Sri Vamana Mahapuranam    Chapters   

ముప్పది తొమ్మిదవ అధ్యాయము

దండక ఉవాచ :

ఏతస్మిన్నంతదేబాలే యక్షసురసుతే శుభే | సమాగతే హరంద్రష్టుం శ్రీకంఠయోగినాం వరమ్‌. 1

దదృశాతే పరిమాన సంశుష్కకుసుమ విభుమ్‌ | బహునిర్మాల్య సమయుక్త గతేతస్మిన్‌ ఋతధ్వజే. 2

తతస్తంవీక్ష్య దేవేశం తేఉభే అపికన్యకే | స్నాపయేతాం విధానేన పూజయేతా మహర్నిశమ్‌. 3

తాభ్యం స్తితాభ్యాంతత్రైవ ఋషిరభ్యాగమద్వనమ్‌ | ద్రుష్టుం శ్రీ కంఠమవ్యకతం గాలవోనామ నామతః. 4

సదృష్ట్వా కన్యకాయుగ్మం కస్యేదమితి చింతయన్‌ | ప్రవివేశశుచిః స్నాత్వా కాళింద్యా విమలేజలే. 5

తతో7ను పూజయామాస శ్రీకంఠంగాలవోమునిః | గాయేతేసుస్వరం గీతం యక్షాసురసుతేతతః. 6

తతః స్వరం సమాకర్ణ్య గాలవస్తే అజానత | గంధర్వకన్యకే చైతే సందేహోనాత్ర విద్యతే. 7

సంపూజ్య దేవమీశానం గాలవస్తు విధానతః | కృతజప్యః సమధ్యాస్తే కన్యాభ్యా మభివాదితః. 8

తతః ప్రవచ్ఛసమునిః కన్యకేకస్య కథ్యతామ్‌ | కులాలంకార కరణ భక్తియుక్తే భవస్యహి. 9

తమూచతుర్మనిశ్రేష్ఠం యథాతథ్యం శుభాననే | జాతోవిదితవృత్తాంతో గాలవస్తపతాంవరః. 10

సముష్య తత్రరజనీం తాభ్యాం సంపూజితోమునిః ప్రాతరుత్థాయ గౌరీశం సంపూజ్యచ విధానతః 11

తేఉపేత్యాబ్రవీద్యాస్యే పుష్కరారణ్య ముత్తమమ్‌ | అమంత్రయామి వాంకన్యే సమనుజ్ఞాతు మర్హథః 12

తతస్తేఊచతుర్బ్రహ్మన్‌ దుర్లభం దర్శనంతవ| కిమర్థం పుష్కరారణ్యం భవాన్‌ యాస్యత్యథాదరాత్‌. 13

తేఉవాచ మహాతేజా మహత్కార్య సమన్వితః | కార్తికీపుణ్యదా భావి మాసాంతే పుష్కరేషుహి. 14

తేఊచతుర్వయం యాయో భవాన్‌ యత్రగమిష్యతి |

నత్వయాస్మవినా బ్రహ్మన్‌ ఇహస్థాతుం హిశక్నువః. 15

దండకుడన్నాడు : ఓ బాలా ! ఆ లోపల యోగయోగీశ్వరుడైన శ్రీ కంఠేశ్వరుని దర్శనానికై ఆ యక్ష అసుర కన్యకలు ఆలయానికి వెళ్ళారు. అక్కడ వారల వాడిపోయిన పూజ అక్షతాదులతో నిర్మాల్యంతో నిండియున్న స్వామి లింగాన్ని దర్శించారు. ఆది ఋతధ్వజుడు కావించిన పూజా నిర్మాల్యం . అంత నా కన్య లిద్దరూ నిర్మాల్యం తొలగించి విధిపూర్వకంగా అభిషేకం చేసి రాత్రింబవళ్ళు అర్చన గావించారు. వారక్కడ అలా ఉండగా నొకనాడు అవ్యక్తమూర్తియగునా శ్రీ కంఠదేవుని దర్శించడానికి గాలవుడను మహర్షి వచ్చాడు. ఆ బాలిక లిర్వురను చూచి యాముని వీరెవ్వరి కుమార్తెలోయని అనుకుంటూ స్నానం చేయడానికి కాళిందిలో దిగాడు. స్నానానంతరం ఆ ముని పూజ చేస్తూండగా నా కన్యలిరువురు కమనీయంగా భగవంతుని గుణానుగానం చేశారు. వారి మధురగానం విని గంధర్వ కామినులని నిశ్చయించుకున్నాడు. జపతప పూజాదులు సక్రమంగా నెరవేర్చిన అనంతరం ఆ కన్యలిద్దరూ ఆ మునికి నమస్కరించారు. అంతట నాముని, శివభక్తి సమేతలై మీమీ వంశాలకు అలంకారాలుగా వెలిగే మీరలెవరి బిడ్డలమ్మా అని ప్రశ్నించాడు. అంతట నో చంద్రముఖి ! ఆ బాలికలు తమతమ గాథలు ఉన్నవి ఉన్నట్టుగా వివరించి చెప్పారు. అదివిన్న ఆగాలవుడా రాత్రి యచటనే ఉండి మరునాడుదయం మరల శివుని అర్చించి వారలతో నేను పుష్కరారణ్యానికి వెళ్తున్నానని చెప్పాడు. అంతట నా యక్ష సురపుత్రికలు చేతులు జోడించుకొని మహాత్మా ! మీబోటి వారలదర్శనం దుర్లభం. పుష్కరారణ్యానికి మీరెందులకు వెళ్తున్నారు. అని అడిగారు. అందులకా తేజస్వి, రాబోవు నెలలో కార్తీక పూర్ణిమా పర్వం పుష్కరారణ్యంలో వైభవంగా జరుగుతుంది. అందుకోసం వెళ్తున్నానని చెప్పగా నా యువతలు మహానుభావా ! మేముగూడా మీవెంట వచ్చెదము. దయచేసికొనిపొండు. మిమ్ము విడచి యిక్కడ యిక ఉండలేమని ప్రార్థించారు.

బాఢమహా ఋషిశ్రేష్ఠ స్తతోనత్వా మహేశ్వరమ్‌ | గతేతేఋషితా సార్థం పుష్కరారణ్య మాదరాత్‌. 16

తథా7న్యే ఋషయస్తత్ర సమాయాతాః సహస్రశః | పార్థివాజొన పద్యాశ్చ ముక్త్వైకం తమృతధ్వజమ్‌. 17

తతః స్నాతాశ్చకార్తిక్యా మృషయః పుష్కరేష్వథ | రాజానశ్చ మహానుభాగా నాభాగేక్ష్వాకు సంయుతాః. 18

గాలవో7పి సమంతాభ్యాం కన్యకాభ్యామవాతరత్‌ | స్నాతుం నపుష్కరేతీర్థే మధ్యమే ధనుషాకృతౌ. 19

నిమగ్నశ్చాపి దదృశే మహా మత్స్యం జలేశయమ్‌ |

బహ్వీభిర్మత్ప్య కన్యాభిః ప్రీయమాణం పునఃపునః. 20

సతాశ్చాహతిమిర్ముగ్ధాః యూయంధర్మం నజానథ | జనాపవాదం హోరంహి నశక్తః సోడుముల్భణమ్‌. 21

తాస్తమూచుర్మహామత్స్యం కింనపశ్యసి గాలవమ్‌ | తాపసంకన్యకాభ్యాంవై విచరంతం యథేల్చయా. 22

యద్యసావపి ధర్మాత్వా నబిభేతి తపోధనః | జనాపవాదాత్‌ తత్కింత్వం బిభేషిజల మధ్యగః 23

తతస్తాశ్చాహా సతిమిర్నైషవేత్తి తపోధనః | దాగాంధోనాపిచ భయం విజానాతి సుబాలిశః. 24

తచ్ఛ్రుత్వా మత్స్యవచనం గాలవోవ్రీడయాయుతః | నోత్తతారనిమగ్నో7పి తస్థౌన విజితేంద్రియః. 25

స్నాత్వాతే అపిరంభోరూ సముత్తీర్యతటేస్థితే | ప్రతీక్షంత్యౌమునివరం తద్దర్శన సముత్సుకే. 26

వృత్తాచ పుష్కరేయాత్రా గతాలోకాయథాగతమ్‌ | ఋషయః పార్థివాశ్చాన్యే నానాజాన పదాస్తదా. 27

తత్రస్థితైకాసుదతీ విశ్వకర్మతనూరుహా | చిత్రాంగదాసుచార్వంగీ వీక్షంతీతను మధ్యమే. 28

తేస్థితేచాపి వీక్షంత్యౌ ప్రతీక్షంత్యౌచగాలవమ్‌ | సంస్థితే నిర్జనేతీర్థే గాలవో7ం తర్జలేతథా. 29

తతో7భ్యాగా ద్వేదవతీ నామ్నా గంధర్వకన్యకా | పర్జన్యతనయాసాద్వీ ఘృతాచీ గర్భనంభవా. 30

మంచిది అలాగే రండని సమ్మతించి ఆ మునివరుడు మహేశ్వరునకు మ్రొక్కి ఆ కన్యలను వెంటబెట్టుకొని భక్త్యాదరాలతో పుష్కరారణ్యానికి వెళ్ళాడు. అచ్చటకు వేలసంఖ్యలో యితర ఋషులు, నరపతులు, జానపదులు వచ్చి చేరుకున్నారు. ఒక్క ఋతధ్మజుడు మాత్రం వెళ్ళలేదు. ఆ కార్తిక పూర్ణిమా పర్వాన ఆ ఋషులంతా ఇక్ష్వాకు నరేశుడు నాభాగుడాదిగా గల రాజులంతా స్నానాలు చేశారు. గాలవముని కూడా ఆ కన్యలతోబాటు పుష్కర జలాల్లో స్నానార్థందిగాడు. నీళ్ళలో మునిగిన ఆముని ప్రవాహ మధ్యన ఒక పెనుచేపను ఎందరో మత్స్యాంగనలతో తిరుగడం చూచాడు. ఆడచేపలలా తిమింగలానితో ప్రేమకలాపాలు జరపబోగా నా మహామత్స్యం వాటితో, ఓముగ్ధాంగనలారా! మీరు ధర్మం ఎరుగరు. ఇందువలన కలిగే విపరేతమైన జనాపవాదాన్ని నేను భరించలేను. కనుక తొందల పడకుడని మందలించాడు. అదివిని ఆడచేపలు, తపస్వి అయిన ఆ గాలవుడే కన్యలను వెంటబెట్లుకొని యథేచ్చగా తిరుగుతుండగా, ఆ మహాత్మునకు లేని భయం, నీళ్ళలోపల ఉండే మీ కేలనని అనగా నా తిమింగలం తపోధనుడై ననేమి? ఆరాగాంధుడు పిల్లవాడిలాగా భయాన్ని, లజ్జనూ వదిలేశాడని చీదరించుకున్నది. ఆ మత్స్యసంవాదంవిని నీళ్ళలో ఉన్న గాలవుడు సిగ్గుపడి బయటకు రాకుండా అలాగే ఉండిపోయాడు. అరటి కాండలవంటి తొడలుగల ఆ కన్యకలు స్నానం ముగించుకొని నీళ్ళలో మునిగిన ఆ జితేంద్రియుడు గాలవునికై నీరీక్షిస్తూ నిలబడ్డారు. పుష్కర పర్వం ముగిసి వచ్చిన వారంతా, ఋషులు రాజులు జానవదులూ, తిరిగి వెళ్ళిపోయారు. సర్వాంగ సుందరి విశ్వకర్మ తనయ చిత్రాంగద ఒక్కతే నలు వైపులా చూస్తూ ఉండిపోయింది. గాలవునితో వచ్చిన కన్యలిద్దరు కూడ, ఆ ముని నీళ్ళలో నుంచి రానందున, తీరాన అలాగే చూస్తూ ఉండిపోగా, వారలు ముగ్గురూ పరస్పరం చూచుకున్నారు. ఇంతలో ఘృతాచి కడుపున జన్మించిన పర్జన్యుని కుమార్తె వేదవతి అనే గంధర్వ కన్య కూడా అక్కడకు వచ్చింది.

సాచాభ్యేత్యజలే పుణ్యస్నాత్వా మధ్యమపుష్కరే | దదర్శకన్యా త్రితియ ముభయోస్తటయోః స్థితమ్‌. 31

చిత్రాంగదామథాభ్యేత్య పర్యప్భచ్ఛ దనిష్ఠురమ్‌ | కా7సికేనచ కార్యేణ నిర్జనేస్థితవత్యసి. 32

సాతా మువాచపుత్రీం మాం విందస్వసురవర్దకేః | చిత్రాంగదే7తి సుశ్రోణి విఖ్యాతాం విశ్వకర్మణః. 33

సాహమభ్యాగతాభ##ద్రే స్నాతుం పుణ్యాంసరస్వతీమ్‌ |

నైమిషే కాంచనాక్షీంతు విఖ్యాతాం ధర్మమాతరమ్‌. 34

తత్రాగతాధరాజ్ఞా7హం దృష్టావైదర్భకేణహి | సురథేన న కామార్తో మామేవశరణంగతః. 35

మయాత్మా తస్యదత్తశ్చ సఖీభిర్వార్య మాణయా | తతః శప్తా7స్మితాతేన వియుక్తాస్మిచ భూభుజా. 37

మర్తుం కృతమతిర్భద్రే వారితాగుహ్య కేనచ | శ్రీకంఠ మగమంద్రష్టుం తతో గోదావరీజలమ్‌. 38

తస్మాదిమంసమాయాతా తీర్థ ప్రవరముత్తమమ్‌ | నచాపిదృష్టః సురథః సమనోహ్లాదనః పతిః. 39

సాబ్రవీచ్ఛ్రూయతాంయా7స్మి మందభాగ్యా కృశోదరి |

యథాయాత్రాఫలే వృత్తే సమాయాతా7స్మి పుష్కరమ్‌. 40

వర్జన్యస్య ఘృతాచ్యాంతు జాతావేదవతీతిహి | రమమాణా వనోద్దేశే దృష్టాస్మి కపినాసఖి. 41

సచాభ్యేత్యా బ్రవీత్‌కా త్వం యాసిదేవవతీతిహి | ఆనీతాస్యాశ్మాత్‌కేన భూపృష్ఠాన్మేరుపర్వతమ్‌. 42

తతోమయోక్తో నైవాస్మి కపేదేవవ తీత్యహం | నామ్నావేదవతీ త్యేవం మేరోరపికృతాశ్రయా. 43

తతస్తేనాతి దుష్టేన వానరేణహ్యభిద్రుతా | సమారూఢాస్మి సహసా బందుజీవం నగోత్తమమ్‌. 44

తేనాపి వృక్షస్తరసా పాదాక్రాంతస్త్వభజ్యత | తతోస్య విపులాంశాభాం సమాలింగ్య స్థితాత్వహమ్‌. 45

తతః ప్లవంగమోవృక్షం ప్రాక్షిపత్సాగరాభసి | సహతేనైవవృక్షేణ పతితాస్మ్యహ మాకులా 46

తతో7ంబరతలాద్వృక్షం నిపతంతం యదృచ్ఛయా | దదృశుః సర్వభూతాని స్థావరాణి చరాణిచ. 47

తతోహాహాకృతం లోకై ర్మాంపతంతీం నిరీక్ష్యహి | ఊచుశ్ఛసిద్దగంధర్వాః కష్టంసేయం మహాత్మనః. 48

ఇంద్రద్యుమ్నస్యమహిషీ గదితా బ్రహ్మణాన్వయమ్‌ | మనోః పుత్రస్య వీరస్య సహస్ర క్రతుయాజినః. 49

ఆమెధనురాకారంలో ఉన్న పుష్కరమధ్య జలాల్లో స్నానంచేసి సరోవరానికి ఉభయ తీరాల్లో నిలబడిన ముగ్గురు కన్యలను చూచింది. చిత్రాంగదను సమీపించి మృదువుగా, అమ్మా నీవెవరవు ఏ కారణాన ఈ నిర్జన ప్రదేశాన ఉన్నావని ప్రశ్నించింది. ఆ చిత్రాంగద తనకథ యిలా వినిపించింది. నేను ప్రఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ కుమార్తె చింత్రాంగదను. నేనొకపరి నైమిషారణ్యంలో కాంచనాక్షి సరస్వతిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్ళాను. అక్కడకు వచ్చిన విదర్భరాజు సురథుడు నన్నుచూచి కామార్తుడై శరణువేడుకున్నాడు. సఖులు వారించినా వినక నే నతనికి వశమయ్యాను. ఆకారణాన నా తండ్రి నన్ను శపించినందువల్ల భర్తకు దూరమై ఆత్మహత్యకు పూనుకోగా ఒక యక్షుడు వారించి శ్రీ కంఠక్షేత్రానికి పంపాడు. అక్కడనుండి సప్తగోదావరికి వెళ్ళి ఈ తీర్థ రాజానికి వచ్చాను. ఇక్కడ కూడ ఇంతమంది జనంలో నాభర్త సురథుడు కనిపించలేదు. ఇది నా కథ. ఇక నీవెవరో యాత్రముగిసిన తర్వాత యిచట కేలవచ్చితివో దాచకుండా నాకు చెప్పమన్నది. అందులకా బాలిక ఓకృశోదరి! అయితే ఈ మందభాగ్యురాలి కథ కూడ విను. చెబుతానంటూ యిలా మొదలు పెట్టింది. నేను వర్జన్యునకు ఘృతాచికి పుట్టిన దానను. పేరు వేదవతి. ఒక పర్యాయం వన ప్రాంతంలో క్రీడించుచుండగా ఒక బలశాలియైన వానరం నన్నుచూచి- ఓ దేవవతీ! ఎక్కడకు వెళ్లున్నావు? భూతలాన నిన్నుంచిన ఆశ్రమంనుంచి ఈ మేరు పర్వతానికి ఎవరు తీసుకవచ్చారని గద్దించి పలుకగా నేనంతట ''నా పేరు వేదవతి, నేను దేవవతిని కాను. ఈ మేరుగిరియే నా నివాసమన్నాను. అంతట నాధూర్త వానరం వినక నా వెంటపడగా నేను భయపడి ప్రక్కనేఉన్న ఒక ఎత్తైన బంధుజీవ వృక్షంమీదకు ఎక్కాను. అంతట ఆ దుష్టుని ప్రచండ కరాఘాతానికాచెట్టు విరిగిపడిగా నే నొక కొమ్మను గట్టిగా కరుచుకుని పట్టుకున్నాను. ఆకోతి ఆ చెట్టును సముద్రజలాల్లోకి విసరివేయగా నేను విల విలలాడుతూ కొమ్మతోకూడ పడిపోయాను. ఆ సమయాన ఆకాశాన్నుంచి క్రిందపడుతూన్న ఆ చెట్టును దానితోపాటు నన్నూ స్థావర జంగను ప్రాణులందరు చూచి హాహాకారాలు చేశారు. సిద్ధులూ గంధర్వులూ - ''అయ్యో! ఎంతకష్టం? మహాత్ముడైన మనుపుత్రుడూ వేయి యజ్ఞాలుచేసిన వీరుడూ నైన ఇంద్రద్యుమ్న మహాజాజుకు పట్టపురాణి కాగలదని స్వయంగా బ్రహ్మచేత దీవింపబడిన ఈ సాధ్వికా యీ దుర్దశ ! అంటూ విలపించారు.

తాంవాణీం మధురం శ్రుత్వా మోహమభ్యాగతాతతః | వచజానే సకేనాపి వృక్షశ్ఛిన్నః సహస్రధా. 50

తతో7స్మి వేగాత్‌బలినా హృతావల సఖేనహి | సమానీతాస్మ్యహమిమం త్వం దృష్టాచాద్య సుందరిః. 51

తదుత్తిష్టస్వ గచ్ఛావః పృచ్ఛావః కఇమేస్థితే | కన్యకే అనుపశ్యేహి పుష్కరస్యోత్తరే తటే. 52

ఏవముక్త్వా వరాంగీసా తయాసుతను కన్యయా | జగామకన్యకే ద్రుష్టుం ప్రష్టుం కార్యసముత్సుకా. 53

తతోగత్వా సర్యపృచ్ఛత్‌ తే ఊచతురుభే అపి |

యాథాతథ్వం తయోస్తాభ్యాం స్వమాత్మానం నివేదితుమ్‌. 54

తతస్తాశ్చతురోపీహా సప్త గోదావరం జలమ్‌ | సంప్రాప్య తీర్థేతిష్ఠంతి అర్చంత్యో హాటకేశ్వరమ్‌. 55

తతోబహూన్‌ వర్షగణాన్‌ బభ్రముస్తే జవాస్త్రయః | తాసామర్థాయ శకుని ర్జాబాలిః సఋతధ్వజః. 56

భారవాహీతతః భిన్నో దశాబ్దశతకేగతే | కాలేజగామ నిర్వేదాత్‌ సమంపిత్రాతు శాకలమ్‌. 57

తస్మిన్నరపతిః శ్రీమా నింద్రద్యుమ్నోమనోః సుతః | సమధ్యాస్తే సవిజ్ఞాయ సార్ఘపాత్రో వినిర్య¸°. 58

సమ్యక్‌ సంపూజితస్తేన సజాబాలిర్‌ ఋతధ్వజః | సచేక్ష్వాకుసుతోధీమాన్‌ శకునిర్భ్రాతృజో7ర్చితః. 59

తతోవాక్యం మునిః ప్రాహ ఇంద్రద్యుమ్నం ఋతుధ్వజః |

రాజన్నష్టా7బలాస్మాకం నందయంతీతి విశ్రుతా. 60

తస్యార్థే చైవవసుధా అస్మాభిరటితానృప | తస్మాదుత్తిష్ఠ మార్గస్య సాహాయ్యం కర్తుమర్హసి. 61

అథోవాచ నృపోబ్రహ్మన్‌ మమా పిలలనోత్తమా | నష్ఠాకృతశ్రీమస్యాపి కస్యాహంకథయామితామ్‌. 62

ఆకాశాత్‌ పర్వతాకారః పతమానోనగోత్తమః | సిద్ధానాం వాక్యమాకర్ణ్య బాణౖశ్ఛన్నః సహస్రధా. 63

నచైవ సావరారోహా విభిన్నా లాఘవాన్మయా | నచజానామి సాకుత్ర తస్మాద్గచ్ఛామి మార్గితుమ్‌. 64

ఇత్యేవముక్త్వా సనృపః సముత్థాయ త్వరాన్వితః |

స్యందనాని ద్విజాభ్యాంస భ్రాతృపుత్రాయ చార్పయత్‌. 65

తే7ధిరుహ్యరథాం స్తూర్ణం మార్గంతే వసుధాంక్రమాత్‌ |

బదర్యాశ్రమమాసాద్య దదృశు స్తవసా నిధిమ్‌ 66

తపసాకర్శికం దీనం మలపంకజటాధరమ్‌ | నిఃశ్వాసాయాసపరమం ప్రథమేవయసిస్థితమ్‌. 67

ఆ తియ్యని వాణి చెవిన బడిన వెంటనే నేను మూర్చిల్లి పడిపోయాను. అందుచేత ఆ వృక్షాన్ని వేయిముక్కలుగా నరికినదెవరో తెలుసుకోలేక పోయాను. అంతట అగ్ని మిత్రుడు వాయువు ప్రచండ వేగంతో నన్నీచోటికి విసరి వైచినాడు. ఇక్కడ నిన్ను చూచాను. ఇక లెమ్ము. మనంవెళ్ళి పుష్కరానికి ఉత్తరతీరాన నిలబడిన ఆ యిద్దరు కాంతలెవరో అడిగి తెలుసుకుందాము. అని చెప్పి ఆ వేదవతి చిత్రాంగదతో, ఓకవ్యామణీ! ఆ సుందరీల వద్దకు వెళ్ళింది. ఆమె అడిగిన మీదట వారుభయులూ తమతమ వృత్తాంతాలు వినిపించారు. అంతట నాకన్యలు పలువురూ సప్తగోదావరి క్షేత్రానికి వెళ్ళి హాటకేశ్వర మహాదేవుని అర్చిస్తూ ఉండిపోయారు. ఈ లోపుగా శకుని, జాబాలి, ఋతధ్వజులుమవ్వురూ ఆ కాంతను వెదకుచూ చాలా ఏండ్లు తిరిగారు. వేయేండ్ల తర్వాత జటాభారంతో అలసిపోయిన జాబాలిని వెంటబెట్టుకొని నిరాశులైనారు. శాకలానికి వెళ్ళారు. ఆ నగరాధిపతి ఇంద్రద్యుమ్న మహారాజు. వారలు వచ్చుటతెలిసికొని అర్ఘ్యపాత్రతో ఎదురుగా వెళ్ళి ఋషులను పూజించి సోదరపుత్రుడయిన శకునిని సంభావించాడు. ఋతధ్వజుడా రాజుతో, రాజన్‌ మా బిడ్డ నందయంతి తప్పిపోయినది. ఆమెకోసం భూమి అంతా గాలించాం. విసిగి వేసారి పోయాం. మీరు వెంటనే లేని ఆమెను వెదకి మాకు సహాయం వడండని అర్థించాడు. అంతట నా ఇద్రద్యుమ్నుడు కాడ, మహామునీ ! కోమలాంగియైన నా భార్య కూడ ఎక్కడనో తప్పిపోయింది. ఆమె కోసం నేనూ వెదకి విసిపోయాను. నా బాధ ఎవరితో చెప్పుకోను? సిద్ధులమాట లాకర్షించి ఆకాశాన్నుంచి పడిపోతున్న ఒక పర్వంతంలాంటి వృక్షాన్ని లాఘవంలో బాణపరంపరతో వేయి ఖండాలుగా ఖండించాను. ఆ సుందరికేమాత్రము దెబ్బతగులలేదు. కాని ఆమె ఎక్కడ పడిపోయినదో ఎక్కడ ఉన్నదో తెలియక నిరంతరం నేనూ వెదకుతున్నాను. అని చెప్పి త్వరగా లేచి మూడు రథాలు తెప్పించాడు. ఋషులిర్వురకూ, శకునికీ రెండు రథాలు యిచ్చి తాను మూడవది ఎక్కి అందరూ నేల నాలుగుమూలలా వెదకుతూ బదరీ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ కఠోర తపస్సులో వేగిపోతూ, దుమ్ముకొట్టుకున్న జడలతో, కృశించిపోయి. ఎంతో కష్టంతో ఊపిరిపీలుస్తూ ఉన్న ఒక యువ తపస్విని చూచారు.

తముపేత్యాబ్రవీద్రాజా ఇంద్రద్యుమ్నో మహాభుజః |

తపస్విన్‌ ¸°వనేఘోర మాస్థితో7సి సుదుశ్చరమ్‌. 68

తపః కిమర్థం తచ్ఛంశ కిషుభి ప్రేతముచ్యతామ్‌ |

సో7బ్రవీద్‌ కోభవాన్‌ బ్రూహి మమాత్మానాం సుహృత్తయా. 69

పరిపృచ్ఛసి శోకార్తం పరిభిన్నంతపోన్వితమ్‌ | నప్రాహరాజా7స్మి విభో తపస్విన్‌ శాకలేపురే. 70

మనోః పుత్రః ప్రియోభ్రాతా ఇక్ష్వాకోః కథితంతవ | సచాసై#్మపూర్వ చరితం సర్వంకథితవాన్‌ నృపః. 71

శ్రుత్వాప్రోవాచ రాజర్షి ర్మాముంచస్వ కళేవరమ్‌ |

ఆగచ్ఛ యామి తన్వంగీం విచేతుం భ్రతృజో7సిమే. 72

ఇత్యుక్త్వా సంపరిష్యజ్య నృపం ధమనిసంతతమ్‌ | సమారోప్యరథం తూర్ణం తాపసాభ్యాం న్యవేదయత్‌. 73

ఋతధ్వజః సపుత్రస్తు తందృష్ట్వా పృథివీపతిమ్‌ | ప్రోవాచరాజన్‌ ఏహ్యేహి కరిష్యామి తవప్రియమ్‌. 74

యాసౌచిత్రాంగదానామ త్వయాదృష్ట్వా హి నైమిషే | సప్తగోదావరం తీర్థం సామయైవ విసర్జితా. 75

తదాగచ్ఛథ గచ్ఛమో నౌదేవసై#్యవ కారణాత్‌ | తత్రాస్మాకం సమేష్యంతి కన్యాస్తిస్రస్తథాపరాః. 76

ఇత్యేవముక్త్వాస ఋషిః సమాశ్వాస్య సుదేవజమ్‌ | శకునిం పురతః కృత్వా సేంద్రద్యుమ్నః సపుత్రకః. 77

స్యందనేనాశ్వయుక్తేన గంతుం సముపచక్రమే | సప్తగోదావరం తీర్థం యత్రతాః కన్యకాగతాః 78

ఏతస్మిన్నంతరేతస్వీ ఘృతాచీ శోకసంయుతా | విచచారోదయగిరిం విచన్వంతీ సుతాం నిజామ్‌. 79

తమాససాదచ కపిం పర్యపృచ్ఛత్తథాప్సరాః | కింబాలానత్వయాదృష్టా కపేః సత్యంవదస్వమామ్‌. 80

తస్యాస్తద్వచనం శ్రుత్వా సకపిః ప్రాహబాలికామ్‌ | దృష్ఠాదేవవతీ నామ్నా మయాన్యస్తా మహాశ్రమే 81

కాలింద్యా విమలేతీర్థే మృగ పక్షిసమన్వితే | శ్రీకంఠాయతనస్యాగ్రే మయాసత్యం తవోదితమ్‌. 82

సాప్రాహ వానరపతే నామ్నా వేదవతీతిసా | నహిదేవవతీ శ్యాతా తదాగచ్ఛ వ్రజామహే. 83

అతనిని చూచి మహాభుజుడైన ఇంద్రద్యుమ్న నృపతి చిన్నవాడా ! ¸°వనంలోనే యింతటి కఠోర తపస్సు ఏమాశించి చేస్తున్నావు? అని ప్రశ్నించగా నతడు, మీరెవ్వరు శోకార్తుడనైన నన్ను యింత ప్రేమాను రాగాలతో అడుగు తున్నారని బదులు చెప్పాడు. అందులకా నరపతి నేను మనువు కుమారుడను. ఇక్ష్వాకు సోదరుడను శాకల నగరాధిపతి నని చెప్పగా నా యువక తపస్వి తన పూర్వగాథ అంతావివరించాడు. ఆదివిని ఆ రాజర్షి, బాబూ ! నీవు శరీర త్యాగం చేసికోవద్దు. నీవు నా సోదరుని కుమారుడవే. రారమ్ము. నీ ప్రియురాలని అన్వేషించుదమంటూ ఆ కృశించిన యువకుని కౌగలించుకున్నాడు. అతనిని తన రథంమీద కూర్చుండ బెట్టుకొని ఋషుల వద్దకు తీసుక వెళ్లారు. ఋతధ్వజుడు అతనితో, రా బాబూ! రా ! నీకు ప్రియం కలుగజేస్తా. నీవు నైమిషారణ్యంలో చూచిన చిత్రాంగదను నేనే సప్త గోదావరి తీర్థంలో వదలి వచ్చాను.'' అనిచెప్పి అందరను చూచి, రండి ! రండి ! సుదేవుని కుమారుని కోసం మనం సప్త గోదావరి సంగమానికి వెళ్దాం. అక్కడే ముగ్గురు కన్యలూ ఇతరులూ మనకు కనిపిస్తారన్నాడు. అలా సదేవ కుమారుని సమాశ్వసించి శకునీ ఇంద్రద్యుమ్నుడు తన పుత్రునితో కలిసి అంతా రథారూఢులై ఆ బాలికామణులు వెళ్ళి సప్తగోదావరానికి బయలుదేరారు. ఈ లోపున ఘృతాచి తనకుమార్తెను గానక విచారమగ్నయై ఉదయగిరిమీద అంతటా వెదకుతూ తిరిగింది. దారిలో తారసిల్లి వానరాన్ని చూచి ఆ అప్సరస, ఓ కపీ! నీవొక కన్యక నెవరినైనా చూచావా నిజం చెప్పమని అడుగగా నా కపి, దేవవతి అనే కన్యను చూచాను. ఆమెనొక మహాశ్రమంలో కాళిందీ తీరాన మృగపక్షి సంకీర్ణమైన అరణ్యంలో వదలి వచ్చాను. ఆ ఆశ్రమం శ్రీకంఠేశ్వరాలయాని కెదురుగా ఉంది. అని చెప్పింది. అందుకామె. ఓ వానర శ్రేష్ఠా ! ఆమె పేరు వేదవతి, రమ్ము మనమచ్చటకు వెళ్ళుదామన్నది.

ఘృతాచ్యాస్తద్వచః శ్రుత్వా వానరస్త్వరిత క్రమః |

వృష్ఠతో7స్యాః సమాగచ్ఛ న్నదీ మన్వేవ కౌశికీమ్‌. 84

తేచాపికౌశికీం ప్రాప్తా రాజర్షి ప్రవరాస్త్రయః | ద్వితయం తాపసాభ్యాంచ రథైః పరమవేగిభిః 85

అవతీర్య రథేభ్యస్తే స్నాతు మభ్యాగమన్‌ నదీమ్‌ | ఘృతాచ్యపినదీం స్నాతుం సుపుణ్యా మాజగామహ. 86

తామన్వేనకపిః ప్రాయా ద్దృష్టోజాబాలినాతథా | దృష్ఠ్వైవపితరం ప్రాహ పార్దివంచ మహాబలమ్‌. 87

నఏవ పునరాయతి వానరస్తాత వేగవాన్‌ | పూర్వం జటాస్వేవబలా ద్యేన బద్దో7స్మిపాదపే. 88

తజ్జాబాలివచః శ్రుత్వా శకునిః క్రోధసంయుతః | సశరం ధనురాదాయ ఇదంవచన మబ్రవీత్‌. 89

బ్రహ్మన్‌ ప్రదీయతాంమహ్య మాజ్ఞాతాతః వదస్వమామ్‌ |

యావదేనం నిహన్మ్యద్య శ##రేణౖ కేనవానరమ్‌. 90

ఇత్యేవ ముక్తే వచనే సర్వభూతహితేరతః | మహర్షిః శకునిం ప్రాహ హేతుయుక్తం వచోమహత్‌. 81

నక్షశ్చిత్తాత కేనాపి వధ్యతేహన్యతే7పివా | వధబంధౌ పూర్వకర్మవశ్యౌనృపతి నందన. 82

ఇత్యేవముక్త్వా శకుని మృషిర్వానరమ బ్రవీత్‌ | ఏహ్యేహి వానరాస్మాకం సాహాయ్యం కర్తుమర్హసి. 83

ఇత్యేవముక్తో మునినా బాలేః సకపికుంజరః | కృతాంజలి పుటోభూత్వా ప్రణిపత్యేదమబ్రవీత్‌ |

మమాజ్ఞా దీయతాంబ్రహ్మన్‌ శాధికింకర వాణ్యహమ్‌. 84

ఇత్యుక్తే ప్రాహనముని స్తం వానరపతింవచః | మమపుత్రస్త్వ యోద్బద్దో జటాను వటపాదపే. 85

నచోన్మోచయితుం వృక్షా చ్ఛక్నుయామో7పి యత్నతః | తదనేన నరేంద్రేణ త్రిధాకృత్వాతు శాఖినః. 96

శాఖాం వహతిమత్సూనుః శిరసాతాం విమోచయ | దశవర్ష శతాన్యస్య శాఖాంవైవహతో7గమన్‌. 97

నచసో7స్తిపుమాన్‌ కశ్చిత్‌ యోహ్యున్మోచయితుంక్షమః |

సఋషేర్వాక్యమాకర్ణ్య కపిర్జాబాలినో జటాః. 98

శ##నైరున్మోచయామాస క్షణాదువ్మోచితాశ్చతాః | తతః ప్రీతోమునిశ్రేష్ఠో వరదో7భూదృతధ్వజః. 99

కపిం ప్రాహవృణీష్వత్వం వరంయన్మనసేప్సితమ్‌ |

ఘృతాచి మాటలువిని ఆ వానరం పెద్దపెద్ద అంగలువేస్తూ త్వరగా ఘృతాచిని వెంట బెట్టుకొని కౌశికీనదికి వెళ్ళింది. ఆ రాజర్షులు ముగ్గురూ ఇద్దరు మునులు కూడా రథాలమీద వేగంగా పయనించి కౌశికీనది చేరుకున్నారు. రథాలు దిగి నదిలో పవిత్ర స్నానం చేయుటకు వెళ్ళారు. ఘృతాచి కూడ నదిలోకి స్నానం చేయడానికి దిగగానే ఆ ప్రక్కనే ఉన్న వానరాన్ని చూస్తూనే జాబాలి తండ్రితోను మహావీరుడైన చక్రవర్తితోను యిలా అన్నాడు. తండ్రీ! అడుగో నా జడలు చెట్టుకొమ్మకు కట్టి ఆ దుష్టవానరుడు. మళ్ళీయిటే వస్తున్నాడు. జాబాలి మాటలువింటూనే శకుని కోపంతో మండి పడి మహర్షి నీ రాజునూచూచి, తపోధనా ! మహారాజా ! అనుజ్ఞ యివ్వండి. ఒక్కకోలతో నీ పాడు కోతినినేల గూలుస్తా నన్నాడు. ఆ మాటలు విని సర్మజీవ కారుణ్యమూర్తి అయిన ఋతధ్వజుడు వారించి ''వత్సా ! పొరబడుతున్నావు ! లోకంలో ఎవ్వరూ ఎవ్వరినీ చంపరు. చావులు గాని, బంధనాలు గాని వారివారి కర్మల ననుసరించియే కలుగుతాయి. కనుక నీ ప్రయత్నం విరమించుమని చెప్పి ఆ కపిని చూచి ఓ వానరా! మాకు నీవల్ల ఒక సహాయం కావాల్సి ఉంది. రమ్మురమ్మని'' ఆహ్వానించాడు. ఓ అరజా సందరీ ! ముని మాటలువిని ఆ వానరం చేతులు జోడించి ప్రణామంచేసి, ''ఓ బ్రహ్మర్షీ! ఆజ్ఞాపించండి. శాసించండి. నేనేమి చేయవలసి ఉన్నదో అని ప్రార్థించినది. అందుకు ముని, వెనుక నీవు నా కుమారుని జటలతో లతాదికాలతో వటవృక్షానికి బంధించావు. ఈ మహారాజు సహాయంతో ఆ కొమ్మను మూడు ఖండాలుగా నరికి పిల్లవాడిని విడిపించుకున్నాం అయినప్పటికీ జడలతో నీవు కొమ్మకు బిగించిన కట్లు విప్పడం ఎవరికీ శక్యంకాలేదు. అందుచేత నీ పసివాడు గతించి పదివేలేండ్లుగా, తలకు కట్టబడిన కొమ్మబరువు మోస్తూ తిరుగుతున్నాడు. ఆ కట్లు విడదీసి వానిక పూర్తి విముక్తి కలిగించు మనగా నాశాఖామృగం మెల్లమెల్లగా ఆ చిక్కుముడులు విప్పి ఆ జాబాలికి పూర్తి విమోచనం కలిగించింది. అంతట సంతోషించిన ఆ ముని ఆ కపిన ఏదేని వరం కోరుకొమ్మన్నాడు.

ఋతధ్వజవచఃశ్రుత్వా ఇమంవరమయాచత. 100

విశ్వకర్మామహాతేజా కపిత్వేప్రతిసంస్థితః | బ్రహ్మన్‌భవాన్యరంమహ్యం యదిదాతుమిహేచ్ఛతి. 101

తత్స్వదత్తోమహఘోరో మమశాపోనివర్త్యతామ్‌ | చిత్రాంగదాయాఃపితరం మాంత్వస్టారంతపోధన. 102

అభిజానీహిభవతః శాపాద్వానరతాంగతమ్‌ | సుబహూనిచపాపాని మయాయానికృతానిహి. 103

కపిచాపల్యదోషేణ తానిమేయాంతు సంక్షయమ్‌ | తతోఋతధ్వజఃప్రాహ శాపస్యాంతోభవిష్యతి. 104

యదాఘృతాచ్యాంతనయం జనిష్యసిమహాబలమ్‌ | ఇత్యేవముక్తఃసంహృష్టః సతదాకపికుంజరః 105

స్నాతుంతూర్ణంమహానద్యా మవతీర్ణఃకృశోదరి | తతస్తుసర్వేక్రమశః స్నాత్వా7ర్చ్యపితృదేవతాః. 106

జగ్ముర్‌హృష్టారథేభ్యస్తే ఘృతాచీ దివముత్పతత్‌ | తామన్వేవమహావేగః సకపిఃప్లవతాంరః 107

దదృశేరూపసంపన్నాం ఘృతాచీంసప్లవంగమః | సాపితంబలినాంశ్రేష్ఠం దృష్ట్యైవకపికుంకరమ్‌. 108

జ్ఞాత్వా7థవిశ్వకర్మాణం కామయామాసకామినీ | తతో7నుపర్వతశ్రేష్ఠే ఖ్యాతేకోలాహలేకపిః. 109

రమయామాసతాంతన్వీం సాచతంవానరోత్తమమ్‌ | ఏవంరమంతౌసుచిరం సంస్రాప్తౌవింధ్యపర్వతమ్‌. 110

రథైఃపంచాపితత్తీర్థం సంప్రాప్తాస్తేనరోత్తమాః | మధ్యాహ్నసమయేప్రీతాః సప్తగోదావరంజలమ్‌. 111

ప్రాప్యవిశ్రామహేత్వర్థ మవతేరుస్త్వరాన్వితాః | తేషాంసారథయశ్చాశ్వాన్‌ స్నాతపీతోదకాప్లుతాన్‌. 112

రమణీయేవనోద్దేశే ప్రచారార్థేసముత్సృజన్‌ | శాద్వలాఢ్యేషుదేశేషు ముహూర్తాదేవవాజినః 113

తృప్తాఃసమాద్రమన్‌సర్వే దేవాయతనముత్తమమ్‌ | తురంగఖురనిర్ఘోషం శ్రుత్వాతాయోషితాంవరాః. 114

కిమేతదితిచోక్త్వైవ ప్రజగ్ముర్హాటకేశ్వరమ్‌ | ఆరుహ్యబలభీం తాస్తు సముదైక్షంతసర్వశః. 115

ఋతధ్వజుని మాటలువిని వానరుడుగా ఉన్న మహాతేజస్వి విశ్వకర్మ యిలా వరం అడిగాడు. భగవాన్‌ ! నాకు వరమివ్వరునెంచినచో, ఒకనాడు తమ నాకు యిచ్చిన మహా కఠోర శాపాన్ని ఉపసంహరించండి. ఓ తపోధనా ! తమచే వానరుడుగా శపించబడిన చిత్రాంగద తండ్రిని, అభాగ్యుడనైన విశ్వకర్మ దేవశిల్పిని నేనే అని తెలపుకుంటున్నాను. కపి చాపల్యం వల్ల నేనెన్నియో పాపాలు చేశాను. వానినన్నింటినీ నశింపజేయండి. నన్ననుగ్రహించండి. అంతట ఋతధ్వజుడు ఏనాడు నీవుఘృతాచివల్ల మహాబలుడైన కుమారుని కంటావో ఆనాటితో నీకపిత్వం సమాప్తమౌతుంది. అంటూ శాపాంతం సూచించాడు. అంతట సంతసించి ఆ కపి స్నానార్థం ఆ మహానదిలో దిగాడు. ఇతరులందరూ ఒకరొకరుగా పవిత్ర స్నానాలు చేసి పితృదేవార్చనలు గావించారు. అనంతరం తమతమ రథాలెక్కి వెళ్ళిపోయారు. ఘృతాచి గగనమార్గానికెగిరి పోగా నా మహాకపి ఆమెను వెంబడించాడు. ఆ సర్వాంగ సుందరిని చేరుకోగానే ఆమెకూడా నా ప్లవంగ శ్రేష్ఠుని విశ్వకర్మగా గుర్తించి కామించింది. అంతట వారిద్దరూ కోలాహలం పర్వతసానుకందరాలలో యథేచ్ఛగా రమిస్తూ ఒకరినొకరు సంతృప్తిపరుచుకుంటూ విహరించారు. అలా విహరిస్తూ చాలాకాలానికి వింధ్యపర్వతానికి చేరు కున్నారు. ఆ విధంగా ఋతధ్వజుడు మిగిలిన నలుగురూ రథాలమీద మధ్యాహ్నవేళకు సప్తగోదావర క్షేత్రానికి ప్రీతులై చేరుకున్నారు. విశ్రాంతి కోసం త్వరత్వరగా రథాలు దిగారు. సారథులు గుర్రాలను కడిగి నిర్మలోదకాలు త్రాగించి చుట్టుప్రక్కలగల చక్కని పచ్చిక బయళ్ళలోకి మేయుటకై వదిలారు. ముహూర్తకాలంలో అవి కడుపునిండా మేతమేసి తృప్తి చెందాయి. అంతట అందరూ రథాలెక్కి హాటకేశ్వరాలయానికి వెళ్ళారు. ఆ దేవాలయంలో ఉన్న నాస్త్రీ రత్నాలా గుర్రపుడెక్కల చప్పుళ్ళు విని అది ఏమో తెలుసుకుందామని, దేవాలయ పైభాగాలకు ఎక్కి నలువైపులా తేరిపార చూడసాగారు.

అపశ్యం స్తీర్థసలిలే స్నాయామానాన్‌ నరోత్తమాన్‌ | తతశ్చిత్రాంగధా దృష్ట్వా జటామండల ధారిణమ్‌ |

సురథం హాసతీప్రాహ, సంరోహత్పులకా సఖీమ్‌. 116

యో7సౌ యువా నీలఘనప్రకాశః సందృశ్యతే దీర్ఘభుజః సురూవః |

స ఏవ నూనం నరదేవసూను ర్వృతోమయా పూర్వతరం పతిర్యః. 117

యశ్చైష జాంబూనద తుల్యవర్ణః శ్వేతం జటాభారమధారయిష్యత్‌ |

స ఏషమానం తపాతాంవరిష్ఠో ఋతధ్వజోనాత్రవిచార్యమస్తి 118

తతో7బ్రవీదథో హృష్టా నందయంతీ సఖీజనమ్‌ | ఏషో7పరో7సై#్యవ సుతో జాబాలిర్నాత్ర సంశయః. 119

ఇత్యేవముక్త్వా వచనం బలభ్యా అవతీర్యచ | సమాసతాగ్రతః శంభో ర్గాయంత్యో గీతికాం శుభామ్‌. 120

నమో7స్తు శర్వశంభోః త్రినేత్రః చారుగాత్ర త్రైలోక్యవాథ |

ఉమాపతే, దక్షయజ్ఞవిధ్వంసకర కామాంగనాశన ఘోర |

వా. పు. 38

పాపప్రణాశన మహాపురుష మహోగ్రమూర్తే నర్వ - |

సత్వక్షయంకర శుభంకర మహేశ్వర త్రిశూలధారిన్‌ః

స్మరారే గుహావాసిన్‌ తిగ్వాసః మహాశంఖశేఖర. 5

జటాధర కపాలమాల విభూషితశరీర వామచక్షుః |

వామదేవ ప్రజాధ్యక్ష భగాక్‌ష్ణోః భయంకర భీమసేన |

మహాసేన నాథ పశుపతే కామాంగదహన చత్వరవాసిన్‌ |

శివ మహాదేవ ఈశాన శంకర భీమ భవః

వృషభధ్వజ జటిల ప్రౌఢ మహానాట్యేశ్వర భూరిరత్న. 10

ఆవిముక్తక రుద్ర రుద్రేశ్వర స్థాణో ఏకలింగ |

కాళిందీప్రియ శ్రీకంఠ నీలకంఠ అపరాజిత |

రిపుభయంకర నంతోషపతే వామదేవ అఘోర |

తత్పురుష మహాఘోరమూర్తే శాంత |

సరస్వతీకాంత కోనాట సహస్రమూర్తే మహోద్భవ. 15

విభో కాలాగ్నిరుద్ర రుద్ర హర మహీధరప్రియ |

సర్వతీర్థాధివాన హంస కామేశ్వర కేదారాధిపతే |

పరిపూర్ణ ముచుకుంద మధునివాసిన్‌ క్భపాణపాణ |

భయంకర విద్యారాజ సోమరాజ కామరాజ రంజిక

అంజన రాజకన్యాహృదచలవసతే సముద్రశాయిన్‌. 20

గజముఖ ఘంటేశ్వర గోకర్ణ బ్రహ్మయోనే |

సహస్రవక్త్రాక్షిచరణ హాటకేశ్వర నమో7స్తుతే

ఏతస్మిన్నంతరే ప్రాప్తాః సర్వ ఏవర్షి పార్థివాః |

ద్రష్టుంత్రై లోక్యకర్తారం త్య్రంబకం హాటకేశ్వరమ్‌. 121

పవిత్ర తీర్థంలో స్నానాలు చేస్తున్న ఆ రాజులను చూచారు. చిత్రాంగద వారలలో జటామండలధారియైయున్న సురథుని చూచిచాలా సంతోషంతో దేహం గగుర్పాటొందగా తన సఖులతో యిలా అన్నది. అడుగో అక్కడ నల్లని మేఘంలో వెలుగుతున్న సుందరుడు మహాభుజుడు అతడే! అతడే నేను వరించిన నా భర్త ! రాజకుమారుడు ! సురథుడు ! బంగారు రంగులో తెల్లని జటాభారంతో ప్రకాశించే ఆ తపస్వి, ఆయనే ఋతధ్వజుడు. ఏమాత్రం సందేహం లేదు. అంతట ''నందయంతి'' కూడ ఆనందంతో, అడుగో ఆతడు ఆ మహర్షి జాబాలి ! అని అరచినది. అంతట వారంతా ఆ వలభి (మేడ) నుండి క్రిందకు వచ్చి హాటకేశ్వర మహాదేవున కభిముఖంగా నిలబడి ఆ భక్తవత్సలుని యిలా స్తోత్రం చేయసాగారు. ''ప్రభూ ! శర్వా ! శంభో త్రినేత్రా ! సుందరాంగా ! నీకు నమస్సులు ! త్రిలోకేశ్వరా, ఉమావల్లభా, దక్షయాగనాశకా, మదనాంతకా, ఘోరా, పాపహారీ, మహాపురుషా, మహోగ్రమూర్తీ, సర్వజీవనాశకా, శుభంకరా, మహేశ్వరా, త్రిశూలపాణీ, మదనవైరీ, గుహావాసీ, దిగంబరా, మానవాస్థిమస్తకధరా, జటాధారీ, కపాలమాలాధరా, వామనేత్రా, వామదేవా, ప్రజాపతీ, భగుని కన్నుపొడిచినవాడా, ప్రళయంకరా, భీమసేనా, మహాసేననాథా, పశుపతీ, కామాంగ దహనా, యజ్ఞవేదినివాసా, శివా, మహాదేవా, ఈశానా, శంకరా, భీమా భవా వృషభధ్వజా, జటాజూటధరా, ప్రౌఢా, మహానటరాజా, మహారత్న కాంతిధరా, అవిముక్తకా, రుద్రా, రుద్రుల అధినాయకా, స్థాణూ ! ఏకలింగేశ్వరా, కాళిందీ ప్రియా, చక్కని కంఠం గలవాడా, నల్లని కంఠం గలవాడా, అజేయా, శత్రుభయంకరా, సంతోషపతీ, వామదేవా, అఘోరా, తత్పురుషా, మహాఘోరా, సౌమ్యా (అఘోర) మూర్తీ, శాంత, సరస్వతీ వల్లభా, కోనాటా ! సహస్రమూర్తీ, అద్భుతజన్మా ! విభూ కాలాగ్నిరుద్రా హరా, పర్వతప్రియా, సర్వతీర్థాల్లో నివసించువాడా, హంసా, కామేశ్వరా, కేదార నాధా, పరిపూర్ణరూపా ముచుకుందా, తేనెలోతీపిరూపంలో ఉండే ప్రభూ ! ఖడ్గపాణీ ! భయంకరా, విద్యాధిరాజా, సోమ రాజా, మన్మథపతీ, రంజింప జేయువాడా, అంజన రాజకుమారి హృదయంలో నివసించు ప్రభూ! సాగరశయనా, గజముఖా ఘంటేశ్వరా గోకర్ణేశ్వరా! బ్రహ్మయోనీ, వేలాదితలలు నేత్రాలు చరణాలు గల దేవా, హాటకేశ్వరా ! హరా! నీకు నమస్సులు. వేలాది ప్రణామాలు ! ఇలా కోమల కంఠాలతో గంధర్వులను మరిపిస్తూ ఆ బాలికలు హాటకేశ్వరుని గుణగణాలు గానం చేస్తుండగా ఆ ఋషులు నరపతులు స్వామి దర్శనానికై ఆలయంలో ప్రవేశించి ఆ ముల్లోక కర్త త్రినేత్రునికి ప్రణామాలు గావించి మండపంలో కూర్చున్నారు.

సమారూఢాశ్చ సుస్నాతా దదృశుర్యోషితశ్చతాః | స్థితాస్తు పురతస్తస్య గాయంత్యో గేయముత్తమమ్‌. 122

తతఃసుదేవతనయో విశ్వకర్మసుతాం ప్రియాం | దృష్ట్వాహృషితచిత్తస్తు సంరోహత్పులకోబభౌ. 123

ఋతధ్వజో7పి తన్వంగీం దృష్ట్వా చిత్రాంగదాం స్థితామ్‌ |

ప్రత్యభిజ్ఞాయ యోగాత్మా బభౌముదితమానసః. 124

తతస్తు సహసాభ్యేత్య దేవేశం హాట కేశ్వరమ్‌ | సంపూజయంతస్త్ర్యక్షంతే స్తువంతః సంస్థితాః క్రమాత్‌. 125

చిత్రాంగదా7పి తాన్‌ దృష్ట్వా ఋతధ్వజపురోగమాన్‌ |

సమం తాభిః కృశాంగీతి రభ్యుత్థా యాభ్యవాదయత్‌. 126

సచతాః ప్రతినంద్యైవ సమం పుత్రేణ తావసః | సమంనృపతిభిర్హృష్టః సంవివేశయథాసుఖమ్‌. 127

తతః కపివరః ప్రాప్తో ఘృతాచ్యాసహ సుందరి | స్నాత్వా గోదావరీతీర్థే దిదృక్షుర్హాట కేశ్వరమ్‌. 128

తతో7పశ్యత్సుతాంతన్వీం ఘృతాచీ శుభదర్శనామ్‌ |

సా7పితాం మాతరందృష్ట్వా హృష్టా7భూద్వర వర్ణినీ. 129

తతోఘృతాచీస్వాం పుత్రీం పరిష్యజ్య న్యపీడయత్‌ | స్నేహాత్సబాష్పనయనాం ముహుస్తాం పరిజిఘ్రతీ. 130

తతో ఋతధ్వజః శ్రీమాన్‌ కపిం వచనమబ్రవీత్‌ |

గచ్ఛనేతుం గుహ్యకం త్వ మంజనాద్రౌ మహాంజనమ్‌. 131

పాతాళాదపి దైత్యేశం వీరం కందరమాలినమ్‌ | స్వర్గాద్గంధర్వరాజానం వర్జన్యం శీఘ్రమానయ. 132

ఇత్యేవముక్తే మునినా ప్రాహదేవవతీ కపిమ్‌ | గాలవం వానరశ్రేష్ఠ ఇహానేతుంత్వమర్హసి. 133

ఇత్యేవముక్తే వచనే కపిర్మారుత విక్రమః | గత్వా7ంజనం సమామంత్య్ర జగామామరపర్వతమ్‌. 134

పర్జన్యంతత్ర చామంత్య్ర ప్రేషయిత్వా మహాశ్రమే | సప్త గోదావరీతీర్థే పాతాళ మగమత్కపిః. 135

తత్రామంత్య్ర మహావీరం కపిః కందరమాలినమ్‌ | పాతాళాదభి నష్క్రమ్య మహీంపర్యచరజ్జవీ. 136

గాలవంతపసోయోనిం దృష్ట్వామాహిష్మతీమను | సముత్పత్యానయచ్ఛీఘ్రం సప్తగోదావరీజలమ్‌. 137

తత్రస్నాత్వా విధానేన సంప్రాప్తో హాటకేశ్వరమ్‌ | దదృశేనంయంతీంచ స్థితాం దేవవతీమపి. 138

తేదృష్ట్వా గాలవంచైవ సముత్థాయాభ్యవాదయన్‌ | సచార్చిష్యన్మహాదేవం మహర్షి నభ్యవాదయత్‌ |

తేదాపి నృపతిశ్రేష్ఠా స్తంసంపూజ్య తపోధనమ్‌. 139

ప్రహర్ష మతులంగత్వా ఉపవిష్టాయధాసుఖమ్‌.

స్నానానంతరం ఆలయంలో కూర్చొని వారు హాటకేశ్వరుని మ్రోల గీతాలాపన చేయుచున్న ఆ కన్యలను చూచారు. వారిలో విశ్వకర్మ తనయను గుర్తుపట్టి సుదేవకుమారుడు సంతోషంతో తబ్బిబ్బైనాడు. ఋతధ్వజుడు కూడ చిత్రాంగదను గుర్తించి యోగదృష్టితో సర్వమూ తెలిసికొని సంతోషించాడు. అంతట వారందరూ లేచి త్వరగా వెళ్ళి హాటకేశ్వరుని పూజించి క్రమంగా స్తోత్రాలు గావించారు. ఋతుధ్వజునితో కలిసి వచ్చిన వారలను చూచి, చిత్రాంగద తన సఖులతో లేచి వారలకు నమస్కారం చేసింది. అంతట నామహర్షి కుమారుడూ తక్కిన రాజులతో కలసి వారలకు ప్రత్యభినందనలు తెలిపి అందరూ కూర్చున్నారు. అదే సమయాన ఆ వానరవీరుడు ఘృతాచితో కలసి అక్కడకేతెంచి గోదావరిలో స్నానంచేసి హాటకేశ్వర దర్శనానికి ఆలయంలో ప్రవేశించాడు. అక్కడ తన కుమార్తెను చూచి ఘృతాచీ తల్లిని చూచి వేదవతీ ఆనందాతిరేకంతో ఒకరినొకరు గాఢంగా కౌగలించుకొని జలజలా కన్నీళ్ళు రాల్చారు. అంత నా మహర్షి ఆ కపిని చూచి. నీవు వెంటనే అంజనాద్రికి వెళ్ళి యక్షేశ్వరుడు అంజనునీ, పాతాళానికి వెళ్ళి దైత్యపతి కందర మాలినీ స్వర్గానికి వెళ్ళి పర్జన్య గంధర్వునీ తీసుకొని రమ్మని ఆదేశించాడు. అంతట దేవవతి ఆ కపితో, అయ్యా! గాలవ మహర్షిని గూడ తీసుకొని రండనీ అర్థించింది. అంతట వాయు విక్రముడైన నాకపివీరుడట్లేయని, వాయువేగంతో వెళ్ళి అంజనుని పిలచి అమరగిరికి వెళ్ళి పర్జన్యుని సప్తగోదావరి మహాశ్రమానికి వెళ్ళమని చెప్పి తాను పాతాళానికి వెళ్ళాడు. అచ్చట కందర మాలికి చెప్పి మరల భూమిమీదకు వచ్చి గాలవమునికోసం మాహిష్మతికి వెళ్ళాడు. ఆ పరిసరాలలో మహా తపస్వి యైన గాలవుని చూచి తనతో ఆకాశమార్గాన సప్తగోదావరానికి గొని వచ్చాడు. అక్కడ ఇద్దరు నదిలో స్నానంచేసి ఆలయానికి చేరారు. అచట నా ముని నందయంతిని దేవవతిని చూచాడు. ఆ కన్యలిద్దరామునికి లేచి వినయంతో నమస్కరించారు. గాలవుడంతట మహాదేవుని అర్చించి అచటనున్న ఋషులకభివాదనం చేశాడు. ఆ రాజ శ్రేష్ఠులు లేని నిలబడి ఆ తపస్విని యథావిధిగా పూజించారు. అందరూ సంతోషస్వాంతులై కూర్చున్నారు.

తేషూపవిష్టేషు తదా వానరోపనిమంత్రితాః, 140

సమాయాతా మహాత్మానో యక్షగంధర్వదానవాః | తానాగతాన్‌ సమీక్ష్యైవ పుత్య్రస్థాః పృథులోచనాః. 141

స్నేహార్ధ్ర నయనాః సర్వా స్తదాసన్వజిరేపితౄన్‌ | నందయంత్యాదికా దృష్ట్వా సపితృకావరానవా. 142

సబాష్పనయనా జాతా విశ్వకర్మ సుతాతదా | అథతామహాస మునిః సత్యం సత్యధ్వజోవచః. 143

మావిషాదం కృథాఃపుత్రి పితా7యంతవ వానరః | సాతద్వచనమాకర్ణ్య వ్రీడోపహత చేతనా 144

కథంతు విశ్వకర్మా7సౌ వానరత్వం గతో7ధునా |

దుష్పుత్య్రాం మయిజాతాయాం తస్మాత్త్యక్ష్యేకలేవరమ్‌. 145

ఇతిసంచింత్యమనసా ఋతధ్వజ మువాచహ | పఠిత్రాయస్వమాం బ్రహ్మన్‌ పాపోపహత చేతనామ్‌. 146

పితృఘ్నీ మర్తువిచ్ఛామి తదనుజ్ఞాతు మర్హసి | అథోవాచ మునిస్తన్వీం మావిషాదం కృథాధునా. 147

భావ్యస్యనైవ నాశో7స్తి తన్మాత్యాక్షీః కలేవరమ్‌ | భవిష్యతి పితాతుబ్యం భూయో7ప్య మరవర్ధకిః. 148

జాతే7వత్యే ఘృతాచ్యాంతు నాత్రకార్యా విచారణా | ఇత్యేవముక్తే వచనే మునినాభావితాత్మనా. 149

ఘృతాచీతాం సమభ్యేత్య ప్రాహ చిత్రాంగదాంవచః | పుత్రి త్యజస్వశోకంత్వం మాసైర్దశభిరాత్మజః 150

భవిష్యతి పితుస్తుభ్యం మత్పకాశాన్న సంశయః | ఇత్యేవముక్తా సంహృష్టా బభౌ చిత్రాంగదాతదా. 151

ప్రతీక్షంతీసుచార్వంగీ వివాహే పితృదర్శనమ్‌ | సర్వాస్తా అపితావంతం కాలం సుతనుకన్యకాః. 152

ప్రత్యైక్షంత వివాహం హి తస్యా ఏవప్రియేప్సయా | తతోదశసుమాసేషు సమతీతే ష్వథాప్సరాః. 153

తస్మిన్‌ గోదావరీతీర్థే ప్రసూతాతనయం నలమ్‌ | జాతే7పత్యేకపిత్వాచ్చ విశ్వకర్మాప్యముచ్యత. 154

వారలా కూర్చొని యుండగా వానరునిచే పిలువబడిన యక్షగంధర్వదైత్యులూ వచ్చి చేరారు. అంతట ప్రేమతో చెమ్మగిలిన నేత్రాలతో నా ముగ్గురూ తమ తప్పిపోయిన పుత్రికలను కౌగిలించుకున్నారు. ఆ సుందరాంగనలు కూడ కండ్లనీరు పెట్టుకున్నారు. తన తండ్రి ఒక్కడు మాత్రమే లేనందున తన దురదృష్టానికి చింతించి చిత్రాంగద కన్నీరు విడవడం చూచి ఆ ఋతధ్వజుడు పుత్రీ బాధపడకుము. ఈ కపివరుడు నీ తండ్రియేనని సత్యం వెల్లడించగా నా బాలిక సిగ్గుపడి మహాత్ముడగు విశ్వకర్మకీ వానరత్వమెట్లు గలిగెనో కదా ! నాలాంటి కుమార్తె వల్లనే ఈ దుస్థితి కలిగి ఉంటుంది. అందుచే ఈ పాడు శరీరాన్ని వదలి వేస్తానని నిశ్చయించుకొని ఋతధ్వజునితో, స్వామీ ! నన్ను రక్షించండి. నేను పితృహంతకు రాలిని. నా మూలాన్నే నా తండ్రికీ దురవస్థ కలిగినది. నేను చనిపోవుదును. అనుమతి ఇండని వేడుకున్నది. అందులకాముని ''అమ్మా ! విచారించకు; భవితవ్యాన్ని ఎవరూ తప్పించుకోలేరు. శరీర త్యాగం చేయవద్దు. కొంచెం ఓపిక పట్టుము. ఈ కపికి ఘృతాచి వలన పుత్రుడు కలుగగానే శాపాంతమై పూర్వపు రూపం పొందుతాడు. నీవు నీ తండ్రిని మరల కలుసుకుంటావని ఓదార్చాడు. ఆ తర్వాత ఘృతాచి చిత్రాంగదను సమీపించి మృదువుగా, పుత్రీ శోకింపకుము. పది నెలలలో నావల్ల నీ తండ్రికి ఔరసుడు కలుగుతాడు. అంతవరకూ వేచి యుండుమని నచ్చజెప్పినది. అదివిని చిత్రాంగద ఎంతో సంతోషించింది. తండ్రి సమక్షాన వివాహం చేసుకోనెంచిన చిత్రాంగద అందుకొరకు ప్రతీక్షించసాగింది. తక్కిన ముగ్గురు కన్యలు కూడా తమ నెచ్చెలితో బాటే తమ వివాహాలుకూడా వాయిదా వేసుకొన్నారు. ఆ స్నేహితురాండ్ర సంకల్పం ఫలించి పదినెలలమీద ఘృతాచి ఆ గోదావరి తీర్థంలోనే నలుడను కుమారుని ప్రసవించింది. పుత్రుడు కలుగగానే కపి రూపం వదలి విశ్వకర్మ తనతొంటి రూపంలో ప్రియపుత్రికను ఆలింగనం చేసుకున్నాడు.

సమభ్యేత్యప్రియాం పుత్రీం పర్యష్వజత చాదరాత్‌ | తతః ప్రీతేనమనసా సస్మార సురవర్దకిః. 155

సురాణా మధిపంశక్రం సహైవసుర కిన్నరైః | త్వష్ట్రా7థ సంస్కృతః శక్రో మరుద్గుణ వృత్తస్తదా. 156

సురైః సరుద్రైః సంప్రాప్త న్తత్తీర్థం హాటికాహ్వయమ్‌ |

సమాయాతేషు దేవేషు గంధర్వే ష్వప్సరస్సుచ. 157

ఇంద్రద్యుమ్నో మునిశ్రేష్ఠ మృతధ్వజ మువాచహ |

జాబాలేర్దీయతాం బ్రహ్మన్‌ సుతాకందర మాలితః 158

గృహ్ణాతు విధవత్పాణి దైతేయ్యాస్తనయస్తవ | నందయంతీంచ శకునిః పరిణతుం స్వరూపవాన్‌. 159

మమేయం వేదవత్యస్తు త్వాష్ట్రేయీ సురథస్యచ |

బాఢమిత్యబ్రవీద్‌ హృష్ణో మునిర్మనుసుతంనృవమ్‌ 160

తతో7నుచక్రుః సంహృష్టా వివాహవిధిముత్తమమ్‌

ఋత్విజో7భూద్గాలవస్తు హుత్వాహవ్యం విధానతః. 161

గాయంతే తత్రగంధర్వా నృత్యంతే7ప్సరసస్తథా | ఆదౌజాబాలినః పాణి ర్గృహీతో దైత్యకన్యయా. 162

ఇంద్రద్యుమ్నేన తదను వేదవత్యా విధానతః | తతః శకునినాపాణిః గృహీతో యక్షకన్యయా. 163

చిత్రాంగదాయాః కల్యాణి సురథః పాణిమగ్రహీత్‌ | ఏవంక్రమాద్వి వాహస్తు నిర్వృత్తస్తనుమధ్యమే. 164

వృత్తేమునిర్వివాహేతు శక్రాదీన్‌ ప్రాహదైవతాన్‌ | అస్మింస్తీర్థే భవద్భిస్తు సప్తగోదావరే

సదా. 165

స్థేయం విశేషతోమాస మిమం మాధవముత్తమమ్‌ |

బాఢముక్త్వాసురాః సర్వే జగ్ముర్‌ హృష్టా దివం క్రమాత్‌. 166

మునయోముని మాదాయ నపుత్రంజగ్ము రాదరాత్‌ |

భార్యాశ్చాదాయ రాజానః స్వంస్వంనగర మాగతాః. 167

ప్రహృష్టాః సుఖినన్తస్థుః భుంజతే విషయాన్‌ ప్రియాన్‌ |

చిత్రాంగదాయాః కళ్యాణి ఏవంవృత్తం పురాకిల | తన్మాం కమలపత్రాక్షిః భజస్వలలనోత్తమే. 168

ఇత్యేవముక్త్వా నరదేవసూనుః తాంభూమిదేవస్య సుతాం వరోరుమ్‌ |

స్తువన్‌ మృగాక్షీం మృదునాక్రమేణ సాచాపివాక్యం నృపతిం బబాషే. 169

ఇతి శ్రీ వామన మహాపురాణ ఏకోనచత్వారింశో7ధ్యాయః.

ఆ విధంగా కుమార్తెను కలుసుకొని ఆ సుర శిల్పి దేవరాజు ఇంద్రుని సురకిన్నరాదులను మనసా స్మరించుకున్నాడు. వెంటనే శక్రుడు మరుత్తులు సురలు రుద్రగణాలతో కూడి ఆ విశ్వకర్మ కోర్కె ననుసరించి హాటకేశ్వర క్షేత్రానికి వచ్చి చేరాడు. అలా దేవతలు గంధర్వులు అప్సరసలంతా వచ్చిన తర్వా ఇంద్రద్యుమ్నుడు ఋషిసత్తముడైన ఋతధ్వజనితో యిలా అన్నాడు.

''బ్రహ్మర్షీ ! కందరమాలి కుమార్తెను మీ పుత్రుడు జాబాలికిచ్చి విధిపూర్వకంగా వివాహం జరిపించండి. రూపవంతుడగు శకుని నందయంతిని పరిణయమాడగలడు. నేను వేదవతిని గ్రహించెదను. విశ్వకర్మ పుత్రికను సురథుడు వివాహమాడును. అందులకు మంచిదని ఋతధ్వజుడనగా సంతోషంతో వివాహ సంస్కారం ప్రారంభ##మైంది. గాలవముని ఋత్విజత్వం వహించి వైవాహిక హోమాలు నిర్వర్తించాడు. గంధర్వులు నృత్యాలు చేస్తూ మంగళ గీతాలు పాడారు. మొదట జాబాలి కందరమాలి కుమార్తెను పాణిగ్రహణం చేసుకున్నాడు. తర్వాత వరుసగా ఇంద్రద్యుమ్నుడు వేదవతిని, శకుని యక్షపుత్రికను సురథుడు, చిత్రాంగదను పరిగ్రహించాడు. ఓ సన్నని నడుముగల కళ్యాణీ అరజా! ఇలా వివాహ కార్యం సంపన్నమైన తర్వాత ఋతధ్వజుడు ఇంద్రాది దేవతలతో, మీరందరు నీ పవిత్ర సప్త గోదావరి తీర్థంలో విశేషించి ఈ వైశాఖ మాసంలో నివసించుట ఉత్తమ మనెను. వారందరు నందులకంగీకరించి అట్లేయుండిరి. అనంతరం దేవతలు తమతమ నెలవులకు వెళ్ళి పోయారు. మునులంతా ఋతధ్వజ జాబాలురతో స్వస్థానాలకు వెళ్ళారు. రాజులు తమతమ భార్యలతో తమ నగరాలకు వెళ్ళి సకల భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఓ కళ్యాణీ ! చిత్రాంగద వృత్తాంతమంతా సమగ్రంగా నీకు వినిపించాను. ఓ కమలనేత్రీ, నారీరత్నమా ! ఇక ఆలసింపక నన్ను భజింపుమని ఆ దండక నృపతి. శుక్రనందిని అందాన్ని పొగడుతూ చెప్పినంతనే ఆ మానవతి మృదు వచనాలతో ఇలా చెప్పిది.

ఇది శ్రీవామన పురాణంలో ముప్పది తొమ్మిదవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters