Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ షష్ట చత్వారింశో%ధ్యాయః (46)

నారద ఉవాచ -

యదమీ భవతా ప్రోక్తా మరుతో దితిజోత్తమాః | తత్కేన పూర్వమాసన్‌ వై మరున్మార్గేణ? కథ్యతామ్‌ || 1

పూర్వమన్వంతరేష్వేవ సమతీతేషు సత్తమ!, కేత్వాసన్‌ వాయుమార్గస్థాస్తన్మే వ్యాఖ్యాతు మర్హసి|| 2

పులస్త్య ఉవాచ -

శ్రూయతాం పూర్వమరుతా ముత్పత్తిం కథయామి తే, స్వాయంభువం సమారభ్య యావన్మన్వంతరం త్విదమ్‌|| 3

స్వాయంభువస్య పుత్రో%భూన్మనో ర్నామ ప్రియవ్రతః, తస్యాసీ త్సవనో నామ పుత్రః త్రైలోక్య పూజితః|| 4

స చా నపత్యో దేవర్షే నృపః ప్రేతగతిం గతః తతో%రుద త్తస్య పత్నీ సుదేవా శోకవిహ్వలా|| 5

న దదాతి తదా దగ్ధుం సమాలింగ్య స్థితా పతిమ్‌, నాథ నాథేతి బహుశో విలపంతీ త్వనాథవత్‌|| 6

తా మంతరిక్షా దశరీరిణీ వాక్‌, ప్రోవాచ మా రాజ పత్నీహ రోదీః!

యద్యస్తి తే సత్య మనుత్తమం తదా త్వ భవత్వయం తే పతినా సహాగ్నిః || 7

సా తాం వాణీ మంతరిరక్షా న్నిశమ్య, ప్రోవాచేదం రాజపుత్రీ సుదేవా,

శోచామ్యేనం పార్ధివం పుత్రహీనం, నైవాత్మానం మందభాగ్య విహంగ!|| 8

సో%థాబ్రవీ న్మారుదస్వాయతాక్షీ!, పుత్రా స్త్వత్తో భూమి పాలస్య సప్త

భవిష్యంతి వహ్ని మారోహ శ్రీఘ్రం సత్యం ప్రోక్తం శ్రద్ధధత్స్వ త్వమద్య || 9

ఇత్యేవ ముక్త్వా ఖచరేణ బాలా, చితౌ సమారోప్య పతిం వరార్హమ్‌,

హుతాశ మాసాద్య పతివ్రతా తం, సంచింతయంతీ జ్వలనం ప్రపన్నా|| 10

తతో ముహూర్తా న్నృపతిః శ్రియా యుతః, సముత్తస్థౌ, సహితో భార్యయా%సౌ,

ఖ ముత్పపాతా థ స కామచారీ, సమం మహిష్యా చ సునాభపుత్ర్యా|| 11

తస్యాంబరే నారద! పార్థివస్య, జాతా రజోగా మహిషీ తు గచ్ఛతః,

స దివ్య యోగాత్‌ ప్రతిసంస్థితో%బరే, భార్యా సహాయో దివసాని పంచ|| 12

తతస్తు షష్ఠే%హని పార్థివేన, ఋతు ర్నవంధ్యో%ద్య భ##వే ద్విచింతయన్‌,

రరామ తన్వ్యా సహ కామచారీ, తతో%బరాత్‌ ప్రాచ్యవతాస్య శుక్రమ్‌|| 13

శుక్రోత్సర్గావసానేతు నృపతి ర్భార్యయా సహ జగామ దివ్యయా గత్యా బ్రహ్మలోకం తపోధన!|| 14

శ్రీ వామన పురాణంలో నలుబది యారవ అధ్యాయము

నారదుడు ప్రశ్నించాడు.

మహర్షే! దితి పుత్రులు మరుత్తులైనారని నీవు చెప్పి యున్నావు గదా. అయితే వారలు వాయుమార్గాన చరించుటకు కారణమేమి? వారలకు పూర్వపు మన్వంతరాలలో మరుత్తులుగా నున్న వారెవరు? ఈ వివరం నాకు తెలియ జేయుము. అందులకు పులస్త్యుడిలా చెప్ప సాగెను. నారదా! స్వాయంభు వ మనువు నుండి వర్తమాన కాలపు మనువు వరకు గల మన్వంతరాలలో మరుత్తులెవరెవ రుండిరో వివరంగా చెబుతున్నా వినుము. స్వాయంభువ మనుపు కుమారుడు ప్రియవ్రతుడు మనువు. అతని పుత్రుడు త్రిలోక పూజితుడు సవనుడు. ఆ సవనుడు అపుత్రకుడుగా మరణించగా నాతని భార్య సుదేవ శోకంతో బాధపడుతూ భర్త శరీరాన్ని దహనం చేయ నివ్వకుండా ఆ లింగనం చేసుకుని కూర్చుకున్నది. నాధా! నాధా అంటూ ఆ పతి పరాయణ విలపిస్తూండగా అంతరిక్షాన్నుంచి ఒక అశశీరవాణి వినిపించి"ఓ కల్యాణీ! ఏడువకుము. నీ పతి భక్తి నిజ మైనదైనచో నీ భర్తతో పాటు అగ్నిలో పడి పొమ్ము". అని ఆదేశించింది. ఆ అశరీరవాణి వైపునకు తిరిగి ఆ రాజపుత్రి సుదేవ, నేను నా కోసం విలపించడం లేదు. నా భర్త పుత్రహీనుడై నందులకే శోకిస్తున్నా నన్నది. అందుల కానభోవాణి, ఓ విశాలాక్షీ! ఏడువకుము. వెంటనే చితి నెక్కుము. నీకు నీ భర్తవలన ఏడుగురు పుత్రులు కలుగుతారు.ఇది సత్యం. నా మాట మీద నమ్మక ముంచి వెంటనే అగ్ని నారోహించుమని మరల బలికినది. అది విన్నంతనే ఆ బాలిక తన భర్త పవిత్ర శరీరాన్ని చితి మీద పెట్టి భర్తనే ధ్యానిస్తూ దాని మీద కూర్చోని తగులబడి పోయింది. అనంతరం ముహూర్త కాలంలో ఆ రాజు భార్యతో కూడ లేచి ఆకాశాని కెగిరిపోయాడు. అక్కడ కామగమనంతో ఆ సునాభ కుమార్తె అయిన సుదేవతో తిరుగుతుండగా నామె ఋతుమతి (బహష్టు) అయంది. అంత తన దివ్య శక్తి వల్ల భార్యా సహితుడై ఆ నృపతి ఆకాశంలోనే అయిదు దినాలుండి పోయాడు. ఆరవనాడు ఋతుస్నానం చేసిన తర్వాత ఆ ఋతుస్రావం వ్యర్థం కాకూడదని తెలిసికొన్న ఆ రాజు ఆ సుందరితో యదేచ్ఛగా సమాగమం కావించాడు. ఫలితంగా నాతనికి వీర్యస్ఖలమై ఆ శుక్రం భూమి మీద పడి పోయింది. ఓ తపోధనా! శుక్రం అలా జారి పడిపోగానే ఆ రాజు సపత్నీకుడై దివ్యగమనంతో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు -14.

తదాంబరాత్ర్పచలిత మభ్రవర్ణం శుక్రం సమానా నళినీ వపుష్మతీ| చిత్రా విశాలా హరితా ళినీచ, సప్తర్షి పత్న్యో దదృశు ర్యథేచ్ఛయా|| 15

తద్దృష్ట్వా పుష్కరే న్యస్తం ప్రయచ్ఛంత తపోధన!, మన్య మానా స్తదమృతం సదా ¸°వన లిప్సయా|| 16

తతఃస్నాత్వా చ విధివత్‌ సంపూజ్య తాన్‌ నిజాన్‌ పతీన్‌ | పతిభిః సమనుజ్ఞాతాః పపుః పుష్కర సంస్థితమ్‌|| 17

తచ్ఛుక్రం పార్థివేంద్రస్య మన్యమానా స్తదా%మృతమ్‌, పీతమాత్రేణ శుక్రేణ పార్థింవేంద్రోద్భవేన తాః || 18

బ్రహ్మతేజో విహీ నాస్తా జాతాః పత్న్యస్తపస్వినామ్‌, తతస్తు తత్యజుః సర్వే సదోషా స్తాశ్చ పత్నయః|| 19

సుషుపుః సప్త తనయాన్‌ రుదంతో భైరవం మునే ! తేషాం రుదిత శ##బ్దేన సర్వ మాపూరితం జగత్‌|| 20

అథా జగామ భగవాన్‌ బ్రహ్మలోక పితామహః, సమభ్యేత్యా%బ్రవీద్బాలాన్‌ మారుదధ్వం మహాబలాః|| 21

మరుతో నామ యూయం వై భవిష్యధ్వం వియచ్చరాః, ఇత్యేమముక్త్వా దేవేశో బ్రహ్మలోకంపితామహః|| 22

తానాదాయ వియచ్చారి మారుతా నాదిదేశ హ, తేత్వాసన్‌ మరుతస్త్వాద్యో మనోః స్వాయం భువే%తరే|| 23

స్వారోచిషేతు మరుతో వక్ష్యోమి శ్రుణు నారద |, స్వారోచిషస్య పుత్రస్తు శ్రీ మానాసీత్‌ క్రతుధ్వజః|| 24

తస్యపుత్రా భవన్‌ సప్త సప్తార్చిః ప్రతిమా మునే, తపో%ర్ధంతే గతాః శైలం మహామేరుం నరేశ్వరాః || 25

ఆరాధయంతో బ్రహ్మాణం పద మైంద్ర మథే ప్సవః , తతో విపశ్చిన్నామాధ సహస్రాక్షో భయాతురః|| 26

పూతనా మప్సరోముఖ్యాం ప్రాహ నారద! వాక్యవిత్‌, గచ్ఛస్వ పూతనే శైలం మహామేరుం విశాలినమ్‌ || 27

తత్ర తప్యంతి హి తపః ఋతధ్వజ సుతా మహత్‌, యథా హి తపసో విఘ్నం తేషాం భవతి సుందరి|| 28

తథా కురుష్వ మా తేషాం సిద్ధి ర్భవతు సుందరి!, ఇత్యేవముక్తా శ##క్రేణ పూతనా రూపశాలినీ|| 29

తత్రా జగామ త్వరితా యత్రా తప్యంత తే తపః, ఆశ్రమస్యావిదూరే తు నదీ మందోద వాహినీ|| 30

అలా ఆకాశం నుండి జారిన, ఆకాశ వర్ణపు శుక్రాన్ని సమాన, నళిని, వపుష్మతి, చిత్ర, విశాల, హరిత, అళిని అనే సప్తర్షుల భార్యలు కోరికతో దర్శించారు. అది ఒక పద్మంలో పడి యుండగా దానిని అమృతమని భ్రమించారు. ఓ తపోధనా! ఆ ఋషిపత్నులు ఎల్లప్పుడూ జవ్వనులుగా ఉండాలనే కోరకతో అమృతమని భ్రమపడి ఆ రాజు శుక్రాన్ని త్రాగవలె నని నిశ్చయించు కున్నారు. ఆ విషయం వారలు తమ భర్తలతో చెప్పి వారి అనుమతితో యధావిధిగా స్నానాలు చేసి భర్తలను పూజించి కమలంలోని ఆ శుక్రాన్ని ఏడుగురూ త్రాగారు. పార్థివేంద్రుని ఆ శుక్రాన్ని త్రాగినంతనే ఆ తపస్వుల భార్యలు తమ బ్రహ్మతేజాన్ని కోల్పోయారు. ఆ విధంగా దూషిత శీలలైన తమ భార్యలను వారేడుగురు వదలి వేశారు. ఆ ముని పత్ను లేడుగురు కుమారులను కన్నారు. ఆ ఏడుగురు శిశువులు భయంకరంగా రోదించారు. వారి ఏడుపు ధ్వనులతో జగత్తంతా నిండి పోయింది. అంతట నచటకు లోక పితామహుడు బ్రహ్మ వచ్చి రోదించుచున్న నా బాలురతో ఓ మహాబలులారా! ఏడువకు డేడువకుడు. మీరు మరుత్తులనే పేరుతో ఆకాశగాము లౌతారు. అని చెప్పి వారలను తనతో గొని పోయి మరుత్తులుగా ప్రకటించాడు. వార లోనారదా! స్వాయంభువ మన్వంతరాన వెలసిన ఆది మరుత్తులు. ఇక స్వారోచిష మన్వంతరం లోని మరుత్తుల కథ వినుము. స్వారోచిష మనుపుత్రుడు శ్రీమంతుడగు క్రతుధ్వజుడు. అతనికి అగ్ని సమానులైన కుమారు లేడుగురు గలిగారు. వారలు తపస్సుగావించుటకై మహామేరు గిరికి వెళ్లారు. ఇంద్రపదవిని కాక్షించి వారు బ్రహ్మను గూర్చి తపించుట ఎరిగి సహస్రాక్షుడు యింద్రుడు భయపడి అప్సరసల్లో శ్రేష్ఠురాలైన పూతనను చూచి యిలా అన్నాడు. ఓ సుందరీ! పూతనా! నీవు వెంటనే మహామేరు శైలానికి వెళ్లుము. అక్కడ క్రతుధ్వజుని కుమారులు కఠోర తపస్సు చేస్తున్నారు. నీకు తోచిన యుక్తులన్నీ ప్రయోగించి వారలకు తపోవిఘ్నం కలిగించి రమ్ము. నీకు సిద్ధి కలుగు గాక. ఇంద్రుని ఆదేశాన్ని తల దాల్చి ఆ రూపశాలిని అయిన పూతన త్వరగా నా రాజకుమారులు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వెళ్లినది. వారల అశ్రమానికి దగ్గరగా నొక నది మెల్లగా ప్రవహిస్తోంది -30

తస్యాం స్నాతుం సమాయాతాః సర్వ ఏవ సహెదరాః, సా%పి ప్నాతుం సుచార్వంగీ త్వవతీర్ణా మహానదీమ్‌ | 31

దదృశు స్తేనృపాః స్నాతాం తతు శ్చుక్షుభిరే మునే!, తేషాం చ ప్రాచ్యవ చ్ఛుక్రం తత్పపౌ జలచారిణీ|| 32

శంఖినీ గ్రాహ ముఖ్యస్య మహాశంఖస్య వల్లభా, తే| పి విభ్రష్టతపసో జగ్మూ రాజ్యం తు పైతృకమ్‌|| 33

సా చా%ప్సరాః శక్రమేత్య యాథా తథ్యం న్యవేదయత్‌, తతో బహు తిథే కాలే సా గ్రాహీ శంఖరూపిణీ|| 34

సముద్ధృతా మహాజాలై ర్మత్స్యబంధేన మానినీ, స తాం దృష్ట్వా మహా శంఖీం స్థలస్థాం మత్స్య జీవకః|| 35

నివేదయామాస తదా క్రతుధ్వజ సుతేషు వై, తథా%భ్యేత్యమహాత్మానో యోగినో యోగ ధారిణః|| 36

నీత్వా స్వమందిరం సర్వే పురవాప్యాం సముత్ర్సుజన్‌, తతః క్రమా చ్ఛంఖినీ సా సుషువే సప్త వై శిశూన్‌|| 37

జాతమాత్రేషు పుత్రేషు మోక్షభావ మగా చ్చ సా, అమాతృ పితృకో బాలా జల మధ్య విహారిణః|| 38

స్తన్యార్థినో వై రురుదుః అథా భ్యాగా త్పితామహః, మా రుదధ్వ మితీత్యాహ మరుతో నామ పుత్రకాః|| 39

యూయం దేవా భవిష్యధ్వం వాయు స్కంధవిచారిణః ఇత్యేవ ముక్త్వా ధాదాయ సర్వాస్తాన్‌ దైవతాన్‌ ప్రతి|| 40

నియోజ్య చ మరు న్మార్గే వైరాజం భవనం గతః, ఏవమాసంశ్చ మరుతో మనోః స్వారోచిషేం%తరే|| 41

ఉత్తమే మరుతో యే చ తాం ఛృణుష్వ తపో ధన, ఉత్తమస్యాన్వవాయే తు రాజాసీ న్నిషధాధిపః || 42

వపుష్మా నితి విఖ్యాతో వపుష్మాన్‌ భాస్కరోపమః, తస్య పుత్రో గుణశ్రేష్ఠో జ్యోతిష్మాన్‌ ధార్మికో %భవత్‌|| 43

స పుత్రార్థీ తప స్తేపే నదీం మందాకినీ మను, తస్య భార్యా చ సుశ్రోణీ దేవాచార్య సుతా శుభా|| 44

తపశ్చరణ యుక్తస్య బభూవ పరిచారికా, సా స్వయం ఫల పుష్పాంబు సమిత్కుశం సమాహరత్‌|| 45

చకార పద్మపత్రాక్షీ సమ్య క్చాతిథి పూజనమ్‌, పతిం శుశ్రూషమాణా సా కృశా ధమనిసంతతా|| 46

తేజోయుక్తా సుచార్వంగీ దృష్టా సప్తర్షిభి ర్వనే, తాం తథా చారు సర్వాంగీం దృస్ట్వా%థ తపసా కృశామ్‌ || 47

పప్రచ్ఛు స్తపసో హేతుం తస్యాస్తద్‌ భర్తు రేవ చ || సా%బ్రవీ త్తనయార్థాయ ఆవాభ్యాం వై తపః క్రియా|| 48

తే చాసై#్య వరాద బ్రహ్మన్‌ జాతా సప్త మహర్షయః, వ్రజధ్వం తనయాః సప్త భవిష్యంతి న సంశయః|| 49

యువయో ర్గుణ సంయుక్తా మహర్షీ ణా ప్రసాదతః | ఇత్యేవ ముక్త్వా జగ్ము స్తే సర్వ ఏవ మహర్షయః|| 50

ఆ ఏడుగురు సోదరులూ స్నానార్థం నదికి వెళ్లగా నదే వేళకు చక్కని అంగసౌష్టవంతో అలరారే ఆ అప్సర కూడా నీళ్లలో దిగి స్నానం మొదలు పెట్టింది. ఆవిడ స్నాన సౌందర్యాన్ని చూడగానే ఆ రాకుమారు లందరు మనస్సులు వికారానికి లోనై వారల వీర్యం స్ఖలనమై నీటిలో పడిపోయింది. దానిని ఆ నీటిలో నివసిస్తున్న మహాశంఖుడనే మకరి (మొసలి) భార్య శంఖిని మ్రింగివేసింది. అంతట వారు తపోభ్రష్టులై తమ రాజ్యానికి తిరిగి వెళ్లారు. ఆ పూతన ఇంద్రుని వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పి వెళ్లిపోయిది.తర్వాత బహుదినాల కాశంఖరూపంలో ఉన్న ఆమె మొసలి జాలరి వాండ్ల పెద్ద వలలో చిక్కిపోయింది. వారా విలక్షణమైన మొసలిని బయట పడవేసి ఆ విషయం క్రతుధ్వజుని కుమారులకు నివేందిచారు. యోగులైన ఆ మహాత్ములందరూ ఆలోచించుకొని దానిని తమ గృహావరణం లోని బావిలోనికి వదిలారు. తర్వాత క్రమంగా ఆ శంఖిని ఏడుగురు శిశువులను కని వెంటనే దేహత్యాగం కావించింది. తలిదండ్రులు లేక స్తన్యపానం కోసం బావిలో బిగ్గరగా రోదిస్తున్న ఆ బాలుర వద్దకు పితామహుడు వచ్చి, పుత్రులారా! ఏడవకండి. మీ రిప్పటినుంచీ మరుత్తులనే పేరుతో వాయుస్కంధాల మీద సంచరిస్తూ దేవతలు అవుతారు. అని చెప్పి వారలను తనలో కొనిపోయి వాయు మార్గాన వదలి తన లోకానికి వెళ్లిపోయాడు. ఈ విధంగా స్వారోచష మన్వంతరంలో మరుత్తులు వెలిశారు. ఓ తపోధనా! ఇక ఉత్తముడు మనువుగా నున్న కాలంలోని మరుత్తుల జన్మ విధానం చెబుతున్నా వినుము. ఉత్తమ మన్వంతరంలో నిషధ దేశాధిపతి వపుష్మాను డను వాడు సూర్యకాంతితో రాజ్య మేలేవాడు. అతనికి గుణవంతుడూ ధార్మికుడు నైన పుత్రుడు "జ్యోతిష్మంతు" డను వాడు కలడు. అతడు పుత్రుల కొరకై మందాకినీ నదీ తీరాన తపస్సు చేస్తూండగా నతని భార్య, దేవగురువు పుత్రిక యైన సుందరి కూడా భర్తకు పరిచర్య చేస్తూ తపో జీవనం గడప సాగింది. ఫల పుష్ప సమిధలు సమకూర్చుతూ అతథి సత్కారాలు చేస్తూ అరణ్యవాసం వాల్ల నామె కృశించి శల్యమై పోయింది. తపస్తేజంతో వెలిగిపోతూ వనంలో తిరుగుతూ ఉన్న ఆమె నొకపరి సప్తర్షులు చూచి, ఈ కావనంలో యిలా కఠోర తపస్సు చేయుటకు కారణ మేమని ప్రశ్నించారు. అందులకా యల్లాలు తనూ తన భర్త తనయుల కొరకై తపో దీక్షలో ఉన్నామని చెప్పగా వారలు కరుణించి అమ్మా! మీరింటికి వెళ్లిపోండి. మీకు ఏడుగురు కుమారులు కలిగెదరు. మీ సద్గుణాలకు మా అనుగ్రహం తోడై మీ కోరక నెరవేరుతుంది. సందియము లేదని వరమిచ్చి వెళ్లిపోయారు -50.

స చా పి రాజర్షి రగాత్‌ సభార్యో నగరం నిజమ్‌, తతో బహుతిథే కాలే సా రాజ్ఞో మహిషీ ప్రియా|| 51

అవాప గర్భం తన్వంగీ తస్మా న్నృపతి సత్తమాత్‌, గుర్విణ్యా మథ భార్యాయాం మమారా సౌ నరాధిపః|| 52

స చాప్యారోఢు మిచ్ఛంతీ భర్తారం వై పతివ్రతా, నివారితా తదామ త్యై ర్న తథాపి వ్యతిష్ఠత|| 53

సమారోప్యాథ భర్తారం చితాయా మారుహచ్చ సా, తతో%గ్ని మధ్యా త్స లిలే మాంస పేశ్యపత న్మునే || 54

సా%భసా సుఖశీతేన సంసిక్తా సప్త ధా% భవత్‌, తే%జాయంతా థ మరుత ఉత్తమస్యా ంతరే మనోః|| 55

తామసస్యాంతరే యే చ మరుతో ప్యభవన్‌ పురా, తా నహం కీర్తయిష్యామి గీత నృత్య కవిప్రియః|| 56

తామసస్య మనోః పుత్రో ఋతుధ్వజ ఇతి శ్రుతః, స పుత్రార్థీ జుహా వాగ్నౌ స్వమాంసం రుధిరం తథా|| 57

అస్థీని రోమ కేశాంశ్చ స్నాయు మజ్జా యకృద్ఘనమ్‌ || శుక్రం చ తిత్రగౌ రాజా సుతార్థీ ఇతి నః శ్రుతమ్‌|| 58

సప్త స్వేవార్చిషు తతః శుక్ర పాతా దనంతరమ్‌, మా మాక్షిప స్వేత్య భవ చ్ఛబ్దః సో%పి మృతో నృపః|| 59

తత స్తస్మా ద్ధుతవహాత్‌ సప్త తత్తేజసోపమాః, శిశవః సమజాయంత తే రుదంతో%భవ న్మునే|| 60

తేషాం తు ధ్వని మాకర్ణ్య భగవాన్‌ పద్మసంభవః, సమాగమ్య నివార్యాథ స చక్రే మరుతః సుతాన్‌|| 61

తే త్వాసన్‌ మరుతో బ్రహ్మం స్తామసే దేవతా గణాః|| 61

అంతట నా రాజర్షి భార్యతో నగరానికి తిరిగి వెళ్లి పోయాడు. తదుపరి చాలా దినాల కారాజు భార్య భర్త వలన గర్భం ధరించింది. ఆవిడ గర్భిణిగా ఉండగానే ఆ రాజు మృతుడైనాడు. ఆ పతివ్రత అమాత్యులు వలనదని ఎంత బ్రలిమాలినా అంగీకరిచక భర్త దేహాన్ని చితిపై నుంచి తాను గూడ చితాగ్నలో దుమికింది. ఓ మహర్షీ! అంతట నామె గర్భంలో నుండి ఒక మాంస ఖండం ఎగిరి వచ్చి బయట నీళ్లలో పడి ఆ శైతల్యానికి ఏడు భాగాలుగా ఆమెను అందులో నుంచి ఉత్తముని మన్వంతరంలో మరుత్త లుద్భవించారు. ఆ ఉత్తముని భ్రాత తామనుని మన్వంతరంలో మరుత్తులుగా జన్మించిన గాథ ఓనారదా! శ్రద్ధగా వినుము. "ఋతుధ్వజు"డను పేర విఖ్యాతుడైన తామస మనువు కుమారుడు తనయుల కోసమై యజ్ఞం మొదలు పెట్టి అగ్నితో తన రక్తమాంస అస్థి రోమ కేశ స్నాయువులు మజ్జా యకృత్తూ చక్కన అగు శుక్రం అన్నీ హోమం చేశాడు. వీర్యం అగ్నిలో బడుతూండగా "వద్దు వద్దు శుక్రం వ్రేల్చ వద్ద" నే శబ్దం బయలు వెడలిన వెంటనే ఆ రాజు మృతుడై పోయాడు. అంతట ఆ హవ్యవాహనుడి నుండి ఆయన లాంటి తేజస్సుతో వెలుగుతూ ఏడుగురు శిశువులు రోదిస్తూ బయట పడ్డారు. వారల ఏడుపు విని పద్మభవుడు వచ్చి, ఏడ్పు మాన్పించి వారలను 'మరుత్తు"లను గావించాడు. ఆ విధంగా తామస మన్వంతరంలో మరుద్దేవ గణాలు వెలిశారు - 61

యే%భవన్‌ రైవతే తాంశ్చ శృణుష్వ త్వం తపోధన!|| 62

రైవతస్యాన్వవాయే తు రాజాడీద్రిపుజిద్వశీ, రిపుజి న్నామతః ఖ్యాతో న తస్యాసీ త్సుతః కిల|| 63

న సమారాధ్య తపసా భాస్కరం తేజసాం నిధిం, అవాప కన్యాం సురతిం తాం ప్రగృహ్య గృహం య¸°|| 64

తస్యాం పితృ గృహే బ్రహ్మన్‌ ! వాసంత్యాం స పితా మృతః, సా%పి దుఃఖ పరీతాంగి స్వాం తనుం త్యక్తు ముద్యతా|| 65

తత స్తాం వారయామాసు రృషయః సప్త మానసాః, తస్యా మాసక్త చిత్తాస్తు సర్వ ఏవ తపోధనాః|| 66

అపారయంతీ తద్దుఃఖం ప్రజ్వాల్యాగ్నిం వివేశ హ, తే చాపశ్యంత ఋషయ స్తచ్చతా భావితా స్తథా|| 67

తా మృతాం మునయో దృష్ట్వా కష్టం కష్టేతి వాదినః, ప్రజగ్ముర్జ్వలనా చ్చాపి సప్తా జాయంత దారకాః|| 68

తే చ మాత్రా వినా భూతా రురుదు స్తాన్‌ పితామహః , నివారయిత్వా కృతవాం ల్లోకనాధో మరుద్గణాన్‌|| 69

రైవతస్యాంతరే జాతా మరుతో%మీ తపోధన!, శ్రుణుష్వ కీర్తయిష్యామి చాక్షుషస్యాంతరే మనోః|| 70

ఆసీ న్మంకి రితి ఖ్యాత స్తపస్వీ సత్యవాక్‌ శుచిః, సప్త సారస్వతే తీర్థే సో%తప్యత మహత్తపః|| 71

విఘ్నార్థం తస్య తుషితా దేవాః సంప్రేషయన్‌ వపుమ్‌, సా చాభ్యేత్య నదీతీరే క్షోభయామాస భామినీ|| 72

తతో%స్య ప్రాచ్యవ చ్ఛుక్రం సప్త సారస్వతే జలే, తాం చైవాప్యశపన్‌ మూఢాం ముని ర్మంకణకో వపుమ్‌ || 73

గచ్ఛ లబ్ధా%సి మూఢే! త్వం పాపస్యాస్య మహత్పలమ్‌| విధ్వంసయిష్యతి హయో భవతీం యజ్ఞ సంసది|| 74

ఏవం శప్త్వా ఋషిః శ్రీమాన్‌ జగామాథ స్వమాశ్రమమ్‌, సరస్వతీభ్యః సప్తభ్యః సప్త తే మరు తో%భవన్‌|| 75

ఏత త్తయోక్తా మరుతః పురా యథా జాతా వియద్వ్యాప్తికరా మహర్షే!, యేషాం శ్రుతే -జన్మని పాపహాని ర్భవేచ్ఛ ధర్మాభ్యుదయో మహాన్‌ వై|| 76

ఇతి శ్రీ వామన పురాణ షట్‌ చత్వారింశో|ధ్యాయః||

ఇక రైవత మన్వంతరంలోని మరుత్తుల జన్మ ప్రకారం వినుము. రైవతుని వంశంలో శత్రు భయంకరు డగు రిపుజిత్తనే రాజు గలడు. అతనికి పుత్రులు కలుగక పోగా తేజోనిధి అయిన భాస్కరుని ఉపాసించి "సురతి" అను పుత్రకను పొంది యింటికి గొనిపోయెను. తండ్రి యింటిలో ఆ బాలిక పెరుగుతుండగా నా రిపుజత్తు మరణించెను. పితృవియోగం సహించ లేక ఆ బాలిక దేహ త్యాగానికి ఉద్యుక్తురాలైంది. అంత బ్రహ్మ మానస పుత్రులైన సప్తర్తర్షు లామెను నివారించిరి. ఇతర తపస్వులు గూడ ఆమె పై నెంతయో వాత్సల్యం కలిగియుండిరి. అయిననూ ఆమె ఆ దుఃఖ సాగరం భరించలేక చితి పేర్చుకొని అందులో దగ్ధమై పోయింది. ఆ దృశ్యం చూచి, ఆమె నభిమానించిన ఋషు లందరూ అయ్యో!ఎంతకష్టం ! అని ఆక్రోశించారు. తగులబడుతున్న ఆమె శరీరాగ్ని నుండి ఏడుగురు బాలకు లుద్భవించారు. తల్లిని కోల్పోయి ఏడ్చుచున్న వారలను నిరించి లోకపతి అయిన బ్రహ్మ మరుద్గణాలనుగా నియమించాడు. ఓ నారదా! వారే రైవత మన్వంతరంలోని మరుత్తులు. ఇక చాక్షుష మన్వంతరం లోని మరుత్తుల వృత్తాంతమువినుము. ఆ కాలంలో సప్త సారస్వత తీర్థంలో సత్యవాది, శుచివ్రతుడు అయిన మంకియను తపోధనుడు ఘోర తపస్సులో నుండగా దానకి విఘ్నం కలిగించుటకై తుషితదేవతలు "వపు"వనే సుందరిని నియోగించారు. ఆ భామిని నదీ తీరాన చేరి ఆయనకు మనోవికారం కలుగజేయగా ఆయన శుక్రం జారిసప్త సారస్వత జలాల్లో పడిపోయింది. అందుల కాగ్రహెదగ్రుడై ఆ మంకణకు డావపును చూచి కలుగ జేయగా ఆయన శుక్రం జారిసప్త సారస్వత జలాల్లో పడిపోయింది. అందుల కాగ్రహెద్రగుడై ఆ మంకణకు డావపును చూచి గర్జిస్తూ ఓసీ! మూర్ఖురాలా! నీ పాపానికి ఫలం తప్పక అనుభవించుము. పో పో ! నిన్ను యజ్ఞ సభా వేదిక వద్ద నుండగా నొక గుర్రం నాశనం చేస్తుంది.' అని శపించాడు. అనంతరం మా ఋషి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. ఆ సప్త సారస్వతీ జలంలో నుంచి ఏడుగురు మరుత్తులు జన్మించారు. ఓ నారదా! ఈ విధంగా పూర్వమన్వంతరాలలో ఆకాశ వ్యాపకులైన మరుత్తు లెలా జన్మించినదీ నీకు విపులంగా వివరించాను. వీరల జన్మ గాథ శ్రవణం పాప పరిహారం కలిగించి ధర్మాభ్యుదయం చేకూర్చ గలదు - 56.

ఇది శ్రీ వామన పురాణంలో నలభై యారవ అధ్యాయము ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters