Sri Vamana Mahapuranam    Chapters   

ముప్పది మూడవ అధ్యాయము

నారద ఉవాచ :

యో7సౌమంత్రయతాం ప్రాప్తో దైత్యానాంశతడాడితః | నకేనవద నిర్భిన్నః శ##రేణదితిజేశ్వరః. 1

పులస్త్య ఉవాచ :

అసీత్‌ నృపోరఘుకులే రిపుజిన్‌ మహర్షే తస్యాత్మజో గుణగణౖకనిధి ర్మహాత్మా |

శూరో7రిసైన్యదమనో బలవాన్‌ సుహృత్సు విప్రాంధ దీనకృపణషు సమానభావః. 2

ఋతధ్వజోనామ మహాన్మహీయాన్‌ సగాలవార్థేతురగాధిరూఢః |

పాతాళ##కేతుం నిజఘానవృష్ఠే బాణన చంద్రార్దనిభేనవేగాత్‌. 3

నారద ఉవాచ :

కిమర్థం గాలవస్యాసౌ సాధయామానసత్తమః | యేనా7సౌ పత్రిణాదైత్యం నిజఘాననృపాత్మజః. 4

పులస్త్య ఉవాచ :

పురాతనస్తవ్యతి గాలవర్షి ర్మహాశ్రమేస్వేసతతం నిష్టః |

పాతాళ##కేతుస్తపసో7స్యవిఘ్నం కరోతిమౌఢ్యాత్ససమాధి భంగమ్‌. 5

నచేష్యతే7సౌతనసోవ్యయంహి శక్తో7పికర్తుం త్వథభస్మసాత్తమ్‌ |

ఆకాశమీక్ష్యాథ సదీర్ఘముష్ణం ముమోచనిఃశ్వాసమనుత్తమంహి. 6

తతో7ంబరాద్వాజివరః పపాత బభూవవాణీత్వశరీరిణీచ |

అసౌతుంరంగో బలవాన్‌ క్రమేత ఆహ్నాసహస్రాణి తుయోజనానామ్‌. 7

సతంప్రగృహ్యాశ్వవరం నరేంద్రం ఋతధ్వజం యోజ్యతదాత్తశస్త్రమ్‌ |

స్థితస్తపస్యేవతతో మహర్షిర్ధైత్యం సమేత్య విశ##ఖైః నృపజోబిభేద. 8

నారద ఉవాచ :

కేనాంబరతలాత్‌వాజీ విసృష్టో వదసువ్రత | వాణీకస్యా7రేహినీజాతా పరంకౌతూహలంమమ. 9

పులస్త్య ఉవాచ :

విశ్వావసుర్నామ మహేంద్రగాయనో గంధర్వరాజో బలవాన్‌యశస్వీ |

నిసృష్టవాన్‌ భూవలయేతురంగం ఋతథ్వజసై#్యవ సుతార్థమాశు. 10

నారద ఉవాచ :

కో7ర్థోగంధర్వరాజస్య యేనాపై#్రషీన్మహాజమవమ్‌ | రాజ్ఞః కువలయాశ్వస్య కో7ర్థోనృపసుతస్యచ. 11

నారదుడిట్లనియె : ఓ మహర్షీ ! ఆ రాక్షసులు తమలో తాము చర్చించుకొనుచుండగా ఆ దైత్యేశురుని బాణాలతో కొట్టి చీల్చిన వారెవరు? అందులకు పులస్త్యుడిట్లనెను. నారదా! రఘువంశలో రిపుజిత్త (శతృఘ్ను)ను రాజు ఉండేవాడు. అతనికి ఋతధ్వజుడనే తనయుడు కలడు. ఆ ఋతధ్వజుడు సర్వసద్గుణాల నిధి మహాత్ముడు, శూరుడు బలవంతుడు శత్రుసైన్యమర్దనుడు. బ్రాహ్మణుల నేత్రహీనులు దీన దరిద్రుల పట్లనూ స్నేహితుల యెడనూ సమదృష్టి గలవాడు. ఆ రాజ కుమారుడు గాలవ ఋషికోసంగాను జవాశ్వం మీదనెక్కి అర్దచంద్రబాణంతో దుష్టుడైన పాతాళ కేతువు వీపు బ్రద్ధలు కొట్టాడు. అంతట నారదుడో మహాత్మా ! అలా, గాలవమునికోసం, ఆ ఋతధ్వజుడు పాతాళ##కేతువు నెందుకు ప్రహరించాడని ప్రశ్నించగా పులస్త్యుడు యిలా అన్నాడు. పూర్వం గాలవ ఋషి తన ఆశ్రమంలో తపోమగ్నుడై యుండగా బుద్ధిహీనుడై పాతాళ##కేతువాయనకు తపోభంగం సమాధి భంగం కావించాడు. ఆ మునీశ్వరుడు వాడిని శాపదగ్ధుణ్ణి చేయగలిగియూ తపోవ్యయానిక వెరచి అలా చేయక మహావ్యథతో ఆకాశం వైపు చూస్తూ వేడి నిట్టూర్పు విడిచాడు. వెంటనే ఆకాశన్నుంచి ఒక ఉత్తమమైన అశ్వం భూమిమీద పడినది. దానితోబాటు ఈ గుర్రం రోజుకు వేయి యోజనాలు పరుగిడ గలదంటూ ఆశరీరవాణి వినిపించింది. ఆ గుర్రాన్ని స్వీకరించి ఋతధ్వజునకిచ్చి ఆ ముని మరల తపోదీక్షలో మునిగి పోగా దానిపై నెక్కి మహావీరుడైన నా రాజకుమారుడు రాక్షసుని బాణాలతో ప్రహరించాడు. అంతట నారదుడు. ఆకాశాన్నుంచి గుర్రాన్ని ఎవరు విడిచారు? ఆ అశరీరవాణి పలికిన వారెవరు? నాకు వింతగా ఉంది. దయచేసి చెప్పుడని అర్థించాడు. అందుకు పులస్త్యుడోనారదా ! ఇంద్రుని ఆస్థాన గాయకుడైన విశ్వావసుడనే గంధర్వ రాజు ఆశ్వాన్ని ఋతధ్వజుని కొరకై ఆయన కుమార్తె కారణంగా భూమిమీద వదలాడు అని చెప్పడు దానితో మరింత వింతపడి నారద ముని, ఆ గంధర్వ రాజే నా యశ్వాన్ని వదిలాడు? కుమలయాశ్వునకు, రాకుమారునకిందువల్ల కలుగు ప్రయోజనమేమిటని ప్రశ్నించాడు.

పులస్త్య ఉవాచ :

విశ్వావసోః శీలగుణోపవన్నా ఆసీత్‌పురంధ్రీషువరాత్రిలోకే |

లావణ్యరాశిః శశికాంతితుల్యా మదాలసానామ మదాలసైన. 12

తానందనే దేవరిపుస్తరస్వీ నం క్రీడతీం రూపపతీందర్శ |

పాతాశ##కేతుస్తు జహారతన్వీం తస్యా7ర్థతః సో7శ్వవరః ప్రదత్తః. 13

హత్వాసదైత్యం నృపతేస్తనూజో లబ్ద్వావరోరూమపి సంస్థితో7భూత్‌ |

దృష్టోయథా దేవపతిర్మహేంద్రం శచ్యాతథారాజసుతోమృగాక్ష్య 14

నారద ఉవాచ :

ఏవంనిరస్తే మహిషే తారకేచ మహాసురే | హిరణ్యాక్షసుతో ధీమాన్‌ కిమచేష్టతవైపునః 15

పులస్త్య ఉవాచ :

తారకంనిహతందృష్ఠ్వా మహిషంచరణ7ంధకః | క్రోదంచక్రేసుదుర్భద్ది ర్దేవానాందేవసైన్యహా. 16

తతః స్వల్పపరీవారః ప్రగృహ్యపరిఘంకరే క్ష నిర్జగామా7థ పాతాలా ద్విచచారచమేదినీమ్‌. 17

తతోవిచరతాతేన మందరేచారుకందరే | దృష్టాగౌరీచ గిరిజా నఖీమధ్యేస్థితాశుభా. 18

తతో7భూత్కామ బాణార్తః సహసైవాందకో7సురః | తాందృష్ట్వాచారు సర్వాంగీం గిరిరాజసుతాంవనే. 19

అథోవాచాసురోమూఢో వచనంమన్మథాంతకః | కస్యేయంచారు సర్వాంగీ వనేచరతి సుందరీ. 20

ఇయంయది భ##వేన్నైవ మమాంతః పురవాసినీ | తన్మదీయేనజీవేన క్రియతేనిష్ఫలేనకిమ్‌ 21

యదస్యాన్తను మధ్యాయా నపరిష్వంగవానహమ్‌ | అతోధిజ్‌ మమరూపేణ కింస్థిరేణ ప్రయోజనమ్‌. 22

సమేబంధుః ససచివః సబ్రాతాసాంపరాయికః | యోమామసితకేశాంతాం యోజయేన్మృగలోచనామ్‌. 23

ఇత్థంపదతి దైత్యేంద్రే ప్రహ్లాదోబుద్దిసాగరః | పిదాయకర్ణౌ హస్తాభ్యాం శిరః కంప్యవచో7బ్రవీత్‌. 24

మామైవంవదదైత్యేంద్ర జగతో జననీత్వియమ్‌ | లోకనాథస్య ఖార్యేయం శంకరస్యత్రిశూలినః 25

మాకురుష్వనుదుర్బిద్దిం సత్యః కులవినాశినీమ్‌ | భవతః పరదారోయం మానిమజ్జరసాతలే. 26

సత్సుకుత్సితమేవంహి ఆసత్స్వపిహికుత్సితమ్‌ | శత్రవస్తే పరకుర్వంతు పరదారావగాహనమ్‌. 27

కించత్వయానశ్రుతం దైత్యనాథ గీతంశ్లోకం గాధినాపార్ధవేన |

దృష్ట్వా సైన్యం విప్రధేనుప్రసక్తం తథ్యం పథ్యం సర్వలోకేహితంచ. 29

వరంప్రాణాస్త్యాజ్యా నచపిశునవాదేష్వభిరతిః వరం మౌనంకార్యం నచవచన ముక్తం యదనృతమ్‌ |

వరంక్లీబైర్భావ్యం నచపరకళత్రాభిగమనమ్‌ వరంభిక్షార్థిత్వం నచపరజధానస్వాద మనకృత్‌. 29

సప్రహ్లాదవచః శ్రుత్వా క్రోంధాంధోమదనార్దితః | ఇయం సాశత్రుజననీ త్యేవముక్త్వా వ్రదుద్రువే. 30

అందులకు పులస్త్యుడిలా చెప్పాడు : ఆ విశ్వావసువు కూతురు మదాలస అనుసుందరి శీల గుణాల్లో ముల్లోకాల్లో సాటిలేనిది. చంద్రకాంతతో వెలిగే ఆ లావణ్య రాశి నిజంగా ¸°వన మదాలసయే. ఆమె ఒకనాడు నందనోద్యానంలో సఖులతో విహరించడం చూచి ఆ దుష్టుడు పాతాళ##కేతు అపహరించాడు. ఆమె రక్షణ కోసం ఆ అశ్వాన్ని వదిలారు. ఆ రాజకుమారుడు పాతాళ##కేతువును సంహరించి ఆమెను విడిపించి శచీదేవితో యింద్రునకు మాదిర ప్రకాశించాడు. అది విని నారదడు అలా మహిష తారకులు హతులైన తర్వాత ధీమంతుడైన హిరణ్యాక్షుని కుమారుడేమి చేశాడని ప్రశ్నించగా పులస్త్యుడిలా చెప్ప మొదలు పెట్టాడు. నారదా ! ఆ దుర్బుద్థీ, దేవాతంకుడైన అంధకుడు తారకాసుర మహిషాసురుల సంహారం చూచి ఆగ్రహోదగ్రుడయ్యాడు. తనకున్న స్వల్ప పరివారంతో పరిఘపాణియై బయలుదేరి ఆ దుష్టుడు పాతాళాన్నుంచి వచ్చి భూమిమీద నలువైపులా తిరుగసాగాడు. అలా సంచరిస్తూ ఒకనాడు సుందరమైన కండరాలతో నొప్పిన మందరపర్వతాన సఖులతో కూర్చున్న గిరి కుమారగౌరి సౌందర్యం చూచి ఆ కామాంధుడు బుద్ధహీనుడై యిలా ప్రశ్నించాడు. ఈ వనంలో విహరించే ఆ లావణ్య రాశి ఎవరు ? ఈమె నా అంతఃపురవాసిని కాని నాడు నాయీ జీవితం వ్యర్థం. ఈతనుమధ్యను కౌగిలించుకొనని నా రూప సంపద నిరర్థకం కదా. ఈ మృగ నేత్రినీ నన్ను కూర్చగలవాడే నాకు నిజమైన బంధువు మిత్రుడు సోదరుడూ నాసర్వస్వమూను. అంటూ వదరుతున్న ఆ దైత్యేంద్రుని మాటలకు రెండు చెవులు చేతులతో మూసికొని తలపంకిస్తూ బుద్ధిసాగరుడైన ప్రహ్లాదుడిలా హితబోధచేశాడు. దైత్యేంద్ర ! అలాంటి మాటలనకుము. ఆమె ఎవరనుకుంటివి? జగజ్జనని ! లోకేశ్వరుడు శూలపాణియగు శంకరుని యిల్లాలు. వంశక్షయానికి దారితీసే యిలాంటి దుష్టాలోచనలు మానుము. ఆమెవరదార. రసాతలంలో పడిపోకుము. దుర్మార్గులకే కాదు సజ్జనులకు గూడ యిలాంటి దుష్ట సంకల్పం మంచిదికాదు. ఇలాంటి పరదారగ్రహణం నీ విరోదులు చేయుదురుగాక. నీవీ ప్రయత్నాన్ని విరమించుకో. గాధిరాజు విప్రుల ధేనువులను అపహరించిన సైనికులను చూచి పలికిన హిత వాక్యాలు నీవు వినలేదా? ఇతరుల మీద చాడీలు చెప్పటం కన్నా మరణించుట మేలు. అబద్దం చెప్పడం కన్నా నోరు మూసుకొని ఉండటం మంచిది. ఇతరుల భార్యలను కోరడం కన్నా నపుంసకత్వం ఉత్తమం. పరధనాపహరణం కన్నా బిచ్చమెత్తుకొవడం శ్రేష్టం. మోహంతో క్రోధంతో కండ్లు మూసుకొని పోయిన ఆ దుష్టుని మీద ఆ హితవచనాలు ఏమి పనిచేయలేక పోయాయి. ఈ స్త్రి నా విరోధి తల్లి. అని అరుస్తూ ఆమె ఉన్న వైపు పరుగుతీసాడు.

తతో7న్వధావన్‌ దైతేయా యంద్రముక్తా ఇవోపలాః |

తాన్‌రురోధ బలాన్నందీ వజ్రోద్యత కరో7వ్యయః. 31

మయతార పురోగాస్తే వారతాద్రావితాస్తథా | కులిశేనాహతా స్తూర్ణం జగ్ముర్బీతాదిశోదశ. నః. 32

తానర్దితాన్‌ రణదృష్ట్వా నందినా7ంధకదానవః | పరిఘేణసమాహత్య పాతయామాననందినమ్‌. 33

శైలాదింపతితం దృష్ట్వా దావమానంతథాంధకమ్‌ | శతరూపా7భవద్గౌరీ భయాత్త స్యదురాత్మనః. 34

తతః నదేవీగణ మధ్యసంస్థితః పరిభ్రమన్‌ భాతిమహా7సురేంద్రః |

యథావనేమత్తకరీ పరిభ్రమన్‌ కరేణుమధ్యే మదలోలదృష్టిః. 35

నపరిజ్ఞాతవాం స్తత్ర కాతుసాగిరికన్యకా | నాత్రావ్చర్యంన పశ్యంతి చత్వారో7మీసదైవహి. 36

నపశ్యతీహజాత్యంధో రాగాంధో7పినవశ్యతి | నవశ్యతి మదోన్మత్తో లోభాక్రాంతోన పశ్యతి. |

సో7పశ్యమానో గిరజాం వశ్యన్నపితథాంధకః. 37

ప్రహారం నాదదత్తాసాం యువత్య ఇతిచింతయన్‌ | శతోదేవ్యాన దుష్టాత్మా శతావర్యానిరాకృతః. 38

కుట్టితః ప్రమరైః శ##సై#్త్రర్నివపాత మహీతలే | వీక్ష్యాంధకం నిపతితం శతరూపా విభావరీ. 39

తస్మాత్‌ స్థానాదపాక్రమ్య గతా7ంతర్దానమంబికా | పతితం చాంధకం దృష్ఠ్వాదైత్యదానవయూథపాః. 40

కుర్వంతః సుమహాశబ్దం ప్రాద్రవంతరణార్థినః | తేషామావతతాం శబ్దం శ్రుత్వాతస్థౌ గణశ్వరః. 41

ఆదాయవజ్రం బలవాన్‌ బఘవానివకోపితః | దానవాన్‌ సమయాన్‌ వీరః పరాజిత్య గణశ్వరః. 42

సమభ్యేత్యాంబికాం దృష్ట్వా వవందే చరణౌశుభౌ | దేవచతా నిజామూర్తీః ప్రాహ గచ్చధ్వమిచ్ఛయా. 43

నిహరధ్వం మహీవృష్టే పూజ్యమాననరైరిహ | వనతిర్ఛవతీనాంచ ఉద్యానేషు వనేషుచ 44

వనస్పతిషు వృక్షేషు గచ్ఛద్వం విగతజ్వరాః | తాస్త్వేవముక్తాః శైలేయ్యా ప్రణివత్యాంబికాంక్రమాత్‌. 45

దిక్షునర్వాసు జగ్ముస్తాః స్తూయమానాశ్చకింనరైః అంధకో7పి స్మృతిలబ్ద్యా అపశ్యన్నద్రి నందినీమ్‌ |

స్వబలం నిర్జితం దృష్ట్వా తతః పాతాళమాద్రవత్‌. 46

తతోదురాత్మా సతదాంధకోమునే పాతాళ మభ్యేత్య దివానభుంక్తే |

రాత్రౌనశేతే మదనేషుతాడితో గౌరీంస్మరన్‌ కామబలాభిపన్నః. 47

అంతట నారాక్షసులంతా యంత్రాలనుంచి వెడలిన శిలలలాగా విజృంభించారు. వారలను బలపూర్వకంగా వజ్రపాణియై నందీశ్వరుడు నివారించాడు. మయుడు తారుడితోపాటు ఆ దైత్యులంతా వజ్రాఘాతాలను తల్లడిల్లి భయంతో పది దిక్కులకు పారిపోయారు. అలా వారలను మర్దించిన నందిన చూచి కోపంతో, అంధకుడు పరిఘతో గట్టిగా ప్రహరించి నేలపడగొట్టెను. నంది మూర్ఛిల్లడం ఆ దుష్డుడు తన మీదకు రావడం చూచి గౌరి భయంతో నూరురూపాలు ధరించింది. ఆ స్త్రీల మధ్య నా దురాత్ముడు ఆడ ఏనుగుల మధ్య పరుగులు తీసే మదపుటేనుగులాగా గంతులేయసాగాడు. వాళ్ళ మధ్య అసలు గౌరి ఎవరో చూడలేక పోయాడు. అందులో ఆశ్చర్యమేముంది? పుట్టు గ్రుడ్డివాడు, మోహంతో కళ్లుమూసుకపోయినవాడు, మదాంధుడు, లోభంతో నిండిపోయినవాడు ఈ నలుగురు కళ్లు తెరచుకొనినప్పటికీ చూడలేరు. అలాగే ఎదుట ఉన్న గౌరిని కూడా ఆ అంధకుడు గుర్తించలేకపోయాడు. స్త్రీలనే భావంతో వారలమీద చేయి చేసుకోలేరు. గౌరి యొక్క నూరురూపాలలో విజృంభించిన ఆ దేవీ శక్తులన్నీ వానిపైబడి శస్త్రాస్త్రాలతో మర్దించి నేలబడగొట్టారు. అంధకుడావిధంగా భూపతితుడు కాగానే శతరూపాలు ధరించిన అంబిక అంతర్దానమై పోయింది. మట్టి గరచిన తమ నాయకుణ్ణి చూచి దైత్య దానవ వీరులంతా హాహాకారాలు చేస్తూ యుద్ధానికి తలపడగా గణశ్వరుడు, తన గణాలతో, వజ్రం చేతబట్టి కోపించిన యింద్రునివలె ఎదురొడ్డి నిలిచాడు. అలా విజృంభించి దానవులందరనూ, మయునితోసహా, పారద్రోలి అంబిక సన్నిధికి వెళ్ళి నమస్కరించాడు. అంతట గౌరి తన రూపాలనన్నింటినీ విసర్జించి యిలా అన్నది. మీరంతా భూలోకంలో స్వేచ్ఛగా తిరుగుతూ మానవులచేత పూజలు స్వీకరించండి. ఉద్యానవనాల్లో అరణ్యాలలో వనస్పతులలో వృక్షలలో నివసించండి. నిశ్చితంగా శతావరులుగా విహరించండి. ఆ గిరి నందిని ఆ దేశాన్ని తలదాల్చి ఆ శతావరులందరూ ఒకరొకరుగా నామెకు ప్రణమిల్లి, కిన్నరులంతా తమ్ము కీర్తిస్తుండగా సర్వదిక్కులకూ వెళ్ళిపోయారు. ఇంతలో అంధకుడు మూర్ఛనుండి తేరుకొని చూస్తే ఆచట గౌరికనిపించలేదు. తన బలాలన్నీ ఓడిపోయినట్లు గ్రహించి ఆ దుష్టుడు కూడా చల్లగా పాతాళానికి జారుకున్నాడు. అప్పటినుండీ ఆ కామోపహతుడు పగలు తిండీ రాత్రులు నిద్రా మాని గౌరిని స్మరిస్తూ మతి భ్రష్టుడయ్యాడు.

ఇది శ్రీవామన మహాపురాణంలో ముప్పది మూడవ అధ్యాయం ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters