ్య ద్విజశ్రేష్ఠ ! శాకలే వైపురూరవాః సమవాప పరం రూప మైశ్వర్య చదుర్లభమ్‌ || 83

కుష్ఠ రోగాభిభూతశ్చ యం సమారాధ్య వై భృగుః, ఆరోగ్య మతులం ప్రాప సంతాన మపి చాక్షయమ్‌ || 84

నారద ఉవాచ :

కధం పురూరవా విష్ణు మారాధ్య ద్విజసత్తమః, విరూపత్వం సముత్సృజ్య రూపం ప్రాప శ్రియా సహ || 85

పులస్త్య ఉవాచ :

శ్రూయతాం కధయిష్యామి కథాం పాప ప్రణాశినీమ్‌, పూర్వం త్రేతా యుగస్యాదౌ యధావృత్తం తపోధన ! || 86

మద్రదేశ ఇతి ఖ్యాతో దేశో వై బ్రహ్మణః సుతః, శాకలం నామ నగరం ఖ్యాతం స్థానీయ ముత్తమమ్‌ || 87

తస్మిన్‌ విపణి వృత్తిస్థః సుధర్మాఖ్యోభవ ద్వణిక్‌, ధనాఢ్యో గుణవాన్‌ భోగీ నానా శాస్త్ర విశారదః || 88

స త్వేకదా నిజాద్‌ రాష్ట్రా త్సురాష్ట్రం గంతు ముద్యతః, సార్థేన మహాతా యుక్తో నానా విపణి పణ్యవాన్‌ || 89

గచ్ఛతః పధి తస్యాథ మరుభూమౌ కలిప్రియః, అభవ ద్దస్యుతో రాత్రౌ అవస్కందో తిదుః సహః || 90

తతః స హృతసర్వస్వో వణిగ్‌ దుఃఖ సమన్వితః, అసహాయో మరౌ తస్మిం శ్చచారోన్మత్తవ ద్వశీ || 91

చరతా తదారణ్యం వైదుఃఖాక్రాంతేన నారదః, ఆత్మా ఇవ శమీవృక్షో మరా వాసాదితః శుభః || 92

తం మృగైః క్షిభిశ్చైవ హీనం దృష్ట్యా శమీ తరుమ్‌, శ్రాంతః క్షుత్తృట్‌ పరీతాత్మా తస్యాధః సముపావిశత్‌ || 93

శ్రీ వామన పురాణంలో ఏబది మూడవ అధ్యాయము

పులస్త్యడిలా అన్నాడు ః

పవిత్ర యమునా నదిలో స్నానం చేసి విక్రమ దేవుని పూజించి ఆ రాత్రి ఉపవాస ముండి ప్రహ్లాదుడి, లింగ భేద పర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిర్మలో దకాల్లో స్నానం చేసి భక్తితో దర్శించి ఒక రాత్రి ఉపవసించి పిమ్మట కేదార క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ స్నానాదులు చేసి అభేదబుద్ధితో మాధవ ఉమాధవులను అర్చించి ఏడు దినాలు ఉపవసించి ఆమీద కుబ్జామ్ర క్షేత్రానికి వెళ్ళాడు. ఆ ఉత్తమ తీర్థంలో మునిగి మనో నిగ్రహంతో ఉపవాసం చేసి హృషీకేశ్వరుని దర్శించి బదరికాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఉండగా ఆ విద్వాంసుడు భక్తి పూర్వకంగా సరస్వతీ జలాలలో అవగాహనం చేస వరాహ తీర్థంలో గరుడ వాహనుని భక్తితో సేవించి తర్వాత భద్రకర్ణంలో చంద్రశేఖరుడగు జయేశ్వరుని దర్శించి పూజ చేసి ఆ ప్రహ్లాదుడు విపాశా నదికి వెళ్ళాడు. ఆ నదిలో మునిగి బ్రాహ్మణ ప్రియుడగు దేవదేవుని పూజించి ఉపవాసం గావించి ఇరావతికి వెళ్లి పరమేశ్వర దర్శనం చేసుకున్నాడు. ఆ స్వామిని అర్చించి పూర్వం శాకల నగరంలో పురూరవుడు దుర్లభ##మైన ఐశ్వర్య సౌందర్యాలు పొందాడు. కుష్ఠు రోగ పీడీతుడైన భ్రుగు వాస్వామి ప్రసాదం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందటమే కాకుండా సత్సంతానాన్ని గూడ కనినాడు. అది విని నారదుడో బ్రహ్మర్షే ! పురూరపు డేవిధంగా పూర్వ కాలాన ఆ విష్ణువు నారాధించి తన కురూపత్వాన్ని పోగొట్టుకుని సౌందర్య సంపదలు పొందినదీ వివరించి చెప్పండని అడుగగా పులస్త్యుడావుదంతం చెప్పసాగాడు. నారదా ! పురూరవుని కధ పాపహరమైనది. వినుము. పూర్వం త్రేతాయుగారంభంలో అది జరిగింది. మద్ర దేశంలో శాకల మనే ప్రసిద్ధ నగరం ఉండేది. ఆ ఊరిలో ధనవంతుడు గుణవంతుడు నానాశాస్త్రకోవిదుడు మహా భోగి అయిన సుధర్ముడనే వణిజుడు (వ్యాపారి) ఉండేవాడు. అతడొక పర్యాయం విశేషంగా విలువ గల సరకులు తీసికొని చరాస్తి తీసికొని తన రాష్ట్రం వదలి సురాష్ట్ర దేశానికి వెళ్తుండగా మార్గ మధ్యాన దొంగలు అడ్డగిచి ఆయన సర్వస్వాన్ని, ఎడారి ప్రదేశంలో దోచుకు పోయారు. సర్వస్వం కొల్పొయి కట్టు బట్టలతో మగిలిన ఆ వ్యాపారి తన దుర్దశకు మిక్కిలిగా దఃఖించి అసహాయుడై ఆ ఎడారి దేశంలో పిచ్చివాడి వలె తిరుగ సాగాడు. అలా ఒకనాడు అరణ్యంలో తిరుగుతూ తనవలెనే ఏకాకిగా నిలబడిన ఒక జమ్మి చెట్టువద్దకు చేరాడు. ఆ చుట్టు పట్లపక్షులు గాని మృగాలు గాని ఏవీ కనుపించలేదు. నడక శ్రమతో ఆకలితో తూలి పోతూ ఆ సుధర్మడాశమీ వృక్షం క్రింద కూలబడి నాడు.

సుప్త శ్చాపి సువిశ్రాంతో మధ్యాహ్నే పున రుత్థితః, సమపశ్య దధాయాంతం ప్రేతం ప్రేత శ##తైర్‌ వృతమ్‌ || 1

ఉద్వాహ్యంత మధాన్యేన ప్రేతేన ప్రేతనాయకమ్‌, పిండాశిభిశ్చ పురతో ధావ ద్భీ రూక్ష విగ్రహైః || 2

అధా జగామ ప్రేతో సౌ పర్యటిత్వా వనాని చ, ఉపాగమ్య శమీ మూలే వణి క్పుత్రం దదర్శ సః || 3

స్వాగతే నా భివాద్యైనం సమాభాష్య పరస్పరమ్‌, సుఖోపవిష్ట శ్ఛాయాయాం పృష్ట్యా కుశల మాప్తవాక్‌ || 4

తతఃప్రేతాధిపతినా పృష్టః స తు వణిక్‌ సఖః, కుత ఆగమ్యతే బ్రూహి క్వ సాధో వా గమిష్యసి || 5

కధం చేదం మహారణ్యం మృగ పక్షి వివర్జితమ్‌ , సమాపన్నోసి భద్రం తే సర్వ మాఖ్యాతు మర్హసి || 6

ఏవం ప్రేతాధిపతినా పణిక్‌ పృష్టః సమానతః, సర్వ మాఖ్యాతవాన్‌ బ్రహ్మన్‌ ! స్వదేశ ధన విచ్యుతిమ్‌ || 7

తస్య శ్రుత్వా స వృత్తాంతం తస్య దుఃఖేన దుఃఖిత, వణి క్పుత్రం తతః ప్రాహ ప్రేతపాలః స్వబంధువత్‌ || 8

ఏవం గతేపి మా శోకం కర్తు మర్హసి సువ్రత, భూయోప్యర్ధా భవష్యంతి యది భాగ్య బలం తవ || 9

భాగ్యక్షయే ర్థారి క్షీయంతే భవం త్యభ్యుదయే పునః, క్షీణ స్యాస్య శరీరస్య చింతయానోదయో భ##వేత్‌ || 10

ఇత్యుచ్చార్య సమాహూయ స్వాన్‌ భృతాన్‌ వాక్య మబ్రవీత్‌, అద్యాతిధి రయం పూజ్యః సదైవ స్వజనో మమ || 11

అస్మిన్‌ దృష్టే వణిక్పుత్రే యధా స్వజన దర్శనమ్‌, అస్మిన్‌ సమాగతే ప్రేతాః ప్రీతి ర్జాతా మమా తులా ||12

ఏవం హి వదత స్తస్య మృత్పాత్రం సుదృఢం నవమ్‌, దధ్యోదనేన సంపూర్ణ మాజగామ యధేప్సితమ్‌ || 13

తధా నవా చ సుదృఢా సంపూర్ణ పరమాంభసా, వారిధానీ చ సంప్రాప్తా ప్రేతానా మగ్రతః స్థితా || 14

తమాగతం సలిల మన్నం వీక్ష్య మహామతిః, ప్రాహూత్తిష్ఠ వణిక్పుత్ర ! త్వమాహ్నిక ముపాచర || 15

తతస్తు వారిధాన్యాసౌ సలిలేన విధానతః, కృతాహ్నికా వుభౌ జాతౌ వణిక్‌ ప్రేత పతి స్తధా || 16

తతో వణిక్సుతాయా దౌ దధ్యోదన మధేచ్చయా, దత్తా తేభ్యశ్చ సర్వేభ్యః ప్రేతేభ్యో వ్యదదా త్తతః|| 17

భుక్తవత్సు చ సర్వేషు కామతోంభసి సేవితే, అనంతరం స బుభుజే ప్రేత పాలో వరాశనమ్‌ || 18

ప్రకామతృప్తే ప్రేతే చ వారిధాన్యోదనం తథా, అంతర్థాన మగాద్‌ బ్రహ్మన్‌ ! వణిక్త్సుత్రస్యపశ్యతః || 19

వెంటనే పండుకొని గాఢంగా నింద్రించి మధ్యాహ్న వేళకు, బడలిక తీరి పోగా మేలు కొనే సరిగి ఎదురుగా వంద లాది ప్రేతాల చే పరివేష్టితుడైన ఒకానొక ప్రేతాన్ని చూచాడు. ఆ ప్రేత నాయకుడిని మరొక ప్రేతం మోసుకుని వచ్చింది. ఎందరో పిండ భుక్కులైన ప్రేతాలు ఎండిన శరీరాలతో ముందర పరుగిడుతూ వచ్చారు. అలా అరణ్యంలో తిరిగి వచ్చి ఆ ప్రేతపతి శమీ వృక్షం క్రింద ఆ కోమటి బిడ్డను చూచి స్వాగత పూర్వకంగా అభివాదం చేశాడు. ఇద్దరూ శ్రమ మూలాన సుఖోపవిష్టులై పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ ప్రేతనాయకుడు తన వణిక్‌ మిత్రునితో యిలా అన్నాడు - సౌమ్యా ! నీ వెవరవు ? ఎక్కడ నుండి రాక ? ఎక్కడకు వెళ్తున్నావు ? ఈ మృగపక్షి విహీనమైన మహారణ్యాని కెలా వచ్చి చేరావు ? నీకు క్షేమ మగుగాక ! అంతా వివరంగా చెప్పుము. అది విని ఓ నారదా! ఆ వణిక్పుత్రుడు ఉన్న దున్నట్టుగా, స్వదేశాన్ని వదలడం దారిలో సర్వస్వం కోలు పోవడం వివరంగా చెప్పాడు. అది విని ఆ వణిక్సుతునితో బాటు ఆ ప్రేత నాయకుడు గూడ దుఃఖించి ఆప్యాయతతో అతడి నిలా ఓదార్చాడు. బాబూ! ధనం పోయిందని విచారించకుము. సమయం కలిసి వస్తే ధనం మళ్ళీ వస్తుంది. భాగ్య క్షయంతో ధన క్షయం కలుగుతుంది. భాగ్యం కలిసి వస్తే మళ్ళీ అభ్యుదయం కలుగుతుంది. అంతే కాని విచారంతో శరీరాన్ని క్షీణింప జేసుకుంటే ఏమి అనుభవించ నగును ? కనుక దిగులు మానుము. తర్వాత తన నేవకుల నందరను పిలిచి, యిదుగో ఈ సోదరుడు మన అతిధి. పూజ్యుడు. నా స్వజనంలో నివాడు. యితనిని చూస్తే నా స్వజనులను చూచినంత ఆనందంగా ఉందని అంటూండగా ఎక్కడ నుంచో ఒక దృఢమైన మట్టి కుండ పెరుగన్నంతో నిండుగా వచ్చి ఎదుట కనిపించింది. మరొక గట్టి కొత్త కుండ నిర్మలోవకంతో నిండి వచ్చింది. ఆ రెండు పాత్రలను అందులోని అన్న జలాలను చూచి ఆ మహామతి ఆయన ప్రేత నాయకుడావణికుణ్ణి చూచి - బూబూ ! లేచి అహ్నికాలు తీర్చుకొనుమని చెప్పాడు. అనంతరం ఆ నాయకుడా కడుపార పెరుగన్నం చల్లని మంచి నీరు ఆరగింప చేసి, తర్వాత తన పరివారానికి కంతకూ భోజనం పెట్టాడు. అందరూ ఆరగించి నీరు త్రాగిన తర్వాత ఆ ప్రేత నాయకుడు తానూ ఆ దధ్యోదనం తిని చల్లని నీరు యధేచ్చగా త్రాగాడు. అందరూ అలా తృప్తులైనంతనే ఆ కోమటి బిడ్డడు చూస్తుండగనే ఆ రెండు పాత్రలూ అదృశ్యమైన పోయాయి.

తత స్తదద్భుతతమం దృష్ట్వా స మతిమాన్‌ వణిక్‌, పప్రచ్చ తం ప్రేతపాలం కౌతూహల మనా వశీ ||ల 20

అరణ్య నిర్జనే సాధో కుతోన్నస్య సముద్బవః, కుతశ్చ వారి ధానీయం సంపూర్ణ పరమాంభసా || 21

తధామీ తయే భృత్యా స్త్వ త్త స్తే వర్ణతః కృశౌః భవా నపి చ తేజస్వీకించి త్పుష్ట వపుః శుభః || 22

శుక్ల వస్త్ర పరీధానో బహూనాం పరిపాలకః, సర్వమేత న్మయాచక్ష్వ కో భవాన్‌ కా శమీత్వియమ్‌ || 23

ఇత్థం వణిక్సుత వచః శ్రుత్వా సౌ ప్రేతనాయకః, శశంస సర్వమప్యాద్యం యధావృత్తం పురాతనమ్‌ || 24

అహమాసం పురా విప్రః శాకలే నగరోత్తమే, సోమశ##ర్మేతి విఖ్యాతో బహులా గర్భ సంభవాం || 25

మమాస్తి చ వణిక్‌ శ్రీమాన్‌ ప్రాతివేశ్యోమహాధనః, సతు సోమశ్రవా నామ విష్ణుభక్తో మహాయశాః || 26

సో హం కదర్యో మూఢాత్మా ధనే పి సతి దుర్మతిః, న దదామి ద్విజాతిభ్యో న చా శ్నామ్యన్న ముత్తమమ్‌ || 27

ప్రమాదా ద్యది భుంజామి దధి క్షీర ఘృతాన్వితమ్‌, తతో రాత్రౌ సృభిర్‌ ఘోరై స్తాడ్యతే మమ విగ్రహః || 28

ప్రాతర్భవతిమే ఘోరా మృత్యుతుల్యాః విఘంచికౌ, న చ కశ్చి న్మమాభ్యాసే తత్ర తిష్ఠతిబాంధవః || 29

కధం కధమపి ప్రాణా మయా సంప్రతిధారితాః, ఏవ మేతాదృశః పాపీ నివసామ్యతినిర్ఘృణః || 30

సౌవీర తిల పిణ్యాక సక్తు శాకాది భోజనైః , క్షపయామి కదన్నాద్యై రాత్మానం కాలయాపనైః || 31

ఏవం తత్రాసతో మహ్యం మహాన్‌ కాలో భ్యగా దథ శ్రవణ ద్వాదశీ నామ మాసే భాద్రపదే భవత్‌ || 32

తతో నాగరికో లోకో గతః స్నాతుం హి సంగమమ్‌ , ఇరావత్యా నడ్వలాయా బ్రహ్మ క్షత్ర పురస్పరః || 33

ప్రాతివేశ్య ప్రసంగేన తత్రాప్యనుగతో స్మ్యహమ్‌, కృతోపవాసః శుచిమా నేకాదశ్యాం యతవ్రతః || 34

తతః సంగమ తో యేన వారిధానీం దృఢాం నవామ్‌, సంపూర్ణాం వస్తు సంవీతిం ఛత్రోపానహ సంయుతామ్‌ || 35

మృత్పాత్ర మపి మిష్టస్య పూర్ణం దధ్యోదనస్య హ, ప్రదత్తం బ్రాహ్మణంద్రాయ శుచయే జ్ఞానధర్మిణ || 36

తదేవ జీవతా దత్తం మయాదానం వణిక్సుత, వర్షాణాం సప్తతీనాం నై నాన్యద్‌ దత్తం కించన || 37

ఆ అద్భుతం చూచిన కోమటి బిడ్డ కుతూహలం కోద్దీ ఆ ప్రేత నాధుడిని ప్రశ్నంచాడు. సాధూ ! ఈ నిర్జనారణ్యంలో ఈ అమృతోపమమైన అన్నం నిర్మల జలంతో నింపిన పానపాత్ర ఎలా వచ్చాయి? ఈ నీభృత్యు లెవరు ? నీ కంటె బక్క చిక్కి వర్చస్సు లేకుండా ఉన్నారేల ? నీవూ వారల కంటే పుష్టిగా తేజస్విగా ఉన్నావు. తెల్లటి వస్త్రాలు ధరించి యిందరను పోషిస్తున్న నీవెవరు ? ఈ శమీ వృక్షం విషయమేమిటి ? ఈ విషయా లన్నీ నాకు చెప్పుము. వణిక్‌ పుత్రుడి మాటలు విని ఆ ప్రేతాల పెద్ద పూర్వం గడచిన తన జీవిత గాధనంతా పూస గ్రుచ్చినట్టుగా చెప్పాడు. బాబూ! పూర్వం శాకల నగరంలో నేను సోమ శర్మగా ప్రసిద్ధి కెక్కిన విప్రుడను. మా తల్లి పేరు బహుళాదేవి. నా పొరుగున నే మహాధనికుడైన సోమశ్రవు డనే వైశ్యుడుండేవాడు. అతడు విష్ణుభక్తుడు యశస్వి. నేనూ పరమ మూర్ఖుణ్ణి డబ్బు ఉన్నప్పటికి బ్రాహ్మణుల కిచ్చెడి వాడను కాను, కడుపు నిండా మంచి భోజనం కూడ చేసే వాడిని కాదు. మహాలోభిని, దుర్మార్గుడను, ఏ నాడైనా షడ్రసోపేతంగా భోజనం చేశానంటే ఆ రాత్రి ఎవరో మనుష్యులు వచ్చి నా వళ్ళు హూనం చేసి పొయ్యేవారు. తెల్లవారగానే నాకు భయం కరమైన విషూచి (కలరా) కలిగి మరణ బాధ పడుతూండే వాడిని. ఆ విధంగా సిగ్గు మాలిన పాపిష్టి జీవితం గడపేవాడిని. తరవాణి, నువ్వుల చక్క, పేలపిండి, ఆకుకూరలు, పాడై పోయిన అన్నం యిలాంటి వాటితో రోజులు గడిపే వాడిని. ఈ విధంగా చాలా కాలం గడచి పోగా భాద్రపద మాసంలో ద్వాదశీ పర్వం వచ్చింది. మా నగరంలోని బ్రాహ్మణులూ, క్షత్రియులూ, యితరులూ పర్వస్నానం చేసేందుకు ఇరావతి నడ్వల సంగమానికి వెళ్లారు. నా పొరుగు మిత్రుడు వైశ్యునితో కలసి నేను కూడ వెళ్ళి సంగమ స్నానం చేసి శుచినై ఏకాదశీ ఉపవాసం గావించాను. ఆ పర్వాన సంగమ స్నానం లో పవిత్రుడు జ్ఞాని ధర్మనిష్ఠు డైన ఒక బ్రాహ్మణునకు క్రొత్త జల కుంభాన్ని వస్త్రాచ్ఛాదనంతో, గొడుగు ఒక జత పాదరక్షలతో కూడా కలిపి యిచ్చాను. మరొక కుండలో తియ్యని పెరుగన్నంనింపి యిచ్చాను. డెబ్బది యేండ్లు నా జీ విత కాలంలో నేను గావించిన దానం అదొక్కటి మాత్రమే.

మృతఃప్రేతత్వ మాపన్నో దత్వా ప్రేతాన్న మేవ హి, అమీ చా దత్త దానాస్తు మదన్నేనోపజీవినః || 38

ఏతత్తే కారణం ప్రోక్తం యత్తదన్నం మయా ంభసా , దత్తం తదిద మాయాతి మధ్యాహ్నేపి దినే దినే || 39

యావ న్నాహం చ భుంజామి న తావ త్షయ మేతి వై, మయి భుక్తే చ పీతే చ సర్వ మంతర్హితం భ##వేత్‌ || 40

యచ్చాతపత్ర మదదం పోయం జాతః శమీ తరుః , ఉపాన ద్యుగళే దత్తే ప్రేతో మే వాహనో భవత్‌ || 41

ఏవం తోవోకా ధర్మజ్ఞ మనాశీ నాశతా త్మనః, శ్రవణ ద్వాశీ పుణ్యం తవోక్తం పుణ్య వర్థనమ్‌ || 42

ఇత్యేవ ముక్తేవచే వణిక్‌ పుత్రో బ్రవీ ద్వచః, యన్మయా తాత కర్తవ్యం తదనుజ్ఞాతు మర్హసి || 43

తత్తస్య మంశ్రుత్వా వణిక్పుత్రస్య నారద, ప్రేత పాలో వచ ః ప్రాహ స్వార్థ సిద్ధి కరం తతః || 44

యత్త్వయా తాత ! కర్తవ్యం మద్ధితార్థం మహామతే, కధయిష్యామి తత్సమ్యక్‌ తవ శ్రేయస్కరం మమ || 45

గయాయాం తీర్థజుష్టాయాం స్నాతఃశౌచ సమన్వితః, మమ నామ సముద్దిశ్య పిండ నిర్వాపణం కురు || 46

తత్ర పిండ ప్రదానేన ప్రేత భావా దహం సఖే | ముక్తస్తు సర్వదాత్రూణాం యస్యామి సహలోకతామ్‌ || 47

యదీయం ద్వాదశీపుణ్యా మాస ప్రౌష్ఠపదే సితా, బుధ శ్రవణ సంయుక్తా సాతిశ్రేయస్కరీ స్మృతా || 48

ఇత్యేవ ముక్త్వా వణిజం ప్రేతరాజోనుగై స్సహ, స్వనామాని యధాన్యాయం సమ్యగాఖ్యాతవాం చ్ఛుచిః || 49

ప్రేతస్కంధే సమారోప్య త్యాజితో మరు మండలమ్‌, రమ్యే శూరసేనాఖ్యే దేశే ప్రాప్తః స వై వణిక్‌ || 50

స్వకర్మ ధర్మ యోగేన ధన ముచ్చావచం బహు, ఉపార్జయిత్వా ప్రయ¸° గయా శీర్ష మనుత్తమమ్‌ || 51

పిండ నిర్వాపణం తత్ర ప్రేతానా మానుపూర్వశః, చకార స్వపితృణాం చ దాయాదానా మనంతరమ్‌ || 52

ఆత్మన శ్చ మహాబుద్ధి ర్మహాబోధ్యం తిలై ర్వినా, పిండనిర్వపణం చక్రే త ధా న్యా నపి గోత్రజాన్‌ || 53

మరణానంతరం నేను ప్రేతాన్నైనాను. నేను దానం చేసిన ఆ అన్నమే తింటున్నా. ఈ మహాప్రేతా లేవీ అలా దానం చేయ నందున నా అన్నం తిని జీవిస్తున్నారు. నేను దానం చేసిన జల కుంభం అన్న కుంభం రోజూ మధ్యాహ్న వేళకు యిలాగే వస్తాయి. నేను తిన నంతవరకు అక్షయంగా ఉంటాయి. నేను తిని నీరు త్రాగిన వెంటనే వెళ్ళిపోతాయి. నేను వెనుక దానం చేసిన గొడుగే ఈ జమ్మి వృక్షం నాకు నీడ యిస్తున్నది. నేను దానం చేసిన చెప్పులే ప్రేతాల రూపంలో నన్ను మోసికొని వెళ్లాయి. ఓ ధర్మజ్ఞా ! నా లోభి గుణాన్నీ, శ్రవణ ద్వాదశి వ్రత మహా ఫలాన్ని నీకు వివరించి చెప్పాను. ఇది ఎంతో పుణ్య వర్థకమైనది. ''ఆ మాటలు విని ఆ వణిజుడు యిలా అడిగాడు''-. దయచేసి నాకు భవిష్యత్‌ కర్తవ్యం కూడ చెప్పండి''. అంత నా ప్రేత పాలకు డిలా అన్నాడు - మిత్రమా ! వినుము. నీకూ నాకూ గూడ కల్యాణ కరమైన విషయం చెబుతున్నాను. అనేక తీర్థాలతో కూడిన గయా క్షేత్రానికి వెళ్ళి శుచిగా స్నానం చేసి నాపేరు చెప్పి పిండ ప్రదానం చేయుము. దానితో నాకు ప్రేత దేహ విముక్తి కలుగుతుంది. సర్వదాతలు ఉండే లోకాలకు పోతాను. ఇక ఈ భాద్రపద శుద్ధ బుధ శ్రవణా నక్షత్రంతో గూడిన ద్వాదశి వ్రతం ఆచరించినచో అనంత సుఖాలు కలుగుతాయి సుమా. ''అలా చెప్పి ఆ ప్రేత నాయకుడావణిజుని ప్రేత భుజాల మీద నెక్కించి ఆ ఎడారి దాటించి రమ్యమైన శూరసేన దేశానికి చేర్చాడు. అచట తన శక్తి సామర్థ్యంతో నావణిజుడు బాగా వ్యాపారం చేసి ధనం సంపాదించి పవిత్రమైన గయాశిరక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ప్రేత నాయకుడు చెప్పిన విధంగా అతనికీ అతని సహప్రేతాలకు నామ గోత్రాలతో ఆనుపూర్వికంగా పిండ ప్రదానం చేశాడు. తర్వాత తన పితృదేవతలకూ దాయాదులకు పిండ ప్రదానం చేసి ఆ బుద్ధిమంతుడు తిలలు లేకుండా తనకూ ఇతరులకు పిండదానం చేసుకున్నాడు.-

ఏవం ప్రదత్తే ష్వథ వై పిండేషు ప్రేత భావతః | విముక్తా స్తే ద్విజ! ప్రేతా బ్రహ్మ లోకం తతో గతాః || 54

స చాపి హి వణి క్పుత్రో నిజ మలయ మావ్రజత్‌, శ్రవణ ద్వాదశీం కృత్వా కాలధర్మ ముపేయివాన్‌ || 55

గంధర్వలోకే సుచిరం భోగాన్‌ భుక్త్వా సుదుర్గభాన్‌, మానుష్యం జన్మ మాసాద్య స బభౌ శాకలే విరాట్‌ || 56

స్వధర్మ కర్మ వృత్తిస్థః శ్రవణద్వాదశీరతః, కాల ధర్మ మవాప్యాసౌ గుహ్యకా వాస మాశ్రయత్‌ || 57

తత్రోష్య సుచిరం కాలం భోగాన్‌ భూక్త్వా థ కామతః, మర్త్య లోక మనుప్రాప్య రాజన్య తనయో భవత్‌ || 58

తత్రాపి క్షత్ర వృత్తిస్థో దాన భోగ రతో వశీ, గోగ్రహే రి గణాన్‌ జిత్వా కాల ధర్మ ముపేయివాన్‌,

శక్రలోకం స సంప్రాప్య దేవైః సర్వైః సుపూజితః || 59

పుణ్యక్షయాత్‌ పరిభ్రష్టః శాకలే సోభవ ద్విజః తతో వికట రూపోసే సర్వశాస్త్రార్థ పారగః || 60

వివాహయ ద్ద్విజసుతాం రూపేణా నుపమాం ద్విజ ! సాచమేనే చ భర్తారం సుశీల మపి భామినీ || 61

విరూప మితి మన్వానా తత స్సో భూ త్సుదుఃఖితః,

తతో నిర్వేద సంయుక్తో గత్వా శ్రమ పదం మహత్‌ || 62

ఇరావత్యాస్తటే శ్రీమాన్‌ రూపధారిణ మాసదత్‌, తమారాధ్య జగన్నాధం నక్షత్ర పురుషేణ హి || 63

సురూపతా మవాప్యాగ్ర్యాం తస్మి న్నేవ చ జన్మని, తతః ప్రియో భూద్‌ భార్యాయా

భోగవాంశ్చా భవ ద్వశీ || శ్రవణ ద్వాదశీ భక్తంః పూర్వాభ్యాసా దజాయత|| 64

ఏవం పురాసౌ ద్విజ పుంగవస్తు, సురూప రూపో భగవ త్ర్పసాదాత్‌ || 65

అనంగ రూప ప్రతిమో బభూవ, మృతశ్చ రాజా స పురూవో భూత్‌ || 66

ఇతి శ్రీ వామన పురాణ త్రి పంచాశోధ్యాయ సమాప్తః

ఓ నారదా ! అలా నా వర్తకుడు పిండ ప్రదానాలు చేసి నంతనే ఆ ప్రేతా లన్నీ ప్రేత యోని వదలి బ్రహ్మ లోకానికి వెళ్ళి పోయాయి. అతడు తన నగరానికి తిరిగి శ్రవణ ద్వాదశీ వ్రతాన్ని చేసి కాల ధర్మం చెందాడు. గంధర్వ లోకంలో చాల కాలం భోగాలనుభవంచి శాకల నగరంలో ఉత్తమమైన మానవ జన్మ పొందాడు. తన ధర్మాలు అనుష్ఠిస్తూ శ్రవణ ద్దాదశీ వ్రతాన్ని తప్పకుండా పాటిస్తూ దేహత్యాగం చేసి యక్షుడై యక్షలోకంలో అన్ని విధాల భోగాలు అనుభవించాడు. అనంతరం భూలోకంలో రాజునకు పుత్రుడై జన్మించి క్షాత్రధర్మం అనుష్ఠిస్తూ దాన భోగాసక్తుడై గోవులను విడిపించుటకై శత్రువులతో పోరాడి జయించి కాలం చేశాడు. అనంతరము యింద్ర లోకంలో దేవతల పూజ లందుకుంటా దుర్లభా లైన భోగా లనుభవించి పుణ్య క్షయం కాగా శాకలనగరంలో బ్రాహ్మణుడుగా జన్మించాడు. సర్వశాస్త్ర నిష్ణాతుడై ఒక ఉత్తమ సౌందర్య రాశి అయిన ద్విజ పుత్రికను పెండ్లాడు. చూచేందుకు వికారమైన రూపంతో ఉన్నందున ఆ కన్య విద్వాంసుడైన ఆ భర్తను ఏవగించుకుని అవమాననించుటతో చాలా దుఃఖించి అతడు యిరావతీ నదీ తటాన గల విష్ణుదేవుని ఆరాధించి అందమైన రూపాన్ని వరంగా పొందాడు. అచట నక్షత్ర పురుష వ్రత యుక్తంగా జన్మలో సుందరవిగ్రహుడై భార్యవద్దకు పోయి ఆమెతో సకల భోగాలూ అనుభవించాడు. పూర్వ జన్మ వాసనల వల్ల శ్రవణ ద్వాదశీ వ్రతాలు చేస్తూ ఆ ద్విజుడు కురూపియై కూడ భగవ త్కృప వల్ల మన్మధరూపుడై మరణానంతరం పురూరవుడై జన్మించాడు ||

ఇది శ్రీ వామన పురాణంలో ఏబది మూడవ అధ్యాయం సమాప్తం

Sri Vamana Mahapuranam    Chapters